30-03-1985 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
'' మూడు - మూడు మాటల పాఠము ''
ఈ రోజు బాప్దాదా సదా తమ సాథీ పిల్లలను లుసుకునేందుకు వచ్చారు. పిల్లలే తండ్రికి సదా సాథీలుగా, సహయోగులుగా ఉన్నారు. ఎందుకంటే పిల్లలు అతి స్నేహీలు. ఎవరితో స్నేహం ఉంటుందో వారికే సదా సహయోగులుగా, సాథీలుగా అవుతారు. కనుక స్నేహీ పిల్లలుగా ఉన్న కారణంగా పిల్లలు లేకుండా తండ్రి ఏ పనీ చెయ్యలేరు. పిల్లలు తండ్రి లేకుండా ఏ పనీ చెయ్యలేరు. అందువలన స్థాపన ఆది నుండి తండ్రి బ్రహ్మతో పాటు బ్రాహ్మణ పిల్లలను రచించారు. బ్రహ్మనొక్కరినే కాదు, బ్రహ్మతో పాటు బ్రాహ్మణ పిల్లలు కూడా జన్మించారు. ఎందుకు? పిల్లలు సహయోగీ, సాథీలు. అందువలన తండ్రి జయంతి జరిపినప్పుడు జతలో ఏమంటారు? శివజయంతియే బ్రహ్మ జయంతి, బ్రాహ్మణుల జయంతి అని అంటారు. కావున జత జతలో బాప్దాదా మరియు పిల్లలందరి ఆది రచన జరిగింది అంతేకాక వారు ఆది నుండే తండ్రికి సహయోగులుగా, సాథీలుగా అయ్యారు. కావున తండ్రి తన సహయోగి, సాథీలతో(స్నేహితులతో) కలుస్తున్నారు. సాథీలు అనగా ప్రతి అడుగులో, ప్రతి సంకల్పంలో, మాటలో స్నేహాన్ని నిభాయించేవారు. అనుసరించడం అనగా స్నేహాన్ని నిభాయించడం. ఇలా ప్రతి అడుగులో తోడు నిభాయించేవారు అనగా తండ్రిని అనుసరించే సత్యమైన సాథీలు. అవినాశి స్నేహితులు(సాథీలు). సత్యమైన స్నేహితులుగా ఉన్నవారి ప్రతి అడుగు స్వత:గానే తండ్రి సమానంగా పడ్తూ ఉంటుంది. అక్కడ ఇక్కడ పడజాలదు. సత్యమైన స్నేహితులు శ్రమ చెయ్యవలసిన అవసరం ఉండదు. స్వత:గానే ప్రతి అడుగు తండ్రి అడుగు పై వెయ్యడం తప్ప కొంచెం కూడా అక్కడ ఇక్కడ వెయ్యలేరు. ఇలాంటి సత్యమైన స్నేహితులైన పిల్లల మనసులో, బుద్ధిలో, హృదయంలో ఏం ఇమిడి ఉంది? నేను తండ్రికి చెందిన వాడిని, తండ్రి నావాడు. తండ్రి బేహద్ ఖజానాల వారసత్వం నాది అని బుద్ధిలో ఉంటుంది. మనసులో మనోభిరాముడు మరియు మనసు(హృదయం) తప్ప ఇంకొకటి ఏదీ ఉండదు. తండ్రియే స్మృతి స్వరూపంగా ఇమిడిపోయి ఉన్నప్పుడు ఎలాంటి స్మృతియో అలాంటి స్థితి మరియు అలాంటి కర్మలే స్వత:గానే జరుగుతాయి. ఉదాహరణకు భక్తిమార్గంలో కూడా భక్తులు నిశ్చయం చూపించేందుకు మా హృదయంలో ఎవరున్నారో చూడండి అని అంటారు. మీరు చెప్పరు కాని స్వత:గానే తమ హృదయంలో హృదయాభిరాముడే అందరికి అనుభవం అవుతారు అనగా కనిపిస్తారు. కావున సత్యమైన సాథీలు ప్రతి అడుగులో తండ్రి సమానంగా మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉన్నారు.
ఈ రోజు బాప్దాదా పిల్లలకు అభినందనలు తెలిపేందుకు వచ్చారు. సహయోగీ, సాథీలైన పిల్లలందరు తమ-తమ ఉత్సాహ-ఉల్లాసాలతో స్మృతిలో, సేవలో ముందుకు వెళ్తూ ఉన్నారు. విజయ పతాకము ఎగురవెయ్యాల్సిందే అని ప్రతి ఒక్కరి మనసులో ఒక్కటే దృఢ సంకల్పం ఉంది. మొత్తం విశ్వంలో ఒక్క ఆత్మిక తరడ్రి యొక్క ప్రత్యక్షతా జెండా ఎగురుతుంది. ఈ ఉన్నతమైన జెండా క్రింద మొత్తం విశ్వంలోని ఆత్మలు 'తండ్రి వచ్చేశారు' అనే పాట పాడ్తారు. జెండా ఎగరవేయునప్పుడు మీరు అందరూ జెండా క్రింద పాట పాడ్తారు. తర్వాత ఏమవుతుంది? జెండా ఎగరవేసినందున అందరి పై పూల వర్షం కురుస్తుంది. అలాగే అందరి హృదయం నుండి ఈ పాట స్వత:గానే వెలువడ్తుంది. అందరి తండ్రి ఒక్కరే. గతి, సద్గతినిచ్చే తండ్రి ఒక్కరే. ఇలా పాట పాడుతూ అవినాశి సుఖ, శాంతుల వారసత్వాన్ని పుష్ప వర్షం వలె అనుభవం చేస్తారు. 'తండ్రి' అని అనగానే వారసత్వాన్ని అనుభవం చేస్తారు. కనుక అందరి మనసులో ఒకే ఉత్సాహ-ఉల్లాసాలు ఉన్నాయి. అందువలన బాప్దాదా పిల్లల ఉత్సాహ-ఉల్లాసాలకు పిల్లలకు అభినందులు తెలుపుతున్నారు. వీడ్కోలు అయితే ఇవ్వరు కదా! శుభాకాంక్షలు ఇస్తారు. సంగమయుగంలోని ప్రతి సమయం అభినందనలు తెలిపే సమయము. కావున మానసిక లగ్నము పై, సేవ లగ్నము పై బాప్దాదా పిల్లలందరికి అభినందనలు తెలుపుతున్నారు. సేవలో సదా ముందుకు వెళ్ళాలని అందరికీ ఉత్సాహముంది. సేవలో ముందుకు వెళ్లే ఉత్సాహము లేనివారు ఎవ్వరూ లేరు. ఉత్సాహము లేకుంటే ఇక్కడకు ఎలా వస్తారు, ఇది కూడా ఉత్సాహానికి గుర్తు కదా! ఉత్సాహ-ఉల్లాసాలు ఇప్పుడున్నాయి, సదా ఉంటాయి. ఉత్సాహ-ఉల్లాసాలతో ముందుకు వెళ్తూ సేవలో సదా నిర్విఘ్నంగా ఉన్నారా? ఉత్సాహ-ఉల్లాసాలైతే చాలా బాగున్నాయి. కాని నిర్విఘ్న సేవ మరియు విఘ్నాలను దాటుకుంటూ దాటుకుంటూ సేవ చేసేందుకు అంతరం ఉంది. నిర్విఘ్నులు అనగా ఎవరి కొరకు విఘ్నరూపంగా అవ్వరు మరియు ఏ విఘ్నరూపంతో భయపడరు. ఈ విశేషతను ఉత్సాహ-ఉల్లాసాలతో పాటు అనుభవం చేస్తున్నారా? లేక విఘ్నాలు వస్తున్నాయా? ఒకటి - విఘ్నాలు పాఠము చదివించేందుకు వస్తాయి, రెండవది - విఘ్నాలు కదిలించేందుకు వస్తాయి. ఒకవేళ పాఠము చదువుకొని పక్కా అయి ఉంటే ఈ విఘ్నాలు లగ్నములోకి పరివర్తన అవుతాయి. విఘ్నాలతో భయపడ్తే రిజిస్టరులో మచ్చ పడ్తుంది. తేడా ఉంది కదా!
బ్రాహ్మణులుగా అవ్వడం అనగా ''భలే విఘ్నాలూ రండి, మేము విజయులము, మీరు ఏమీ చెయ్యలేరు'' అని మాయను సవాలు చెయ్యడము. ఇంతకుముందు మాయకు స్నేహితులుగా ఉన్నారు. ఇప్పుడు మాయాజీతులుగా అవుతామని సవాలు చేస్తారు. ఛాలెంజ్ చేస్తారు కదా! లేకుంటే దేని పై విజయులుగా అవుతారు? తమ పైననా? విజయీ రత్నాలుగా అవుతారంటే మాయ పైననే విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు కదా! విజయమాలలో కూర్చబడ్తారు, పూజింపబడ్తారు. కావున మాయాజీత్లుగా అవ్వడం అనగా విజయులుగా అవ్వడం. బ్రాహ్మణులుగా అవ్వడం అనగా మాయను సవాలు చెయ్యడం. సవాలు చేసేవారు ఆట ఆడ్తారు. వచ్చింది మరియు వెళ్లిపోయింది. దూరం నుండే తెలుసుకుంటారు, దూరం నుండే తరిమేస్తారు. సమయాన్ని వృథా చెయ్యరు. సేవలో అయితే అందరూ చాలా బాగున్నారు. సేవతో పాటు నిర్విఘ్న సేవ యొక్క రికార్డు ఉండాలి. ఉదాహరణానికి పవిత్రత గురించి ఆది నుండి రికార్డు ఉంచుకుంటారు కదా! సంకల్పంలో కూడా ఆది నుండి ఇప్పటి వరకు అపవిత్రంగా అవ్వని వారు ఎవరున్నారు? ఈ విశేషత చూసుకుంటున్నారు కదా! కేవలం ఈ ఒక్క పవిత్రత విషయంతో గౌరవనీయంగా పాసవ్వరు. కాని సేవలో, స్వ స్థితిలో, సంపర్కములో, సంబంధములో, స్మృతిలో అన్నింటిలో ఆది నుండి ఇప్పటి వరకు అచలంగా(స్థిరంగా) ఉండి అలజడిలోకి రానివారు, విఘ్నాలకు వశీభూతం అవ్వనివారు అవుతారు. వినిపించాను కదా, విఘ్నాలకు వశమవ్వరాదు. స్వయం ఎవరి ముందు విఘ్నరూపులుగా అవ్వరాదు. దీనికి కూడా మార్కులు జమ అవుతాయి. ఒకటి పవిత్రత, రెండవది అవ్యభిచారి స్మృతి. స్మృతి మధ్యలో కొంచెం కూడా ఏ విఘ్నమూ ఉండరాదు. ఈ విధంగా సేవలో సదా నిర్విఘ్నంగా ఉండాలి, గుణాలలో సదా సంతుష్టంగా ఉండాలి అంతేకాక సంతుష్ట పరిచేవారిగా ఉండాలి. సంతుష్టతా గుణము అన్ని గుణాల ధారణకు దర్పణము. కావున గుణాలలో సంతుష్టతను గురించి స్వయంతో, ఇతరులతో సర్టిఫకెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది గౌరవనీయంగా పాసయ్యేవారి గుర్తు. అష్టరత్నాలుగా అయ్యేవారి గుర్తు. అన్నింటిలో నెంబర్ తీసుకునేవారు కదా లేక ఒక్క దానిలో వస్తే సరిపోతుందా. సేవలో బాగున్నాను, శుభాకాంక్షలు అయితే బాప్దాదా ఇస్తూనే ఉన్నారు. అష్టరత్నాలుగా అవ్వాలి. ఇష్టులుగా అవ్వాలి. అష్టరత్నాలుగా అయినట్లయితే ఇష్టదేవతలుగా కూడా అంత మహాన్గా అవుతారు. అందుకు మూడు విషయాలు మొత్తం సంవత్సరమంతా గుర్తుంచుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఈ మూడు విషయాలు కొద్దిగా సంకల్పమాత్రం మిగిలిపోయి ఉన్నా వీడ్కోలు ఇచ్చేయండి. ఈ రోజు శుభాకాంక్షల రోజు కదా! పంపించేటప్పుడు ఏం చేస్తారు?(మిశ్రీ, బాదం, యాలకలు ఇస్తారు). అందులో మూడు వస్తువులు ఉంటాయి. కావున బాప్దాదాకు కూడా మూడు వస్తువులు ఇస్తారు కదా! వీడ్కోలు కాదు, శుభాకాంక్షలు. అందుకే కదా నోటిని తీపి చేయిస్తారు. ఇక్కడ మూడు వస్తువులు ఎందుకు ఇస్తారు? మళ్లీ త్వరగా రావాలని స్మృతి ఉంటుంది. బాప్దాదా కూడా ఈ రోజు మూడు విషయాలు తెలుపుతున్నారు. అవి సేవలో అప్పుడప్పుడు విఘ్నరూపంగా కూడా అవుతాయి. కావున మూడు విషయాల పై వినిపించి మళ్లీ బాప్దాదా అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు. ఈ అటెన్షన్తో స్వత:గానే గౌరవనీయంగా పాసవుతారు.
మొదటి విషయము :- ఏ విధమైన హద్దు ఆకర్షణ(లగావ్) ఉండరాదు. తండ్రి పై ఆకర్షణ వేరే విషయము. కాని హద్దు లగావ్ ఉండరాదు. రెండవది - ఒత్తిడి. ఏ విధమైన స్వయానికి స్వయంతో లేక ఇతరులతో లాగుడు అనగా పెనుగులాట(ఖీంచాతాన్) ఉండరాదు, లగావ్ ఉండరాదు. మాయతో యుద్ధానికి బదులు పరస్పరంలో పెనుగులాట ఉండరాదు. మూడవది - ఎలాంటి బలహీన స్వభావము ఉండరాదు. లగావ్ (తత్పరత), ఒత్తిడి(పెనుగులాట) మరియు బలహీన స్వభావము. వాస్తవానికి స్వభావము అనే శబ్ధము చాలా మంచిది. స్వభావము అనగా స్వయం యొక్క భావము(ఆత్మ భావము). ఆత్మాభిమానము. శ్రేష్ఠాన్ని స్వ అని అంటారు. శ్రేష్ఠమైన భావము. స్వ అనే భావముంటే అది ఆత్మ - అభిమానము. కాని భావ-స్వభావము అనే మాటను చాలా మాట్లాడ్తారు కదా! ఇది బలహీన స్వభావము. ఇది ప్రతి సమయంలో ఎగిరేకళలో విఘ్నరూపంగా అవుతుంది. దీనినే మీరు రాయల్ రూపంలో నా స్వభావం ఇలాంటిది అని అంటారు. స్వభావం (నేచర్) శ్రేష్ఠంగా ఉంటే తండ్రి సమానంగా ఉంటారు, విఘ్నరూపంగా అయితే అది బలహీన స్వభావము. కావున మూడు మాటల అర్థం తెలుసుకున్నారు కదా! చాలా రకాల ఒత్తిడులు ఉంటాయి. ఒత్తిడికి కారణము 'నాది (మైపన్)'. నేను ఇది చేశాను, నేను ఇది చెయ్యగలను, నేనే చేస్తాను. ఈ 'నాది' అనేది ఏదైతే ఉందో ఇది ఒత్తిడిని ఉత్పన్నం చేస్తుంది. 'నేను' అనునది దేహాభిమానానికి సంబంధించినది. ఒకటి నేను శ్రేష్ఠమైన ఆత్మను, ఒకటి నేను ఫలానా. నేను తెలివిగలవాడిని, నేను యోగిని, జ్ఞానిని, సేవలో నా నెంబర్ ముందు ఉంది. ఈ 'నాది' ఒత్తిడిని ఉత్పన్నం చేస్తుంది. ఈ కారణంగా సేవలో ఎక్కడెక్కడ తీవ్రగతి ఉండాలో ఆ తీవ్రగతికి బదులు మందగతిగా అవుతుంది. నడుస్తూ ఉంటారు కాని వేగంగా వెళ్ళలేరు. వేగము తీవ్రము చేసుకునేందుకు ఆధారము - ఇతరులు ముందుకు వెళ్లడం చూసి సదా ఇతరులను ముందుకు వెళ్లనీయడమే స్వయం ముందుకు వెళ్ళడం. సేవలో నాది అనేది ఎందుకు వస్తుందో అర్థం అయింది కదా! ఈ 'నాది' అనేదే తీవ్రగతిని సమాప్తం చేసేస్తుంది. అర్థమయిందా!
ఈ మూడు మాటలు అయితే ఇస్తారు కదా! మళ్లీ వెంట తీసుకు వెళ్తారా. దీనినే త్యాగంతో లభించిన భాగ్యము అని అంటారు. సదా పంచుకొని తినండి మరియు పెంచుకోండి. ఇది త్యాగానికి లభించిన భాగ్యము. సేవకు సాధనము త్యాగము వలన కలిగిన భాగ్యము. కానీ భాగ్యాన్ని నాది అనే హద్దులో ఉంచితే పెరగదు. సదా త్యాగం వలన లభించే భాగ్య ఫలాన్ని, ఇతరులను కూడా సహయోగులుగా చేసుకొని, పంచుతూ ముందుకు వెళ్లండి. కేవలం 'నేను, నేను' 'నాకే' అని అనకండి. మీరు కూడా తినండి అని అనండి. పంచి ఒకరితో ఒకరి చేయి కలుపుతూ ముందుకు వెళ్లండి. ఇప్పుడు సేవ మధ్యలో ఈ వైబ్రేషన్ కనిపిస్తుంది. కావున ఇందులో విశాల హృదయులుగా అవ్వండి. దీనినే ఎవరు చేస్తే వారే అర్జనుడు అని అంటారు. ఒకరు ఇంకొకరిని చూడకండి. వీరు కూడా ఇలాగే చేస్తున్నారు కదా! ఇది అయితే జరుగుతూనే ఉంటుంది అని భావించకండి. కాని నేను విశేషతను చూపించేందుకు నిమిత్తంగా అవుతాను. బ్రహ్మబాబాలో ఏ విశేషత ఉండేది! సదా పిల్లలను ముందు ఉంచారు. నా కంటే పిల్లలు తెలివిగా ఉన్నారు, పిల్లలు చేస్తారు. ఇలా త్యాగానికి లభించే భాగ్యాన్ని కూడా త్యాగం చేశారు. ఎవరైనా ప్రేమ కారణంగా, ప్రాప్తి కారణంగా బ్రహ్మాబాబాను మహిమ చేస్తే వారికి కూడా తండ్రి స్మృతి ఇప్పించేవారు. బ్రహ్మ నుండి వారసత్వం లభించదు. బ్రహ్మ ఫొటో ఉంచుకోకండి, బ్రహ్మను సర్వస్వము అని భావించకండి అని చెప్పేవాడు. దీనినే త్యాగం వలన లభించే భాగ్యాన్ని కూడా త్యాగం చేసి సేవలో నిమగ్నమవ్వడం అని అంటారు. దీనిలో డబల్ మహాదానిగా అవుతారు. ఇతరులు ఆఫర్ చేసినా, స్వయం తమవైపు ఆకర్షించకండి. స్వయం తమ మహిమ చేసుకుంటూ తమవైపు ఆకర్షిస్తూ ఉంటే వారిని ఏమంటారో మురళిలో విన్నారు కదా! అలా అవ్వకండి. ఏ విషయాన్ని అయినా తమవైపు లాక్కునే పెనుగులాట ఎప్పుడూ చెయ్యకండి. సహజంగా లభిస్తే అది శ్రేష్ఠమైన భాగ్యము. లాక్కొని తీసుకునే దానిని శ్రేష్ఠ భాగ్యమని అనరు. అందులో సిద్ధి ఉండదు. శ్రమ ఎక్కువ, సఫలత తక్కువ ఎందుకంటే అందరి ఆశీర్వాదాలు లభించవు. సహజంగా లభించేదానిలో అందరి ఆశీర్వాదాలు నిండి ఉంటాయి. అర్థమయిందా!
ఒత్తిడి అంటే ఏమిటి! లగావ్ గురించి అయితే ఆ రోజు స్పష్టం చేశాను. ఎలాంటి బలహీన స్వభావము ఉండరాదు. ఇలా కూడా భావించకండి - '' నేను ఈ దేశంలో ఉండేవాడిని అందువలన నా స్వభావము, నా నడవడిక, నేను ఉండేది ఇలా అని కాదు. దేశం కారణంగా, ధర్మం కారణంగా, సాంగత్యం కారణంగా నా స్వభావం ఇలా ఉంది'' అని అనరాదు. మీరు ఏ దేశం వారు! ఇది సేవ కొరకు నిమిత్తంగా లభించిన స్థానం. ఎవ్వరూ విదేశీయులు కారు, నేను భారతవాసిని అని నశా ఉండరాదు. అందరూ ఒక్క తండ్రికి చెందిన వారే. భారతవాసులు కూడా బ్రాహ్మణ ఆత్మలే, విదేశాలలో ఉండేవారు కూడా బ్రాహ్మణ ఆత్మలే. తేడా ఏమీ లేదు. భారతవాసులు ఇలా ఉన్నారు, విదేశీయులు ఇలా ఉన్నారు, ఈ శబ్ధాలు కూడా ఎపుడూ మాట్లాడకండి. అందరూ బ్రాహ్మణ ఆత్మలే. ఇవి సేవ కొరకు స్థానాలు. మీరు విదేశాలకు ఎందుకు చేరుకున్నారో వినిపించాను కదా! అక్కడ ఎందుకు జన్మ తీసుకున్నారు? భారతదేశంలో ఎందుకు తీసుకోలేదు? అక్కడ సేవా స్థానాలు తెరిచేందుకు వెళ్ళారు. లేకుంటే భారతవాసులకు వీసా గురించి ఎంత సమస్య ఉంది! మీరందరూ సహజంగా అక్కడ ఉండేవారు. ఎన్ని దేశాలలో సేవ జరుగుతూ ఉంది! కావున సేవ కొరకు విదేశాలకు వెళ్ళారు. పోతే అందరూ బ్రాహ్మణ ఆత్మలే. అందువలన ఎవ్వరూ ఏ ఆధారంతోనూ స్వభావాన్ని తయారు చేసుకోకండి. తండ్రి స్వభావం ఏదైతే ఉందో అదే పిల్లల స్వభావము. తండ్రి స్వభావము ఏది? సదా ప్రతి ఆత్మ పట్ల కళ్యాణ భావన లేక దయా భావనల స్వభావము. ప్రతి ఒక్కరిని ఉన్నతంగా చేసే స్వభావం, మధురమైన స్వభావం, నిర్మాన స్వభావము. నా స్వభావము ఇలాంటిది అని ఎప్పుడూ మాట్లాడకండి. 'నాది' ఎక్కడ నుండి వచ్చింది? నాకు తీవ్రంగా మాట్లాడే స్వభావముంది, నాకు ఆవేశపడే స్వభావముంది. స్వభావము కారణంగానే జరిగిపోతుంది - ఇదంతా మాయ. చాలామందికి అభిమానంలోకి వచ్చే స్వభావము, ఈర్ష్యపడే స్వభావం, ఆవేశంలోకి వచ్చే స్వభావం ఉంటుంది. మనసును కష్టపెట్టుకునే(వ్యాకులపడే) స్వభావం ఉంటుంది. మంచిగా ఉన్నప్పటికి తమను తాము మంచిగా భావించరు. ఎప్పుడూ స్వయాన్ని బలహీనంగానే భావిస్తారు. నేను ముందుకు వెళ్ళలేను, నేను చెయ్యలేను. ఈ బలహీన స్వభావం కూడా తప్పు. అభిమానంలోకి రాకండి కానీ స్వమానంలో ఉండండి. ఈ రకమైన స్వభావాన్ని బలహీన స్వభావమని అంటారు. కావున మూడు విషయాల పై అటెన్షన్ మొత్తం సంవత్సరమంతా ఉంచుకోండి. ఈ మూడు విషయాలతో సురక్షితంగా ఉండండి. కష్టం అయితే కాదు కదా! స్నేహితుడు ఆది నుండి అంతిమము వరకు సహయోగి, స్నేహితుడిగానే ఉంటారు. సాథీలు సమానంగా ఉండాలి కదా! స్నేహితులలో సమానత లేకుంటే స్నేహితులు ప్రీతి యొక్క రీతిని నిభాయించలేరు. మంచిది. ఈ మూడు మాటలు అటెన్షన్లో పెట్టుకోండి. కాని ఈ మూడు మాటల నుండి సదా దూరంగా ఉండేందుకు మరో మూడు మాటలు గుర్తుంచుకోవాలి. ఈ రోజు మూడు పాఠాలను చదివిస్తున్నారు. సదా మీ జీవితంలో బ్యాలెన్స్ ఉంచుకోవాలి. అన్ని విషయాలలో బ్యాలెన్స్ ఉండాలి. స్మృతి మరియు సేవలో బ్యాలెన్స్ ఉండాలి. స్వమానం అభిమానాన్ని సమాప్తం చేస్తుంది. స్వమానంలో స్థితులై ఉండాలి. ఈ మాటలన్నీ స్మృతిలో ఉండాలి. ఎక్కువ రమణీయంగానూ ఉండకండి, వక్కువ గంభీరంగానూ ఉండకండి. బ్యాలెన్స్ ఉండాలి. సమయానికి రమణీయంగా, సమయానికి గంభీరంగా ఉండాలి. కావున ఒకటి - బ్యాలెన్స్ ఉండాలి, రెండవది - సదా అమృతవేళ తండ్రితో విశేష ఆశీర్వాదాలు తీసుకోవాలి. రోజూ అమృతవేళ బాప్దాదా పిల్లల పట్ల ఆశీర్వాదాల జోలెను తెరుస్తారు. ఆ జోలె నుండి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. కావున బ్యాలెన్స్ (సమతుల్యత), బ్లెస్సింగ్స్(ఆశీర్వాదాలు), మూడవది బ్లిస్ఫుల్ లైఫ్(ఆనందకరమైన జీవితం). ఈ మూడు విషయాలు స్మృతిలో ఉంచుకుంటే ఆ మూడు అటెన్షన్ ఇవ్వాల్సిన మాటలు స్వత:గానే సమాప్తమైపోతాయి. అర్థమయిందా! మంచిది, ఇంకా మూడు మాటలు వినండి.
లక్ష్యము రూపంలో లేక ధారణ రూపంలో విశేషించి మూడు మాటలు ధ్యాసలో ఉంచుకోవాలి. వాటిని వదిలేయాలి, వీటిని ధారణ చెయ్యాలి. వదిలేసేవి సదాకాలం కొరకు వదిలేశారు కదా! వాటిని జ్ఞాపకం చేసుకునే అవసరం ఉండదు. కానీ ఈ మూడు మాటలు ఏవైతే వినిపించామో ఇవి స్మృతిలో ఉంచుకోవాలి, ధారణ స్వరూపంలో విశేషించి స్మృతిలో ఉంచుకోవాలి. ఒకటి - అన్ని విషయాలలో రియాల్టీ(వాస్తవికత) ఉండాలి, మిక్స్(కల్తీ) ఉండరాదు. దీనినే రియాల్టీ అంటారు. సంకల్పంలో, మాటలో అన్ని విషయాలలో వాస్తవితక ఉండాలి. సత్యమైన మనసు ఉంటే తండ్రి ప్రసన్నమవుతారు. సత్యతకు గుర్తు ఏముంటుంది? సత్యంగా ఉంటే నాట్యము చేస్తూ ఉంటారు. ఎవరు సత్యంగా ఉంటారో వారు నాట్యం చేస్తూ ఉంటారు. ఒకటి రియాల్టీ (వాస్తవము), రెండవది రాయల్టీ(హుందాతనము). చిన్న చిన్న విషయాలలో బుద్ధి ఎప్పుడూ వంగిపోరాదు. ఉదాహరణానికి ఎవరైతే రాయల్ పిల్లలుగా ఉంటారో వారి దృష్టి ఎప్పుడూ చిన్న వస్తువుల పైకి వెళ్ళదు. ఒకవేళ అలా దృష్టి వెళ్తే వారిని రాయల్ అని అనరు. ఏవైనా చిన్న చిన్న విషయాలలో బుద్ధి వంగిపోతే దానిని రాయల్టీ అని అనరు. రాయల్గా ఉన్నవారు సదా ప్రాప్తి స్వరూపులుగా ఉంటారు. బుద్ధి లేక దృష్టి ఎక్కడకూ వెళ్లదు. కనుక ఇది ఆత్మిక రాయల్టీ. బట్టల రాయల్టీ కాదు. కావున రియాల్టీ, రాయల్టీ మూడవది యూనిటీ(ఐకమత్యం). ప్రతి విషయంలో, సంకల్పంలో, మాటలో, కర్మలో కూడా సదా పరస్పరం ఐకమత్యం కనిపించాలి. బ్రాహ్మణులంటేనే ఒక్కటి, లక్ష కాదు. ఒక్కటే. దీనినే ఐకమత్యం(యూనిటి) అని అంటారు. అక్కడ అనేక స్థితుల కారణంగా ఒక్కరు కూడా అనేకంగా అవుతారు. ఇక్కడ అనేకమంది ఉన్నా ఒక్కరే. దీనినే ఐకమత్యము(యూనిటి) అని అంటారు. ఇతరులను చూడకండి. మేము యూనిటీగా చెయ్యాలనే అనుకుంటాము కానీ వీరు చెయ్యరు. ఒకవేళ మీరు చేస్తూ ఉంటే వారికి డిస్యూనిటీకి(అనైక్యతకు) అవకాశం లభించదు. ఎవరైనా చెయ్యి ఇలా పెడతారు ఇంకొకరు అలా పెట్టకపోతే శబ్ధము రాదు. ఒకవేళ ఎవరైనా ఐకమత్యంగా ఉండకుండా ఏ పని చేసినా మీరు ఐకమత్యంగా ఉంటే డిస్యూనిటీ(ఐకమత్యం లేనివారు) ఎప్పుడూ ఐకమత్యం లేని పనులు చెయ్యలేరు. ఐకమత్యంలోకి తప్పకుండా రావాల్సి ఉంటుంది. అందువలన మూడు మాటలు రియాలిటి, రాయల్టి, యూనిటి. ఈ మూడు మాటలు సదా తండ్రి సమానంగా అవ్వడములో సహయోగిగా అవుతాయి. అర్థమయిందా! - ఈ రోజు మూడు యొక్క పాఠం చదువుకున్నారు కదా! తండ్రికి పిల్లలంటే గర్వం ఉంది. ఇంతమంది యోగ్యులైన పిల్లలు, యోగి పిల్లలు ఏ తండ్రికీ ఉండరు. యోగ్యులుగానూ, యోగీలుగానూ ఉన్నారు అంతేకాక ఒక్కొక్కరు పదమాపదమ్ భాగ్యశాలురు. మొత్తం కల్పంలో ఇంతమంది ఇలాంటి పిల్లలు ఉండనే ఉండరు. అందువలన విశేషించి అమృతవేళ సమయము బాప్దాదా బ్రాహ్మణ పిల్లల కొరకు ఎందుకు పెట్టారు? ఎందుకంటే విశేషించి బాప్దాదా ప్రతి బాలుని విశేషతను, సేవను, గుణాలను సదా ఎదురుగా తీసుకొస్తారు. ఇంకేం చేస్తారు? ప్రతి బాలుని విశేషతను, సేవ, గుణము, సేవను విశేష వరదానముతో అవినాశిగా చేస్తారు. అందువలన ముఖ్యంగా ఈ సమయం పిల్లల కొరకు ఉంచారు. అమృతవేళలో విశేష పాలన ఉంటుంది. ప్రతి ఒక్కరికి బాప్దాదా స్నేహము, సహయోగము, వరదానాల పాలన ఇస్తారు. అర్థమయిందా - ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? శివబాబా సుఖదాత, శాంతిదాత..... అని అంటారు కదా! తండ్రి పాలన ఇస్తారు. ఎలాగైతే తల్లి-తండ్రి పిల్లలను ఉదయమే తయారుచేస్తారు, శుభ్రం చేసి, తయారుచేసి, తర్వాత రోజంతా తినండి, తాగండి, చదవండి అని అంటారు కదా! బాప్దాదా కూడా అమృతవేళలో ఈ పాలన ఇస్తారు. అనగా మొత్తం రోజంతటికి శక్తి నింపుతారు. ఈ సమయము విశేష పాలన లభించే సమయము. ఇది అదనపు వరదానానికి, పాలనకు సమయము. అమృతవేళ వరదానాల జోలె తెరుచుకుంటుంది. ఏదో ఒక లాభం ఆశించి కాక సత్యమైన హృదయంతో ఎవరు ఎన్ని వరదానాలు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. స్వార్థం ఉంటే మాకు ఇది ఇవ్వండి అని అంటారు. స్వర్థంతో అడిగినప్పుడు బాప్దాదా ఏం చేస్తారు? వారి స్వార్థం సఫలత చేయించేవరకే శక్తినిస్తారు. అనుకున్నది పూర్తి అయిందంటే ఆ శక్తి సమాప్తమవుతుంది. అయినా పిల్లలు కనుక లేదని అనరు. కాని సదా వరదానాలతో పాలింపబడుతూ ఉండండి, నడుస్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి. అందుకు అమృతవేళను ఎంత శక్తిశాలిగా చేసుకుంటే అంత రోజంతా సహజంగా ఉంటుంది. అర్థమయిందా!
సదా స్వయాన్ని గౌరవయుక్తంగా పాసయ్యే లక్ష్యము మరియు లక్షణాలతో నడిపించుకునేవారు, సదా స్వయాన్ని బ్రహ్మాబాబా సమానంగా త్యాగం వలన లభించిన భాగ్యాన్ని పంచేవారు, నెంబర్వన్ త్యాగులుగా అయి శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకునేవారు, సదా సహజ ప్రాప్తికి అధికారులుగా అయ్యి స్వ ఉన్నతి మరియు సేవా ఉన్నతి చేసుకునేవారు, సదా ప్రతి అడుగులో సహయోగులుగా, సాథీలుగా అయ్యి ముందుకు వెళ్ళేవారు, స్మృతి, స్థితి, శక్తిశాలిగా తయారు చేసుకోవడం వలన సదా తండ్రిని అనుసరించేవారు - ఇటువంటి సదా సహయోగి సాథీలు, విధేయులు, ఆజ్ఞాకారులు, సంతుష్టంగా ఉండేవారు, సర్వులను రాజీ(సంతోషపరచే) చేసే రహస్యము తెలిసినవారు - ఇటువంటి శ్రేష్ఠమైన ఆత్మలకు, మహాన్ పుణ్యాత్మలకు, డబల్ మహాదానీ పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment