* 18-06-1970 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“వృద్ధి కొరకు టైమ్ టేబుల్ విధి”
బాప్ దాదా ఒక్క క్షణములో అవ్యక్తము నుండి వ్యక్తములోకి వచ్చారు, అలాగే మీరు కూడా ఒక్క క్షణములో వ్యక్తము నుండి అవ్యక్తమవ్వగలరా? ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నోటితో మాట్లాడుతారు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మాటలను ఆపేస్తారు, అలా అవుతుంది కదా.. అలాగే బుద్ధిని కూడా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నడిపించాలి, ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు బుద్ధిని నడిపించకూడదు. మీకు ఇటువంటి అభ్యాసముందని భావిస్తున్నారా?నోటిలోని కర్మేంద్రియాలు కొన్ని లావుగా ఉంటాయి. బుద్ధి నోటి కన్నా సూక్ష్మమైనది. కానీ నోటి వలె బుద్ధిని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నడిపించండి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నడపించకండి. అటువంటి అభ్యాసము ఉందా? ఈ డ్రిల్లు తెలుసా? ఒకవేళ ఈ విషయపు అభ్యాసము దృఢంగా ఉన్నట్లయితే మీ స్థితిని కూడా దృఢంగా తయారు చేసుకోగలరు. ఇదే మీ స్థితిని వృద్ధి చేసుకొనే విధి. వృద్ధి ఎలా జరుగుతుంది అన్నది చాలామంది పిల్లల ఆలోచన, వృద్ధి విధి ద్వారా జరుగుతుంది. ఒకవేళ విధిని తెలుసుకోనట్లయితే వృద్ధి కూడా ఉండదు. ఈ రోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి వృద్ధి మరియు విధి, రెండింటినీ చూస్తున్నారు. ఏ దృశ్యమును చూసి ఉంటారో ఇప్పుడు చెప్పండి! వృద్ధి జరుగుతూ ఉందా అని ప్రతిఒక్కరూ తమను తాము ప్రశ్నించుకున్నారా, చూసుకున్నారా? (చాలామంది చేతులెత్తారు) ఎక్కువమంది తమ వృద్ధితో సంతుష్టముగా ఉన్నారు. అచ్ఛా, రోజు మొత్తములో అవ్యక్త స్థితి ఎంత సమయము ఉంటుంది? బిందు రూపము గురించి అడగటం లేదు, అవ్యక్త స్థితి ఎంత సమయము ఉంటుంది? బాప్ దాదా సంపూర్ణ స్టేజును ఎదురుగా ఉంచుకొని అడుగుతారు మరియు మీరు మీ గత పురుషార్థమును ఎదురుగా ఉంచుకొని ఆలోచిస్తారు, ఎంత అంతరమైపోయింది! వర్తమాన సమయములో చదువులో ఏ ముఖ్యమైన సబ్జెక్టులు నడుస్తున్నాయి? ముఖ్యమైన సబ్జెక్టుగా ఎక్కువలో ఎక్కువ అవ్యక్త స్థితి తయారవ్వాలన్నదానిని చదువుతున్నారు. మరి ముఖ్యమైన సబ్జెక్టులో రిజల్టు తక్కువగా ఉంది. నిరంతరము స్మృతిలో ఉండే సంపూర్ణ స్టేజ్ ముందు ఒకటి రెండు గంటలు ఎంత? ఇంతకంటే ఎక్కువగా మీ అవ్యక్త స్థితిని తయారుచేసుకొనే విధి బుద్ధిలో ఉందా? ఒకవేళ విధి ఉన్నట్లయితే వృద్ధి ఎందుకని ఉండదు, కారణమేమిటి? విధి యొక్క జ్ఞానము మొత్తము స్పష్టముగా బుద్ధిలోకి వస్తుంది, కానీ ఒక విషయము మాత్రం రాదు, ఈ కారణంగా విధిని తెలుసుకున్నా కానీ వృద్ధి ఉండదు. అది ఏ విషయము? అచ్ఛా, వృద్ధి ఎలా జరగాలి అన్నదానిపై ఈరోజు వినిపిస్తాము. బుద్ధిలోకి రాని ఆ ఒక్క విషయము ఇదే, విస్తారము చెయ్యటము మరియు విస్తారములోకి వెళ్ళటము వస్తుంది, కానీ విస్తారమును ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సర్దుకోవటము మరియు ఇముడ్చుకోవటము - ఈ ప్రాక్టీసు తక్కువగా ఉంది. జ్ఞాన విస్తారములోకి రావటము కూడా తెలుసు, కానీ జ్ఞాన విస్తారమును ఇముడ్చుకొని జ్ఞాన స్వరూపులుగా తయారవ్వటము, బీజరూపముగా అవ్వటము - ఈ ప్రాక్టీసు తక్కువగా ఉంది. విస్తారములోకి వెళ్ళటం వలన సమయము చాలా వ్యర్ధముగా పోతుంది మరియు సంకల్పములు కూడా వ్యర్థముగా పోతాయి. అందువలన ఏ శక్తి జమ అవ్వవలసి ఉందో అది జమ అవ్వటం లేదు. ఇందుకొరకు ఏ ప్లానును తయారుచెయ్యాలి అన్నదానిని ఈ రోజు వినిపిస్తాము. మొత్తము విశ్వములో అతి పెద్ద వారు ఎవరు? (బ్రాహ్మణులము) అతి పెద్ద వారు ఏం చేస్తారు? ఈ రోజుల్లోని పెద్దవారు ఏ సాధనను అనుసరిస్తారు, దానితో పెద్ద పెద్ద కార్యాలలో వారు సఫలత పొందుతారు? మొదటగా వారు తమ సమయాన్ని సెట్ చేసుకుంటారు. టైమ్ టేబులను తయారుచేసుకుంటారు. ఎంతెంతగా చాలా బిజీగా ఉంటారో అంతగా ప్రతి గంట టైమ్ టేబులను తయారుచేసుకుంటారు. ఒకవేళ టైమ్ టేబుల్ లేనట్లయితే సమయమును సఫలము చెయ్యలేరు. సమయాన్ని సఫలం చేయ్యలేనట్లయితే కార్యము కూడా సఫలమవ్వదు. కావున ఈ రోజుల్లోని పెద్ద వారు ప్రతి సమయమునకూ టైమ్ టేబుల్ ను తయారుచేస్తారు. వారి డైరీ నోట్ చేసుకుంటారు. మరి బ్రాహ్మణులైన మీరు అందరికన్నా పెద్దవారు అయినప్పుడు మీరు మీ టైమ్ టేబులను పెట్టారా? ఇది ఒక విధి. ఏవిధంగా ఆ మనుషులు ఉదయాన్నే రోజు ప్రారంభము నుండే టైమ్ టేబుల్ ను తయారుచేస్తారో అలా మీరు ప్రతిఒక్కరూ అమృతవేళ నుండే ఈరోజు ఏమేమి చెయ్యాలి అన్నదాని టైమ్ టేబులను తయారు చెయ్యండి. ఏవిధంగా శారీరిక కార్యాల కొరకు టైమ్ టేబులను తయారుచేసారో అలా ఆత్మ ఉన్నతి కొరకు కూడా టైమ్ టేబులను తయారు చెయ్యండి. అర్థమైందా? ఇందులో అటెన్షన్ మరియు పరిశీలన తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అటువంటి టైమ్ టేబుల్ ను తయారు చెయ్యండి. ఈరోజు ఇన్ని కార్యాలను సమాప్తము చెయ్యాలి అని ఏవిధంగా వారు తమ ప్లానును తయారుచేస్తారో అలా అదేవిధంగా ఈ రోజు అవ్యక్త స్థితికి ఇంత శాతము మరియు ఇంత సమయాన్ని కేటాయించాలి... టైమ్ అనుసారంగా నడవటం ద్వారా ఒక్క రోజులోనే అనేక కార్యాలు చెయ్యగలరు. టైమ్ టేబుల్ లేనట్లయితే అనేక కార్యాలను చెయ్యలేరు. కావున మీ డైరీని తయారు చెయ్యండి. ఏవిధంగా ఒక్క గంట స్థూల కార్యము కొరకు తయారుచేసుకుంటారో అలా ఆత్మ ఉన్నతి కార్యమును నోట్ చేసుకోండి. ప్లానును తయారుచెయ్యండి. స్థూల కార్యము అయిన తరువాత ఈ పని అయింది. ఈ పని అవ్వలేదు అని దాని దగ్గర రైట్ వేసుకుంటారు కదా, అదేవిధంగా ఏ ప్లానును తయారుచేసినా అది ఎంతవరకు ప్రాక్టికల్ అయింది, లేక ప్రాక్టికల్ లో అవ్వలేదు, అవ్వకపోవటానికి గల కారణము ఏమిటి మరియు దానికి తోడుగా నివారణ సాధనమును కూడా ఆలోచించి పైకి ఎక్కుతూ ఉండండి. ఈ రోజైతే దీనిని చేసే వదులుతాను, ఇలా ఇలా మొదటినుండే ప్రతిజ్ఞను చెయ్యండి. ఏ కార్యమునకైనా మొదట ప్రతిజ్ఞ ఉంటుంది, తరువాత ప్లాను ఉంటుంది, తరువాత ప్రాక్టికల్ ఉంటుంది. ప్రాక్టికల్ తరువాత ఏది అయింది, ఏది అవ్వలేదు అన్న పరిశీలన ఉంటుంది. పరిశీలన తరువాత ఏదైతే జరిగిపోయిందో అది జరిగిపోయింది. ఇక ముందు ఉన్నతికి సాధనమును ఉంచుతారు. ఏవిధంగా మీరు క్రొత్త విద్యార్థుల కొరకు సప్తాహిక కోర్సు కార్యక్రమమును తయారుచేసారు కదా. మరి ఆత్మ ఉన్నతి కొరకు కూడా సప్తాహిక ప్లానును తయారు చెయ్యవచ్చు. మధువనమునకు వచ్చినప్పుడు కొన్ని వదిలేసి వెళ్తారు, కొన్ని నింపుకొని వెళ్తారు. అదేవిధంగా ప్రతిరోజూ కొన్ని వదలండి, కొన్ని నింపుకోండి. ఎప్పుడైతే ఇంతగా అటెన్షన్ ను ఉంచుతారో అప్పుడే సమయానికి ముందే సంపూర్ణముగా అవ్వగలరు. సమయ అనుసారంగా సంపూర్ణంగా అయినట్లయితే దానికి అంత ప్రాప్తి ఉండదు, సమయానికి ముందే సంపూర్ణంగా అవ్వాలి. సంపూర్ణత అనగా ఎటువంటిది, దాని అనుభవమును ఎప్పుడు చెయ్యగలరు? నిరంతరమూ ఈశ్వరీయ అతీంద్రియ సుఖము అంటే ఏమిటి అన్నదాని అనుభవమును ఇక్కడే చేసుకోవాలి. నియమ అనుసారముగా ఎలా తమ టైమ్ టైబుల్ ను లేక సప్తాహిక కార్యక్రమమును తయారుచేసుకుంటారు అన్నదానిని ఇప్పుడు చూద్దాము. ఎవరు ఎంత సెన్సిబుల్ (తెలివైనవారు)గా ఉంటారో వారు అటువంటి కార్యమును యధార్థరీతిలో చెయ్యగలరు. అందరికంటే సెన్సిబుల్ బ్రాహ్మణులు. దేవతల కంటే కూడా సెన్సిబుల్ లు బ్రాహ్మణులు. కావున ఎంత సెన్సిబుల్ గా అయ్యాము అన్నదాని పరిశీలన ఉంటుంది. సెన్స్ తో పాటు ఎసెన్స్ ను తియ్యటమును కూడా నేర్చుకోవాలి. ఎసెన్సు చాలా తక్కువ ఉంటుంది. మరియు దేని ఎసెన్సు ను వెలికితీస్తారో అది చాలా విస్తారమౌతుంది. కావున సెన్సు కూడా మంచిగా ఉండాలి మరియు ఎసెన్సు తియ్యటము కూడా రావాలి. కొందరిలో సెన్సు చాలా ఉంటుంది, కానీ ఎసెన్సులో ఉండటము రాదు. కావున రెండింటి అభ్యాసము, అవసరము. మీరు కూడా నేచర్ క్యూర్ చేసేవారు అని వినిపించి ఉన్నాము కదా! నేచర్ అనగా సంస్కారము. పురుషార్థము చెయ్యలేనప్పుడు నేచర్ పై దోషాన్ని మోపుతారు. మా నేచర్ ఇలాంటిది, నేచర్ పై దోషాన్ని మోపి స్వయాన్ని తేలిక చేసుకుంటారు, కానీ అలా చెయ్యకూడదు. నేచర్ క్యూర్ చెయ్యటమే మీ పని. ఆ నేచర్ క్యూర్ చేసేవారు ఫాస్ట్(ఉపవాసాన్ని)చేయిస్తారు, మరి మీరు ఇప్పుడు ఏం చెయ్యాలి? ఫాస్ట్ గా(త్వరగా)వెళ్ళాలి. లాస్ట్(చివర)లో ఉండకూడదు. ఫాస్ట్ గా వెళ్ళేందుకు ఫాస్టు ను (ఉపవాసాన్ని) ఉంచండి. ఎటువంటి ఫాస్టు? టైమ్ టేబుల్ ను తయారు చేయండి. ఈ రోజు ఈ విషయంలో ఫాస్టింగ్ ఉంటాము. ప్రతిజ్ఞ చెయ్యండి. ఏవిధంగా వారు ఒక్కోసారి ఒక్కోదాని ఫాస్టు ను చేస్తారో, అలా మీరు కూడా ప్రతి రోజు ఏదో ఒక బలహీన విషయాన్ని వ్రాసుకోండి. వారు కూడా ఏదైతే హానికారమో దాని ఫాస్ట్ ను ఉంచుతారు, కావున పురుషార్థములో ఏ హానికారకమైన విషయాలు ఉన్నా వాటి ఫాస్ట్ ను ఉంచండి, మరల దాని పరిశీలన కూడా చెయ్యండి. కొందరు ప్రతాన్ని ఉంచుతారు, ఉపవాసాన్ని పెట్టుకుంటారు, కానీ చెయ్యలేకపోయినట్లయితే మధ్యలో తినేస్తారు కూడా. ఏవిధంగా భక్తిమార్గపు అలవాటు అయి ఉందో, అలా ఇక్కడ కూడా చేస్తారు. దీనిని చెయ్యకూడదు అని ఉదయాన్నే ప్రతిజ్ఞ చేస్తారు, మళ్ళీ రోజు ప్రారంభమయ్యేకొద్దీ ఆ ప్రతిజ్ఞ సమాప్తమైపోతుంది. ఇక్కడ కూడా అలాగే ఉదయాన్నే ప్రతిజ్ఞ చేస్తారు, మళ్ళీ తరువాత ఏం చెయ్యాలి, సమస్య అలా వచ్చేసింది. సమస్య పూర్తి అయిన తరువాత మరల చేస్తాము అని అంటారు. ఇప్పుడు ఆ సంస్కారమును సమాప్తము చెయ్యండి. సర్దుకోవటము మరియ ఇముడ్చుకోవటమును నేర్చుకోండి. పాత సంస్కారాన్ని ఇముడ్చుకోవాలి, దాని ప్రతిజ్ఞను చెయ్యండి మరియు ఫాస్ట్ ను ఉంచండి, పెద్ద మనుష్యుల ప్రోగ్రాము మొదటి నుండే ఫిక్స్ అయి ఉంటుంది కదా. మీరైతే అందరికంటే పెద్దవారు, కావున మీ ప్రోగ్రామును కూడా 6 నెలలకు ఫిక్స్ చేసుకోండి. ఈ కార్యాన్ని చేసే వదులుతాను, తయారుచేసే వదులుతాను. ఎప్పుడైతే ఇంత నిశ్చయబుద్ధి కలవారిగా అవుతారో అప్పుడే విజయులుగా అవుతారు. తండ్రిలో అయితే నిశ్చయము ఉంది, కానీ మీరు కూడా నిశ్చయబుద్ధిగా అయ్యి కార్యమును చేసినట్లయితే అప్పుడిక విజయమే విజయము. విజయమునకు ముందు సమస్య అన్నది పెద్ద విషయమేమీ కాదు. అప్పుడు ఆ సమస్య సమస్యగా అనుభమవ్వదు కానీ ఆటగా అనుభమవుతుంది. ఆటను సంతోషముగా ఆడటం జరుగుతుంది. ఏదైనా కార్యము సహజమైనదైనట్లయితే ఇదైతే ఎడమ చేతితో ఆట ఆడినట్లు అని అంటారు కదా, అనగా సహజమైనది. మరి ఇది కూడా బుద్ధి ఆట అయిపోయింది. ఆటలో గాభరా పడకూడదు. పెద్దవారికంటే పెద్దవారుగా ఉన్నారు మరి అతి పెద్ద స్థితిని కూడా తయారుచేసుకోండి. కొంతమంది పెద్దవారు ఎలా ఉంటారంటే వారికి తమ పెద్దరికములో ఉండటము రాదు. మీరు అలా అవ్వవద్దు. మీరు ఎంత పెద్దవారో అంతే పెద్ద స్థితిని తయారుచేసుకొని చూపించండి, పెద్ద కార్యమును చేసి చూపించండి. తక్కువలో తక్కువ 8గంటల లక్ష్యమును ఉంచండి. అవ్యక్త స్థితిని గూర్చి చెప్తున్నాము. అవ్యక్త స్థితిని 8 గంటలు తయారుచేసుకోవటమన్నది పెద్ద విషయమేమీ కాదు. అవ్యక్తుని స్మృతి అనగా అవ్యక్త స్థితి. తండ్రిని రెండు గంటలే ఎందుకు స్మృతి చేస్తారు? రెండు గంటలు తండ్రి స్మృతి ఉన్నట్లయితే మిగిలిన సమయాన్ని ఏం చేస్తున్నారు? తండ్రికి స్నేహీలా లేక మాయకా? ఎవరితో స్నేహము ఉంటుందో, స్నేహము అనగా సంపర్కము. ఎవరితో సంపర్కము ఉంటుందో వారిలాంటి సంస్కారమును తప్పక నింపుకుంటారు. సంస్కారము కలిసే ఆధారముతోనే సంపర్కము ఉంటుంది కదా! మరి ఒకవేళ తండ్రి స్నేహులుగా ఉంటే, సంపర్కము కూడా ఉన్నట్లయితే సంస్కారములు ఎందుకని కలువవు? మీరు మాయా స్నేహులు అని అప్పుడు బాప్ దాదా అంటారు. ఒకవేళ రెండు గంటలు తండ్రికి స్నేహులుగా ఉండి, మిగిలిన 22 గంటలు మాయకు స్నేహులు అయినట్లయితే ఏమంటారు? సేవ చేస్తూ కూడా స్నేహమును, సంపర్కమును వదలవద్దు. సంపూర్ణ స్టేజ్ అయితే సమీపంగా ఉండేందుకు ఉంది. వారు మా నుండి విడిపోలేరు..... అన్న ఒక గీతము కూడా ఉంది కదా! ఎప్పుడైతే అసలు వేరుగానే అవ్వకపోతే స్నేహము హృదయము నుండి ఎలా పోతుంది? కావున నిరంతరము ఉండటము అవసరము. కానీ పురుషార్థులుగా ఉన్న కారణంగా మార్జిన్ ను ఇస్తారు. కావున తక్కువలో తక్కువ 8 గంటల లక్ష్యాన్ని ఉంచుకొని డైరీని తయారు చెయ్యండి. టైమ్ టేబుల్ ను తయారుచెయ్యండి, మళ్ళీ రిజల్టును కూడా చూస్తాము. ప్రతి వారపు రిజల్టును మీ బ్రాహ్మణి ద్వారా చెక్ చేయించుకోండి మరియు ప్రతి వారపు రిజల్టును జమ చేసి ఒక్క మాసపు రిజల్టుగా మధువనమునకు రావాలి. బ్రాహ్మణీలు ఈ పనిని చెయ్యవలసి ఉంటుంది. ఏ టైమ్ టేబుల్ ను తయారుచేసారు? అందులో ఎంతవరకు సఫలమయ్యారు? అని ప్రతి ఒక్కరి ప్రతి వారపు డైరీని చెక్ చెయ్యండి. దానిని ఒక్క మాసపు రిజల్టుగా క్లుప్తము చేసి మధువనమునకు పంపాలి. ఇది నిర్లక్ష్యపు సమయము కాదు, చాలా సమయము నిర్లక్ష్యమైన పురుషార్థమును చేసారు, ఏది చేసారో అది చేసారు. ఇప్పుడు కాకున్న
మరెప్పుడూ లేదు - అని మీరు ఇతరులకు వినిపిస్తారు కదా! ఇప్పుడు ఈ స్లోగన్ గుర్తు చేయిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు చెయ్యకపోయినట్లయితే మరెప్పుడు చేస్తారు? ఇంకెప్పుడూ చెయ్యలేరు, కావున స్లోగన్ ను కూడా గుర్తు ఉంచుకోవాలి. ప్రతి రోజూ మీ ఎదురుగా వేరు వేరు స్లోగన్ లను పెట్టుకోవచ్చు. ఏ కర్మను నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు అన్నది ఒక స్లోగన్. దీనిని ఒక రోజు మీముందు ఉంచుకోండి, మరుసటి రోజు మరొక స్లోగన్ ను ముందు ఉంచుకోండి. సఫలత మన జన్మసిద్ధ అధికారము అని బాప్ దాదా వినిపించి ఉన్నారు. అంతమైపోతాము కానీ తొలగిపోము అనికూడా బాప్ దాదా వినిపించి ఉన్నారు. ఈ విధంగా ప్రతి రోజూ ఏదో ఒక స్లోగన్ ను ఎదురుగా ఉంచుకోండి మరియు ఆ స్లోగన్ ను ప్రాక్టికల్ లోకి తీసుకురండి. అప్పుడు చూడండి అవ్యక్త స్థితి అన్నది ఎంత త్వరగా తయారవుతుందో!
ఫరిస్తాలకు ధరిత్రి ఆకర్షణ ఉండదు. ఇప్పుడిప్పుడే వచ్చారు. ఇప్పుడే వెళ్ళారు. కార్యము సమాప్తమైన తరువాత ఇక నిలవనే నిలవరు. మీరు కూడా కార్యము కొరకు వ్యక్త ఆధారమును తీసుకున్నారు, కార్యము సమాప్తము చేసారు, మరల ఒక్క క్షణములో అవ్యక్తము. ఈ అభ్యాసము ఉన్నట్లయితే ఫరిస్తాలు అని అనబడతారు. అచ్ఛా!
ఓంశాంతి, స్థితిని అభివృద్ధి చేసుకొను విధానము ఏమిటి? అన్ని అలవాట్లు ఎలా సమాప్తమవుతాయి? ఇప్పుడు ఎలాంటి సంస్కారములను సమాప్తము చేయాలి? విస్తారములో వెళ్ళుట వలన కలిగే నష్టమేమీ? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళిలో తెలిపించారు. శివబాబా యాద్ హై?
ReplyDelete