08-05-1969 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ఈరోజు బాబా విశేషంగా ఒక విశేష కార్యం కోసం వచ్చారు. ఇక్కడ కూర్చున్న వారందరూ మిమ్మల్ని మీరు నిశ్చయబుద్ధిగా భావిస్తున్నారా? నెంబర్ వారీగా ఉన్నారు. భలే నెంబర్ వారీగా ఉన్నా కానీ నిశ్చయబుద్ధియేనా? నిశ్చయబుద్ధి అనే బిరుదు ఇవ్వవచ్చా? నిశ్చయంలో నెంబర్ ఉంటుందా లేక పురుషార్థంలో నెంబర్ ఉంటుందా? నిశ్చయంలో ఎప్పుడు శాతం ఉండదు. నిశ్చయంలో నెంబర్ ఉండదు. పురుషార్థ స్థితిలో నెంబర్ ఉంటుంది. నిశ్చయబుద్ధిలో నెంబర్ ఉండదు. ఉంటే నిశ్చయం ఉంటుంది, లేకపోతే సంశయం ఉంటుంది. నిశ్చయంలో ఒకవేళ కొద్దిగా అయినా మనస్సులో అయినా, వాచాలో అయినా, కర్మణాలో అయినా కానీ మనస్సులో ఒక సంకల్పంలో సంశయం ఉన్నా సంశయబుద్ధి అంటారు. ఇలా అందరూ నిశ్చయబుద్ధిగా అయ్యారా? నిశ్చయబుద్ధికి ముఖ్య పరిశీలన ఏమిటి? పరిశీలించడానికి ఏదైనా ముఖ్య విషయం ఉందా? మీ ఎదురుగా ఎవరైనా కొత్తవారు వస్తే వారి చరిత్ర మీరు వినలేదు, అప్పుడు వారిని ఎలా పరిశీలిస్తారు? (వైబ్రేషన్ ద్వారా) ఏ వైబ్రేషన్ ద్వారా పరిశీలన జరుగుతుంది? ఇప్పుడు ఈ అభ్యాసం చేయాలి. ఎందుకంటే వర్తమాన సమయంలో చాలామంది ప్రజలు పెరుగుతూ ఉంటారు. కనుక ప్రజలని మరియు సమీపంగా వచ్చేవారిని పరిశీలించడానికి చాలా అభ్యాసం కావాలి. పరిశీలన యొక్క ముఖ్య విషయం - వారి నయనాల ద్వారా ఏదో ఒక లక్ష్యం వైపు వారు ధ్యాస పెట్టినట్లు అనుభవం అవుతుంది. బాణం వేసేవారు లేదా గురి చూసే మిలట్రీవారు పూర్తిగా లక్ష్యం యొక్క దృష్టిలో ఉంటారు. వారి నయనాలు, వారి ఆలోచన, ఆ సమయంలో ఒకేవైపు ఉంటాయి. అదేవిధంగా పక్కా నిశ్చయబుద్ధిగా ఉన్నవారి ముఖం ద్వారా వీరు ఒకే గమ్యంలో లీనమైనట్లు అనుభవం అవుతుంది. మీకు ముఖ్య శిక్షణ లభిస్తుంది కదా! ఒకే లక్ష్యాన్ని చూడండి - అంటే బిందువుని చూడండి. బిందువుని చూడటమే గమ్యాన్ని చూడటం. నిశ్చయబుద్ధికి గుర్తు ఏమిటి? పూర్తి లక్ష్యం ఉంటుంది. లక్ష్యం కొంచెం అయినా గురి తప్పితే ఓడిపోతారు. నిశ్చయబుద్ధి ఆత్మల నయనాల ద్వారా వారు చూస్తున్నా కానీ మరేదో చూస్తున్నట్లు అనుభవం అవుతుంది. వారి మాటలు కూడా అలాగే వస్తాయి. ఇది నిశ్చయబుద్ధి యొక్క గుర్తు. నిశ్చయబుద్ధికి గుర్తు - లక్ష్యం మరియు వారి స్థితి నషాతో ఉంటుంది. ఈ అభ్యాసం ఇప్పుడు చేయండి. ఆ తర్వాత మీ పరిశీలన మంచిగా ఉందా? లేదా? అనేది నిర్ణయించుకోండి. అలా అభ్యాసం చేస్తూ చేస్తూ పరిశీలన యదార్థం అయిపోతుంది. దృష్టి ద్వారా సృష్టి అంటారు కదా! కనుక మీరు వారి దృష్టి ద్వారా మొత్తం సృష్టిని తెలుసుకోవచ్చు.
మనసా - వాచా - కర్మణా మూడింటిని మంచిగా చేసుకోవడానికి కేవలం మూడు పదాలు స్మృతిలో ఉండాలి. ఆ మూడు పదాలు ఏమిటి? ఈ మూడు పదాలు రోజూ మురళీలో కూడా వస్తాయి. మనస్సు కొరకు నిరాకారి అవ్వాలి. వాచా కొరకు నిరంహంకారి అవ్వాలి. కర్మాణా కొరకు నిర్వికారి అవ్వాలి. ఇటువంటి వాచా మరియు కర్మణా ద్వారానే దేవతల ప్రత్యక్షత జరుగుతుంది. కనుక నిరాకారి, నిరహంకారి మరియు నిర్వికారి. ఈ మూడు విషయాలు స్మృతిలో ఉంచుకుంటే మనసా, వాచా, కర్మణా మూడూ మంచిగా ఉంటాయి. ఎంత నిరాకారి స్థితిలో ఉంటారో అంతగానే నిరహంకారిగా మరియు నిర్వికారిగా కూడా ఉంటారు. వికారం యొక్క ఏ చెడువాసన ఉండదు, ఇదే ముఖ్య పురుషార్థం. ఈ మూడు విషయాలు స్మృతి ఉంచుకోవటం ద్వారా ఏవిధంగా తయారవుతారు? త్రికాలదర్శిగా కూడా అవుతారు, మరియు భవిష్యత్తులో మరలా విశ్వానికి యజమాని అవుతారు. ఇప్పుడు త్రిలోకనాథులుగా మరియు త్రికాలదర్శిగా అవుతారు. త్రిలోకనాథులు అంటే మూడులోకాల జ్ఞానం స్మరణ చేస్తున్నారు. ఇది త్రిలోకనాధ స్థితి ఎందుకంటే బాబాతో పాటు పిల్లలందరు కూడా ఉన్నారు. మంచిది.
Om shanti baba
ReplyDeleteOm Shanthi bapdada... Aap ko mera sadar pranam... Dhanyawad baba🌸🌸
ReplyDeleteOm shanthi Mera Bapdada. Thank you Baba.
ReplyDelete