25-10-1969 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
మాలలో మణులుగా అయ్యేటందుకు విజయీ అవ్వండి.
బాప్ దాదా పిల్లలని చూసినప్పుడు ముఖ్యంగా ఏ విషయం చూస్తారు? ఈ రోజు ప్రతి ఒక రత్నం తమలో ఏమేమి పరివర్తన తీసుకువచ్చారు అని. ఈ రోజు పరివర్తన చూడడానికి వచ్చారు. ప్రతి ఒక్కరు శక్తిననుసరించి పరివర్తనను అయితే తీసుకువచ్చారు. కానీ బాప్ దాదా ఎటువంటి పరివర్తన చూడాలనుకుంటున్నారు? అది కూడా మీకు తెలుసు. బాప్ దాదా పరివర్తనతో పాటు పరిపక్వత కూడా చూడాలనుకుంటున్నారు. బాబాని అవినాశి, సత్యం అని అంటారు కదా! అదేవిధంగా మీలో అవినాశి పరివర్తనని తీసుకువచ్చారా? పరివర్తన అయితే చూసారు, కానీ పరివర్తనతో పాటు మీలో పరిపక్వత తీసుకువచ్చారా? ఖజానా కూడా అవినాశిగా లభించింది. ప్రాలబ్దం కూడా అవినాశి అయితే పరివర్తనను కూడా అవినాశిగా తీసుకువచ్చారా లేక వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అని ఆలోచిస్తున్నారా? ఏ పరిస్థితులు వస్తాయో తెలియదు, పరిపక్వంగా ఉండగలమో, లేదో, ప్రతిజ్ఞ చేస్తున్నాము కానీ ఎంత వరకు నిలబెట్టుకుంటామో చూడాలి అని ఆలోచిస్తున్నారు. నిశ్చయబుద్దిగా ఉండేవారికి బాబాతో పాటు తమపై కూడా పూర్తి నిశ్చయం ఉంటుంది. ఏదైతే పరివర్తన తీసుకువచ్చామో దానిని స్థిరంగా ఉంచుకుంటాము అని. మరియు ఏదైతే ప్రతిజ్ఞ చేసామో అది నిలిపి చూపిస్తాము అని. సంపూర్ణ నిశ్చయబుద్ధి అంటే ఏదైతే ప్రతిజ్ఞ చేసామో అది నిలిపి చూపిస్తాము అని అంటారు. వీరు సంపూర్ణ నిశ్చయబుద్ధి మరియు ఆలోచించి ధైర్యాన్ని ధారణ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పటివరకు ఇలాగే చేస్తూ నడిస్తే అంతిమం వరకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారా? ఈ విధమైన పురుషార్ధిని ఒక దెబ్బతో బలి అయినవారు అంటారా? దేవతలకి బలి ఇచ్చేటప్పుడు ఒక దెబ్బతో బలి కాకపోతే శక్తులు లేక ఇతరులు స్వీకరించరు మరి బాబా స్వీకరిస్తారా? ఒకవేళ ఇక్కడ స్వీకరించకపోతే స్వర్గంలో ఉన్నత పదవి యొక్క స్వీకృతి లభించదు. అందువలనే చెప్పాను కదా - ఏది ఆలోచిస్తారో అదే చెప్పాలి. ఏది చెప్తారో అదే చేయాలి. ఆలోచించడం, చెప్పటం, చేయటం ఈ మూడూ సమానంగా ఉండాలి. కానీ వర్తమాన సమయంలో కొంతమంది పిల్లలు చాలా ఆలోచిస్తున్నారు. చాలా చెప్తున్నారు. కానీ చేసే సమయంలో తక్కువ అయిపోతున్నారు. అందువలనే ఈ భట్టీలో గట్టిగా అయ్యి చేయడానికి ధైర్యం ఉందా లేక వెళ్ళాలి, అంటే గట్టిగా ప్రతిజ్ఞ చేసి వెళ్ళాలి. మొదట ప్రతిజ్ఞ ధారణ చేస్తారా? ధైర్యవంతులైన పిల్లల గుర్తు ఏమిటి? వారు ఎప్పుడూ ఓడిపోరు. ఒకవేళ మీరందరూ ధైర్యవంతులైతే తప్పకుండా ఈరోజు నుండి ఎప్పుడూ ఓడిపోరు. చాలా సమయం నుండి ఎవరైతే విజయీ అవుతారో వారే విజయీ మాలలో మణులుగా అవుతారు. ఒకవేళ విజయీ మాలలోకి రావాలంటే విజయీ అయ్యే పరివర్తన తీసుకురావాలి. పరివర్తనలో ముఖ్య విషయాలను పరిశీలించుకోవాలి, చాలా సహజం. రెండు మాటలు స్మృతిలో ఉంచుకోవాలి. 1.ఆకర్షణామూర్తి అవ్వాలి మరియు 2.హర్షితముఖి అవ్వాలి. ఆకర్షణ చేసేది ఆత్మ, ఆత్మిక స్థితిలోనే ఒకరినొకరిని ఆకర్షితం చేయగలరు. ఒకవేళ ఈ రెండు విషయాలను మీలో ధారణ చేస్తే సంపూర్ణ విజయీ అవుతారు. ఎక్కువ మంది పిల్లలలో ముఖ్యంగా ఏ విషయం ఉంది? అది ఈ రోజు కూడా చెప్తున్నారు. నిశ్చయబుద్ది కనుకే ఇక్కడికి వచ్చారు. బాబాపై నిశ్చయం, జ్ఞానంపై నిశ్చయం ఉంది కానీ స్వయంపై నిశ్చయంలో అక్కడక్కడ అలజడి చేస్తుంది. ముఖ్య లోపం ఇదే - కంట్రోలింగ్ పవర్ (అదుపులో పెట్టుకునే శక్తి) లేదు. ఈ శక్తి లేని కారణంగా అర్ధం చేసుకుంటూ, ఆలోచిస్తూ కూడా మరలా అదే విషయం చేసేస్తున్నారు. అందువలన కంట్రోలింగ్ పవర్ అవసరం. మనస్సులో, వాచాలో మరియు కర్మణాలో కూడా మరియు వెనువెంట లౌకిక సంబంధీకుల లేదా దైవీ పరివారం యొక్క సంబంధంలోకి రావటంలో కూడా కంట్రోలింగ్ పవర్ ఉండాలి. ఎంతవరకు ఏమి చేయాలి, ఏమి చెప్పాలి. ఏమి చెప్పకూడదు అనే కంట్రోలింగ్ పవర్ ఉండాలి మరియు ఏది చేయకూడదో దానిని పూర్తిగా కంట్రోల్ చేసుకునే శక్తి పూర్తిగా లేని కారణంగా సఫలత పొందటం లేదు. కనుక కంట్రోలింగ్ పవర్ యొక్క లోపాన్ని ఎలా తొలగించుకుంటారు? కొన్నిసార్లు గోపకులైన మీరు చూస్తారు - ఏదైనా వస్తువుని ఎక్కువగా కంట్రోల్ చేయాలంటే ఆ వస్తువుని తేలికగా వదలవలసి ఉంటుంది. గాలిపటం ఎప్పుడైనా ఎగురవేశారా? గాలిపటాన్ని కంట్రోల్ చేయడానికి మరియు పైకి ఎగిరేలా చేయడానికి ఏమి చేస్తారు? ఇది కూడా అంతే. మీ బుద్ధిని అదుపులో పెట్టుకోవడానికి కొన్ని విషయాలని తేలిక చేయాలి. అన్నింటికంటే తేలికైన వస్తువు ఏమిటి? ఆత్మ (బిందువు). మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునేటందుకు పూర్తిగా తేలికగా బిందురూప స్థితిలో స్థితులవ్వాలి. కంట్రోల్ చేయడానికి ఫుల్ స్టాప్ (బిందువు) పెట్టవలసి ఉంటుంది. కనుక మీరు కూడా ఏదైతే జరిగిపోయిందో దానిని పూర్తిగా మర్చిపోండి. చూసారు, చేసారు కానీ ఒక్కసారిగా దానికి బిందువు పెట్టండి, ఒక్కసారిగా దానిని సమాప్తి చేయండి. సమాప్తి చేయటం అంటే బిందువు, ఫుల్ స్టాప్ పెట్టడం, కామా(,) ప్రశ్నార్ధకం(?) పెట్టడం వస్తుంది. ఆశ్చర్యార్ధకం (!) పెట్టడం కూడా వస్తుంది. కానీ ఫుల్ స్టాప్ పెట్టడం రావటం లేదు. కాగితంపై ఈ గుర్తులు పెట్టడం సహజమే కానీ మీ కర్మలపై ఈ గుర్తులు పెట్టడంలో కష్టం ఎందుకు? కాగితంపై గుర్తులు పెడతారు కదా! మరియు ఏ గుర్తు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే ప్రవీణులు అంటారు. కామా (,) బదులు ఫుల్‌స్టాప్ పెడితే ప్రవీణులు అని అనరు. ఎక్కడ ప్రశ్నార్ధకం పెట్టాలో అక్కడ ప్రశ్నార్థకం పెట్టకపోయినా ప్రవీణులు అనరు. ఇక్కడ కూడా ఏ విషయంలో ప్రశ్నార్ధకం, ఏ విషయంలో ఆశ్చర్యార్ధకం, ఏ విషయంలో ఫుల్ స్టాప్ పెట్టాలో పూర్తిగా గ్రహించని కారణంగా ప్రవీణులుగా కావటం లేదు. ఇప్పుడు అర్ధమైందా! కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఆ సమయంలో జ్ఞానం యొక్క పెట్రోల్ తక్కువ అయిపోతుంది. ఒకవేళ జ్ఞానం అనే పెట్రోల్ ఉంటే కంట్రోల్ చేయగలరు. బుద్ధిరూపి ట్యాంక్ లో జమ చేసుకోండి. మైనస్ (- తీసివేత) మరియు ప్లస్ (+ కూడిక) ఈ లెక్క నేర్చుకున్నారా? జమ చేసుకోవటం కూడా నేర్చుకున్నారా? కేవలం జోడించాము, తొలగించేసాము అని కాదు. కానీ జమ చేసుకోవటం కూడా నేర్చుకోండి. ఒకవేళ జమ చేసుకోకపోతే ఇతరులకి ఇవ్వలేరు. స్వయాన్ని ముందుకి తీసుకువెళ్ళలేరు. ఇతరులకి ఇవ్వడానికి, మనం అవసర సమయంలో ఉపయోగించుకోవడానికి జమ చేసుకోవాలి. ఎంత జమ చేసుకున్నాను! అనేది కూడా చూసుకోవాలి. కేవలం సంపాదించుకోవటం మరియు తినేయడమేనా లేక జమ కూడా అవుతుందా? ఎప్పుడైనా లెక్క పెట్టారా? 25% జమ అయితే చాలా తక్కువ. ఒకవేళ 25% జమ చేసుకుంటే ఇప్పటి లెక్కతో బాప్ దాదా కూడా ఏమి బాధ్యత ఇస్తారు? ఇప్పటి నుండి ఎక్కువ సృృతి ఎన్ని రోజులలో చేస్తారు? వినాశనం ఎప్పుడు అవుతుంది? 7 సం||లో 75% జమ చేసుకుంటారా? ఒకవేళ దాని కంటే ముందే వినాశనం అయిపోతే ఏమి చేస్తారు? మీ ప్లాన్స్ అయితే 7 సం||ల లెక్కతో తయారు చేసుకున్నారు. ఒకవేళ 5 సం||లోనే అయిపోతే ఏమి చేస్తారు? ఈ రోజు పని రేపు చేస్తాం అని అనకండి అని ఇతరులకి చెప్తున్నారు కదా! మరి 7 సం||లని ఎందుకు ఆలోచిస్తున్నారు? అది సృష్టి మారేటటువంటి విషయం కానీ మీరు మారడానికి 7 సం||లు అని చెప్పలేదు. 7 సం||లు అనేది దృష్టి మారే విషయమా లేక మీరు మారే విషయమా? 7 సం||లలో మారుతాము అని ఎప్పుడూ ఆలోచించకూడదు. తీవ్ర పురుషార్థులు ఇలా ఎప్పుడూ అనరు. చాలా సమయం నుండి సంపూర్ణత యొక్క సంస్కారం ఉంటే అంతిమంలో కూడా సంపూర్ణం అవుతారు. ఒకవేళ 7 సం||ల అంతిమంలో అవుతాము అంటే బాప్ దాదా కూడా అంతిమంలో కొద్దిగానే ఇస్తారు. ఇప్పుడు చేస్తే వారిని బాప్ దాదా కూడా సత్యయుగ ప్రారంభంలో రండి అని అంటారు. ఎవరైతే 7 సం||లు అంటారో వారికి పదవి కూడా తక్కువ అయిపోతుంది. ఈ లక్ష్యం లేదు కదా?
బాప్ దాదా ప్రతి ఒక్కరత్నంపై ఆశ పెట్టుకుంటు న్నారు - వీరు అనేకులని ఆశావాదులుగా చేస్తారని. ఎవరైతే అనేకులని ఆశావాదులుగా చేస్తారో వారు తమ కొరకు మరలా అంతిమంలో చేస్తాం అనే ఆశ ఎలా పెట్టుకుంటారు? ఈ గ్రూప్ యొక్క భట్టీ కూడా సమాప్తి అయ్యింది. సమాప్తి అయ్యిందా లేక ప్రారంభం అయ్యిందా? ఈ గ్రూప్ యొక్క పరీక్ష తీసుకోలేదు. ఏదైతే ఉదాహరణ చూసానో దానిని సదాకాలికంగా స్థిరంగా ఉంచుకుంటే పరీక్ష తీసుకుంటాను. ఏదైనా విషయాన్ని గట్టిగా చేయాలంటే ఏమి చేస్తారు? పునాది గట్టిగా ఉండటానికి లోతుగా వేయవలసి ఉంటుంది. ఎంతెంత లోతుగా వేస్తారో అంతంత గట్టిగా ఉంటుంది. పైపైకి వేస్తే గట్టితనం ఉండదు. అదేవిధంగా ఎంతెంత లోతుగా జ్ఞానధారణ చేస్తారో అంతగానే మీలో గట్టితనం వస్తుంది. పరివర్తన అయితే అందరు ఎంతో కొంత అయ్యారు. కొంచెం అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే ప్రత్యక్షంలోకి తీసుకువచ్చిన తర్వాతే అంతిమ సర్టిఫికెట్ ఇస్తారు. ఇప్పుడు సర్టిఫికెట్ ఇవ్వటం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉత్సాహ, ఉల్లాసాలతో తమ పురుషార్థంలో ముందుకి వెళ్తున్నారని సంతోషపడుతున్నారు. కానీ ప్రత్యక్ష ఫలితం తెలిసినప్పుడే సర్టిఫికెట్ లభిస్తుంది. భట్టి సమాప్తి అయ్యింది అని భావించకూడదు కాని ప్రారంభం అయ్యింది. ఇప్పుడు వినటం అయ్యింది తర్వాత చేయాలి. చేసిన తర్వాత సర్టిఫికెట్ లభిస్తుంది.
ఈ గ్రూప్ యొక్క ముఖ్య గుణం ఏమిటి? ఏకత. కానీ ఏకతతో పాటు ఇప్పుడు మరో మాట కూడా కలపాలి. ఏకతతో పాటు ఏకాంత ప్రియులుగా కూడా అవ్వాలి. ఎలా అయితే ఏకతలో మొదటి నెంబరో అలాగే ఏకాంతంలో కూడా నెంబర్ వన్ అవ్వాలి, ఈ ధారణ చేస్తే ఈ గ్రూప్ చాలామంది కంటే ముందుకి వెళ్తుంది. ఏకతతో పాటు ఏకాంతవాసి ఎలా అవ్వాలి? ఇది కూడా మీలో నింపుకోవాలి. ఎవరికైతే అనేక వైపుల నుండి బుద్ధి తెగిపోతుందో మరియు ఒకనితో ప్రియంగా ఉంటుందో వారే ఏకాంతప్రియులుగా కాగలరు. ఒకనికే ప్రియంగా ఉంటే ఒకని స్మృతిలో ఉండగలరు. అనేకులకి ప్రియంగా ఉంటే ఒకనితోనే జోడించలేరు. అనేక వైపుల నుండి బుద్ధియోగం తెగిపోవాలి. ఒకవైపు జోడించాలి అంటే ఒక బాబా తప్ప ఇంకెవరు లేరు, ఈ స్థితి ఉన్నవారే ఏకాంతప్రియులుగా అవుతారు. లేకపోతే ఏకాంతంలో కూర్చునే ప్రయత్నం చేస్తున్నా కూడా అనేకవైపులకి బుద్ధి భ్రమిస్తుంది. ఏకాంతం యొక్క ఆనందాన్ని అనుభవం చేనుకోలేరు. సర్వ సంబంధాలు, సర్వ అనుభూతులు ఒకరి నుండి తీసుకునేవారే ఏకాంతప్రియులుగా అవుతారు. ఎప్పుడైతే ఒకని ద్వారా సర్వ అనుభూతులు లభిస్తే ఇక అనేకుల వైపు బుద్ది వెళ్ళవలసిన అవసరం ఏముంది? కానీ ఎవరైతే ఒకని ద్వారా సర్వ అనుభూతులు పొందే అభ్యాసిగా ఉండరో వారు అనేక రసనలు పొందడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఒకటి కూడా లభించదు. మరియు ఒక్క బాబాతో జోడించడం ద్వారా అనేక ప్రాప్తులు లభిస్తాయి. కేవలం ఒకటి అనే మాట స్మృతి ఉంచుకున్నా కానీ దానిలో మొత్తం జ్ఞానం వచ్చేస్తుంది, స్మృతి కూడా వచ్చేస్తుంది, సంబంధం కూడా వచ్చేస్తుంది, స్థితి కూడా వస్తుంది, మరియు వెనువెంట ప్రాప్తి ఏదైతే ఉందో అది కూడా ఒకటి అనే మాట ద్వారా స్పష్టం చేయవచ్చు. ఒకని స్మృతి, ఏకరసస్థితి మరియు జ్ఞానం అంతా కూడా ఒకని స్మృతిలోనే లభిస్తుంది. అప్పుడు ప్రాప్తి కూడా ఏకరసంగా ఉంటుంది. ఈ రోజు సంతోషం, రేపు సంతోషం మాయం అయిపోతే దీనిలో ప్రాప్తి ఉండదు. ఏదైతే అతీంద్రియ సుఖం లభిస్తుందో అది కూడా ఏకరసంగా ఉండదు. ఒకోసారి తక్కువ, ఒకోసారి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏకరసంగా ఉండే పేపర్ తీసుకోవడానికి వెళ్తున్నారు. పాట్నా నివాసీయులు పేపర్ లో ఎన్ని మార్కులు తీసుకుంటారో చూస్తాను. మేము ఇతరులకి చేసి చూపిస్తాము అని సదా ఈ ప్రయత్నం చేయండి. మీ నడవడిక మరియు కర్మ ఇతరులకి చదువు నేర్పించాలి. ఏ విషయంలో ఫెయిల్ కాకూడదు. దీని కొరకు మొత్తం వినిపిస్తున్నాను. పాట్నా నివాసీయులు ఉన్నత కార్యం చేయాలి. అందువలనే బాప్ దాదాకి పాట్నా నివాసీయులపై విశేష స్నేహం ఉంది. ఏ విషయంలో ఫెయిల్ కాకూడదు, అంటే ఒక విషయం స్మృతిలో ఉంచుకోవాలి - ఫాలోఫాదర్ (తండ్రిని అనుసరించాలి). సాకార బాబా ఏది చేసి చూపించారో దానిని అనుసరిస్తే ఏ విషయంలో ఫెయిల్ అవ్వరు. ఏదైనా విషయం వస్తే తండ్రిని అనుసరిస్తున్నానా అని చూసుకోండి. ఇన్ని సంవత్సరాలు సాకార రూపంలో కర్మ చేసి చూపించారు. తండ్రిని అనుసరిస్తే ఏదైనా వ్యతిరేక కర్మ చేస్తుంటే దానిలో బ్రేక్ వస్తుంది, ఈ కర్మ మేము చేయవచ్చు అని నిర్ణయం చేసుకోగలరు. తండ్రిని అనుసరించాలి. తండ్రి అంటే దీనిలో ఇద్దరు వస్తారు. తండ్రిని అనుసరించాలి అని జ్ఞాపకం వస్తే ఫెయిల్ అవ్వరు. మచ్చలేని వారిగా అవుతారు. పాట్నా నివాసీయులను బాబా మచ్చలేని వారిగా చేయాలనుకుంటున్నారు. మాలలో సమీపంగా రావడానికి ఈ సహజయుక్తి చెపున్నారు. మీకు వినిపించిన ఈ యుక్తి మీకంటే ముందు ఎవరూ ప్రయోగించకుండా చూసుకోండి. బాప్ దాదా అయితే ప్రతి ఒక సితారపై ఆశ పెట్టుకుంటారు అందువలనే ఆశాసితార అంటారు.
విశేషస్నేహం కనుకే ఈ సమయంలో కూడా వచ్చారు. త్యాగం కూడా చేశారు కదా! మీ నిద్ర కూడా త్యాగం చేశారు. ఇది కూడా స్నేహమే కదా! బాప్ దాదా ఇప్పుడు మీ స్నేహానికి బదులు ఇస్తున్నారు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఫలితం చూస్తాను. వెళ్ళేది మరలా రావడానికే. వెళ్ళాలి మరియు రావాలి. వెళ్ళాల్సిందే కానీ మరలా రావడానికి వెళ్ళాలి. ఎంతెంత అవ్యక్త స్థితి యొక్క అనుభవీగా అవుతారో అంతగానే అవ్యక్త మధుబన్ ఆకర్షితం అవుతుంది, ఇప్పుడు వ్యక్త మధుబన్ కాదు.
ఓంశాంతి, నిశ్చయబుద్దిగా ఉండేవారి గుర్తు ఏమిటి? ధైర్యవంతులైన పిల్లల గుర్తు ఏమిటి? ముఖ్యమైన లోపం ఏమిటి? అన్నింటికంటే తేలికైన వస్తువు ఏమిటి? కంట్రోల్ చేయడానికి ఏ పెట్రోల్ తప్పనిసరి? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళిలో తెలిపించారు.
ReplyDeleteOm shanthi Mera Bapdada. Thank You Pyare Baba.
ReplyDeleteThanks a lot Mera baba
ReplyDelete