21-03-1985 అవ్యక్త మురళి

 21-03-1985                    ఓంశాంతి                 అవ్యక్త బాప్ దాదా           మధువనము

'' స్వదర్శన చక్రము ద్వారా విజయ చక్ర పాప్తి ''
ఈ రోజు ఆత్మిక సేనాపతి అయిన బాప్దాదా తమ ఆత్మిక సైన్యాన్ని చూస్తున్నారు. ఈ ఆత్మిక సైన్యములో ఎటువంటి ఎటువంటి మహావీరులున్నారో, ఏ ఏ శక్తిశాలి శస్త్రాలను ధారణ చేశారో గమనిస్తున్నారు. ఎలాగైతే దేహ సంబంధమైన శస్త్రధారులు రోజురోజుకు అతిసూక్ష్మమైన మరియు తీవ్రగతి గల శక్తి సంపన్నమైన సాధనాలను తయారు చేస్తూ ఉంటారో అలాగే ఆత్మిక సైన్యము అతి సూక్ష్మమైన శక్తిశాలి శస్త్రధారులుగా అయ్యారా? ఎలాగైతే వినాశకారి ఆత్మలు ఒకే స్థానంలో కూర్చుని ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నవాటిని వినాశకారి కిరణాల ద్వారా వినాశనం చేసేందుకు సాధనాలను తయారుచేశారు. వారు అక్కడకు వెళ్ళవలసిన అవసరము లేకుండా దూరంగా కూర్చుని గురి పెట్టగలరు. అలాగే ఆత్మిక సైన్యము స్థాపన చేసే సైన్యము. వారు వినాశకారులు, మీరు స్థాపన చేసేవారు. వారు వినాశనం చేసే ప్రణాళికలను ఆలోచిస్తారు. మీరు క్రొత్త రచన రచించేందుకు, విశ్వాన్ని పరివర్తన చేసేందుకు ప్లాన్లు ఆలోచిస్తారు. స్థాపన చేసే సైన్యం ఇటువంటి తీవ్రగతి గల ఆత్మిక సాధనాలను ధారణ చేసిందా? ఒకే స్థానంలో కూర్చుని ఉంటూ ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఆత్మిక స్మృతి యొక్క కిరణాల ద్వారా ఏ ఆత్మనైనా స్పృశించగలరు(టచ్ చేయగలరు). ఇంత తీవ్రగతితో సేవ చేసేందుకు మీ వద్ద పరివర్తన చేసే శక్తి తయారుగా ఉందా? జ్ఞానము అనగా శక్తి అందరికీ లభిస్తోంది కదా! జ్ఞానశక్తి ద్వారా ఇటువంటి శక్తిశాలి శస్త్రధారులుగా అయ్యారా! మహావీరులుగా అయ్యారా లేక కేవలం వీరులుగా అయ్యారా? విజయచక్రాన్ని పొందారా? దేహ సంబంధమైన సైన్యానికి అనేక రకాల చక్రాలు కానుకలుగా లభిస్తాయి. మీ అందరికీ సఫలతకు కానుకగా విజయ చక్రము లభించిందా? విజయము లభించే ఉంది. అటువంటి నిశ్చయబుద్ధి గల మహావీరులైన ఆత్మలు విజయ చక్రానికి అధికారులుగా ఉన్నారు.
ఎవరికైతే విజయ చక్రము లభించిందో బాప్దాదా గమనిస్తున్నారు. స్వదర్శన చక్రము ద్వారా విజయ చక్రమును పొందుతారు. అందరూ శస్త్రధారులుగా అయితే అయ్యారు కదా! ఈ ఆత్మిక శస్త్రాల స్మృతిచిహ్నాన్ని స్థూల రూపంలో మీ స్మృతిచిహ్న చిత్రాలలో చూపించారు. దేవీల చిత్రాలలో శస్త్రధారులుగా చూపిస్తారు కదా! పాండవులను కూడా శస్త్రధారులుగా చూపిస్తారు కదా! ఈ ఆత్మిక శస్త్రాలు అనగా ఆత్మిక శక్తులను స్థూల శస్త్రాల రూపంలో చూపించారు. నిజానికి పిల్లలందరికీ బాప్దాదా ద్వారా ఒకే సమయంలో ఒకే విధమైన జ్ఞాన శక్తి ప్రాప్తిస్తుంది. వేరు వేరుగా ఇవ్వరు. అయినా నెంబరువారిగా ఎందుకవుతారు? బాప్దాదా ఎప్పుడైనా ఎవరినైనా వేరుగా చదివించారా? చదువైతే కలిపే చదివిస్తారు కదా! అందరికీ ఒకే చదువును చదివిస్తారు కదా! లేక ఒక గ్రూపుకు ఒక విధంగా, మరొక గ్రూపుకు ఇంకొక విధంగా చదివిస్తారా?
ఇక్కడ (6) ఆరుమాసాల విద్యార్థి అయినా లేక 50 సంవత్సరాల విద్యార్థి అయినా ఒకే క్లాసులో కూర్చుంటారు. వేరు వేరుగా కూర్చుంటారా? బాప్దాదా ఒకే సమయంలో, ఒకే చదువును అందరినీ కలిపే చదివిస్తారు. ఒకవేళ ఎవరైనా వెనుక వచ్చినా ఇంతకు ముందు ఏ చదువు అయితే జరిగిపోయిందో అదే చదువును మీరందరూ ఇప్పుడు కూడా చదివిస్తూ ఉంటారు. రివైజ్ కోర్సు ఏదైతే జరగుతూ ఉందో దానినే - మీరు కూడా చదువుతున్నారా? లేక పాతవారి కోర్సు వేరుగా, మీది వేరుగా ఉందా? కోర్సు అయితే ఒక్కటే కదా! 40 సంవత్సరాల వారికి ఒక మురళి, (6) ఆరు మాసాల వారికి ఇంకొక మురళి అయితే లేదు కదా? మురళి ఒక్కటే కదా! చదువు ఒక్కటే, చదివించేవారూ ఒక్కరే. అయినా నెంబరువారిగా ఎందుకవుతారు? లేక అందరూ నెంబరువన్గా ఉన్నారా? నెంబరు ఎందుకు తయారవుతుంది? ఎందుకంటే చదువును అందరూ భలే చదువుతున్నారు కాని చదువు చదువుకోవడం అనగా జ్ఞానములోని ఒక్కొక్క విషయాన్ని శస్త్రము లేక శక్తి రూపంలో ధారణ చేయడంలో మరియు జ్ఞాన విషయాలను పాయింట్ల రూపంలో ధారణ చేయడంలో తేడా ఏర్పడ్తుంది. కొందరు విని కేవలం పాయింట్ రూపంలో బుద్ధిలో ధారణ చేస్తారు అంతేకాక ఆ ధారణ చేసిన పాయింట్లను చాలా బాగా వర్ణన కూడా చేస్తారు. భాషణ(ఉపన్యాసం) చేయడంలో, కోర్సు ఇవ్వడంలో, మెజారిటీ చరుకుగా ఉన్నారు. బాప్దాదా కూడా పిల్లలు భాషణ చేసే, కోర్సు చేయించే విధానాన్ని చూసి సంతోషిస్తారు. కొందరు పిల్లలైతే బాప్దాదా కంటే బాగా ఉపన్యసిస్తారు. పాయింట్లను కూడా చాలా బాగా వర్ణన చేస్తారు. కాని జ్ఞానాన్ని పాయింట్ల రూపములో ధారణ చేయడం మరియు జ్ఞానములోని ఒక్కొక్క విషయాన్ని శక్తి రూపములో ధారణ చేయడంలో తేడా ఏర్పడ్తుంది. ఉదాహరణానికి డ్రామా పాయింటును తీసుకోండి. ఇది చాలా పెద్ద విజయాన్ని ప్రాప్తి చేసుకునే శక్తీశాలి శస్త్రము. ఎవరికైతే ప్రత్యక్ష జీవితంలో డ్రామా జ్ఞాన శక్తి ధారణ అయి ఉంటుందో వారెప్పుడూ అలజడిలోకి రాజాలరు. సదా ఏకరసంగా, అచలంగా, స్థిరంగా తయారై ఇతరులను తయారు చేసేందుకు ఈ డ్రామా పాయింటే విశేషమైన శక్తి. దీనిని శక్తి రూపములో ధారణ చేసేవారెప్పుడూ ఓటమిని చవిచూడజాలరు. కాని ఎవరైతే కేవలం పాయింట్ రూపంలో ధారణ చేస్తారో వారేం చేస్తారు? వారు డ్రామా పాయింటును వర్ణన కూడా చేస్తారు, అలజడిలోకి కూడా వస్తున్నారు, ఇంకొక వైపు డ్రామా పాయింటును కూడా చెప్తూ ఉన్నారు. అప్పుడప్పుడు కనుల నుండి కన్నీరు కూడా కారుస్తూ ఉంటారు. ఏమయిందో తెలియదు, ఇదేమిటో తెలియదు అని కూడా అంటూ ఉంటారు. మళ్ళీ ఇంకొక వైపు డ్రామా పాయింటును కూడా వల్లె వేస్తూ ఉంటారు. విజయులుగా అయితే అవ్వాల్సిందే, నేను విజయీ రత్నాన్నే, డ్రామా కూడా గుర్తుంది కాని ఇలా ఎందుకు జరిగిందో తెలియదని అంటారు.
కనుక దీనినేమంటారు? శక్తి రూపముతో, శస్త్ర రూపముతో ధారణ చేశారా లేక కేవలం పాయింటు రూపములో ధారణ చేశారా? అలాగే ఆత్మను గురించి కూడా నేనైతే శక్తిశాలి ఆత్మనే, సర్వశక్తివంతుని సంతానాన్నే కాని ఈ విషయం చాలా పెద్దది. ఇటువంటి విషయాన్ని నేనెప్పుడూ ఆలోచించలేదని కూడా అంటారు. మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ ఎక్కడ? ఈ మాటలెక్కడ? ఇవేమైనా బాగున్నాయా? మరి దీనినేమంటారు? కావున ఒకటి ఆత్మ పాఠము, తర్వాత పరమాత్మ పాఠము, డ్రామా పాఠము, 84 జన్మల పాఠము ఇలా ఎన్ని పాఠాలున్నాయి? అన్నింటినీ శక్తి అనగా శస్త్రాల రూపంలో ధారణ చేయడం అనగా విజయులుగా అవ్వడం. కేవలం పాయింట్ రూపంలో ధారణ చేసినట్లయితే, కొన్ని సార్లు పని చేస్తుంది, కొన్నిసార్లు పని చేయదు. అయినా పాయింటు రూపంలో ధారణ చేసేవారు కూడా సేవలో బిజీగా ఉన్న కారణంగా, పాయింట్లను పదే పదే వర్ణన చేసే కారణంగా మాయ నుండి సురక్షితంగా ఉంటారు. కాని ఏదైనా పరిస్థితి లేక మాయ రాయల్ రూపమేదైనా ముందుకు వచ్చినప్పుడు సదా విజయులుగా అవ్వలేరు. అవే పాయింట్లను వర్ణన చేస్తూ ఉంటారు. కాని శక్తి లేని కారణంగా సదా మాయాజీతులుగా అవ్వలేరు.
కావున నెంబరువారిగా ఎందుకు అవుతారో అర్థమయిందా ? ఇప్పుడు ప్రతి జ్ఞాన పాయింట్ను శక్తి రూపంగా, శస్త్ర రూపంగా ధారణ చేశామా? అని చెక్ చేసుకోండి. కేవలం జ్ఞానవంతులుగా అయ్యామా లేక శక్తీశాలిగా కూడా అయ్యాయా? అని చెక్ చేసుకోండి. జ్ఞాన స్వరూపులుగా అవ్వడంతో పాటు పవర్ఫుల్గా(శక్తి స్వరూపంగా) కూడా అయ్యారా లేక కేవలం జ్ఞాన స్వరూపులుగా అయ్యారా? యథార్థ జ్ఞానము, లైట్(ప్రకాశము) మరియు మైట్(శక్తి) స్వరూపము. దానిని అదే రూపంగా ధారణ చేశారా? సమయానికి జ్ఞానము విజయులుగా చేయకపోతే జ్ఞానాన్ని శక్తి రూపంగా, ధారణ చేయనట్లే. ఒకవేళ ఎవరైనా యోధులు సమయానికి శస్త్రాలను కార్యములోకి తీసుకురాలేకపోతే వారినేమంటారు? మహావీరులని అంటారా? ఈ జ్ఞానశక్తి ఎందుకు లభించింది? మాయాజీతులుగా అయ్యేందుకే లభించింది కదా! లేక సమయము గతించిపోయిన తర్వాత పాయింట్లను గుర్తు చేసుకుంటారా? ఇది చేయాల్సింది, ఇలా ఆలోచించామని అంటారా? కనుక దీనిని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫోర్సు (శక్తి) యొక్క కోర్సు ఎంతవరకు చేశారు! కోర్సును చేయించేందుకు అందరూ తయారుగా ఉన్నారు కదా! కోర్సు చేయించలేని వారెవరైనా ఉన్నారా! అందరూ చేయించగలరు. చాలా ప్రేమగా, మంచి రూపముతో కోర్సు చేయిస్తారు. ఎంతో ప్రేమగా, అలసట లేనివారిగా అయి, ఎంతో లగ్నముతో చేస్తూ, చేయిస్తూ ఉండడం బాప్దాదా గమనించారు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. తనువు-మనసు -ధనాలను వినియోగిస్తున్నారు. అందుకే ఇంతగా వృద్ధి జరిగింది. ఇదంతా చాలా బాగా చేస్తున్నారు. కాని ఇప్పుడు సమయానుసారంగా ఇదైతే దాటేశారు. బాల్యము పూర్తయిపోయింది కదా! ఇప్పుడు యువావస్థలో ఉన్నారా? లేక వానప్రస్థంలో ఉన్నారా? ఎంతవరకు చేరుకున్నారు? ఈ గ్రూపులో మెజారిటీ కొత్త కొత్త వారు ఉన్నారు. కాని విదేశీ సేవ జరిగి కొన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి. కావున ఇప్పుడు బాల్యము కాదు. ఇప్పుడు యువావస్థకు చేరుకున్నారు. ఇప్పుడు ఫోర్సును నింపే కోర్సును చేయండి మరియు చేయించండి.
సాధారణంగా కూడా యువతలో చాలా శక్తి ఉంటుంది. యువత ఆయువు చాలా శక్తిశాలిగా ఉంటుంది. ఏది కావాలనుకుంటే అది చేయగలరు. కావున చూడండి, ఈనాటి ప్రభుత్వము కూడా యువతకు భయపడ్తుంది. ఎందుకంటే యూత్ గ్రూప్లో లౌకిక రూపములో బుద్ధి శక్తీ ఉంది, శారీరిక శక్తి కూడా ఉంది. కాని ఇక్కడ విధ్వంసం చేసేవారు లేరు, నిర్మాణము చేసేవారు ఉన్నారు. వారు ఆవేశపరులు. ఇక్కడ మీరు శాంతి స్వరూప ఆత్మలు. పాడైపోయిన దానిని తీర్చిదిద్దేవారు, అందరి దుఃఖాలను దూరం చేసేవారు. వారు దుఃఖమును ఇచ్చేవారు, మీరు దుఃఖమును దూరం చేసేవారు. దుఃఖహర్త-సుఖకర్తలు. తండ్రి ఎలా ఉన్నారో పిల్లలు అలా ఉన్నారు. సదా ప్రతి సంకల్పము, ప్రతి ఆత్మ పట్ల లేక స్వయం పట్ల సుఖదాయకమైన సంకల్పాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు దుఃఖ ప్రపంచము నుండి బయటపడ్డారు. ఇప్పుడు మీరు దుఃఖ ప్రపంచంలో లేరు. దుఃఖధామం నుండి సంగమ యుగములోకి వచ్చి చేరుకున్నారు. పురుషోత్తమ యుగంలో కూర్చున్నారు. వారు కలియుగ యువత. మీరు సంగమయుగ యువత. కావున ఇప్పుడు సదా స్వయంలో జ్ఞానమును శక్తి రూపంలో ధారణ చేయండి ఇతరులచే చేయించండి కూడా. ఎంతగా స్వయం ఫోర్సు యొక్క కోర్సును చేసి ఉంటారో అంత ఇతరులకు కూడా చేయిస్తారు. లేకపోతే కేవలం పాయింట్ల కోర్సును చేయిస్తారు. ఇప్పుడు కోర్సును మళ్ళీ రివైజ్ చేయండి. ఒక్కొక్కపాయింట్లో ఏ ఏ శక్తి ఉంది, ఎంత శక్తి ఉంది. ఏ సమయం, ఏ శక్తిని, ఏ రూపములో ఉపయోగించగలరో ఈ ట్రైనింగ్ స్వయానికి స్వయం కూడా ఇచ్చుకోగలరు. కావున ఆత్మ యొక్క పాయింట్ రూపీ శక్తిశాలి శస్త్రాన్ని రోజంతటిలో ప్రాక్టికల్గా కార్యంలోకి తీసుకొచ్చానా? అని చెక్ చేసుకోండి. మీకు మీరే ట్రైనింగ్ ఇచ్చుకోగలరు. ఎందుకంటే మీరు జ్ఞాన సంపన్నులుగా ఉన్నారు. ఆత్మను గురించిన పాయింట్లను తయారు చేయమని చెప్తే ఎన్ని పాయింట్లు తీస్తారు! చాలా ఉన్నాయి కదా! భాషణం చేయడంలో అయితే తెలివైనవారిగా ఉన్నారు. కాని ఒక్కొక్క పాయింటును చూడండి. పరిస్థితుల సమయంలో ఎంతవరకు కార్యంలోకి తీసుకొస్తున్నారు? మేమైతే సరిగ్గానే ఉన్నాము కాని ఇటువంటి విషయము జరిగింది, పరిస్థితి వచ్చింది అప్పుడే ఇలా అయిందని భావించకండి. శస్త్రాలు దేని కొరకు ఉంటాయి? శత్రువు వచ్చినప్పుడు ఎదుర్కునేందుకు ఉంటాయి లేక శత్రువు వచ్చిన కారణంగా ఓడిపోయానని చెప్పేందుకే ఉంటాయా! మాయ వచ్చేసింది కనుక నేను తికమక పడ్డాను అని అంటారా. మాయా రూపి శత్రువు కొరకే కదా శస్త్రాలుండేది! శక్తులను దేని కొరకు ధారణ చేశారు? సమయానికి విజయాన్ని పొందేందుకే కదా శక్తిశాలిగా అయ్యారు! కావున ఏం చేయాలో అర్థమయిందా! పరస్పరంలో మంచి రీతిగా ఆత్మిక సంభాషణ చేస్తూ ఉంటారు. బాప్దాదాకు అన్ని సమాచారాలు లభిస్తూ ఉంటాయి. బాప్దాదా అయితే పిల్లల్లోని ఉల్లాసాన్ని చూసి సంతోషిస్తూ ఉంటారు. చదువు పై ప్రేమ ఉంది, తండ్రి పైన ప్రేమ ఉంది, సేవ పైన ప్రేమ ఉంది. కాని అప్పుడప్పుడు ఎవరైతే నాజూకుగా అవుతారో, శస్త్రాలు జారిపోతాయో ఆ సమయంలో వారి ఫిల్మ్ తీసి మళ్ళీ వారికే చూపించాలి. అది కేవలం కొద్ది సమయం వరకే ఉంటుంది. ఎక్కువగా ఉండదు. అయినా నిరంతరము అనగా సదా నిర్విఘ్నంగా ఉండడం, మరియు విఘ్నము, నిర్విఘ్నము రెండూ నడుస్తూ ఉండడంలో తేడా ఉంటుంది కదా! దారములో ముళ్ళు ఎన్ని పడుతూ ఉంటాయో, దారము అంత బలహీనంగా అవుతుంది. జోడింపబడ్తుంది కాని ముడి వేయబడిన వస్తువుకు, అఖండంగా ఉన్న వస్తువుకు తేడా అయితే ఉంటుంది కదా! అతుకులు వేయబడిన వస్తువు బాగుంటుందా? కావున విఘ్నం వచ్చింది తర్వాత నిర్విఘ్నంగా అవుతారు, మళ్ళీ విఘ్నం వచ్చింది ఇలా తెంచుకుంటూ, ముడి వేసుకుంటూ ఉండడం లేదు కదా! అందువలన కూడా దీని ప్రభావము స్థితి పైన పడ్తుంది.
కొందరు చాలామంచి తీవ్రపురుషార్థులు కూడా ఉన్నారు. నాలెడ్జ్ఫుల్గా(జ్ఞానసంపన్నులుగా), సేవా యోగ్యులుగా కూడా ఉన్నారు. బాప్దాదా మరియు పరివారము దృష్టిలో కూడా ఉన్నారు. కాని ఇలా ముడి వేసుకుంటూ, తెంచుకుంటూ ఉన్న కారణంగా ఆత్మ సదా శక్తిశాలిగా ఉండదు. చిన్న-చిన్న విషయాలలో కూడా కష్టపడవలసి ఉంటుంది. ఒకసారి సదా తేలికగా, హర్షితంగా, సంతోషంతో నాట్యం చేసేవారిగా ఉంటారు. కాని అలా సదా కనిపించరు. మహారథుల లిస్టులో ఉంటారు. కాని ఇటువంటి సంస్కారాలు గలవారు తప్పకుండా బలహీనంగా ఉంటారు. ఇందుకు కారణమేమి? ఇలా తెంచుకుంటూ, ముడి వేసుకుంటూ ఉండే సంస్కారము వారిని లోపల నుండి బలహీనంగా చేస్తుంది. బయట నుండి విషయమేదీ కనిపించదు. చాలా బాగా కనిపిస్తూ ఉంటారు. కావున ఈ సంస్కారాన్ని ఎప్పుడూ తయారు చేసుకోకండి. మాయ వచ్చేసింది కాని నడుస్తూనే ఉన్నామని అనుకోకండి. కాని ఇలా నడుచుకోవడం, ఒకసారి తెగడం, ఒకసారి ముడి వేసుకోవడం ఎలా ఉంటుంది? సదా జోడింపబడి ఉండాలి, సదా నిర్విఘ్నంగా ఉండాలి. సదా హర్షితంగా, సదా ఛత్రఛాయలో ఉండాలి. ఆ జీవితానికి, ఈ జీవితానికి తేడా ఉంది కదా! అందుకే కొందరి జాతకము గల కాగితము స్వచ్ఛంగా ఉంది. మరికొందరిది మధ్య-మధ్యలో మచ్చలు ఉన్నాయని బాప్దాదా అంటారు. భలే మచ్చలను చెరిపేస్తారు కాని అవి కూడా కనిపిస్తాయి కదా! అసలు మచ్చలే లేని స్వచ్ఛమైన కాగితము, మరియు మచ్చలు చెరిపివేయడిన కాగితము ఏది బాగుంటుంది? కాగితమును స్వచ్ఛంగా ఉంచుకునేందుకు ఆధారము చాలా సహజమైనది. ఇది చాలా కష్టమని భయపడకండి. ఇది చాలా సహజము. ఎందుకంటే సమయము సమీపంగా వస్తోంది. సమయానికి కూడా విశేష వరదానము లభించింది. ఎవరెంత ఆలస్యంగా వస్తారో వారికి సమయానుసారంగా అదనపు లిఫ్ట్ అనే గిఫ్ట్ కూడా లభిస్తుంది. అంతేకాక ఈ అవ్యక్త రూపము యొక్క పాత్ర వరదాని పాత్ర. కావున మీకు సమయము యొక్క సహాయం కూడా ఉంది. అవ్యక్త పాత్ర యొక్క అవ్యక్త సహయోగము కూడా ఉంది. ఇప్పుడు సమయం తీవ్రగతిలో ఉంది. దీని సహాయం కూడా ఉంది. మొదట అన్వేషణలో సమయం పట్టింది. ఇప్పుడు తయారై తయారు చేయబడి ఉంది. మీరు తయారై తయారుచేయబడిన సమయంలో చేరుకున్నారు. ఈ వరాదనము కూడా తక్కువది కాదు. ఎవరైతే ముందు వచ్చారో వారు వెన్న తీశారు. మీరందరూ వెన్న తినే సమయంలో వచ్చారు. కావున వరదానులుగా ఉన్నారు కదా! కేవలం కొంచెం అటెన్షన్ ఉంచండి. మిగిలింది ఏమంత పెద్ద విషయం కాదు. అన్ని రకాల సహాయం మీకు తోడుగా ఉంది. ఇప్పుడు మీ అందరికీ మహారథులైన నిమిత్త ఆత్మల పాలన ఎంత లభిస్తోందో అంత ప్రారంభంలోని వారికి లభించలేదు. ఒక్కొక్కరితో ఎంత శ్రమ చేస్తూ టైమ్ ఇస్తున్నారు. మొదట సాధారణ పాలన లభించింది. కాని మీరైతే అపురూపంగా అయి పాలింపబడ్తున్నారు. పాలనకు రిటర్ను కూడా ఇచ్చేవారు కదా! కష్టమేమీ లేదు. కేవలం ఒక్కొక్క విషయాన్ని శక్తి రూపంతో ఉపయోగించేందుకు అటెన్షన్ ఉంచండి. అర్థమయిందా. మంచిది.
సదా మహావీరులుగా అయి విజయ ఛత్రధారి ఆత్మలకు, సదా జ్ఞాన శక్తిని సమయానుసారంగా కార్యంలోకి తీసుకొచ్చేవారు, సదా స్థిరమైన, అచలమైన, అఖండ స్థితిని ధారణ చేసేవారికి, సదా స్వయాన్ని మాస్టర్ సర్వశక్తివంతులుగా అనుభవం చేసుకునేవారికి - ఇటువంటి శ్రేష్ఠమైన సదా మాయాజీత్లైన, విజయీ పిల్లలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో :- అనన్య రత్నాల ప్రతి అడుగులో స్వయానికైతే పదమాల సంపాదన ఉంది. కాని ఇతరులకు కూడా పదమాల సంపాదన ఉంది. అనన్య రత్నాలు సదా ప్రతి అడుగులో ముందుకు వెళ్తూనే ఉంటారు. అనాది తాళంచెవి లభించింది. అది ఆటోమేటిక్ తాళంచెవి. నిమిత్తంగా అవ్వడం అనగా ఆటోమేటిక్ తాళంచెవిని త్రిప్పడం. అనన్య రత్నాలు అనాది తాళంచెవి ద్వారా ముందుకు వెళ్లాల్సిందే. మీ అందరి ప్రతి సంకల్పంలో సేవ నిండి ఉంది. అనేక ఆత్మలను ఉల్లాస-ఉత్సాహాలలోకి తీసుకొచ్చేందుకు ఒక ఆత్మ నిమిత్తంగా అవుతుంది. శ్రమ చేయవలసిన అవసరంలేదు. కాని నిమిత్తమైన వారిని చూస్తూనే ఈ అల వ్యాపిస్తుంది. ఎలాగైతే ఒకరినొకరు చూసినప్పుడు రంగు అంటుకుంటుంది కదా! కావున ఈ ఆటోమేటిక్ ఉత్సాహ-ఉల్లాసాల అల ఇతరుల ఉత్సాహ-ఉల్లాసాలను కూడా పెంచుతుంది. అలాగే ఎవరైనా మంచి డాన్సు చేసినట్లయితే, చూసేవారి పాదము నాట్యము చేయడం మొదలు పెడ్తుంది, అల వ్యాపిస్తుంది. కోరుకోకపోయినా కూడా చేతులు, పాదాలు కదలడం మొదలుపెడ్తాయి.
మధువనంలోని కార్య వ్యవహారాలన్నీ బాగున్నాయి. మధువన నివాసులతో మధువనం అలంకరించబడి ఉంది. బాప్దాదా అయితే నిమిత్తంగా ఉన్న పిల్లలను చూసి సదా నిశ్చింతగా ఉన్నారు. ఎందుకంటే, పిల్లలెంతో తెలివైనవారు. పిల్లలు కూడా తక్కువ కాదు. తండ్రికి పిల్లల పై పూర్తి విశ్వాసముంది. కావున పిల్లలు తండ్రి కంటే ముందున్నారు. నిమిత్తంగా ఉన్నవారు సదా తండ్రిని కూడా నిశ్చింతగా చేసేవారు. ఎటువంటి చింతా లేదు. తండ్రికి సంతోషకర వార్తను వినిపించేవారు. ఒక్కొక్క పుత్రుడు ఒకరికన్నా ఒకరు ముందు ఉన్నారు. ప్రతి పుత్రుడు విశేషమైనవారు. ఇటువంటి పిల్లలు ఎక్కడా ఉండరు. అటువంటి పిల్లలు ఎవ్వరికీ ఇంతమంది ఉండజాలరు. కొంతమంది కొట్లాడుకునేవారు, కొంతమంది చదువుకునేవారు ఉంటారు. ఇక్కడైతే ప్రతి ఒక్కరూ విశేష మణులు. ప్రతి ఒక్కరికి విశేషత ఉంది.

Comments