26-03-1970 అవ్యక్త మురళి

* 26-03-1970         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“మహారథితనపు గుణము మరియు కర్తవ్యము.”

ఈ రోజు మాట్లాడాలా లేక మాట్లాడటము నుండి అతీతముగా వెళ్ళాలా? మాట్లాడటము నుండి అతీతముగా వెళ్ళే స్థితి మంచిగా అనిపిస్తుందా లేక మాట్లాడటము మంచిగా అనిపిస్తుందా? (రెండూ) ఎక్కువగా ఏది మంచిగా అనిపిస్తుంది? మాట్లాడుతూ కూడా మాటల నుండి అతీతముగా అయ్యే స్థితి ఉండగలదా? రెండూ కలిసి ఉండగలవా? లేక ఎప్పుడైతే మాట్లాడరో అప్పుడు అతీతముగా ఉండే స్థితి ఉండగలదా? ఉండగలదంటే ఎప్పుడు ఉంటుంది? ఈ స్థితిలో స్థితులయ్యేందుకు ఎంత సమయం కావాలి? ఇప్పుడు అవ్వగలదా? కొన్ని నెలలు లేక కొన్ని సంవత్సరాలు కావాలా? ప్రాక్టీసు ఇప్పుడు మొదలు పెట్టగలరా లేక కార్యవ్యవహారములలో ఉన్నారు కాబట్టి వీలవ్వదా? ఒకవేళ అవగలదంటే ఇప్పటినుండే అవ్వగలదా? ఎవరైతే మహారథులని పిలవబడతారో వారి ప్రాక్టీసు మరియు ప్రాక్టికల్స్ రెండూ కలిసి జరగాలి. మహారథులు మరియు గుర్రపు సవారీలలో అంతరము ఇదే. ప్రాక్టీసు చేయగానే ప్రాక్టికల్ గా అయిపోవడమే మహారథుల గుర్తు. గుర్రపు సవారీవారు ప్రాక్టీసు చేసిన తరువాత ప్రాక్టికల్ లోకి వస్తారు. మరియు కాల్బలము వారు ప్లాన్సును ఆలోచిస్తూనే ఉంటారు. ఇదే అంతరము. పిల్లలు తమ నోటినుండి అటెన్షన్ ఉంది, ప్రాక్టీసు చేస్తాము అన్న మాటలను కూడా మాట్లాడకూడదు. ఇప్పుడు ఆ స్థితి కూడా దాటిపోయింది. ఇప్పుడైతే సంకల్పమేదో కర్మ కూడా అదే కావాలి. సంకల్పము మరియు కర్మలో అంతరము ఉండకూడదు. అవి చిన్ననాటి విషయాలు. సంకల్పము చెయ్యటము, ప్లాన్సు తయారుచేయటము, మరల వాటిపైన నడవటము, ఇప్పుడు ఆరోజులు కాదు. ఇప్పుడు చదువు ఎంతవరకు చేరుకుంది? ఇప్పుడైతే అంతిమ స్టేజ్ లో ఉంది. మహారథితనమునకు ఏ గుణము మరియు కర్తవ్యము ఉంటాయి, దానిని గురించి కూడా ధ్యానమును ఇవ్వాలి. ఈ రోజు దానినే వినిపించేందుకు మరియు అంతిమ స్థితి స్వరూపపు సాక్షాత్కారమును చేయించేందుకు వచ్చారు. సర్వీసబుల్ లు ఏం చెయ్యగలరు, ఏం చెయ్యలేరు, ఏం అనగలరు, ఏం అనలేరు? ఇప్పటినుండి ధారణ చెయ్యటం ద్వారానే అంతిమ మూర్తిగా అవుతారు, సాకార నిదర్శనమును చూసారు కదా, ప్రాక్టీసు మరియు ప్రాక్టికల్ ఒకే విధంగా ఉండేదా లేక వేరువేరుగా ఉండేదా? ఏ సంకల్పమో అదే కర్మ ఉండేది. ఫాలో చెయ్యటమే పిల్లల కర్తవ్యము. అడుగులో అడుగు. ఫుట్ స్టెప్ (అడుగుజాడల)పై నడవడమంటే అర్ధమే - అడుగులో అడుగు. ఎలా ఉందో అలాగే ఫాలో చేస్తారు. ఆ స్టేజ్ ఎప్పుడు వస్తుంది? మహారథుల నోటినుండి - 'ఎప్పుడు' అన్న మాట కూడా వెలువడదు. ఎప్పుడో చేస్తారా లేక ఇప్పుడు చేస్తారా? ఎప్పుడు అన్న మాట శోభించదు. ఎప్పుడు అన్న మాట బలహీనతను నిరూపిస్తుంది. చేసే చూపిస్తాము అన్నది ఒకటి - ఆ, చేస్తాము, ఆలోచిస్తాము, ధైర్యము ఉంది కానీ విశ్వాసమే లేదు అన్నది ఒకటి. విశ్వాసముతో కూడిన మాటలు ఇలా ఉండవు. విశ్వాసము అన్నదాని అర్థమే నిశ్చయబుద్ధి. మనసు, వచనము, కర్మ అన్ని విషయాలలో నిశ్చయబుద్ధి. కేవలము జ్ఞానము మరియు తండ్రి పరిచయము, ఇంతవరకే నిశ్చయము కాదు. కానీ వారి సంకల్పము కూడా నిశ్చయబుద్ధిగా, వాణిలో కూడా నిశ్చయము ఉంటుంది, ఎప్పుడు కూడా ఏ మాటలూ ధైర్యవిహీనముగా ఉండవు. వారినే మహారథి అని అంటారు. మహారథి అర్థమే మహానత. 

పరస్పరములో ఏయే ప్లానులను తయారుచేసారు? ఎటువంటి ప్లానును తయారు చేయాలంటే ఆ ప్లాను ద్వారా నూతన ప్రపంచపు ప్లాను ప్రాక్టికల్ అయిపోవాలి. నూతన ప్రపంచపు ప్లాను ప్రాక్టికల్ లోకి రావటము అనగా పాత ప్రపంచపు ఏ విషయమూ తిరిగి ప్రాక్టికల్ లో  రాకూడదు. అందరూ అంటారు - ప్లానులైతే చాలా తయారవుతాయి, ఇప్పుడు ప్రాక్టికల్ లో చూడాలి అని కొందరు మనసులో అనుకుంటారు, కొందరు నోటితో అంటారు. కానీ ఈ సంకల్పమును కూడా సదా కాలమునకు తొలగించటము, ఇది మహారథుల పని. అందరి దృష్టి ఇప్పుడు మధువనములోని విశేషంగా ముఖ్య రత్నాలపై ఉంది. మీలోపరివర్తన అయిన దృష్టియే వారి దృష్టికి చూపించండి. కావున ఇప్పుడు ఆ పాత దృష్టి లేదు, పాత వృత్తి లేదు. అప్పుడే అంతిమ నగారా మ్రోగుతుంది. ఈ సంగఠన సామాన్యమైనది కాదు, ఈ సంగఠన అద్భుతమైనది. ఈ సంగఠన నుండి ఎటువంటి స్వరూపులుగా అయ్యి వెలువడాలంటే అందరికీ సాక్షాత్తు బాప్ దాదాల మాటలుగానే అనుభవమవ్వాలి. బాప్ దాదాల సంస్కారాలు అందరి సంస్కారాలలో కనిపించాలి, మీ సంస్కారాలు కనిపించకూడదు. అన్ని సంస్కారాలను తొలగించి ఏ సంస్కారమును నింపాలి? బాప్ దాదాల సంస్కారమును నింపాలి. వీరు సాక్షాత్తు బాప్ దాదా లాగనే అయ్యి వెలువడ్డారు అని అందరికీ సాక్షాత్కారమవ్వాలి. ఇలా అందరికీ అనుభవం చేయించాలి. ఎటువంటి పాత సంకల్పము గానీ లేక సంస్కారము గానీ ఎదురుగా రానేకూడదు. ఇది బాప్ దాదా సంస్కారమేనా అని మొదట పోల్చి చూసుకోండి. ఒకవేళ అది బాప్ దాదా సంస్కారము కానట్లయితే దానిని తాకను కూడా తాకవద్దు. బుద్ధిలో సంకల్పరూపంలో కూడా తాకకూడదు. ఏవిధంగా క్రిమినల్(అశుద్ధ) వస్తువును తాకరో అలాగే అది ఒకవేళ బాప్ దాదాకు సమానమైన సంస్కారము కానట్లయితే ఆ సంస్కారమును తాకనే తాకకూడదు. దీనిని చెయ్యకూడదు అని నియమాన్ని పెట్టుకున్నప్పుడు, ఆ తరువాత ఇక ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ దానిని మీరు చేయరు కదా! పరిస్థితులను ఎదిరిస్తారు, ఎందుకంటే ఇది చెయ్యాలి అన్న లక్ష్యము ఉంది. అలాగే మీ సంస్కారము ఏదైతే బాప్ దాదా సమానమైన సంస్కారము కాదో దానిని అస్సలు తాకకూడదు. అలా భావించండి. దేహము మరియు దేహ సంబంధాలు అనే ఈ నిచ్చెననైతే ఎక్కేసారు, కానీ ఇప్పుడు బుద్ధిలో కూడా సంస్కారము ఇమర్జ్ కాకూడదు. ఎటువంటి సంస్కారము ఉంటే అటువంటి స్వరూపము కలుగుతుంది. ఎవరి సంస్కారమైతే సరళంగా, మధురంగా ఉంటుందో ఆ సంస్కారము స్వరూపములోకి వస్తుంది. సంస్కారములు బాప్ దాదాల సమానంగా తయారైపోయినట్లైతే బాప్ దాదాల స్వరూపము అందరికీ కనిపిస్తుంది. బాప్ దాదా ఎలాగో పూర్తిగా అలాగే అదే గుణము, అదే కర్తవ్యము, అదే మాట, అదే సంకల్పము ఉండాలి, అప్పుడు అందరి నోటి నుండి వీరు వారిలాగే అనిపిస్తున్నారు అనే మాట వెలువడుతుంది. ముఖము వేరుగా ఉంటుంది, కానీ గుణము అదేగా ఉంటుంది. కానీ ముఖముపైకి గుణాలు రావాలి. ఇప్పుడు బాప్ దాదా పిల్లల నుండి ఇదే ఆశను ఉంచుతారు. అందరూ స్నేహీ, సఫలతా సితారలుగా, పురుషార్ధీ సితారలు అయితే ఉండనే ఉన్నారు. సర్వీసబుల్ పిల్లల పురుషార్థము సఫలతా సహితంగా ఉంటుంది. నిమిత్తంగా పురుషార్థము చేస్తారు, కానీ సఫలత అయితే ఉండనే ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థమైందా? ఏది ఆలోచిస్తామో, ఏది అంటామో దానినే చేస్తాము. ఆలోచిస్తాము, చూస్తాము, ఆలోచన అయితే అలా ఉంది... ఇలాంటి మాటలు విన్నప్పుడు నవ్వు వస్తుంది, ఇప్పటివరకు కూడా ఇలా ఎందుకు ఉన్నారు? ఇప్పుడు ఈ మాటలు ఎలా అనిపిస్తున్నాయంటే, ఎవరైనా ముసలి వాళ్ళయిన తరువాత బొమ్మలతో ఆటలాడుతుంటే ఏమనిపిస్తుంది? అందుకే బాప్ దాదా కూడా చిరునవ్వు నవ్వుతారు - ముసలివాళ్ళు అయినాగానీ అప్పుడప్పుడు చిన్ననాటి ఆటలు ఆడటంలో ఉంటారు. బొమ్మల ఆట ఏమిటో తెలుసా? పూర్తి జీవితాన్ని వారి కొరకే వెచ్చిస్తారు, చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళుగా చేస్తారు, తరువాత స్వయంవరం (వివాహము) చేస్తారు....... అలాగే పిల్లలు కూడా అనేక విషయాలను తయారు చేసారు, సంకల్పాల రచనను చేస్తారు, మరల వాటి పాలన చేస్తారు, వాటిని పెద్దగా చేస్తారు మళ్ళీ వాటితో స్వయమే విసిగిపోతారు. మరి ఇది బొమ్మల ఆట కాదా? స్వయాన్ని చూసి స్వయమే ఆశ్చర్యపోతారు కూడా. ఇప్పుడు అటువంటి రచనను రచించవద్దు. బాప్ దాదా వ్యర్ధ రచనను రచించరు. పిల్లలేమో వ్యర్థ రచనను రచించి మళ్ళీ వాటినుండి దూరమయ్యేందుకు మరియు తొలగించేందుకు పురుషార్థము చేస్తారు. కావున అటువంటి రచనను రచించవద్దు. క్షణకాలపు మంచి రచనను కూడా త్వరగా రచిస్తారు మరియు చెడు రచన కూడా అంత త్వరగానే జరుగుతుంది. ఒక్క క్షణంలో ఎన్ని సంకల్పాలు కలుగుతాయి! రచనను రచించి సమయాన్ని ఇచ్చి, మళ్ళీ వాటిని సమాప్తము చేసేందుకు ప్రయత్నము చేసే ఆవశ్యకతయే ఎందుకు? ఇప్పుడు ఈ రచనకు బ్రేకు వెయ్యాలి. వారు కుటుంబ నియంత్రణను చేస్తారు కదా! ఇక్కడ కూడా సంకల్పాల ఉత్పత్తి జరుగుతుంది. కావున ఇది కూడా బర్త్ (జన్మ). అక్కడ జనసంఖ్య అతిలోకి వెళ్తే ఇక్కడ సంకల్పాల సంఖ్య అతి అవుతుంది. ఇప్పుడు వీటిని కంట్రోల్ (అదుపు) చెయ్యాలి. పురుషార్ధములోని బలహీనత కారణంగా సంకల్పాల రచన జరుగుతుంది, కావున ఇప్పుడు దీనిని అంశమాత్రము కూడా లేకుండా సమాప్తము చేసేయ్యాలి. పాత మాటలు, పాత సంస్కారాలు ఎలా అనుభవమవ్వాలంటే అసలు అవి ఎప్పటి పాత విషయాలో తెలియనుకూడా తెలియదు అని అనిపించాలి. అలా అంశమాత్రము కూడా లేకుండా సమాప్తమైపోవాలి. ఇప్పుడు భాష మారాలి. సంపూర్ణతా స్టేజ్ అనుసారంగా లేని చాలా మాటలు ఇప్పటివరకు కూడా కొందరిలోవెలువడుతున్నాయి. కావున ఇప్పటి నుండి సంకల్పము కూడా అదే చెయ్యాలి, మాట కూడా అదే మాట్లాడాలి. కర్మ కూడా అదే చెయ్యాలి. ఈ భట్టీ తరువాత అందరి గుణాలలో సంపూర్ణత యొక్క ప్రకాశము కనిపించాలి. మీరు ఇప్పటినుండి సంపూర్ణతను సమీపంగా తీసుకువచ్చినట్లయితే అప్పుడు నంబర్ వార్ గా ఇతరులు కూడా సమీపంగా తీసుకురాగలరు. ఒకవేళ మీరే అంతిమంలో తీసుకువచ్చినట్లయితే ఇతరులు ఏంచేస్తారు? సాకారరూపంలో సంపూర్ణతను సాకారములోకి తీసుకువచ్చారు. సాకారరూపములో సంపూర్ణత సంపన్నంగా కనిపించేది. సంపూర్ణత మరియు సాకారము రెండూ వేరుగా కనిపించేవి కావు. అలాగే మీ సాకార స్వరూపము వేరుగా కనిపించకూడదు. సాకారరూపంలో ఏ ముఖ్యమైన గుణం స్పష్టంగా కనిపించాలి? ఏ గుణము ద్వారా సంపూర్ణత సమీపంగా కనిపించింది? అది ఏ గుణము? ఆ గుణాన్ని చూసే సాకారములో ఉన్నాగానీ అవ్యక్తముగా అనుభవమయ్యేది అని అందరూ అనేవారు. అది ఏ గుణము? (ప్రతిఒక్కరూ వినిపించారు) అన్ని విషయాల రహస్యమైతే ఒక్కటే. కానీ ఇటువంటి స్థితిని ఉపరామ(అతీత) స్థితి అని అంటారు. తమ దేహమునుండి కూడా ఉపరామము. ఉపరామము మరియు ద్రష్ట. ఎవరైతే సాక్షిగా అవుతారో వారి ఉదాహరణనే ఇవ్వటం జరుగుతుంది. కావున సాక్షీద్రష్ట యొక్క ప్రమాణమును ద్రష్టాంతరూపములో ఎదురుగా ఉంచుకోవాలి. ఒకటేమో మీ బుద్ధి నుండి ఉపరామము, సంస్కారాల నుండి కూడా ఉపరామము. నా సంస్కారము - అన్న ఈ నాది అన్న భావము నుండి కూడా ఉపరామముగా ఉండాలి. నేను ఇలా అనుకుంటున్నాను, ఈ నాది అన్న భావము నుండి కూడా ఉపరామముగా ఉండండి. నేను ఇలా అనుకుంటున్నాను, ఇలా అనుకోవటము కాదు, కానీ బాప్ దాదా శ్రీమతము ఇదే అని భావించండి. జ్ఞాన బుద్ధి తరువాత నాది అన్నది వచ్చినట్లయితే ఆ భావము కూడా నష్టపరుస్తుంది. ఒకటేమో నేను శరీరాన్ని అన్న దానిని వదలాలి, రెండవది నేను అనుకుంటున్నాను, నేను జ్ఞానీ అత్మను, నేను బుద్ధివంతుడిని - ఈ నేను అన్నదానిని కూడా తొలగించాలి. ఎక్కడైతే నేను అన్న మాట వస్తుందో అక్కడ బాప్ దాదా స్మృతి రావాలి. ఎక్కడైతే నాది అన్నది వస్తుందో అక్కడ శ్రీమతము గుర్తుకు రావాలి. ఒకటేమో నేను అన్నదానిని తొలగించటము, రెండవది నాది అన్నది, ఇది కూడా పడేస్తుంది. ఈ నేను-నాది, నువ్వు-నీది ఈ నాలుగు మాటలేవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి. ఈ నాలుగు మాటలే సంపూర్ణత నుండి దూరము చేసాయి. ఈ నాలుగు మాటలను సంపూర్ణంగా తొలగించాలి. సాకారుని అంతిమ మాటలను పరిశీలించినట్లయితే ప్రతి మాటలో ఏం వినిపించారు? బాబా -బాబా. సేవలో సఫలత లేనిదాని కరెక్షన్‌ కూడా ఏ విషయంలో ఉంది? ప్రతి మాటలో బాబా, బాబా అని అంటూ మాట్లాడినట్లయితే ఎవరికైనా గురి తగులుతుంది అని అర్థం చేయించేవారు. బాబా గుర్తు వచ్చినప్పుడు నేను-నాది, నువ్వు-నీది అన్నవి సమాప్తమైపోతాయి. అప్పుడిక ఏ స్థితి ఏర్పడుతుంది? అన్ని విషయాలు ప్లెయిన్(సహజము) అయిపోతాయి, ప్లెయిన్ స్మృతిలో నిలిచిపోగలరు. ఇప్పుడు బిందురూపములో స్థితి అయ్యేందుకు కష్టమనిపిస్తుంది కదా! ఎందుకని? పూర్తి రోజంతటి స్థితి ప్లెయిన్ గా లేని కారణంగా ప్లెయిన్ స్మృతి నిలవటం లేదు. ఎక్కడో అక్కడ మైపన్, మేరాపన్, నువ్వు, నీది వస్తాయి. బంగారు సంకెళ్ళు కూడా తక్కువేమీ కాదు అని మొదట్లో వినిపించారు కదా! ఆ సంకెళ్ళు తమవైపుకు లాగుతాయి. ప్రతి ఒక్కరూ తమను పరిశీలించుకోవాలి. పూర్తి ఉపరామ స్థితి, పూర్తి ప్లెయిన్. ఒకవేళ దారి స్పష్టంగా ఉన్నట్లయితే చేరుకోవటానికి ఎంత సమయం పడ్తుంది? అదే ఆ దారిలో అడ్డంకులు ఉన్నట్లయితే చేరుకోవటానికి కూడా సమయము పడుంది. అడ్డంకులు ఉన్నప్పుడు ప్లెయిన్ స్మృతిలో కూడా అడ్డంకి ఉంటుంది, ఇప్పుడు దానిని తొలగించాలి. ఎప్పుడైతే మీరు చేస్తారో మిమ్మల్ని చూసి అందరూ చేస్తారు. నంబర్ వారీగా స్టేజీ పైకి చేరుకోవాలి. మీరు చేరుకుంటే అప్పుడు ఇతరులు కూడా చేరుకుంటారు, అంతటి బాధ్యత ఉంది. సంకల్పములో, వాణిలో, కర్మలో లేక సంబంధములో లేక సేవలో ఒకవేళ ఏదైనా హద్దు ఉండిపోయినట్లయితే ఆ బౌండరీ(హద్దు)లు బాండేజ్(బంధనాల)లో బంధించివేస్తాయి. అనంతమైన స్థితిలో ఉండటం వలననే అనంతమైన రూపంలో స్థితి అయిపోతారు. ఇప్పుడు చెత్త ఏదైతే ఉందో దానిని తొలగించాలి. చెత్తను తొలగించేందుకే ఈ భట్టీ. సంగఠన ఉన్నప్పుడు అది సాక్షాత్తు బాప్ దాదా స్వరూపపు సంగఠనగా ఉండాలి. ఇప్పుడు ఈ సంపూర్ణతా ముద్రను వెయ్యాలి. సంపూర్ణ అవస్థ వర్తమాన సమయము నుండే అవుతుంది. ఇదే మహారథుల కర్తవ్యము. ఇప్పుడు ఇంకేం చెయ్యాలి? స్కాలర్ షిప్ ను ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు స్కాలర్ షిప్ తీసుకొనేవారి ప్రత్యక్ష సాక్షాత్కారము జరుగుతూ ఉంటుంది. బాప్ దాదా గుప్తంగా ఉన్నారు కాబట్టి పిల్లలమైన మేము కూడా గుప్తంగా ఉండాలనైతే కాదు. అలా కాదు, పిల్లలు స్టేజ్ పై ప్రత్యక్షమవ్వాలి.

పిల్లల ప్రత్యక్షత అవ్వాలి. సేవా స్టేజ్ పైన కూడా ఎవరు ప్రత్యక్షమౌతారు? కావున సంపూర్ణతా ప్రత్యక్షతను కూడా స్టేజ్ పైకి తీసుకురావాలి. అంతిమము వరకు గుప్తంగానే ఉంటామనైతే భావించకండి. బాప్ దాదాది గుప్తమైన పాత్ర, పిల్లలది కాదు. కావున ఇప్పుడు దానిని ప్రత్యక్ష రూపంలోకి తీసుకురండి. ఎటువంటి సేవ చెయ్యాలో ఇప్పుడు అర్ధమైందా? సమ్మేళన చేసారు, చాలు, ఇంతేనా సేవ అంటే? దీనితో పాటు ఇంకే ఇతర శ్రేష్ఠమైన సేవ చెయ్యాలి?

ఇప్పుడున్న ముఖ్యమైన సేవ - మీ వృత్తి మరియు దృష్టిని పరివర్తన చెయ్యడము. నజర్  సే నిహాల్ (దృష్టితో పూర్తిగా తృప్తి చెందటం) అన్న గాయనము ఉంది కదా! కావున దృష్టి మరియు వృత్తుల సేవను ప్రాక్టికల్ లోకి తీసుకురావాలి. వాచ అన్నది ఒక సాధనము, కానీ ఎవరినైనా సంపూర్ణ స్నేహము మరియు సంబంధములోకి తీసుకురావటము కొరకు వృత్తి మరియు దృష్టిల సేవ జరగాలి. ఇటువంటి సేవను ఒక స్థానంలో కూర్చుని ఒక్క క్షణములో అనేకులకు చెయ్యగలరు. దీని ప్రత్యక్ష ప్రమాణమును చూస్తాము. ఏవిధంగా మొదట్లో బాప్ దాదా సాక్షాత్కారము ఇంట్లో కూర్చునే జరిగింది కదా? అలాగే ఇప్పుడు దూరంగా కూర్చునే మీ శక్తిశాలీ వృత్తి ఎటువంటి కార్యమును చేస్తుందంటే, ఎవరో చేయి పట్టుకొని తీసుకువస్తున్నట్లుగా వారికి అనిపిస్తుంది. చూడటానికి వారు నాస్తికులు, తమోగుణీలైనా మారిపోతారు. ఇప్పుడు ఈ సేవను చెయ్యాలి. కానీ ఎప్పుడైతే వృత్తి మరియు విషయాలలో స్పష్టంగా ఉంటారో అప్పుడే సేవలో సఫలతను పొందగలరు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగానయితే భావిస్తారు. ప్రతిఒక్కరికీ తమతమ సేవ ఉన్నప్పటికి కూడా యజ్ఞ బాధ్యతను కూడా తమ సెంటరు బాధ్యతతో సమానంగా భావించాలి, స్వయం ఆఫర్ చెయ్యాలి. ఎవరి సంస్కారాలనైనా చాలా తక్కువ సమయంలో మార్చగలిగినంతటి శక్తి వాణితో పాటుగా వృత్తి మరియు దృష్టిలో ఉండాలి. వాటితో పాటు దృష్టి మరియు వృత్తి కలవనట్లయితే సఫలత ఉండనే ఉండదు. ఇది ముఖ్యమైన సేవ. ఇప్పటినుండే అనంతమైన సేవలో అనంతమైన ఆత్మలను ఆకర్షితము చెయ్యాలి. ప్రజలను తయారుచేసే ఏసేవనైతే మీరు సేవగా భావిస్తున్నారో, వారైతే మీ ప్రజలకు ప్రజలుగా స్వయమే తయారవుతారు, వారైతే ప్రదర్శినీలలో తయారవుతున్నారు. ఇప్పుడైతే మీరు మనుష్యులకు అనంతముగా సుఖమును ఇవ్వాలి, అప్పుడే మొత్తము విశ్వము మిమ్మల్ని సుఖదాతలుగా భావిస్తుంది. విశ్వమహారాజును విశ్వదాత అని అంటారు కదా! మరి మీరు కూడా ఇప్పుడు అందరికీ సుఖమును ఇచ్చినట్లయితే అప్పుడు అందరూ మిమ్మల్ని సుఖదాతలుగా గౌరవిస్తారు. కావున ఇప్పుడు ఉన్నతి పొందాలి. ఒక్క క్షణములో అనేకుల సేవను చెయ్యగలరు. ఏ విషయములోనైనా ఫీల్ అవటము ఫెయిల్ అయ్యేందుకు గుర్తు. ఏ విషయములోనైనా ఫీల్ ఉన్నట్లయితే, ఎవరి సంస్కారాలలోనైనా, సంపర్కములోనైనా, ఎవరి సేవలోనైనా ఫీల్ అయ్యారంటే ఫెయిల్. అది మళ్ళీ ఫెయిల్ లో జమ అయిపోతుంది. ప్రతి మూడు నెలలకు పరీక్ష జరగటం ఈ రోజుల్లో రివాజు ఉన్నట్లుగా, ఫెయిల్ లేక పాస్ మార్కులను ఫైనల్ లో కలుపుతారు. ఎవరైతే పదే పదే ఫెయిల్ అవుతారో వారు ఫైనల్ లో ఫెయిల్ అవ్వవలసి ఉంటుంది. కావున పూర్తిగా ఫ్లాలెస్ (మచ్చలేనివారి)గా అవ్వాలి. ఎప్పుడైతే ఫ్లాలెస్ గా అవుతారో అప్పుడు ఫుల్ పాస్ అయినట్లుగా భావించండి. ఏవిధమైన మచ్చ ఉన్నా ఫుల్ పాస్ అవ్వరు. ఓం శాంతి.

Comments

  1. ఓంశాంతి, సర్వీసులో హద్దు లేని స్థితి ఎలా తయారవుతుంది? ఏ విషయములోనైనను చింతించుట దేనికి సంకేతం? అభ్యాసము మరియు ఆచరణ రెండు ఒకటిగా ఎవరిలో ఉంటుంది? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళిలో తెలిపించారు. శివబాబా యాద్ హై?

    ReplyDelete

Post a Comment