27-03-1985 అవ్యక్త మురళి

 27-03-1985                    ఓంశాంతి                 అవ్యక్త బాప్ దాదా           మధువనము

'' కర్మాతీత స్థితి ''
ఈ రోజు బాప్దాదా నలవైపులా ఉన్న పిల్లలను విశేషంగా చూసేందుకు తిరగడానికి వెళ్లారు. ఎలాగైతే భక్తిమార్గంలో మీరందరూ ఎన్నిసార్లు పరిక్రమణ చేశారో, అలా బాప్దాదా కూడా ఈ రోజు నలువైపులా ఉన్న సత్యమైన బ్రాహ్మణులుండే స్థానాలను పరిక్రమణ చేశారు. పిల్లలందరి స్థానాలను, స్థితులను కూడా చూశారు. భిన్న-భిన్న స్థానాలు విధి పూర్వకంగా అలంకరించబడి ఉన్నాయి. కొన్ని స్థానాలు స్థూల సాధనాలతో ఆకర్షించేవిగా ఉన్నాయి, మరికొన్ని తపస్సు వైబ్రేషన్లతో ఆకర్షించేవిగా ఉన్నాయి, మరికొన్ని త్యాగము మరియు శ్రేష్ఠ భాగ్యము అనగా సాధారణత మరియు శ్రేష్ఠతల వాయుమండలముతో ఆకర్షించేవిగా ఉన్నాయి. కొన్ని కొన్ని సాధారణ స్వరూపములో కూడా కనిపించాయి. భిన్న భిన్న రూపాలలో ఉన్న ఈశ్వరీయ స్మృతి గల అన్ని స్థానాలను చూశారు. అలాగే ఏ స్థితిని చూశారు? ఇందులో కూడా భిన్న భిన్న రకాల స్థితులు గల బ్రాహ్మణ పిల్లలను చూశారు. సమయానుసారంగా పిల్లలు ఎంతవరకు తయారయ్యారో చూచేందుకు బ్రహ్మబాబా వెళ్లారు. పిల్లలందరూ అన్ని బంధనాల నుండి బంధనముక్తులుగా, యోగయుక్తులుగా, జీవన్ముక్తులుగా, ఎవర్రెడీగా ఉన్నారు, కేవలం సమయం కొరకు ఎదురు చూస్తున్నారని బ్రహ్మబాబా చెప్పారు. అలా తయారుగా ఉన్నారా? ఏర్పాట్లు అయిపోయి కేవలం సమయం కోసం ఎదురు చూస్తున్నారా? ఈ విధంగా బాప్దాదాల ఆత్మిక సంభాషణ జరిగింది. బంధనముక్తులుగా ఎంతవరకు అయ్యారో, యోగయుక్తులుగా ఎంతవరకు అయ్యారో శివబాబా పరిక్రమణ చేసి చూశారు. ఎందుకంటే బంధనముక్త ఆత్మలే జీవన్ముక్తిని అనుభవం చేయగలుగుతాయి. ఏ విధమైన హద్దులోని ఆధారము లేదు అనగా బంధనాల నుండి అతీతంగా ఉన్నారు. ఎలాంటి చిన్న, పెద్ద, స్థూలమైన, సూక్ష్మమైన మనసు ద్వారా లేక కర్మణా ద్వారా హద్దులోని ఆధారమేదైనా ఉన్నట్లయితే బంధనాల నుండి అతీతంగా అవ్వలేరు. కావున ఇది చూపించేందుకే ఈ రోజు బ్రహ్మబాబాను విశేషంగా సౖౖెర్(విహరింప) చేయించారు. వారు ఏం చూశారు? మెజారిటి పెద్ద పెద్ద బంధనాల నుండి ముక్తులుగా ఉన్నారు. స్పష్టంగా కనిపించే బంధనాలు లేక తాళ్లు ఏవైతే ఉన్నాయో, వాటి నుండైతే దూరమయ్యారు. కాని కొన్ని కొన్ని ఇటువంటి అతి సూక్ష్మమైన బంధనాలు లేక తాళ్లు మిగిలి ఉన్నాయో వాటిని సూక్ష్మ బుద్ధి లేకుండా చూడలేరు లేక తెలుసుకోజాలరు కూడా. ఎలాగైతే ఈ రోజుల్లో విజ్ఞానం వారు సూక్ష్మమైన వస్తువులను శక్తిశాలి లెన్స్(అద్దాలు) ద్వారా చూడగలరో వాటిని సాధారణ రీతిగా చూడలేరో అలా సూక్ష్మమైన పరిశీలనా శక్తి ద్వారా ఆ సూక్ష్మ బంధనాలను చూడగలరు లేక సూక్ష్మ బుద్ధి ద్వారా తెలుసుకోగలరు. కేవలం బాహ్య రూపములో (పై పైన) చూసినట్లయితే సరిగ్గా గమనించని కారణంగా స్వయాన్ని బంధనముక్తులుగానే భావిస్తూ ఉంటారు. బ్రహ్మబాబా ఇటువంటి సూక్ష్మమైన ఆధారాలను కూడా పరిశీలించారు. అన్నిటికంటే ఎక్కువగా రెండు రకాల ఆధారాలను గమనించారు.
ఒకటేమో అతి సూక్ష్మ స్వరూపంలో ఏదో ఒక సేవా సహచరుల సూక్ష్మ ఆధారాన్ని చూశారు. అందులో కూడా అనేక రకాలను చూశారు. సేవా సహయోగమున్న కారణంగా, సేవను వృద్ధి చేసేందుకు నిమిత్తంగా అయిన కారణంగా లేక విశేషంగా ఏదైనా విశేషత లేక విశేష గుణము ఉన్న కారణంగా, విశేషంగా ఏవైనా సంస్కారాలు కలిసిన కారణంగా లేక సమయ ప్రతి సమయము ఏదైనా అదనపు సహాయము ఇచ్చిన కారణంగా, ఇటువంటి కారణాలతో సేవా సహచరుల రూపంలో ఉన్నారు. సహయోగముంది కాని వారి వైపు విశేషమైన ఝుకావ్(తల వంచిన) కారణంగా సూక్ష్మ ఆకర్షణ రూపము తయారవుతూ ఉంటుంది. దీని పరిణామము ఎలా ఉంటుంది? ఇది బాబా ఇచ్చిందని మర్చిపోతారు. వీరు చాలా మంచి సహయోగులని, మంచి విశేషతా స్వరూపులని, గుణవంతులని భావిస్తారు. కాని సమయానుసారంగా తండ్రి అలా మంచిగా తయారు చేశారని మర్చిపోతారు. సంకల్ప మాత్రములో కూడా ఏ ఆత్మ వైపుకైనా బుద్ధి ఆకర్షింపబడినట్లయితే ఆ ఆకర్షణ ఆధారంగా అయిపోతుంది. సాకార రూపంలో సహయోగిగా అయినందున సమయానికి తండ్రికి బదులు వారే ముందు గుర్తుకొస్తారు. మూడు నాలుగు నిముషాలు కూడా ఒకవేళ స్థూల ఆధారము స్మృతిలోకి వస్తే ఆ సమయంలో తండ్రి ఆధారము గుర్తుకొస్తుందా? రెండవ విషయమేమంటే ఒకవేళ మూడు నాలుగు నిముషాలకైనా స్మృతియాత్ర లింకు తెగిపోయిన తర్వాత దానిని కలపడంలో కష్టపడవలసి వస్తుంది. ఎందుకంటే నిరంతరంలో అంతరం(తేడా) వచ్చేసింది కదా! హృదయంలో హృదయాభిరామునికి బదులు ఇంకెటు వైపుకైనా, ఏ కారణంగానైనా హృదయం తల వంచుతుంది. వీరితో మాట్లాడడం మంచిగా అనిపిస్తుంది, వీరితో కూర్చోవడం మంచిగా అనిపిస్తుంది. ''వీరితోనే'' అన్న మాట వస్తే ఏదో దోషమున్నట్లే. 'వీరితోనే' అన్న ఆలోచన రావడం అనగా హీనత రావడమే. అందరూ మంచిగా అనిపిస్తున్నారు కాని వీరు కాస్త ఎక్కువగా మంచిగా అనిపిస్తున్నారు అన్నది తప్పు. అందరితో ఆత్మిక స్నేహాన్ని ఉంచడం, మాట్లాడడం లేక సేవా సహయోగాన్ని తీసుకోవడం లేక ఇవ్వడం వేరే విషయము. విశేషతలను చూడండి, గుణాలను చూడండి కాని వీరి గుణమే చాలా బాగుంది అన్నది మధ్యలో తీసుకు రాకండి. 'వీరే' అన్న పదం గందరగోళం చేస్తుంది. దీనినే మోహమని అంటారు. బాహ్య రూపము సేవా రూపంగా, జ్ఞాన రూపంగా, యోగ రూపంగా ఉన్నా వీరితోనే యోగం చేయాలి, వీరి యోగమే బాగుంది,........ 'వీరే' అన్న ఈ పదము రాకూడదు. వీరే సేవలో సహయోగులుగా అవ్వగలరు, వీరే తోడుగా ఉండాలి అనేది ఉండరాదు. ఈ ఆకర్షణకు గుర్తు ఏమిటో అర్థం చేసుకున్నారా? 'వీరే' అన్న పదాన్ని తీసేయండి. అందరూ బాగున్నారంటూ విశేషతలను చూడండి. సహయోగులుగా అవ్వండి, చేసుకోండి కూడా. మొదట ఆరంభంలో కొద్దిగానే ఉంటుంది కాని తర్వాత పెరుగుతూ పెరుగుతూ భయంకర రూపమైపోతుంది. ఆ తర్వాత వారి నుండి స్వయం తప్పుకోవాలనుకున్నా బయట పడలేరు ఎందుకంటే దారం గట్టిపడిపోతుంది. మొదట చాలా సూక్ష్మంగా ఉంటుంది, ఆ తర్వాత పక్కా అయిపోతుంది. అప్పుడు తెంపడం కష్టమైపోతుంది. ఒక్క తండ్రియే ఆధారము, మనుష్య ఆత్మలు ఎవ్వరూ ఆధారము కాదు. తండ్రి ఎవరినైనా సహయోగిగా నిమిత్తంగా తయారు చేస్తారు కాని తయారు చేసేవారిని మర్చిపోకండి. తండ్రి అలా తయారుచేశారు. మధ్యలో తండ్రి రావడంతో ఎక్కడైతే తండ్రి ఉంటారో అక్కడ పాపముండదు. తండ్రి మధ్య నుండి తొలగిపోతే పాపం ఏర్పడ్తుంది. కావున ఒక విషయము ఈ ఆధారానిది.
రెండవ విషయము - ఏదో ఒక సాకార సాధనాలను ఆధారంగా చేసుకున్నారు. సాధనాలు హెచ్చు-తగ్గులైతే సేవ కూడా హెచ్చు-తగ్గులవుతుంది. సాధనాలను కార్యంలో వినియోగించడం వేరే విషయము. కాని ఆ సాధనాలకు వశమై సేవ చేయడం అనగా సాధనాలను ఆధారంగా చేసుకోవడమే. సాధనాలు సేవ వృద్ధి కొరకే ఉన్నాయి. కావున ఆ సాధనాలను అదే విధంగా కార్యములోకి తీసుకురండి. సాధనాలను ఆధారంగా చేసుకోకండి. ఆధారము ఒక్క బాబాయే. సాధనాలు నశ్వరమైనవి. వినాశి సాధనాలను ఆధారంగా చేసుకోవడం అనగా ఎలాగైతే సాధనాలు నశ్వరమైనవో, అలా స్థితి కూడా కాసేపు చాలా బాగుంటుంది, మరి కాసేపు మధ్యస్థంగా, మరి కాసేపు కిందకు వెళ్లిపోతుంది. అవినాశి ఏకరస స్థితి ఉండదు. కావున ఇంకొక విషయము, వినాశి సాధనాలను ఆధారంగా భావించకండి. అవి కేవలం నిమిత్త మాత్రంగానే ఉన్నాయి. సేవ కొరకు ఉన్నాయి. సేవ కొరకు కార్యంలో ఉపయోగించి మళ్లీ అతీతంగా అవ్వాలి. సాధనాల ఆకర్షణలో మనసు ఆకర్షింపబడరాదు. కావున ఈ రెండు రకాల ఆధారాలు సూక్ష్మ రూపములో ఆధారంగా అవ్వడం గమనించారు. కర్మాతీత స్థితి రావాలనుకుంటే ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువు, కర్మ బంధనం నుండి అతీతంగా అవ్వడం, భిన్నంగా అగుటనే కర్మాతీత స్థితి అని అంటారు. కర్మాతీతము అనగా కర్మ నుండి అతీతంగా అయిపోవడం కాదు, కర్మ బంధనాల నుండి అతీతంగా అవ్వడం. అతీతంగా అయి కర్మ చేయడం అనగా కర్మ నుండి అతీతంగా అవ్వడం. కర్మాతీత స్థితి అనగా బంధనముక్తమైన, యోగయుక్తమైన జీవన్ముక్త అవస్థ.
మరొక విశేషమైన విషయమేమి చూశారంటే సమయానుసారంగా చాలామంది పిల్లలు పరిశీలనా శక్తిలో బలహీనమైపోతున్నారు. పరిశీలించలేకపోతున్నారు కనుక మోసపోతున్నారు. పరిశీలించే శక్తి బలహీనమయ్యేందుకు కారణము బుద్ధి యొక్క లగ్నము ఏకాగ్రంగా లేకపోవడం. ఎక్కడైతే ఏకాగ్రత ఉంటుందో అక్కడ పరిశీలనా శక్తి స్వతహాగా పెరుగుతుంది. ఏకాగ్రత అనగా ఒక్క తండ్రి జతలో సదా లగ్నములో మగ్నమై ఉండడం. ఏకాగ్రతకు గుర్తు సదా ఎగిరేకళను అనుభవం చేసే ఏకరస స్థితి ఉంటుంది. ఏకరసము అనగా అదే వేగముతో ఏకరసంగా ఉండడమని కాదు. ఏకరసము అనగా సదా ఎగిరేకళ అనుభవమవుతూ ఉండాలి. ఇందులో ఏకరసంగా ఉండాలి. నిన్న ఏదైతే ఉందో(ఏ స్థితి ఉందో) ఆ శాతములో ఈ రోజు వృద్ధి జరిగిందని అనుభూతి కలగాలి. దీనినే ఎగిరేకళ అని అంటారు. కనుక స్వ ఉన్నతి కొరకు, సేవా ఉన్నతి కొరకు పరిశీలనా శక్తి ఎంతో అవసరము. పరిశీలనా శక్తి బలహీనంగా ఉన్నందున తమ బలహీనతను బలహీనతగా భావించరు. ఇంకా తమ బలహీనతను దాచుకునేందుకు, నిరూపించేందుకు ప్రయత్నిస్తారు లేక మొండితనము చూపిస్తారు. ఈ రెండు విషయాలు బలహీనతను దాచుకునేందుకు విశేష సాధనాలు. లోపల అప్పుడప్పుడు అనుభవం కూడా అవుతుంది కాని పూర్తిగా పరిశీలించే శక్తి లేనందున తమను తాము సదా రైట్గా, చురుకైనవారిగా నిరూపిస్తారు. అర్థమయిందా! కర్మాతీతముగా అయితే అవ్వాలి కదా. నెంబరునైతే తీసుకోవాలి కదా! కనుక పరిశీలించుకోండి. మంచిరీతిగా యోగయుక్తముగా అయ్యి పరిశీలనాశక్తి ధారణ చేయండి. ఏకాగ్రబుద్ధి గలవారిగా అయి పరిశీలించండి. అప్పుడు సూక్ష్మ లోపాలేవైతే ఉన్నాయో అవి స్పష్ట రూపంలో కనిపిస్తాయి. నేను రైట్, చాలా బాగా నడుచుకుంటున్నాను అని భావించే విధంగా ఉండరాదు. నేను కర్మాతీతంగా అవుతానని భావిస్తూ సమయము వచ్చినప్పుడు ఈ సూక్ష్మ బంధనాలు ఎగరనీయకుండా తమ వైపుకు లాక్కున్నట్లయితే మరి ఆ సమయంలో ఏం చేస్తారు! బంధింపబడిన వ్యక్తి ఎగరాలనుకుంటే ఎగురుతాడా లేక క్రిందికి వచ్చేస్తాడా? కావున ఈ సూక్ష్మ బంధనాలు సమయము వచ్చినప్పుడు నెంబరు తీసుకోవడంలో లేక తోడుగా వెళ్లడంలో లేక ఎవర్రెడీగా అవ్వడంలో బంధనాలుగా అవ్వరాదు. కనుక బ్రహ్మబాబా పరిశీలిస్తున్నారు. వేటినైతే ఆధారంగా భావిస్తున్నారో అవి ఆధారాలు కావు. సూక్ష్మమైన రాయల్ దారాలు. బంగారు లేడి ఉదాహరణ ఉంది కదా! సీతను ఎక్కడికి తీసుకెళ్లింది? కావున ఈ బంధనాలు బంగారు లేడి వంటివి. వీటిని బంగారముగా భావించడం అనగా మీ శ్రేష్ఠ భాగ్యాన్ని పోగొట్టుకోవడం. బంగారము కాదు, పోగొట్టుకోవడం. రాముడిని పోగొట్టుకుంది, అశోకవాటికను పోగొట్టుకుంది.
బ్రహ్మబాబాకు పిల్లల పై విశేషమైన ప్రేమ ఉంది. కావున బ్రహ్మబాబా సదా పిల్లలను తన సమానంగా, ఎవర్రెడీగా, బంధనముక్తులుగా చూడాలనుకుంటారు. బంధనముక్తులుగా ఉన్న దృశ్యమునే చూశారు కదా! ఎంత సమయంలో ఎవర్రెడీగా అయ్యారు? ఎవరి బంధనంలోనైనా చిక్కుకున్నారా! ఫలానావారు ఎక్కడ ఉన్నారని ఎవరైనా గుర్తుకు వచ్చారా? ఫలానా వారు సేవలో సహచరులని గుర్తుకొచ్చారా? కావున ఎవర్రెడీ పాత్రను, కర్మాతీత స్థితిలోని పాత్రను చూశారు కదా! ఎంతగా పిల్లల పై అతి ప్రేమ ఉండేదో, అంతే ప్రియంగా మరియు అతీతంగా ఉండడం చూశారు కదా! పిలుపు వచ్చింది, వెళ్లిపోయారు. లేకపోతే బ్రహ్మకు అన్నిటికంటే పిల్లల పైనే ఎక్కువ ప్రేమ ఉంది కదా! ఎంతగా ప్రేమ ఉందో అంత అతీతంగా అవ్వడం చూశారు కదా. ఏదైనా వస్తువు లేక వంటకం పూర్తిగా తయారైపోయినప్పుడు అంచులను వదిలేస్తుంది కదా! కావున సంపూర్ణంగా అవ్వడం అనగా తీరాలను వదలడం. అలా వదులుతూ అతీతంగా అయిపోయారు. ఒక్క అవినాశి ఆధారమే ఆధారము. వ్యక్తులను, వైభవాలను, వస్తువులను ఆధారంగా చేసుకోకండి. దీనినే కర్మాతీతమని అంటారు. ఎప్పుడూ దేనినీ దాచవద్దు. దాచడం వలన ఇంకా వృద్ధి అవుతూ ఉంటుంది. విషయం పెద్దగా ఉండదు. కాని ఎంతగా దాస్తూ ఉంటారో, అంతగా ఆ విషయం పెద్దగా అవుతుంది. ఎంతగా తమను తాము రైట్గా నిరూపించుకునే ప్రయత్నం చేస్తారో, ఎంతగా మొండితనం చేస్తారో అంతగా విషయాన్ని పెంచుతారు. కావున విషయాన్ని పెంచకుండా దానిని చిన్న రూపములోనే సమాప్తం చేయండి. తద్వారా అది సహజమైపోతుంది అంతేకాక సంతోషముంటుంది. ఈ విషయం జరిగింది అన్న దానిని కూడా దాటి వేయండి. దీనితో కూడా విజయులుగా అయితే ఆ సంతోషము ఉంటుంది. అర్థమయిందా! విదేశీయులు కర్మాతీత స్థితిని పొందాలి అనే ఉత్సాహము కలిగినవారు కదా. కావున డబల్ విదేశీ పిల్లలకు బ్రహ్మబాబా విశేషమైన సూక్ష్మ పాలనను ఇస్తున్నారు. ఇది ప్రేమతో కూడుకున్న పాలన. శిక్షణ, హెచ్చరిక కాదు. అర్థమయిందా! ఎందుకంటే బ్రహ్మబాబా మీకు విశేషమైన ఆహ్వానముతో జన్మనిచ్చారు. బ్రహ్మ సంకల్పముతో మీరు జన్మించారు. బ్రహ్మ సంకల్పముతో సృష్టి రచించారని అంటారు కదా! బ్రహ్మ సంకల్పముతోనే ఈ బ్రాహ్మణుల సృష్టి ఇంతగా రచింపబడ్డది కదా. కావున బ్రహ్మ సంకల్పముతో, ఆహ్వానముతో రచింపబడిన విశేషమైన ఆత్మలు మీరు. మీరు ప్రియమైనవారిగా అయిపోయారు కదా. మీరు వేగంగా పురుషార్థం చేసి ఫస్ట్ డివిజన్లోకి వచ్చే ఉత్సాహము గలవారని బ్రహ్మబాబా భావిస్తున్నారు. విదేశీ పిల్లలను విశేషతలతో విశేషంగా అలంకరించే విషయాన్ని గురించిన మాటలు నడుస్తున్నాయి. ప్రశ్నలు కూడా వేస్తారు. అలాగే త్వరగా అర్థం చేసుకుంటారు కూడా. విశేషంగా వివేకవంతులు కావున బాబా తమ సమానంగా అన్ని బంధనాల నుండి అతీతంగా మరియు ప్రియంగా అయ్యేందుకు ప్రేరణనిస్తున్నారు. బాబా పిల్లలందరికి చెప్తున్నారు. బాబా ముందు సదా బ్రాహ్మణ పిల్లలందరు దేశం వారైనా లేక విదేశం వారైనా అందరూ ఉన్నారు. మంచిది. ఈ రోజు ఆత్మిక సంభాషణను జరుపుతున్నారు. గత సంవత్సరము కంటే ఈ సంవత్సరము రిజల్టు చాలా బాగుందని వినిపించాను కదా. దీని ద్వారా వృద్ధిని పొందుతున్నారని అర్థమవుతుంది. మీరు ఎగిరేకళలోకి వెళ్లే ఆత్మలు. ఎవరినైతే యోగ్యులుగా గమనించడం జరుగుతుందో వారిని సంపూర్ణ యోగులుగా అయ్యేందుకు సూచన ఇవ్వబడ్తుంది. మంచిది.
సదా కర్మబంధన ముక్తులకు, యోగయుక్త ఆత్మలకు, సదా ఒక్క బాబానే ఆధారంగా చేసుకునే పిల్లలకు, సదా సూక్ష్మ బలహీనతల నుండి అతీతంగా అయ్యే పిల్లలకు, సదా ఏకాగత్ర ద్వారా పరిశీలించగలిగే శక్తిశాలి పిల్లలకు, సదా వ్యక్తి లేక వస్తువుల వినాశి ఆధారము నుండి అతీతంగా అయ్యే పిల్లలకు - ఇటువంటి బాబా సమానమైన, జీవన్ముక్తులైన కర్మాతీత స్థితిలో స్థితులై ఉండే విశేష పిల్లలకు బాప్దాదా పియ్రస్మృతులు మరియు నమస్తే.
నిర్మలశాంత దాదీతో - సదా తండ్రి జతలో ఉండేవారిగానే ఉన్నారు. ఎవరైతే ఆది నుండి తండ్రి జత జతలో నడుస్తున్నారో వారికి సదా తండ్రి తోడుగా ఉన్న అనుభవం ఎప్పుడూ తక్కువ అవ్వజాలదు. చిన్ననాటి వాగ్ధానము ఉంది. కనుక సదా తోడుగా ఉన్నారు మరియు సదా తోడుగా వెళ్తారు. కనుక సదా తోడు యొక్క వాగ్ధానమనండి లేక వరదానమనండి, అది లభించే ఉంది. అయినా ఎలాగైతే తండ్రి ప్రీతి యొక్క రీతిని నిభాయించేందుకు అవ్యక్తము నుండి వ్యక్త రూపములోకి వస్తారో, అలా పిల్లలు కూడా ప్రీతి యొక్క రీతిని నిభాయించేందుకు చేరుకుంటారు. మీరు అలాగే ఉన్నారు కదా. సంకల్పములో ఏమిటి, స్వప్నంలో కూడా దేనినైతే సబ్కాన్షియస్ అని అంటారో........... ఆ స్థితిలో కూడా తండ్రి తోడు ఎప్పుడూ వదిలిపెట్టజాలరు. ఇంత పక్కా సంబంధము జోడింపబడి ఉంది. ఎన్ని జన్మల సంబంధము! పూర్తి కల్పానిది. ఈ జన్మలోని లెక్క అనుసరంగా సూచనలు పూర్తి కల్పమంతా ఉంటాయి. ఈ అంతిమ జన్మలో కొంతమంది పిల్లలు సేవ కొరకు ఎక్కడెక్కడో చెల్లాచెదురైపోయారు. ఎలాగైతే వీరు విదేశాలకు చేరుకున్నారో మీరు సింధ్ దేశాంలోకి వచ్చేశారు. కొందరు ఎక్కడికో చేరుకున్నారు, కొందరు మరెక్కడికో చేరుకున్నారు. ఒకవేళ వీరు విదేశాలకు చేరుకోకపోతే ఇన్ని సెంటర్లు ఎలా తెరుస్తారు! మంచిది. సదా తోడుగా ఉండే తోడు యొక్క వాగ్ధానాన్ని నిభాయించే పరదాదీ మీరు. బాప్దాదా, సేవ పట్ల పిల్లల ఉల్లాస-ఉత్సాహాలను చూసి సంతోషిస్తారు. వరదాని ఆత్మలుగా అయ్యారు. ఇప్పటి నుండే రద్దీగా అవ్వడం ప్రారంభమైపోయింది చూడండి. ఇంకా వృద్ధి అయినప్పుడు ఎంత రద్దీ అవుతుంది. ఆ వరదానీ రూపమనే విశేషత పునాదిగా పడుతోంది. ఎప్పుడైతే రద్దీగా అయిపోతుందో అప్పుడేం చేస్తారు? వరదానమిస్తారు, దృష్టినిస్తారు. ఇక్కడ నుండే చైతన్య మూర్తులు ప్రసిద్ధమవుతారు. ఎలాగైతే ప్రారంభంలో మిమ్ములను అందరూ దేవీలు, దేవీలు అని అనేవారో అలా చివర్లో కూడా గుర్తించి దేవీలు, దేవీలని అంటారు. జై దైవీ, జై దేవీ అనే నినాదాలు ఇక్కడ నుండే ప్రారంభమవుతాయి. మంచిది.

Comments