06-12-1969 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సరళస్వభావం ద్వారా బుద్దిని విశాలంగా మరియు దూరదేశీగా చేసుకోండి.
సరళస్వభావం ద్వారా బుద్దిని విశాలంగా మరియు దూరదేశీగా చేసుకోండి.
ఈ రోజు ఈ సభలో ఏ విశేషమైన సువాసన మరియు ఆకర్షణ ఉన్నాయి? స్నేహం అయితే అందరికీ ఉంది. కానీ మిమ్మల్ని ఎందువలన పిలిచాను? ఇక్కడికి ఎవరైతే వచ్చారో అందరూ ఇంటికి వెళ్ళిపోవడానికి తయారై వచ్చారు అని భావించండి. సదా తయారుగా ఉండేవారే ఎవరెడీ. పిలిచిన వెంటనే ఒక్క సెకనులో తమకు ఉన్నవి అన్నీ సర్దుకుంటారు మరియు జంప్ చేస్తారు. ప్రత్యక్షంగా చూశారు కదా! డ్రామా యొక్క పిలుపు ప్రకారం వెళ్ళిపోవటంలో ఎంత సమయం పట్టిందో? ఒకవైపు సర్దుకోవాలి, రెండవవైపు హైజంప్ చేయాలి. ఈ రెండు దృశ్యాలు చూశారు కదా! డ్రామాలో ఇలా ఎందువలన జరిగింది? మీకు నేర్పించటానికి. ఈవిధంగా సదా తయారుగా ఉండవలసి ఉంటుంది. ఇప్పుడు ఎవరెడీ యొక్క లైను ప్రారంభమయ్యింది. ఈ లైనులో ఎవరికి అయినా నెంబర్ వస్తుంది. అది సంకల్పాలలో ఏదైతే ఉందో అదెప్పుడు జరగదు, అవుతుంది కానీ అకస్మాత్తుగా అవుతుంది. బ్రాహ్మణ కులం యొక్క ఈ ఆచారం ప్రారంభమైపోయింది. ఈ విధి - విధానం కూడా డ్రామాలో ఎందుకు తయారయ్యిందో దానికి చాలా గుప్త రహస్యం ఉంది. వెంటనే సర్దుకోవాలి మరియు జంప్ చేయాలి. ఈ పురుషార్ధం ముందు నుండే చేయండి. సర్దుకునే శక్తి ఎవరిలో ఉంటుంది? ఎవరైతే సరళస్వభావంతో ఉంటారో వారిలో సర్దుకునే శక్తి సహజంగా వస్తుంది. ఎవరైతే సరళ స్వభావంతో ఉంటారో వారు అందరికీ సహయోగిగా కూడా ఉంటారు. ఎవరైతే అందరికి స్నేహిగా ఉంటారో వారికి అందరి ద్వారా సహయోగం లభిస్తుంది. అందువలన అన్ని విషయాలలో ఎదుర్కొనే శక్తి లేదా సర్దుకునే శక్తి సహజంగానే ఉంటుంది. మరియు ఎంత సరళ స్వభావం కలిగి ఉంటారో అంత మాయ తక్కువగా ఎదుర్కొంటుంది. అటువంటి వారు అందరికి ప్రియమనిపిస్తారు. సరళ స్వభావం కల వారికి ఎప్పుడు వ్యర్థ సంకల్పాలు నడవవు. సమయం వ్యర్థంగా వెళ్ళదు. వ్యర్ధ సంకల్పాలు నడవని కారణంగా వారి బుద్ధి విశాలంగా, దూరదేశీగా ఉంటుంది. అందువలన వారిని ఏ సమస్య ఎదుర్కోలేదు. ఎంత సరళత ఉంటుందో అంత స్వచ్చత కూడా ఉంటుంది. స్వచ్చత అందరినీ ఆకర్షితం చేస్తుంది. స్వచ్ఛత అంటే సత్యత మరియు శుభ్రత. ఎవరైతే తమ స్వభావాన్ని సరళంగా చేసుకుంటారో వారిలోనే సత్యత, శుభ్రత ఉంటుంది. సరళ స్వభావం కలవారు బహురూపిగా కూడా కాగలరు. కోమల వస్తువుని ఏ రూపంలోకి తీసుకువస్తే ఆ రూపంలోకి వస్తుంది. ఇప్పుడు బంగారంగా అయ్యారు కాని బంగారాన్ని అగ్నిలో వేస్తే మలచగలరు. ఈ లోపం కారణంగా సేవ యొక్క సఫలతలో కూడా లోపం వస్తుంది. మిమ్మల్ని మీరు ఎలా మలుచుకోవాలి? దీని కోసం భట్టికి వచ్చారు.
1.మలిచేశక్తి 2.బ్రేక్ వేసే శక్తి ఉండాలి. ఎంత సమయంలో మలుచుకోవాలి? మలుచుకోవటం వస్తుంది కానీ అక్కడక్కడ సమయం ఎక్కువ పడుతుంది. సమయం పట్టకూడదు. సంకల్పం చేయాలి. సంకల్పం చేయగానే ఫలించాలి. ప్రతీ సంకల్పం, మాట సిద్ధించే విధంగా అయ్యి భట్టి నుండి వెళ్ళాలి. బయటవారు మంత్ర తంత్రాల ద్వారా సిద్ధి పొందుతారు. కానీ మీది యోగం యొక్క రిద్ధి సిద్ధి. స్మృతి యొక్క రిద్ధి సిద్ధిని నేర్చుకోవాలి. ఎవరికైతే సిద్ధి లభిస్తుందో వారి సంకల్పం, మాట మరియు కర్మ సిద్ధి అవుతాయి. ఒక్క సంకల్పం కూడా వ్యర్ధంగా రాదు. ఏ సంకల్పం వచ్చినా సిద్ధిస్తుంది. ఒక సంకల్పం కూడా సిద్దించకుండా ఉండదు. అలాంటి వారినే సేవాధారులు అంటారు. సిద్దించని సంకల్పం ఒకటి కూడా రాకూడదు. మీ యొక్క ఒక్కొక్క సంకల్పానికి విలువ ఉంది. కానీ ఎప్పుడైతే స్వయం విలువ ఉంచుకుంటారో అప్పుడు అనేకాత్మలు కూడా రత్నం అయిన మీ విలువను పరిశీలిస్తారు. ఈ భట్టీ నుండి ప్రతి ఒక్కరి ముఖం చైతన్య మ్యూజియం వలె అయ్యి వెళ్ళాలి. చాలా మ్యూజియమ్స్ తయారుచేసారు. కానీ ఇప్పుడు ఒకొక్కరి ముఖమే చైతన్య మ్యూజియం (చిత్ర ప్రదర్శనశాల) అవ్వాలి. ఈ చైతన్య ముఖం అనే మ్యూజియంలో ఎన్నిచిత్రాలు ఉన్నాయి? ఈ ముఖం యొక్క మ్యూజియంలో ఏయే చిత్రాలు అమరుస్తారు? మ్యూజియంలో మొదట చిత్రాలు అమరుస్తారు. తర్వాత అలంకరణ చేస్తారు. ఆ తర్వాత ప్రారంభం చేయిస్తారు. తర్వాత అందరి అభిప్రాయాలూ తీసుకుంటారు. మీ ఈ చైతన్య మ్యూజియంలో ముఖ్యంగా మూడు చిత్రాలు ఉన్నాయి. భృకటి, నయనాలు మరియు ముఖం. వీటి ద్వారానే మీ స్మృతి, వృత్తి, దృష్టి మరియు వాణీ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఎలా అయితే త్రిమూర్తి, లక్ష్మీనారాయణులు మరియు మెట్ల వరుస ఈ మూడు ముఖ్యమైన చిత్రాలు కదా! వీటిలో మొత్తం జ్ఞానం వస్తుంది. అలాగే ముఖంలో ఈ చిత్రాలు అనాదిగా అమర్చి ఉన్నాయి. వీటిని ఎలా అలంకరించాలంటే దూరం నుండే మీ వైపు ఆకర్షితం అవ్వాలి. ఆకర్షితం కాకుండా ఉండలేరు. మీరు మ్యూజియం తయారుచేసేటప్పుడు చిత్రం దూరం నుండే ఆకర్షించే విధంగా అలంకరించడానికి ప్రయత్నం చేస్తారు కదా! ఎవరినీ పిలవవలసిన అవసరం లేదు. అలాగే మీరు మీ మ్యూజియంను ఇలా తయారు చేసుకోవాలి. ఏది అయినా దానిని లోతుగా ఆలోచించి కణకణంలో నింపుకోవాలి. ఎవరు ఎంత లోతుగా వింటారో మరియు అంత మీ నడవడికలో ప్రత్యక్షరూపం తీసుకురావాలి.
ఆ సంస్కారాలని ప్రత్యక్షం చేయడానికి ఒకొక్క విషయం యొక్క లోతులోకి వెళ్ళాలి మరియు మీ నరనరంలో ఆ సంస్కారాలని నింపుకోవాలి. ఏదైనా వస్తువుని దేనిలో అయినా నింపాలంటే ఏమి చేయాలి? లోతుగా పంపాలి మరియు లోపలికి నొక్కి పెట్టాలి, లోపలికి కూరవలసి ఉంటుంది. అదేవిధంగా కూరటం అంటే ప్రతి విషయం యొక్క లోతులోకి వెళ్ళాలి. ఈ భట్టిలో సంస్కారాలను ప్రత్యక్ష రూపంలోకి తీసుకువచ్చే ప్రతిజ్ఞ చేసి వెళ్ళాలి. ఎంత బాబాని ప్రత్యక్షం చేస్తారో అంత స్వయం ప్రత్యక్షం అవుతారు. బాబాని ప్రత్యక్షం చేయటం ద్వారా బాబాతో పాటు మీ ప్రత్యక్షత కూడా జరుగుతుంది. ఇలా అవ్వాలి మరియు తయారు చేయాలి. అర్థమైందా! ఏది కావాలంటే అది చేయగల శక్తి ఈ సంఘటనలో ఉంది. కేవలం సంకల్పం చేస్తే సృష్టి మారిపోతుంది. ఈ విధమైన శక్తిశాలి ఆత్మలు కానీ ఇప్పుడు ఏ సంకల్పాలని శక్తిశాలిగా చేయాలి, వాటిని మరలా తాజాగా చూసుకోవాలి?
ఇలా, అలా ఉండేవారు (సామాన్యులు) ఇక్కడ పాదం పెట్టలేరు అని మధువనానికే మహిమ ఉంది. మధువనం అంటే సౌభాగ్య రేఖ. దీనిలో ఎవరు పాదం పెట్టలేరు. మీ అందరికీ బాప్ దాదా చెప్తున్నారు. ఈ స్నేహ అవరణలో బాప్ దాదా నివసిస్తున్నారు. తమ తల తీసేసుకున్నా కానీ ఎవరూ లోపలికి రాలేరు. సాకార రూపంలో స్నేహ కలయిక చిన్న విషయం కాదు. దీని కొరకు మున్ముందు ఏడవటం చూస్తారు, అప్పుడు మీకు దీని విలువ తెలుస్తుంది. ఏడ్చి ఏడ్చి మీ పాదాలపై పడతారు. స్నేహం యొక్క ఒక బిందువు కొరకు దాహంగా ఉండి మీ పాదాలపై పడతారు. మీరు స్నేహ సాగరుడిని మీలో నింపేస్తున్నారు. వారు ఒక్క బిందువుకి దప్పికగా ఉంటారు. ఇలాంటి సౌభాగ్యం ఎవరికైనా ఉంటుందా? సర్వసంబంధాల సుఖం, రసన ఏదైతే మీలో నిండి ఉందో అది ఇంకెవరిలో ఉండదు. కనుక డ్రామాలో మీ ఈ ఉన్నత భాగ్యం ఎదురుగా ఉంచుకోండి. ఎదురుగా ఉంచుకోవటం ద్వారా దానికి బదులు ఇవ్వాలి అనే విషయం సదా స్వతహాగానే స్మృతిలో ఉంటుంది.
ఓంశాంతి,సర్దుకునే శక్తి సహజంగా ఎవరికి వస్తుంది? సేవాధారులు అని ఎవరిని అంటారు? సాకార రూపంలో స్నేహ కలయిక ఎంత విలువైనది? మీకు దీని విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళిలో తెలిపించారు.
ReplyDeleteOm shanthi Mera Bapdada. Thank you Pyare Baba.
ReplyDeleteThanks a lot Baba and I am so fortunate in this world
ReplyDelete