* 11-06-1970 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“విశ్వపతిగా అయ్యేందుకు సాధనము."
ఈ రోజు సద్గురువారము రోజున విశేషంగా ఎందుకొరకు పిలిపించాము? ఈరోజు కుమారీలకు ఏ రోజు (సమాప్తి సమారోహము) సమాప్తి సమారోహము కాదు కానీ ఈ రోజు సద్గురువారము విశ్వపతిగా అయ్యే శుభ అవినాశీ దశ కూర్చునే రోజు. అర్థమైందా! మరి ఈ రోజు బాప్ దాదా విశ్వపతిగా అయ్యే ఏ సామగ్రిని తెచ్చి ఉంటారు? ఏదైనా సమారోహము ఉన్నప్పుడు అందులో సామగ్రి కూడా ఉంటుంది. మరి ఈరోజు విశ్వపతిగా తయారుచేసే సమారోహములోకి విశేషంగా ఏ సామగ్రిని తెచ్చారు? కిరీటము, సింహాసనము మరియు తిలకము. మరి ఈ మూడింటిని ధరించే ధైర్యము ఉందా? కిరీటమును ధరించేందుకు, సింహాసనముపై విరాజమానమయ్యేందుకు మరియు తిలకమును దిద్దుకొనేందుకు ఏం చెయ్యవలసి ఉంటుంది? వీటిని ధారణ చేసే ధైర్యము ఉన్నట్లయితే అందుకొరకు ఏం చెయ్యవలసి ఉంటుంది? ఒకటి - త్యాగము, రెండవది - తపస్సు, మూడవది - సేవ. తిలకమును దిద్దుకొనేందుకు తపస్సు, కిరీటమును ధరించేందుకు త్యాగము మరియు సింహాసనముపై విరాజమానమయ్యేందుకు ఎంతగా సేవ చేస్తారో అంతగా ఇప్పుడు కూడా సింహాసనాధికారులుగా మరియు భవిష్యత్తులో కూడా సింహాసనాధికారులుగా అవుతారు. ఈ మూడు విషయాల ద్వారానే మూడు వస్తువులను ధారణ చెయ్యగలరు. ఒకవేళ ఒక్కటి తక్కువగా ధారణ అయినా, విశ్వపతిగా అవ్వజాలరు. అర్ధమైందా! మరి ఈ మూడు గుణాల ధారణను మీలో తప్పకుండా ధారణ చేసారా? మూడింటిలో ఏ ఒక్కటి కూడా పోకూడదు, అప్పుడు శూర-వీరులు అన్న పేరునేదైతే ఇచ్చామో అది పని చెయ్యగలదు. మూడింటి ప్రతిజ్ఞను చేసారా? దేనిని త్యాగము చేస్తారు? అన్నింటికంటే అతి పెద్ద త్యాగము ఏది? ఇప్పుడు సేవలో ఉపస్థితులౌతున్నారు, కావున అందుకొరకు ముఖ్యంగా- మైపన్ (నాది అన్న భావము)ను త్యాగము చేసే ధారణను చెయ్యాలి. నేను చేసాను, నాకు ఇది తెలుసు, నేను దీనిని చెయ్యగలను, ఈ నేను అనే అభిమానము ఏదైతే ఉందో దానిని త్యాగము చెయ్యాలి. నేను అన్నదానికి బదులుగా బాప్ దాదా వినిపించిన జ్ఞాన విషయాలను వర్ణన చెయ్యండి. నాకు ఇది తెలుసు - అని ఇలా అనకూడదు. బాప్ దాదా ద్వారా దీనిని తెలుసుకున్నాను, జ్ఞానములో నడచిన తరువాత స్వ అభిమానము ఏదైతే వస్తుందో దానిని కూడా త్యాగము చెయ్యాలి. ఎప్పుడైతే ఇంతగా త్యాగ వృత్తి మరియు దృష్టి ఉంటుందో అప్పుడు ఎల్లప్పుడూ స్మృతిలో తండ్రి మరియు దాదా ఉంటారు, నోటిపై కూడా వారి నామమే ఉంటుంది, అప్పుడు విశ్వపతులుగా అయ్యి విశ్వ సేవను చెయ్యగలరు. అర్థమైందా!
మీ ధారణను అవినాశిగా తయారుచేసుకొనేందుకు లేక స్థిరంగా ఉంచుకొనేందుకు రెండు విషయాలను గుర్తు పెట్టుకోవాలి. అవి ఏవి? విశేషంగా కన్యల కొరకు. ఒకటేమో అన్ని విషయాలలో సింపుల్ గా ఉండటము మరియు తమను ఉదాహరణగా భావించటము. మీరు ఏవిధంగా ఉదాహరణగా అయ్యి చూపిస్తారో అలాగే అనేక ఆత్మలు కూడా ఈ వ్యాపారమును చేసేందుకు పాత్రులుగా అవుతారు. కావున ఈ
రెండు విషయాలను ఎల్లప్పుడు గుర్తు ఉంచుకోండి. మిమ్మల్ని మీరు అటువంటి శ్రేష్ఠమైన ఉదాహరణగా తయారుచేసుకొన్నారా? ఎవరైతే మంచి ఉదాహరణగా వెలువడుతారో వారికి ముద్రను కూడా వెయ్యటం జరుగుతుంది. ఎప్పటికీ తొలగిపోనటువంటి ఎటువంటి ముద్రను మీరు వేయించుకొని వెళ్తారు? శివశక్తులు మరియు బ్రహ్మాకుమారీలు. సాకారములో నిమిత్తముగా అయిన రెండు పెద్ద అథారిటీలు ఈ ముద్రను వేస్తున్నారు, అంతమైపోయినా కానీ ఎప్పుడూ తొలగిపోము అన్నది గుర్తు ఉంచుకోవాలి. సంస్కారాలలోగానీ, సేవలోగానీ, సంబంధములోగానీ సర్వ విషయాలలో స్వయమును అంతముచేసుకుంటామే కానీ ఎప్పుడూ తొలగిపోము. తొలగిపోవటము బలహీనుల పని. శివశక్తులు స్వయమును అంతముచేసుకుంటారే గానీ తొలగిపోరు. కావున ఈ విషయాలు గుర్తు ఉంచుకోవాలి. ఈ గ్రూపు ప్రాక్టికల్ పేపరు ఎప్పుడు ఉంటుంది? ఇప్పటి రిజల్టు ఫైనల్ కాదు. ఇప్పుడైతే పరీక్ష వ్రాసేందుకు వెళ్తున్నారు. మరల దాని రిజల్టును చూస్తాము. ఈ గ్రూపు ముందుకు వెళ్ళగలదు. బాప్ దాదా అటువంటి నమ్మకమును ఉంచుతున్నారు. కావున ఇప్పుడు ఏయే కర్మ బంధనాలు ఉన్నాగానీ వాటిని చాలా త్వరగా తెంచుకొని తిరిగి మధువనములోకి సంపూర్ణ సమర్పణ సమారోహమును జరుపుకొనేందుకు రావాలి అని భావించండి. ఈ లక్ష్యముతో వెళ్ళాలి. మరల ఈ గ్రూపు నుండి ఎంతమందికి సంపూర్ణ సమర్పణ సమారోహము ఉంటుంది? ఈరోజైతే మహాబలిగా అయ్యే విషయాలను వినిపించాము, మరల మహాబలిని సమర్పించేందుకు వచ్చినట్లయితే బాప్ దాదా చాలా సమాప్తి చేసుకోగలరు.
పార్టీలతో బాప్ దాదా మిలనము:- అవ్యక్తస్థితి అనుభవమవుతున్నదా? ఒక సెకండు అవ్యక్తస్థితి అనుభవము అయినచో దాని ప్రభావము చాలా సమయము వరకు ఉంటుంది, అవ్యక్త స్థితి యొక్క అనుభవము చాలా శక్తిశాలిగా ఉంటుంది, సాధ్యమైనంత వరకు మీ సమయమును వ్యక్తస్థితినుండి తొలగించి అవ్యక్తస్థితిలో ఉండాలి, అవ్యక్తస్థితి ద్వారా సర్వ సంకల్పములు సిద్దిమయమవుతాయి, దీనిలో శ్రమ తక్కువ, ప్రాప్తి ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి పురుషార్థములో సమస్యలు మరియు నిరాశలు వస్తాయి, అందువలన అవ్యక్తస్థితి ద్వారా సర్వప్రాప్తులు అనుభవము అవుతాయి, అవ్యక్త మూర్తులను ఎదురుగా ఉంచుకొని వారి సమానముగా తయారయ్యే ప్రయత్నము చేయాలి. తండ్రి వలె పిల్లలు ఉండాలను ఈ విషయమును సదా స్మృతిలో ఉంచుకోవాలి. వ్యత్యాసమున్నచో అంతర్ముఖీలై దానిని సమాప్తము చేసుకోవాలి, బాబాకు ఎప్పుడైనా క్రోధము కలుగుతుందా? పరిస్థితులకు భయపడతారా? పిల్లలు ఎందువలన భయపడుచున్నారు? ఎక్కువ పరిస్థితులను ఎదుర్కొన్న బ్రహ్మాబాబాను ఉదాహరణముగా చూసారు. ఎప్పుడైనా వారి రూపములో భయము చూసారా? సదా స్మృతిలో ఉండాలి. స్నేహములో సంపూర్ణముగా తయారుకావాలి. స్నేహమును బాబా సమానముగా తీసుకొని రావాలి. స్నేహము గుప్తముగా ఉండాలి. సఫలత ప్రత్యక్షము కావాలి. కల్పము ముందరి మీ యొక్క సఫలతా స్వరూపము స్మృతి వస్తున్నది కదా! మీ యొక్క కల్పము ముందు నింపుకొనియున్న సంస్కారములను ప్రత్యక్షము చేయాలి. నిండియున్న సంస్కారములను ఇప్పుడు కేవలం ప్రత్యక్షము చేయాలి. సదా మీ యొక్క సంపూర్ణతా స్వరూపము మరియు భవిష్య 21 జన్మల రూపమును ఎదురుగా ఉంచుకోవాలి. చాలా మంది తమ ఇంటిని అలంకరణ చేసుకొనుటకు రక రకముల రూపాలను స్మృతిచిహ్నములు ఉంచుకుంటారు. మీరు మీ మనోమందిరములో మీ సంపూర్ణ స్వరూపము యొక్క మూర్తిని మరియు భవిష్య అనేక జన్మల స్వరూపములను స్పష్టమైన రూపములో ఎదురుగా ఉంచుకోండి, తరువాత ఏవైపు మీయొక్క సంకల్పము వెళ్ళదు, సమీప రత్నముల లక్షణములేమి? ఎంత సమీపముగా ఉంటారో అంతే సంస్కారములలో కూడా సమానముగా ఉంటారు. బాప్ దాదా యొక్క సమీపము అనగా లక్షణములు సమీపముగా రావాలి. ఎంత త్వరగా పరిశీలన చేసుకుంటారో అంత త్వరగా పరివర్తనవుతారు. ఆది స్వరూపమును స్మృతిలో ఉంచుకోండి. సత్యయుగము యొక్క ఆది జీవనము మరియు మరజీవ జీవనము యొక్క స్వరూపమును స్మృతిలో ఉంచుకోవాలి. స్నేహీలుగా, సహాయోగులుగా తయారైనారా? స్నేహమున్నచో దానికి బదులు ఏమి ఇవ్వబడుతుంది, స్నేహమునకు బదులు సహాయము లభిస్తుంది, బాబా ఏవిధముగా సర్వ సమర్దులుగా ఉన్నారో పిల్లలు కూడా మాస్టర్ సమర్దులుగా తయారుకావాలి. వినాశనమునకు ముందే ఒకవేళ స్నేహముతో పాటు సహాయోగీలుగా తయారైన యెడల ఆస్తికి అధికారులుగా తయారవుతారు. వినాశన సమయములో సర్వ ఆత్మలు తెలుసుకుంటారు కానీ ఆస్తిని పొందలేరు. ఎందుకంటే బాబాకు సహాయకులుగా తయారుకాలేదు. 2.కర్మ బంధనములు శక్తిశాలిగా ఉన్నాయా? లేక ఈశ్వరీయ బంధనలో ఉన్నారా? ఈశ్వరీయ బంధనములను తీవ్రముగా చేసుకొన్నచో కర్మ బంధనములు స్వతహాగానే సమాప్తమవుతాయి. ఈశ్వరీయ బంధనముల ద్వారానే కర్మ బంధనములు తొలగిపోతాయి. అందువలన ఈశ్వరీయ బంధనలుదృఢముగా ఉండాలి. 3. బిందు స్వరూపులుగా ఎక్కువ సమయముండాలి. బిందు స్వరూపములో ఎక్కువ సమయము ఉండలేక పోయిన యెడల దాని కొరకు సమయమును వ్యర్థము చేసుకొనరాదు. బిందు స్వరూపములో ఉండుటకు ముందు శుద్ధ సంకల్పములు చేయు అభ్యాసముండాలి. అప్పుడే బిందు రూపములో స్థిరముగా ఉండగలరు. అశుద్ద సంకల్పములను శుద్ధ సంకల్పములతో సమాప్తముచేయాలి. ఏదైనా ప్రమాదము / యక్సిడెంట్ జరుగు సమయములో బ్రేక్ వేయలేకపోయినచో ప్రమాదమును తప్పించుకు త్రిప్పవలసి వస్తుంది. బిందు రూపమైనది బ్రేక్. ఒకవేళ బ్రేక్ పడని యెడల, వ్యర్థసంకల్పముల నుండి బుద్దిని తిప్పి, స్వచ్ఛమైన సంకల్పములో ఉంచండి. అప్పుడప్పుడు ఆవిధముగా జరుగుతుందికదా? ప్రమాదములో రక్షణ కొరకు బ్రేక్ పడని యెడల త్రిప్పవలసి వస్తుంది. పూర్తి దినమంతయు శుద్ధసంకల్పములు తప్ప వ్యర్థసంకల్పములు రాకుండా ప్రయత్నముచేయాలి. ఎప్పుడైతే ఈ సబ్జెక్టులో పాస్ అవుతారో అప్పుడు బిందు రూపములో స్థిరమగుట సహజముగా ఉంటుంది . మంచిది-ఓంశాంతి.
ఓంశాంతి, ధారణ అవినాశిగా తయారు చేసుకొనుటకు, సదా స్థిరముగా ఉంచుకొనుటకు రెండు విషయములను స్మృతి ఉంచుకోవాలి, అవి ఏమిటి? లెక్కాచారమును ఏవిధంగా సమాప్తి చేసుకొనగలరు? అవ్యక్తస్థితి అనుభవము ద్వారా కలిగే లాభాలు ఏమి? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళిలో తెలిపించారు. శివబాబా యాద్ హై?
ReplyDelete