* 28-05-1970 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“హైజంపు చేసేందుకు తేలికగా అవ్వండి."
ఎటువంటి సమర్పణ? సమర్పణ సమారోహము అయితే కాదు కదా? ఈ సమారోహము పేరు ఏంటి? తమ జీవితపు తీర్పును చేసేవారి సమారోహము ఇది. తీర్పు ఇవ్వలేదు, ఇవ్వనున్నారు. ఇప్పుడు అగ్రిమెంట్ చేయనున్నారు. తరువాత ఎంగేజ్ మెంట్ ఉంటుంది. దాని తరువాత సమర్పణ అయ్యే సమారోహము ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మొదటి స్టేజ్ కు వచ్చారు. ఇప్పుడు ఎగ్రిమెంటు చేయనున్నారు, కావుననే అందరూ వచ్చారు కదా! జీవితపు నిర్ణయమును తీసుకునేందుకు వచ్చారా, లేదా? బాప్ దాదా కూడా ప్రతి ఒక్కరి సాహసాన్ని చూస్తున్నారు. ఏదైనా విషయములో సాహసమును ఉంచవలసి వస్తే సాహసముతో పాటు ఇంకా వేరేవి కూడా చెయ్యవలసి ఉంటుంది, అనేక విషయాలను ఎదుర్కొనేందుకు వస్తాయి. సాహసమును ఉంచారంటే ఇక మాయ ఎదుర్కోవటం మొదలైపోతుంది. కావున ఎదుర్కొనేందుకు కావలసిన ధైర్యమును కూడా మొదటినుండే మీలో ఉంచుకోవాలి.
మీరందరూ ఎదుర్కొనేందుకు సిద్ధముగా ఉన్నారా? ఏ పరీక్ష ఏ రూపములో వచ్చినాగానీ, పరీక్షను పాస్ అయ్యేందుకు ఒకవేళ హైజంప్ చేసే అభ్యాసము ఉన్నట్లయితే ఎటువంటి పరీక్షనైనా పాస్ అయిపోతారు. మరి ఇది హైజంప్ చేసేవారి గ్రూపు. మేము హైజంప్ చేసేవారము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. అందరూ సాహసమును ఉంచటంలో నెంబర్ వన్‌గా ఉన్నారు. హైజంప్ అని దేనిని అంటారు, దాని మొదటి లక్షణము ఏమిటి అన్నదానిని వీరికి చెప్పవలసి ఉంటుంది. హైజంప్ చేసేవారికి లోపల బయట తేలికతనము అనుభవమౌతుంది. ఒకటేమో లోపలి తమ స్థితి యొక్క తేలికతనము, రెండవది వెలుపలి తేలికతనము. వెలుపల అందరి కనెక్షన్లోకి రావలసి ఉంటుంది. పరస్పర సంబంధ సంపర్కములోకి రావలసి ఉంటుంది, కావున లోపల కూడా తేలికతనము, వెలుపల కూడా తేలికతనము. తేలికతనము ఉన్నట్లయితే హైజంప్ చెయ్యగలరు. ఎక్కడకు వెళ్ళినా వారితో కలిసిపోయేంత తేలికగా ఈ గ్రూపువారు తయారవ్వాలి. అంత సాహసము ఉందా? ఒకవేళ ఇంతమంది కుమారీలు సమర్పణ అయిపోతే ఇక ఏమౌతుంది?
ఈ భట్టీ నుండి ఎలా తయారై వెళ్ళాలంటే ఎవరు ఎటువంటివారైనాగానీ, ఎక్కడ ఉన్నాగానీ, ఎటువంటి పరిస్థితి అయినాగానీ వాటన్నింటినీ ఎదుర్కోగలగాలి! ఎందుకంటే సమస్యలను అంతం చేసేవారిగా అయ్యి వెళ్ళాలి, అంతేగానీ స్వయమే సమస్యగా అవ్వకూడదు. కొందరు సమస్యను తొలగించేవారిగా ఉంటే కొందరు స్వయమే సమస్యగా తయారవుతారు. కావున స్వయం సమస్యగా కాకుండా సమస్యను తొలగించేవారిగా అవ్వాలి. బాప్ దాదా ఈ గ్రూపుకు ఏ పేరు పెట్టారు? కర్మ చేసేందుకు ముందే పేరు పెడ్తారు కావున ఎటువంటి పేరు ఉంటుందో అటువంటి పనిని చేసి చూపిస్తారు. అంతటి ఆశావాదులే కదా? పెద్దవారు పెద్దవారే, కానీ చిన్నవారు కూడా తండ్రి సమానులే అని అంటారు కదా. ఇది చాలా మురిపాల గ్రూపు, ఆశావాదులు. సాహసము కారణంగానే బాప్ దాదా ఈ గ్రూపుకు శూర-వీరగ్రూపు అని పేరు పెట్టారు. పేరుకు తగినట్లుగా ప్రతి కార్యమును శూర-వీరుల సమానంగా చెయ్యాలి. ఎప్పుడూ పిరికివారుగా అవ్వవద్దు, బలహీనతను చూపించవద్దు. కాళీ పూజను చూసారా? ఆ కాళీ దళములాగా ఈ మొత్తము గ్రూపు కూడా కాళీ దళంగా అవ్వాలి. ప్రతి ఒక్కరూ కాళీ రూపులుగా అయినప్పుడు సమస్యలను ఎదుర్కోగలరు. విశేషంగా కుమారీలు శీతలాదేవిగా అవ్వకూడదు, కాళీగా అవ్వాలి. శీతలాదేవిగా కూడా ఏ రూపములో అవ్వాలి అన్నదానినైతే అర్ధం చేసుకున్నారు. కానీ సేవలో ఉన్నప్పుడు, కర్తవ్యములో ఉన్నప్పుడు కాళీ రూపము అవసరము. కాళీ రూపము ఉన్నట్లయితే ఎప్పుడూ దేనిపైనా బలి అవ్వరు, అనేకులను తమపై బలిహారము చేసుకుంటారు. ఎవ్వరిపైనా స్వయం బలి అవ్వకూడదు, కానీ వారిని తమపై అనగా ఎవరిపైనైతే మీరందరూ బలి అయ్యారో వారిపైనే అందరినీ బలి చెయ్యాలి. ఇటువంటి కాళికలుగా అయినట్లయితే అనేకుల సమస్యలను పరిష్కరించగలరు. చాలా కఠిన రూపము అవసరము. మాయ యొక్క ఎటువంటి విఘ్నమైనా ముందుకు వచ్చేందుకు కూడా సాహసించకూడదు. కుమారీలు కాళీ రూపులుగా అయినప్పుడు సేవ సఫలత జరుగుతుంది. కావున వీరందరికీ కాళిక రూపపు లక్షణాలను వినిపించండి. ఎల్లప్పుడూ ఏకరస స్థితిలో ఉండాలి, విఘ్నాలను కూడా తొలగించగలగాలి, ఇందుకొరకు ఎల్లప్పుడూ రెండు విషయాలను మీ ముందు ఉంచుకోవాలి. ఏవిధంగా ఒక కంట్లో ముక్తి, మరొక కంట్లో జీవన్ముక్తిని ఉంచుకుంటారో అలాగే ఒకవైపు వినాశనపు నగారాను ఎదురుగా ఉంచుకోండి, మరొకవైపు మీ రాజ్యపు నజారా(దృశ్యము)ను ఎదురుగా ఉంచుకోండి, రెండింటినీ బుద్దిలో ఉంచండి. వినాశనము కూడా, స్థాపన కూడా, నగారా కూడా, నజారా కూడా ఎదురుగా ఉండాలి.... అప్పుడు ఎటువంటి విఘ్నమునైనా సహజంగానే దాటివేయగలుగుతారు. ఏ కార్యమునైతే ఏ గ్రూపూ చెయ్యలేదో అటువంటి కార్యమును ఈ గ్రూపు చేసి చూపించాలి, అద్భుతమును చేసి చూపించాలి. ఎల్లప్పుడూ పరస్పర స్నేహులుగా మరియు సహయోగులుగా కూడా అయి నడచినట్లయితే సఫలతా సితార మీ అందరి మస్తకముపై మెరుస్తూ కనిపిస్తుంది. ఎప్పుడూ స్నేహము, సహయోగమునివ్వటములో తక్కువ చెయ్యకండి. స్నేహము మరియు సహయోగము రెండూ పరస్పరము కలిసినట్లయితే శక్తి యొక్క ప్రాప్తి జరుగుతుంది, ఈ శక్తి ద్వారానే సఫలత ప్రాప్తిస్తుంది. కావున ఈ రెండు విషయాల ధ్యానమును ఉంచాలి. దేవతలు ఒక్క చూపుతో అసురులను సంహరించేస్తారు అన్నది మీ జడ చిత్రాల గాయనము. అలా ఒక్క క్షణకాలములో ఎటువంటి ఆసురీ సంస్కారమునైనా సంహారము చేసే సంహారకారీ మూర్తులుగా అవ్వాలి. ఎక్కడ సంహారము చెయ్యవలసి ఉంటుందో అక్కడ రచనను రచించకూడదు మరియు ఎక్కడ రచనను రచించవలసి ఉంటుందో అక్కడ సంహారము చెయ్యకూడదు, ఇప్పుడు ఈ విషయమును గమనించాలి. మాస్టర్ బ్రహ్మాగా అవ్వవలసినప్పుడు మాస్టర్ శంకరులుగా అవ్వకూడదు. మాస్టర్ బ్రహ్మాగా ఎక్కడ అవ్వాలి, మాస్టర్ శంకరులుగా ఎక్కడ అవ్వాలి అన్న ఈ జ్ఞానము బుద్ధిలో అవసరము. ఒకవేళ రచనను రచించవలసినప్పుడు వినాశనము చెయ్యటమూ తప్పే, వినాశనమునకు బదులు రచన చెయ్యటమూ తప్పే, అటుదిటు చేసినప్పుడు తేళ్ళు, జెర్రీలు పుట్టుకొచ్చాయి అన్న కధను విన్నారు కదా! కావున ఇక్కడ కూడా ఒకవేళ సంహారము చేసేందుకు బదులుగా చెడు రచనను రచించినట్లయితే వ్యర్ధ సంకల్పాలు తేళ్ళు, జెర్రిలలా అయిపోతాయి. కావున స్వయమును మరియు ఇతరులను కూడా కాటు వేసే అటువంటి రచనను రచించవద్దు. అటువంటి రచనను రచించటము నుండి జాగ్రత్తగా ఉండాలి. ఏ సమయములో ఏ కర్తవ్యపు అవసరము ఉంటుందో ఆ సమయములో ఆ కర్తవ్యమును చెయ్యాలి. సమయము గడచిపోయినట్లయితే సంపూర్ణంగా అవ్వజాలరు. కావున ఈ గ్రూపు చాలా త్వరత్వరగా అగ్రిమెంటు చేసి తరువాత ఎంగేంజ్ మెంటు చేసుకోవాలి. సేవాకేంద్రాలలో సేవలో నిమగ్నులవ్వటమే ఎంగేజ్ మెంట్, అప్పుడు సేవలో సఫలత ప్రాప్తమయ్యాక, ఇక మూడవది సంపూర్ణ సంపన్నంగా అయ్యేందుకు సమారోహము. మూడు సమారోహాలను త్వరగా చేసి చూపించాలి. చిన్నవారు చాలా తీవ్రంగా ముందుకు వెళ్ళగలరు. ప్రియమైనవారు, ముద్దు మురిపాలు కలవారు చిన్నవారే అవుతారు కదా! కావున ఈ గ్రూపు ప్రాక్టికల్‌గా చూపించాలి. ధైర్యము ఉంది కదా! ధైర్యముతో పాటు ఉల్లాసమును కూడా ఉంచాలి. ఎప్పుడూ హార్(ఓటమి) పొందకూడదు కానీ స్వయమును హారముగా చేసుకొని మెడలో అలంకృతులవ్వాలి. ఒకవేళ మెడలో హారముగా అయినట్లయితే ఎప్పుడూ ఓడిపోరు. ఎప్పుడైనా ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మేము ఓడిపోయేవారము కాదు, బాప్ దాదా మెడలోని హారాలము అన్నదానిని గుర్తు తెచ్చుకోండి. చిన్న చిన్న కోమలమైన చిగురుటాకులను పక్షులు చాలా తినేస్తుంటాయి ఎందుకంటే లేతగా ఉంటాయి కాబట్టి తినటంలో చాలా మజా వస్తుంది, కావున సంభాళించుకోవలసి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఒక్కరి ముందు అర్పణ చేసేసారో అప్పుడిక ఇతరుల ముందు సంకల్పము ద్వారా కూడా అర్పణ కాకూడదు. సంకల్పము కూడా చాలా మోసగిస్తుంది. చాలా ప్రియమైన, ముద్దు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు ఏం పెడ్తారు? నల్ల బొట్టు (దిష్టి చుక్క) పెడ్తారు. కావున ఈ గ్రూపుకు కూడా ఎవరి దృష్టీ పడకుండా తిలకాన్ని పెట్టాలి. తిలకమునకు అర్థమునైతే తెలుసుకున్నారు, ఏవిధంగా తిలకము మస్తకముపై ఉంటుందో అలాగే ఏ విషయాలు వచ్చినాగానీ అవన్నీ స్వరూపములోకి రావాలి మరియు ఎల్లప్పుడూ ఆ స్థితిలో స్థితులై ఉండాలి, దాని కొరకు ఈ తిలకము. ఈ అన్ని విషయాలు స్థితిలో ఉండిపోయినట్లయితే అప్పుడు రాజ్య తిలకము లభిస్తుంది. ఎటువంటి స్థితి అవసరము? అన్నదైతే తెలుసు కదా. 'సఫలత మా జన్మ సిద్ధ అధికారము, అసఫలత కాదు' అన్న స్లోగన్ ను ఈ గ్రూపు గుర్తు ఉంచుకోవాలి. నయనాలలో కూడా, ముఖములో కూడా, మస్తకములో కూడా సఫలతా స్వరూపము కనిపించాలి. సంకల్పము కూడా సఫలత కలిగినదిగా ఉండాలి. ఇతర కార్యాలలో కూడా సఫలత ఉండాలి. సఫలతయే జన్మ సిద్ధ అధికారము, ఇదే ఈ గ్రూపు స్లోగన్. భట్టీలోకి రావటం ద్వారా అందరూ మారిపోతారు. అందరికంటే చిన్నవారు ఇంకా ఎక్కువ షో చేస్తారు. (పూనమ్ బాప్ దాదా ఎదురుగా కూర్చుని ఉంది). ఎవరిలో అయితే అస్సలు ఆశనే ఉండదో వారు ఇంకా ఎక్కువ ఆశావాదులుగా అయ్యి చూపెడ్తారు, తాను అద్భుతము చేసి చూపిస్తుంది. బాల భవనపు స్మృతి చిహ్నము ఒక్కటే ఉంది. స్మృతి చిహ్నమును ఎల్లప్పుడూ షోకేసులో ఉంచటం జరుగుతుంది. కావున మిమ్మల్ని ఎల్లప్పుడూ షోకేసులో ఉంచుకోవాలి. ఒకవేళ చిన్నవారు ఒక్కరైనా అద్భుతమును చేసినట్లయితే ఈ మొత్తము గ్రూపు పేరు ప్రసిద్ధమైపోతుంది.
ఇప్పుడు ఏ స్లోగన్ నైతే చెప్పామో దానిని చేసి చూపించాలి. చిన్నవారు పెద్ద కర్తవ్యమును చేసి చూపించాలి. వీరందరి చేత అగ్రిమెంటును వ్రాయించాలి. ఏ కారణము వచ్చినాగానీ, ఎటువంటి సమస్య వచ్చినాగానీ ఇతరులెవ్వరిపైనా బలిహారము కాకూడదు. సత్యమైన, దృఢమైన ప్రతిజ్ఞనే కదా! ఏవిధంగా బీజమును నాటిన తరువాత నీటిని పోసినప్పుడే అది వృక్షరూపములో ఫలీభూతమౌతుందో, అదేవిధంగా ఇప్పుడు చేసిన ఈ ప్రతిజ్ఞకు ఏ జలమును పోస్తారు? ప్రతిజ్ఞను పూర్తి చేసేందుకు సాంగత్యము కూడా అవసరము మరియు దీనికి తోడుతోడుగా మీ ధైర్యము కూడా అవసరము. సాంగత్యము మరియు ధైర్యము - ఈ రెండింటి ఆధారముతో తీరమునకు చేరుతారు. వయా పరంధామము ద్వారా వైకుంఠమునకు తప్ప మరెక్కడకూ వెళ్ళము అన్నదానిని దృఢమైన ముద్రగా వేసుకోవాలి. ఏవిధంగా గవర్నమెంటువారు సీలు వేసినదానిని ఇతరులెవ్వరూ తియ్యలేరో అలా సర్వశక్తివంతమైన గవర్నమెంటు సీలును ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. ఈ గ్రూపులో ఎవరైనా బలహీనమయినట్లయితే వీరందరి నుండి ఉత్తరాలు వస్తాయి, అర్థమైందా? అచ్ఛా.
ఓంశాంతి, పరిస్థితులు వచ్చినను స్థిరముగా ఉండాలి, దీని కోసం ఏ ఒక స్లోగన్ స్మృతి ఉంచుకోవాలి? కూమారీలు కాళీ రూపముగా ఏవిధంగా తయారుకావాలి? పరిస్థితులను ఎదుర్కొనుటకు ముందు నుండే మీలో ఏముండాలి? రెండు కళ్ళల్లో ఏమి కనిపించాలి? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళిలో తెలిపించారు. శివబాబా యాద్ హై?
ReplyDelete