06-07-1969 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
టీచర్లతో అవ్యక్త బాప్ దాదా యొక్క మహావాక్యాలు
అందరు ఎవరి స్మృతిలో కూర్చున్నారు? ఒకరి స్మృతి ఉందా ఇద్దరిది ఉందా? ఎవరైతే ఒకరి స్మృతిలో ఉన్నారో వారు చేతులు ఎత్తండి, మరియు ఎవరైతే ఇద్దరి స్మృతిలో ఉన్నారో వారు చేతులు ఎత్తండి? ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరు? అవ్యక్త వతనవాసీయా లేక వతనవాసీయా!
మీరందరూ టీచర్స్ కదా! మీ దగ్గరకి ఎవరైనా జిజ్ఞాసువులు వస్తే వారికి ఏ గమ్యం ఇస్తారు? అందరికీ ఏమి శిక్షణ ఇస్తారు? మీరు టీచర్స్ కదా! తమ టీచరుని ప్రత్యక్షం చేస్తారు. జిజ్ఞాసువులకి ఎలా పాలన చేస్తే లేదా ఎలా శిక్షణ ఇస్తే టీచర్ ప్రత్యక్షం అవుతారు? ఒకవేళ మీరు జిజ్ఞాసువులకి రాగానే అవ్యక్తవతనం యొక్క గమ్యం చూపిస్తే వారికి ఆ మార్గం తెలియనే తెలియదు, మరి వారు ఎలా చేరుకుంటారు? మొదట దేని చిరునామా ఇస్తారు? మీరు గ్రంథాలయంలో ఇతరులకు ఏమి చెప్తున్నారు, జిజ్ఞాసువులకి ఏమి పరిచయం ఇస్తున్నారు? వారికి ఏ మార్గం, ఏ గమ్యం ఇస్తున్నారు? బీజం ఎవరు వేసారు. బీజం బీజమే. ఒకవేళ అది పాడైపోయినా కానీ సమయానికి ఏవోక కొమ్మలు మొదలైనవి వస్తాయి. వర్షం వస్తే మొలకెత్తుతాయి. మీరు బీజాన్ని మర్చిపోతే మార్గం ఎలా చెప్తారు. బీజం ఏమిటి?
టీచర్స్ యుక్తియుక్తంగా మాట్లాడాలి. చిన్న పిల్లలు కాదు కదా! చిన్న పిల్లలకు అయితే ముందు నుండి నేర్పించవలసి ఉంటుంది. మీరు నేర్చుకొని ఇంత పాలనను తీసుకొని పరీక్ష వ్రాయడానికి వచ్చారు. చదువుకుంటారు మరియు పరీక్ష కూడా వ్రాస్తారు. రెండు కార్యాలు కలిసి నడుస్తాయి. బాబా అవ్యక్తవతనవాసి అయ్యారు. కనుక మీరందరూ కూడా అవ్యక్తవతనవాసి అవ్వాలి. బాబా ఏ సృష్టిలో ఉంటూ అవ్యక్తం అయ్యారు? మీరు కూడా ఎక్కడ తయారవ్వాలి? (సాకార సృష్టిలోనే సృష్టి ఉంటుంది కదా) సృష్టి అయితే అల్ రౌండ్ గ్లోబ్. సృష్టిలో మొత్తం వృక్షం ఇమిడి ఉంది. కానీ సృష్టి యొక్క గమ్యం సంగమం, సంగమ బలిహారం ద్వారానే మీరందరూ ఇక్కడికి చేరుకున్నారు. మీరు మీ గమ్యాన్ని మర్చిపోతే ఏమౌతుంది? గమ్యాన్ని బాగా స్మృతి చేయండి. మరియు ఏదైతే బాబా ద్వారా చదువు లభించిందో దానిని ధారణ చేయండి. ధారణ ద్వారా ధైర్యంగా అంతర్ముఖి అవుతారు. ధైర్యం ద్వారా కలియుగ రావణ రాజ్యాన్ని సమాప్తి చేయగలరు.
ఇప్పుడు చదువుకునే సమయం మరియు వెనువెంట పరీక్ష వ్రాసే సమయం కూడా. ఇది ఒక విషయం. రెండవ విషయాన్ని కూడా ధ్యాసలో ఉంచుకోండి -ఇంత సమయం బాప్ దాదా ఒడిలో పాలింపబడ్డారు. మరియు మీరు చేసిన పనులన్నీ బాబాకి వ్రాసి ఇవ్వండి. సిగ్గు కారణంగా కొన్ని బాప్ దాదాతో దాచారు. బాబాని గ్రహించాం, అన్నీ బాబా ముందు పెట్టేశాం అనుకోకండి. కొందరు కావాలని పొరపాట్లు చేయలేదు, సోమరితనంతో పొరపాట్లు జరిగాయి. అవన్నీ అందరూ వ్రాసి ఇవ్వాలి. ఇది అంతిమ సమయం కదా! 84 జన్మల కర్మల ఖాతా ఇక్కడే పూర్తి చేసుకోవాలి. సత్యత, స్వచ్ఛత అని చెప్తారు. కానీ సత్యత మరియు స్వచ్ఛతలో కూడా తేడా ఏమిటి అనే అర్థాన్ని తెలుసుకోలేదు. ఇప్పుడు దాని లోతులోకి వెళ్ళి మొత్తం జీవిత కథను వ్రాయాలి.
పిల్లల సేవ చేయడానికి మరియు పిల్లలను స్వచ్ఛంగా తయారు చేయడానికి అవ్యక్త వతనం నుండి బాప్ దాదా వచ్చారు. బాబా సేవ చేస్తున్నారు. ఆది నుండి అంతిమం వరకు బాబా మీ సేవకుడు, సేవ చేయడానికి సదా తయారుగా ఉంటారు. బాబాకి చాలా గర్వంగా ఉంటుంది - నా పిల్లలు శిరోకిరీటాలు, నయనసితారలు. వారి కోసం స్వర్గస్థాపన జరుగుతుంది. కనుక స్వర్గవాసులుగా చేయడానికి తయారుచేస్తున్నారు. మేము లక్ష్మినారాయణులు అవుతాము అనే లక్ష్యం పెట్టుకుని కూడా మరలా పొరపాట్లు చేస్తూ ఉన్నారు, కనుక బాప్ దాదా మరలా సేవ చేయడానికి వచ్చారు.
అంతిమతి సోగతి. (అంతిమంలో ఏది ఆలోచిస్తే అదే పొందుతారు) ఇప్పుడు సమయం లేదు. సమయం చాలా సమీపంగా రానున్నది. సింహశక్తులైన మీరు భుజాలను తయారుచేయాలి. అప్పుడే శత్రువులతో యుద్ధం చేయగలరు. మీపై మీకు నమ్మకం లేదు మరియు బాప్ దాదా యొక్క పూర్తి పరిచయం లేకపోతే శక్తి సేనగా కాలేరు. శక్తి స్థితి యొక్క అలంకారం చేసుకోలేరు. మీలో శక్తిని ధారణ చేస్తే అప్పుడు వచ్చేవారికి కూడా పూర్తి గమ్యం దొరుకుతుంది. మరియు వారందరూ కూడా మీ శక్తి సేనలో చేరిపోతారు. కనుక మిమ్మల్ని స్వచ్ఛమైన వజ్రంగా చేసుకోవాలి. లోపాలన్నీ తొలగించుకుని స్వచ్ఛంగా అవ్వాలి. సేన యొక్క విలువ ఎంత? కొంతమంది 9 క్యారెట్లు, కొంతమంది 12 క్యారెట్లు.... స్వచ్ఛమైనది స్వచ్ఛమైనదే. క్యారెట్ల మాట ఉండకూడదు. కరెక్ట్ గా అవ్వాలి. మిమ్మల్ని మీరు సరి చేసుకోడానికి ఈ సమయం లభించింది. ఇప్పుడు ఈ విషయాన్ని బాగా ధ్యాసలో ఉంచుకోవాలి.
భూమి చలించినా ధర్మం వదలకూడదు. ఏ ధర్మం, ఏ భూమి తెలుసా? ఒక్కసారి ప్రతిజ్ఞ చేసారు, బాప్ దాదాకి చేయి ఇచ్చేసారు, మరలా ధర్మాన్ని వదలకూడదు. పతివ్రతానారీ తన ధర్మంలో చాలా గట్టిగా ఉంటుంది. మీరు సత్యమైన సీతలు మరియు సత్యమైన లక్ష్మిలు, మహాలక్ష్మిగా అయ్యేవారు. వారి లక్ష్యం ఏమిటి? మీ లక్ష్యం నుండి ఒకవేళ దిగిపోయినా మరలా జంప్ చేసి లక్ష్యంపై కూర్చోండి. బాప్ దాదా మీకు సేవ చేయడానికి సేవకునిగా అయ్యి శిక్షణ ఇస్తున్నారు. ఆజ్ఞ చేయటం లేదు కానీ శిక్షణ ఇస్తున్నారు. ఎందుకంటే బాబా టీచర్ కూడా మరియు సద్గురువు కూడా! ఒకవేళ పిల్లలకి ఆజ్ఞ చేస్తే అది వారు అంగీకరించకపోతే బావుండదు. అందువలన శిక్షణ ఇస్తున్నారు.
ఈరోజు పునాది వేస్తున్నారు. చిన్న పిల్లలకి గుర్తు చేస్తారు. వారి మార్గం చెప్తారు, ఏమి చేయాలి, ఎలా అవ్వాలి అని. మీ అందరికీ మార్గం లభించేసింది. మీరు ఇతరులకి మార్గం చెప్పడానికి నిమిత్తం అయ్యారు. ఒకవేళ ఆ మార్గంలో ఏదైనా అలజడి ఉంటే దానిని తొలగించాలి. ఇప్పుడు కూడా తొలగించకపోతే ముందు కొరకు ఏదైతే శక్తి లభిస్తుందో అది సమాప్తి అయిపోతుంది. ఇలా బాప్ దాదాకి అక్కడక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు సంఘటనలో అందరి మనస్సులని ఒకే మనస్సుగా చేయడానికి పూర్తి మార్గం చెప్పడానికి మిమ్మల్ని పిలిచాడు. మీ అందరికీ సంతోషం ఉంటుంది. చిన్న చిన్న పిల్లలని ఎక్కడికైనా ఫంక్షన్ కి తీసుకువెళ్తే సంతోషం ఉంటుంది కదా! అక్కడికి వెళ్తారు, క్రొత్త బట్టలు ధరిస్తారు. మీ అందరికీ క్రొత్త బట్టలు, అలంకరణ ఏమి చేయాలి? ఒకవైపు సేవకులుగా కూడా అవ్వాలి. సేవకులు అంటే పతిత ఆత్మల ఉద్దరణ చేయాలి. ఆ సేవ స్థిరంగా ఉంచుకోండి. మీరందరూ వచ్చే ఆత్మలని ఎలా ఉద్దరణ చేయాలి, ఎలా విఘ్నాలను తొలగించాలి? బాణాలలో రత్నాలు ఉంటే ఒకే బాణం ద్వారా వారికి బాణం వేయగలరు. ఆ ఆత్మకి కూడా ఉద్దరణ అవుతుంది. చిన్న చిన్న పిల్లలు ఎవరి ఉద్దరణ చేస్తారు. ఏ పర్వతం ఎత్తారు? పర్వతం ఎత్తడానికి ఎవరు నిమిత్తం? గోపగోపికలు, పూర్తి కర్తవ్యం చేసినప్పుడే గోపికగా అవుతారు. ఇంత బలం ఉన్నప్పుడే పర్వతం కూడా ఎత్తగలరు. ఈ అన్ని విషయాలు వెలుగు ఇవ్వడానికి బాబాకి రావలసి వచ్చింది.
తిలకం అయితే బాబా ఒకేసారి పెట్టేసారు. ఎర్రతిలకమా లేక గంధమా? ఎర్రతిలకం ముఖానికి శోభ. గంధం ఆత్మ యొక్క శోభ. మీరు నగలు కూడా ముఖం అందానికి ధరించకూడదు. వస్త్రాలు కూడా ప్రపంచానికి చూపించడానికి ధరించకూడదు. కానీ అంతరంగికంగా మిమ్మల్ని మీరు ఇలా అలంకరించుకోవాలి, ఇలా నగలు ధరించాలి - అది లోకానికి ఇష్టమైనదా, మన మనస్సుకి ఇష్టమయ్యేదా! లోకానికి ఇష్టం అనేది బయటకి సంబంధించినది. మనస్సుకి అంతర్ముఖిగా ఉండటం ఇష్టం. అంతర్ముఖి అయ్యి మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. లోకానికి ఇష్టమైన ఉపన్యాసం చెప్తారు, సంతోషం చేస్తారు. ఉపన్యాసం యొక్క సారం ఒక్కొక్క కర్మేంద్రియాలలో నిండిపోవాలి. అప్పుడే శోభ వస్తుంది. కర్తవ్యం ద్వారా దైవీగుణాల ప్రత్యక్షత జరగాలి. దైవీగుణాల క్లాస్ అలంకరించుకోవడానికే. ఇలా అలంకరించుకుని సంగమం దాటాలి. మొదట సంగమంలో అలంకరించుకోవాలి. తర్వాత ఇంటికి వెళ్ళాలి. ఇంటి నుంచి మరలా ఎక్కడికి వెళ్ళాలి? అత్తగారి ఇంటికి. కన్య అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒకవేళ చదవటం, వ్రాయటం రాకపోతే అత్తగారికి అత్త అంటారు. వారిలో నడవటం, లేవటం, కూర్చోవటంలో తెలివి ఉండదు. ఇప్పుడు మీరు అత్తగారి ఇంటికి వెళ్ళాలి కనుక బాబా అడుగు అడుగు చూడటం లేదు, కానీ ఒక్కొక్క కర్మేంద్రియాన్ని చూస్తున్నారు. అడుగు ద్వారా కోట్లు లభిస్తాయి. అది మీ కళ్యాణం కొరకే కానీ కర్మేంద్రియాలను కూడా అలంకరించుకోవాలి. నగలు ధరించి నడవాలి. ఇప్పుడు అలంకరించుకోవడానికి ఎవరి దగ్గరికి వచ్చారు? బాప్ దాదా ఇంటికి అంటే మీ ఇంటికి వచ్చారు. అలంకరించేవారు ఎవరు? అలంకరించేటప్పుడు నగలు తయారుచేసేవారు ఒకరు ఉంటారు, ధరించేవారు ఇంకొకరు ఉంటారు. ఎవరి కోడలు అవుతుందో వారే ఖర్చు చేయాలి, ఎవరు తీసుకువెళ్ళాలో వారే అలంకరించి తీసుకువెళ్ళాలి. కనుక ఇప్పుడు అలంకరించుకుని నడవాలి. ఈ 15 రోజుల ఫలితం అంతిమ ఫలితంగా భావించండి. టీచర్స్ అందరు ఇంతగా పురుషార్ధం చేసి ప్రావీణ్యంగా అవ్వాలి. మరలా వెళ్ళి సెంటర్ సంభాళించేటప్పుడు వచ్చేవారికి దృష్టి ద్వారా సృష్టి కనిపించాలి. ఇది నగలు మంచిగా ధరించినప్పుడే జరుగుతుంది. ఒకవేళ సోమరితనంతో ఏమైనా నగలు పడిపోతే నష్టం జరుగుతుంది మరియు అలంకరణ యొక్క శోభ కూడా తొలగిపోతుంది. అందువలన శోభ తొలగిపోకూడదు, నగలు తీయకూడదు, పెద్ద విషయం కాదు. చిన్నదిగా భావిస్తే సహజంగా తెలివి వస్తుంది. ఇది చాలా ఉన్నతమైన జ్ఞానం అని చెప్తే ఎవరు రారు. 7 రోజులలో జీవన్ముక్తి ప్రాప్తి వస్తుంది అని చెప్తే అందరు లాటరీ తీసుకోవడానికి వస్తారు. లాటరీ అందరు తీస్తారు ఆ లాటరీ కొద్దిమందికే లభిస్తుంది. వారిని అదృష్టవంతులుగా భావిస్తారు. ఎవరికి అదృష్టం ఉంటుందో వారికి అవకాశం లభిస్తుంది. కొంతమందికి పెద్ద లాటరీ లభిస్తుంది, కొంతమందికి చిన్న లాటరీ లభిస్తుంది. అంతిమ పేపర్ లో కూడా 3 నెంబర్స్ లభిస్తాయి. ఎవరు ఎంత పురుషార్ధం చేస్తారో అంత నెంబర్ లభిస్తుంది. అదృష్టం తయారుచేసుకోవటం మీ చేతులలోనే ఉంది. ఇప్పుడు లాటరీ యొక్క నిరీక్షణలో ఉండకూడదు. తయారవుతూ ఉండాలి. కానీ ఈ రెండు విషయాలలో నిస్సంకల్పంగా అయినవారినే యోగి అంటారు. ఏ లక్ష్యం ఉందో ఆ లక్షణాలను ధారణ చేయాలి. చాలా ఖజానా లభించింది, ఇప్పుడు దానిని మీ దగ్గర జమ చేసుకోండి. మరలా ఆవు వలె స్వచ్ఛంగా అవ్వాలి. మీరు గోపికలు, గోపకులు కూడా బహురూపాలు ధారణ చేసి బహుకర్తవ్యాలు చేయాలి. భట్టీలో అన్నీ అనుభవం చేసుకోవాలి. ఎంత పురుషార్ధం చేస్తే అంత ఫలితం వస్తుంది. సంపూర్ణస్థితిని పొందేటందుకు లక్ష్యం ఏమిటి? సాధనం ఏమిటి? దానిని తెలుసుకోవాలి. సాధనం లభిస్తే లక్ష్యాన్ని పట్టుకోవచ్చు. రత్నాలని కూడా పరిశీలించాలి కదా! పూర్తి విలువ ఉండాలి. రత్నాల విలువ రత్నాల వ్యాపారియే పరిశీలించగలడు. ఎవరు పరిశీలించలేరో వారు విలువ కట్టలేరు. రత్నాలు మెరుస్తున్నప్పుడే మిమ్మల్ని పరిశీలిస్తారు. మీ విలువ పెరుగుతుంది. మరియు గ్రహించేవారు గ్రహిస్తారు. చమత్కారం లేకపోతే ఎవరు కొనుక్కుంటారు? సత్యమైనదో, కాదో అని అనుకుంటారు. డబ్బులిచ్చి తీసుకున్నది పనిచేయకపోతే లాభం ఏమిటి? మీరు కూడా పూర్తిగా అలంకరించుకున్నప్పుడే కొనుక్కునే వారు కూడా వస్తారు. అప్పుడు రత్నాల విలువ ఎక్కువ అవుతూ ఉంటుంది, అవ్యక్త వతనవాసి అయిపోతారు.
om shanthi Mera Baba. Thank you so much Baba.
ReplyDelete