11-04-1985 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
'' ఉదారతే ఆధార స్వరూప సంఘటనకు గల విశేషత ''
ఈ రోజు విశేషించి విశ్వపరివర్తనకు ఆధార స్వరూపులు, విశ్వ బేహద్ సేవకు ఆధార స్వరూపులు, శ్రేష్ఠ స్మృతి, బేహద్ వృత్తి, మధుర అమూల్యమైన మాటలు మాట్లాడే ఆధారం ద్వారా ఇతరులకు కూడా ఉత్సాహ-ఉల్లాసాలు ఇప్పించేందుకు ఆధార స్వరూపులుగా, నిమిత్తంగా మరియు నిర్మాణ స్వరూపంగా ఉన్న విశేష ఆత్మలను కలుసుకునేందుకు వచ్చారు. ప్రతి ఒక్కరు తమను ఇటువంటి ఆధార స్వరూపులుగా అనుభవం చేస్తున్నారా? ఆధార రూప ఆత్మల సంఘటన పై ఇంత బేహద్ బాధ్యత ఉంది. ఆధార రూపులు అనగా సదా స్వయాన్ని ప్రతి సమయము, ప్రతి సంకల్పము, ప్రతి కర్మలో బాధ్యులుగా భావించి నడిచేవారు. ఈ సంఘటనలోకి రావడం అనగా బేహద్ బాధ్యతా కిరీటధారులుగా అవ్వడం. ఈ సంఘటనను మీటింగ్ అని అంటారు. మీటింగ్లోకి రావడం అనగా సదా తండ్రితో, సేవతో, పరివారముతో, స్నేహం యొక్క శ్రేష్ఠ సంకల్పాల దారములో బంధింపబడడం మరియు బంధించడం. ఇందుకు మీరు ఆధార స్వరూపులు. ఈ నిమిత్త సంఘటనలోకి రావడం అనగా స్వయాన్ని సర్వుల పట్ల ఉదాహరణ మూర్తిగా తయారు చేసుకోవడం. ఇది మీటింగ్ కాదు కానీ మర్యాదా పురుషోత్తములుగా తయారయ్యే శుభసంకల్పం అనే బంధనలో బంధింపబడడం. ఈ విషయాలన్నిటి ఆధార స్వరూపులుగా అవ్వడం. దీనిని ఆధార స్వరూప సంఘటన అని అంటారు. ఇందులో నలువైపుల నుండి ఎన్నుకోబడిన విశేష రత్నాలు ఉన్నారు. ఎన్నుకోబడినవారు అనగా తండ్రి సమానంగా అయినవారు. సేవకు ఆధార స్వరూపులు అనగా స్వ ఉద్ధారము మరియు సర్వుల ఉద్ధార స్వరూపులు. ఎంత స్వ ఉద్ధార స్వరూపులుగా ఉంటారో అంత సర్వుల ఉద్ధార స్వరూపానికి నిమిత్తంగా అవుతారు. బాప్దాదా ఈ సంఘటనలోని ఆధార రూప పిల్లలను మరియు ఉద్ధార రూప పిల్లలను చూస్తున్నారు మరియు విశేషించి ఒక్క విశేషతను చూస్తున్నారు. ఆధార రూపంగా కూడా అయ్యారు, ఉద్ధార రూపంగా కూడా అయ్యారు. ఈ రెండు విషయాలలో సఫలత పొందేందుకు మూడవది ఏ విషయం కావాలి? ఆధార రూపంగా ఉన్నారు కనుకనే ఆహ్వానం పై వచ్చారు కదా మరియు ఉద్ధార రూపంగా ఉన్నారు కనుకనే ప్లాన్లు తయారు చేశారు. ఉద్ధరించడం అనగా సేవ చెయ్యడం. మూడవ విషయం ఏం చూశారు? ఎంత విశేష సంఘటనకు చెందినవారో అంత ఉదార చిత్తులుగా ఉన్నారు. ఉదార హృదయం లేక ఉదారచిత్తుల మాటలు, ఉదారచిత్తుల భావన ఎంతవరకు ఉంది? ఎందుకంటే ఉదార చిత్తులు అనగా సదా ప్రతి కార్యములో విశాల హృదయులు, పెద్ద మనసు గలవారు. ఏ విషయంలో విశాల హృదయులు లేక గొప్ప హృదయులు? సర్వుల పట్ల శుభభావన ద్వారా ముందుకు తీసుకెళ్ళడంలో విశాల హృదయులు. నీది అనేది నాది. నాది అన్నది నీది. ఎందుకంటే ఒకే తండ్రికి చెందిన వారము. ఈ బేహద్ వృత్తిలో విశాల హృదయులు, పెద్ద మనసు గలవారు. ఉదార హృదయులు అనగా దాతృత్వ భావన గల హృదయము గలవారు. తమకు ప్రాప్తించిన గుణాలు, శక్తులు, విశేషతలు అన్నిటిలో మహాదానులుగా అవ్వడంలో విశాల హృదయులు. వాచా ద్వారా జ్ఞాన ధనాన్ని దానం చెయ్యడం ఏమంత గొప్ప విషయం కాదు. కాని గుణదానము లేక గుణాలను ఇచ్చే సహయోగిగా అవ్వాలి. ఈ దానం అనే శబ్ధము బ్రాహ్మణుల కొరకు యోగ్యము కాదు. తమ గుణాలతో ఇతరులను గుణవంతులుగా చేయాలి. విశేషతలు నింపడంలో సహయోగులుగా అవ్వాలి, వీరినే మహాదానులని, విశాల హృదయులని అంటారు. ఇలాంటి ఉదార చిత్తులుగా, ఉదార హృదయులుగా అవ్వాలి - ఇదే బ్రహ్మాబాబాను అనుసరించడము. ఇలాంటి ఉదార చిత్తుల గుర్తులు ఏవి?
విశేషంగా మూడు గుర్తులు ఉంటాయి. ఇలాంటి ఆత్మ ఈర్ష్య, అసహ్యము మరియు విమర్శించడము(దీనిని నిందించడము అని అంటారు) ఈ మూడు విషయాల నుండి సదా ముక్తులుగా ఉంటారు. వీరినే ఉదారచిత్తులని అంటారు. ఈర్ష్య స్వయాన్ని కూడా బాధపెడ్తుంది, ఇతరులను కూడా బాధపెడ్తుంది. ఎలాగైతే క్రోధాన్ని అగ్ని అని అంటారో, అలా ఈర్ష్య కూడా అగ్ని వలె పని చేస్తుంది. క్రోధము మహాఅగ్ని, ఈర్ష్య చిన్న అగ్ని. అసహ్యము(ఘృణ) ఎప్పుడూ శుభ చింత స్థితిని, శుభచింతన స్థితిని అనుభవం చేయనివ్వదు. అసహ్యము అనగా స్వయం కూడా పడిపోవడం మరియు ఇతరులను కూడా పడేయడం. అలాగే విమర్శించడం - నవ్వుతూ చెయ్యండి, సీరియస్గా అయి చెయ్యండి కాని ఇది ఎవరైనా నడుస్తున్నప్పుడు వారిని తోసి క్రిందపడేసినంత దు:ఖమునిస్తుంది. ఎవరినైనా పడేసినప్పుడు చిన్న దెబ్బ లేక పెద్ద దెబ్బ తగలడం వలన వారు ధైర్యహీనులుగా అయినట్లు అవుతారు. ఆ దెబ్బ గురించే ఆలోచిస్తారు. ఆ దెబ్బ ఉన్నంత వరకు ఆ గాయము చేసినవారిని ఏదో ఒక రూపంలో తప్పకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇది సాధారణ విషయము కాదు. ఎవరికోసం అయినా చెప్పడము చాలా సహజం. కాని నవ్వుతూ చేసిన దెబ్బ కూడా దు:ఖ రూపంగానే అవుతుంది. వీరు దు:ఖం ఇచ్చే లిస్టులోకి వస్తారు. అర్థమయిందా? ఎంత ఆధార స్వరూపులుగా ఉన్నారో అంత ఉద్ధార స్వరూపులుగా ఉదార హృదయులుగా, ఉదారచిత్తులుగా అయ్యే నిమిత్త స్వరూపులుగా అవ్వండి. గుర్తులు అర్థం చేసుకున్నారు కదా! ఉదారచిత్తులు విశాల హృదయులుగా ఉంటారు.
సంఘటన అయితే చాలా బాగుంది. అందరూ ప్రసిద్ధమైనవారు వచ్చారు. ప్లాన్లు కూడా మంచి మంచివి తయారు చేశారు. ప్లాన్లు ప్రాక్టికల్లోకి తీసుకొచ్చేందుకు నిమిత్తంగా ఉన్నారు. ఎంత మంచి ప్లాన్లు తయారు చేశారో అంత స్వయం కూడా మంచిగా ఉన్నారు. తండ్రికి మంచిగా అనిపిస్తారు. సేవ పై లగ్నము చాలా బాగుంది. సేవలో సదాకాలపు సఫలతకు ఆధారము ఉదారత. అందరి లక్ష్యాలు, శుభ సంకల్పాలు చాలా బాగున్నాయి. అన్నీ ఒక్కటే. కేవలం ఒకే ఒక శబ్ధము కలపాలి. ఒక్క తండ్రిని ప్రత్యక్షము చేయాలి, ఒక్కటిగా అయి ఒక్కరిని ప్రత్యక్షం చేయాలి. కేవలం ఈ ఒక్కటి కలపాలి. ఒక్క తండ్రి పరిచయాన్ని ఇచ్చేందుకు అజ్ఞానులు కూడా ఒక్క వేలుతో సూచిస్తారు. రెండు వ్రేళ్లు చూపించరు. సహయోగిగా అయ్యేందుకు గుర్తు కూడా ఒక్క వేలునే చూపిస్తారు. విశేష ఆత్మలైన మీ ఈ విశేషతకు గుర్తే కొనసాగుతూ వస్తోంది.
కావున స్వర్ణిమ జూబిలీని జరిపేందుకు లేక ప్లాన్ తయారు చేసేందుకు సదా రెండు మాటలు గుర్తుండాలి - ఏకత(ఐకమత్యము) మరియు ఏకాగ్రత. ఈ రెండు శ్రేష్ఠమైన భుజాలు కార్యము చేసేందుకు, సఫలత కొరకు అవసరము. ఏకాగ్రత అనగా సదా వ్యర్థం లేని సంకల్పాలు, వికల్పాలు లేని స్థితి. ఎక్కడ ఐకమత్యము మరియు ఏకాగ్రత ఉంటుందో అక్కడ సఫలత కంఠహారంగా ఉంటుంది. గోల్డెన్జూబ్లీ కార్యము ఈ రెండు విశేష భుజాలతో చెయ్యండి. రెండు భుజాలు అయితే అందరికి ఉన్నాయి. ఈ రెండు తగిలించుకుంటే నాలుగు భుజాలు అవుతాయి. సత్యనారాయణునికి, మహలక్ష్మికి నాలుగు భుజాలు చూపించారు. మీరందరూ సత్యనారాయణులు, మహాలక్ష్మిలు. చతుర్భుజధారులుగా అయి ప్రతి కార్యము చెయ్యండి. అనగా సాక్షాత్కార స్వరూపులుగా అవ్వండి. కేవలం రెండు భుజాలతో పని చెయ్యకండి, నాలుగు భుజాలతో చెయ్యండి. ఇప్పుడు స్వర్ణిమ మ¬త్సవాన్ని శ్రీగణేష్(ప్రారంభం) చేశారు కదా! గణేశునికి కూడా నాలుగు భుజాలు చూపిస్తారు. బాప్దాదా రోజూ మీటింగ్లోకి వస్తారు. ఒక్క చక్రంలోనే మొత్తం సమాచారమంతా తెలిసిపోతుంది. బాప్దాదా అందరి చిత్రాన్ని గీస్తారు. ఎలా ఎలా కూర్చున్నారు, శరీర రూపంలో కాదు. మానసిక స్థితి అనే ఆసనాన్ని ఫొటో తీస్తారు. నోటితో ఎవరు ఏం మాట్లాడ్తున్నా, మనసుతో ఏం మాట్లాడ్తున్నారో ఆ మనసులోని మాటలను రికార్డ్ చేస్తారు. బాప్దాదా వద్ద కూడా టేప్ చేయబడిన క్యాసెట్లు ఉన్నాయి. చిత్రాలు కూడా ఉన్నాయి. రెండూ ఉన్నాయి. వీడియో, టి.వి. ఏది కావాలంటే అది ఉంది. మీ వద్ద మీ క్యాసెట్ అయితే ఉంది కదా! కాని కొంతమందికి తమ మనసు ధ్వని, సంకల్పం గురించి తెలియదు. మంచిది.
యూత్ చేసిన ప్లాన్లు అందరికి మంచిగా అనిపిస్తాయి. ఇది కూడా ఉత్సాహ-ఉల్లాసాల విషయము. హఠం యొక్క విషయము కాదు. మనసులో ఉత్సాహం ఉంటే వారు స్వత:గానే ఇతరులలో కూడా ఉత్సాహ వాతావరణాన్ని తయారు చేస్తారు. కావున ఇది పాదయాత్ర కాదు, ఉత్సాహ యాత్ర. ఇది నిమిత్తమాత్రము. నిమిత్తమాత్రంగా ఏ కార్యము చేసినా అందులో ఉత్సాహ-ఉల్లాసాల విశేషత ఉండాలి. అందరికి ప్లాన్ ఇష్టమే కదా! ఇకముందు కూడా నాలుగు భుజాలు గలవారిగా అయ్యి ప్లాన్లు ప్రాక్టికల్లోకి తీసుకొస్తూ ఉంటే ఇంకా కలుస్తూ ఉంటుంది. అందరికి స్వర్ణిమ మ¬త్సవం (గోల్డెన్ జూబ్లీ) అట్టహాసంగా జరపాలనే ఉత్సాహ-ఉల్లాసాల సంకల్పం ఒక్కటిగా ఉందనే విషయము బాప్దాదాకు చాలా మంచిగా అనిపించింది. ఈ పునాది అందరి ఉత్సాహ-ఉల్లాసాల సంకల్పము ఒక్కటే. ఈ ఒక్క శబ్ధాన్ని సదా అండర్లైన్ చేస్తూ ముందుకు వెళ్ళండి. మేమంతా ఒక్కటే, ఇది ఒక్కరి కార్యమే. ఏ మూలలో జరుగుతున్నా దేశంలో కావచ్చు, విదేశంలో కావచ్చు, ఏ జోన్లో అయినా కావచ్చు, తూర్పున జరిగినా, పడమరలో జరిగినా ఒక్కటే, ఒక్కరి కార్యమే. అందరి సంకల్పము ఇలాగే ఉంది కదా! మొదట ఈ ప్రతిజ్ఞ చేశారు కదా! నోటితో చేసిన ప్రతిజ్ఞ కాదు. మనసుతో ఈ ప్రతిజ్ఞ అనగా స్థిరమైన సంకల్పము చేశారు కదా. ఏం జరిగినా కదలరాదు. స్థిరంగా ఉండాలి. ఇలా అందరూ ప్రతిజ్ఞ చేశారు కదా! ఏదైనా శుభకార్యము చేస్తే ప్రతిజ్ఞ చేసేందుకు ముందు అందరూ మనసులో సంకల్పం చేసేందుకు గుర్తుగా కంకణం కట్తారు. కార్యకర్తలకు దారంతో గాని, దేనితోనైనా కంకణం కడ్తారు. ఇది కూడా శ్రేష్ఠ సంకల్పం అనే కంకణము కదా! ఏ విధంగా ఈ రోజు భండారీలో అందరూ చాలా ఉత్సాహ-ఉల్లాసాలతో శ్రీ గణేష్ చేశారో, అలా ఇప్పుడు ఈ భండారీ కూడా పెట్టండి. అందులో అందరు స్థిరమైన ప్రతిజ్ఞగా భావించి చీటి వ్రాసి వెయ్యండి. రెండు భండారీలు జతజతగా ఉంటే సఫలత జరుగుతుంది. మనస్ఫూర్తిగా చెయ్యాలి. చూపించేందుకు కాదు. ఇదే పునాది. గోల్డన్గా అయ్యి గోల్డన్జూబ్లీ జరుపుకునేందుకు ఇది ఆధారము. ఇందులో కేవలం ఒక్క స్లోగన్ జ్ఞాపకం ఉంచుకోండి. ''సమస్యగా అవ్వము, సమస్యను చూసి విచలితమవ్వము. స్వయం కూడా సమాధాన స్వరూపులుగా ఉంటాము, అంతేకాక ఇతరులకు కూడా సమాధానం ఇచ్చేవారిగా అవుతాము.'' ఈ స్మృతి స్వత:గానే బంగారు మ¬త్సవాన్ని సఫలతా స్వరూపంగా చేస్తూ ఉంటుంది. గోల్డెన్జూబ్లీ ముగిసినప్పుడు అందరికి మీ బంగారు స్వరూపం అనుభవం అవుతుంది. మీలో స్వర్ణిమ ప్రపంచాన్ని చూస్తారు. బంగారు ప్రపంచం వస్తుంది అని కేవలం చెప్పడం కాదు కాని ప్రాక్టికల్గా చూపిస్తారు. ఇంద్రజాలికులు చూపిస్తూ ఉంటారు, మాట్లాడ్తూ ఉంటారు, ఇది చూడండి..... అని అంటూ అంటారు. తమ ఈ బంగారు ముఖం, మెరుస్తూ ఉన్న మస్తకము, మెరుస్తూ ఉన్న కళ్ళు, మెరుస్తూ ఉన్న పెదవులు ఇవన్నీ బంగారు యుగాన్ని సాక్షాత్కారం చేయించాలి. ఉదాహరణానికి చిత్రాలు తయారు చేస్తారు కదా - ఒకే చిత్రంలో ఇప్పుడిప్పుడే బ్రహ్మను చూడండి, ఇప్పుడిప్పుడే కృష్ణుడిని చూడండి, విష్ణువును చూడండి అని చూపిస్తారు. అలా మీ సాక్షాత్కారం అవ్వాలి. ఇప్పుడిప్పుడే ఫరిస్తా, ఇప్పుడిప్పుడే విశ్వమహారాజు, విశ్వమహారాణి రూపము, ఇప్పుడిప్పుడే సాధారణ శ్వేత వస్త్రధారులు. ఈ భిన్న-భిన్న స్వరూపాలు మీ బంగారు మూర్తి ద్వారా కనిపించాలి. అర్థమయిందా!
ఇంతమంది ఎన్నుకోబడిన ఆత్మిక గులాబీల పుష్పగుచ్ఛము ఏర్పడింది. ఒక్క ఆత్మిక గులాబీ పుష్ప సుగంధము ఎంత ఉంటుంది! కాబట్టి ఇంత పెద్ద పుష్ప గుచ్ఛము ఎంత అద్భుతము చేస్తుంది అంతేకాక ఒక్కొక్క నక్షత్రములో ప్రపంచము కూడా ఉంది. ఒంటరిగా లేరు. ఆ నక్షత్రాలలో ప్రపంచం లేదు. కానీ నక్షత్రాలైన మీలో ప్రపంచం ఉంది కదా! అద్భుతం అయితే జరగనే జరుగుతుంది. అయ్యే ఉంది. కేవలం ఎవరు చేస్తే వారు అర్జనుడిగా అవుతారు. విజయము అయితే అయ్యే ఉంది. అది నిశ్చితము కానీ అర్జునునిగా అవ్వాలి. అర్జునుడు అనగా నంబర్వన్. ఇప్పుడు దీనికి బహుమతి ఇవ్వాలి. పూర్తి గోల్డెన్జూబ్లిలో(సర్ణిమ మ¬త్సవంలో) సమస్యగా అవ్వరాదు. సమస్యను చూడరాదు. నిర్విఘ్నం, నిర్వికల్పం, నిర్వికారి మూడు విశేషతలూ ఉండాలి. ఇలాంటి బంగారు స్థితిలో ఉండేవారికి బహుమతి ఇవ్వండి. బాప్దాదాకు కూడా సంతోషంగా ఉంది. విశాల బుద్ధి గల పిల్లలను చూసి సంతోషమైతే కలుగుతుంది కదా! ఎలాంటి విశాల బుద్ధి ఉందో, అలాంటి విశాల హృదయము. అందరూ విశాల బుద్ధి గలవారు. అందుకే ప్లాన్లు తయారు చేసేందుకు వచ్చారు. మంచిది.
సదా స్వయాన్ని ఆధార స్వరూపులుగా. ఉద్ధారించే స్వరూపులుగా. సదా ఉదారత కలిగిన ఉదార హృదయులు. ఉదారచిత్తులు. సదా ఒక్కరిగానే ఉండేవారు. ఒక్కరి కార్యము, ఇలాంటి ఏకరస స్థితిలో స్థితులై ఉండే సదా ఐకమత్యం మరియు ఏకాగత్రలో స్థితులై ఉండేవారు, విశాల బుద్ధి. విశాల హృదయులు. విశాల చిత్తం గల పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే.
ముఖ్యమైన సోదర-సోదరీలతో :- అందరు మీటింగ్ చేశారు. శ్రేష్ఠ సంకల్పాలకు సఫలత(సిద్ధి) తప్పకుండా ఉంటుంది. సదా ఉమంగ-ఉల్లాసాలతో ముందుకు వెళ్లడమే విశేషత. విశేషంగా మనసా సేవను ప్రయత్నించండి. మనసా సేవ ఒక అయస్కాంతము వంటిది. ఎలాగైతే అయస్కాంతము ఎంత దూరంగా ఉన్న సూదినైనా ఆకర్షించగలదో, అలా మనసా సేవ ద్వారా ఇంట్లో కూర్చుని ఉన్నా సమీపానికి చేరుకుంటారు. ఇప్పుడు మీరు బయట ఎక్కువ బిజీగా ఉంటున్నారు. మనసా సేవను ఉపయోగించండి. స్థాపనలో ఏ ఏ పెద్ద కార్యాలు జరిగాయో వాటి సఫలత మనసా సేవ ద్వారానే జరిగింది. వారు రామలీల లేక ఏ కార్యము చేసినా కార్యానికి ముందు తమ స్థితిని ఆ కార్యము అనుసారంగా వ్రతంలో ఉంచుకుంటారు. మీరందరు కూడా మనసా సేవ అనే వ్రతం తీసుకోండి. వ్రతాన్ని ధారణ చెయ్యకుంటే ఎక్కువ అలజడిలో ఉంటారు. అందుకు ఫలితం ఒకప్పుడు ఒకలాగా, మరొకప్పుడు మరొకలాగా ఉంటుంది. మనసా సేవ అభ్యాసము ఎక్కువగా చేయాలి. మనసా సేవ చేసేందుకు లైట్హౌస్ మరియు మైట్హౌస్ స్థితి కావాలి. లైటు, మైటు రెండూ కలిసి ఉండాలి. మైకు ముందు మైట్గా(శక్తివంతంగా) అయి మాట్లాడాలి. మైకుగానూ ఉండాలి, మైటుగానూ ఉండాలి. మీ నోరు కూడా మైకే. కనుక మైట్గా అయి మైకు ద్వారా మాట్లాడండి. శక్తిశాలి స్థితిలో పై నుండి క్రిందికి దిగాను, అవతరించి అందరికి ఈ సందేశం ఇస్తున్నాను. అవతారమైన నేను మాట్లాడ్తున్నాను, నేను అవతరించిన ఆత్మను. అవతార స్థితి శక్తిశాలిగా ఉంటుంది కదా! పై నుండి ఎవరైతే క్రిందికి వస్తారో, వారి స్థితి బంగారుయుగ స్థితిగా ఉంటుంది కదా. కావున ఏ సమయంలో మిమ్ములను మీరు అవతారంగా భావిస్తారో అదే శక్తిశాలి స్థితి. మంచిది.
Comments
Post a Comment