* 05-04-1970 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
"సర్వ పాయింట్ల సారము - పాయింటుగా (బిందువుగా) అవ్వండి.”
అందరూ వినాలనుకుంటున్నారా లేక సంపూర్ణంగా అవ్వాలనుకుంటున్నారా? సంపూర్ణంగా అయిన తరువాత వినటం ఉంటుందా? మొదట వినటము, పిదప సంపూర్ణంగా అవ్వటము. ఇన్ని పాయింట్లు విన్నారు. ఈ అన్ని పాయింట్ల స్వరూపంగా ఎలా అవ్వాలి? విన్న ఈ అన్ని పాయింట్ల స్వరూపంగా ఎలా అవ్వాలి? సర్వ పాయింట్ల సారము లేక స్వరూపము-పాయింటు(బిందువు)గా అవ్వటమే. సర్వ పాయింట్ల సారము కూడా పాయింటులో వస్తుంది కావున పాయింటు రూపంగా అవ్వాలి. పాయింటు అతి సూక్ష్మంగా ఉంటుంది, అందులో అన్నీ నిండి ఉన్నాయి. ఈ సమయంలో ముఖ్యమైన ఏ పురుషార్థం జరుగుతోంది? విస్తారమును సారరూరములోకి తీసుకువచ్చే పురుషార్థమును ఇప్పుడు చెయ్యాలి. ఎవరికైతే విస్తారమును సారరూరములోకి తీసుకువచ్చే పద్ధతి వస్తుందో వారే బాప్ దాదాకు సమానంగా అవుతారు. ఇముడ్చుకోవటము మరియు సర్దుకోవటముల గురించి మొదట కూడా వినిపించి ఉన్నాము. ఎవరికైతే సర్దుకోవటము వస్తుందో వారికి ఇముడ్చుకోవటము కూడా వస్తుంది. బీజములో ఏ శక్తి ఉంది? వృక్షపు విస్తారమును తనలో ఇముడ్చుకొనే శక్తి ఉంది. మరి ఇప్పుడు ఏ పురుషార్థము చెయ్యాలి? బీజరూప స్థితిలో స్థితి అయ్యే అనగా విస్తారమును సారములోకి తీసుకువచ్చే పురుషార్థము చెయ్యాలి. మరి దీనిని పరిశీలించుకోండి. విస్తారము చెయ్యటము సహజము కానీ విస్తారమును సారములోకి తీసుకురావటము సరళముగా ఉందా? ఈ రోజుల్లో సైన్సువారు కూడా విస్తారమును తగ్గించే పురుషార్థమునే చేస్తున్నారు. సైన్సుశక్తి కలవారు కూడా సైలెన్సుశక్తి కలిగినవారిని కాపీ చేస్తారు. సైలెన్సు శక్తి వారు ఏ ఏ విధంగా పురుషార్థమును చేస్తారో అలాగే వారు కూడా పురుషార్ధము చేస్తున్నారు. మొదట సైలెన్సు శక్తి సేన ఇన్వెన్షన్ (కనుక్కోవటము) చేస్తుంది, మరల సైన్సు తన రూపముతో ఇన్వెన్షన్ ను చేస్తుంది. ఏ ఏ విధంగా ఇక్కడ రిఫైన్ అవుతూ పోతుంటుందో అలాగే సైన్సు కూడా రిఫైన్ అవుతూ ఉంటుంది. మొదట అసంభవముగా అనిపించిన విషయాలే ఇప్పుడు సంభవమవుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా అసంభవమైన విషయాలు సరళంగా, సంభవంగా అవుతూ ఉన్నాయి. స్వయాన్ని అందరి సమీపంగా తీసుకురావాలి, ఇప్పుడు ముఖ్యమైన పురుషార్థంగా దీనినే చెయ్యాలి. శబ్దములోకి రావటము ఎంత సహజమో అంతగానే శబ్దము నుండి దూరంగా ఉండటము కూడా సహజమవ్వాలి. దీనినే సంపూర్ణ స్థితి యొక్క సమీప స్థితి అని అంటారు ఇది ఎటువంటి గ్రూపు? ఈ గ్రూపులోని ప్రతి మూర్తిలో తమ తమ విశేషత ఉంది. విశేషత కారణంగానే సృష్టిలో విశేష ఆత్మలుగా అయ్యారు. విశేష ఆత్మలుగా అయితే ఉండనే ఉన్నారు, ఇప్పుడు ఎలా అవ్వాలి? విశేషంగా ఉన్నారు, ఇప్పుడు శ్రేష్ఠంగా అవ్వాలి. శ్రేష్ఠంగా అయ్యేందుకు భట్టీలో ఏం చేస్తారు? ఎవరిలోనూ లేనటువంటి ఒక విశేషత ఈ గ్రూపులో ఉంది. అది ఏ విశేషత? మీ విశేషత గురించి మీకు తెలుసా? పురుషార్థపు స్థాయిలో ఒకరికొకరు సమీపంగా ఉండటమును ఈ గ్రూపు విశేషతగా చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మనసులో ఏదైనా చేసి చూపించాల్సిందే అన్న ఉత్సాహము ఉంది. కావున ఈ గ్రూపుకు బాప్ దాదా- కాబోయే దేవతల గ్రూపు మరియు ఆకాంక్షుల గ్రూపు అన్న పేరును ఇస్తున్నారు. సృష్టికి తమ అసలైన రూపమును ప్రత్యక్షము చేసి చూపించగలగిన గ్రూపు కూడా ఇదే. మైదానములో నిలబడి ఉన్న సేన ఇది. మీరు వెన్నెముక వంటివారు. బాప్ దాదాల కర్తవ్యమును ప్రత్యక్షము చేసే భుజాలు మీరు. భుజాలకు (చేతులకు) ఏ ఏ అలంకారాలు ఉంటాయో తెలుసా? బాప్ దాదా భుజాలు, అలంకారధారులు. కావున, భుజాలమైన మేము అలంకారధారులుగా ఉన్నామా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏఏ అలంకారాలను ధరించి మైదానములో ఉపస్థితులై ఉన్నారు? అన్ని అలంకారాల గురించి తెలుసు కదా! మరి అలంకారధారులైన భుజాలేనా? అలంకారధారులైన శక్తులే బాప్ దాదాను షో (ప్రత్యక్షము) చేస్తారు. శక్తుల భుజాలను ఎప్పుడూ ఖాళీగా చూపించరు. అలంకారాలు నిలిచి ఉన్నప్పుడే సవాలు ఉంటుంది. మరి బాప్ దాదా ఈరోజు ఏం చూస్తున్నారు? భుజాలైన ఒక్కొక్కరి అలంకారాలు మరియు వేగము. ఈ గ్రూపుకు భట్టీలో ఏం చేయిద్దాము? శక్తుల ముఖ్య గుణము ఏమిటి?
ఈ గ్రూపుకు ఒకటేమో శక్తి యొక్క మొదటి గుణమైన నిర్భయతను మరియు రెండవది విస్తారమును క్షణకాలములో సర్దుకునే యుక్తిని కూడా నేర్పించాలి. ఐక్యత మరియు ఏకరసము. అనేక సంస్కారాలను ఒక్క శుద్ధమైన సంస్కారంగా ఎలా తయారుచెయ్యాలి! అన్నదానిని కూడా ఈ భట్టీలో నేర్పించాలి. తక్కువ సమయము పట్టాలి మరియు తక్కువ మాట్లాడాలి, కానీ సఫలత అధికంగా ఉండాలి. ఈ పద్ధతిని కూడా నేర్పించాలి. వినాలి మరియు స్వరూపంగా అయిపోవాలి. వినటము ఎక్కువగా, స్వరూపంగా అవ్వటము తక్కువగా ఉండకూడదు. వింటూ మరియు తయారవుతూ వెళ్ళాలి. ఇప్పుడు వాచామూర్తులుగా కాకుండా సాక్షాత్కారమూర్తులుగా అయ్యి వెళ్ళాలి. మిమ్మల్ని ఎవరు చూసినా మీ ఆకారీరూపము మరియు అలంకారీ రూపమును చూడాలి. సెన్సు (వివేకము) చాలా ఉంది, కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి? జ్ఞాన ఎసెన్సు (సారము) ఏదైతే ఉందో అందులో ఉండాలి. సెన్సును ఎసెన్సులో పెట్టాలి, అప్పుడే బాప్ దాదా ఉంచిన ఆశను ప్రత్యక్షముగా చూపిస్తారు. ఎసెన్సు తెలుసు కదా! ఈ జ్ఞానమునకు ఆవశ్యకమైన విషయమేదైతే ఉందో అదే ఎసెన్సు, ఒకవేళ ఆ ఆవశ్యకమైన విషయాలను ధారణ చేసినట్లయితే అన్ని ఆవశ్యకతలు పూర్తి అయిపోతాయి. ఇప్పుడు ఏవో కొన్ని ఆవశ్యకతలు ఉన్నాయి. కానీ ఈ ఆవశ్యకతలను సదాకాలము కొరకు పూర్తి చేసేందుకు రెండు ఆవశ్యకమైన విషయమాలు ఉన్నాయి - ఆకారీ మరియు అలంకారీలుగా అవ్వటము. ఆకారీ మరియు అలంకారీలుగా అయ్యేందుకు కేవలము ఒక్క మాటను ధారణ చెయ్యాలి. అందులోనే ఆకారీ మరియు అలంకారీ రెండూ వచ్చేసే ఆ పదము ఏది? ఆ ఒక్క పదము - లైటు. లైటు ఒక అర్థము - జ్యోతి, మరొక అర్థము - తేలిక. కావున తేలికతనము మరియు ప్రకాశమయము కూడా. అలంకారము మరియు ఆకారము కూడా, జ్యోతి స్వరూపంగా మరియు జ్వాలా స్వరూపంగా కూడా ఉండాలి మరియు తేలికగా, ఆకారీగా కూడా ఉండాలి. మరి ఒక్క లైటు అన్న పదములోనే రెండు విషయాలూ వచ్చేసాయి కదా! ఇందులో కర్తవ్యము కూడా వచ్చేస్తుంది. కర్తవ్యము ఏమిటి? లైట్ హౌస్ గా అవ్వటము. లైటులో స్వరూపము కూడా వస్తుంది, కర్తవ్యము కూడా వస్తుంది.
టీచర్లతో- తిలకము ఎందుకు పెట్టడుతుంది? తిలకము ఏవిధంగా మస్తిష్కముపైనే పెట్టబడుతుందో అలాగే ఎల్లప్పుడూ పెట్టబడి ఉండే ఈ బిందు స్వరూపము కూడా తిలకము. రెండవది - భవిష్య రాజ్య తిలకము, ఇది కూడా తిలకమే. రెండింటి స్మృతి ఉండాలి. వాటి గుర్తు ఈ తిలకము. గుర్తును చూస్తూ నషా ఉండాలి. ఈ గుర్తు సదాకాలము కొరకు ఇవ్వబడుతుంది. ఏవిధంగా పాయింటు రూపంలో స్థితులయ్యే విధి చెప్పామో అలాగే ఈ తిలకముకూడా పాయింటు. సర్దుకోవటము మరియు ఇముడ్చుకోవటము వస్తుందా? సర్దుకోవటము మరియు ఇముడ్చుకోవటము అన్నవి ఇంద్రజాలపు పనులు. ఇంద్రజాలము చేసేవారు ఏ వస్తువునైనా సర్దేసి చూపిస్తారు. అలాగే ఇమిడ్చి కూడా చూపిస్తారు. ఎంత పెద్ద వస్తువునైనా చిన్నదానిలో కూడా ఇమిడ్చి చూపిస్తారు. ఇటువంటి ఇంద్రజాలమును చెయ్యాలి, ఈ అభ్యాసమును చెయ్యండి. విస్తారములోకి వెళ్తూ మళ్ళీ అక్కడే ఇముడ్చుకొనే పురుషార్థమును చెయ్యండి. బుద్ధి చాలా విస్తారములోకి వెళ్ళి ఉంది అని ఎప్పుడైతే గమనిస్తారో అప్పుడు ఈ అభ్యాసమును చెయ్యండి. ఇంతటి విస్తారమును ఇముడ్చుకోగలరా? అప్పుడే మీరు తండ్రి సమానంగా అవుతారు. తండ్రిని ఇంద్రజాలికుడు అని అంటారు కదా! మరి పిల్లలు ఎవరు? శీతల స్వరూపము మరియు జ్యోతి స్వరూపము, ఈ రెండింటి స్వరూపములో స్థితులవ్వటము వస్తుందా? ఇప్పుడిప్పుడే జ్యోతిస్వరూపము, ఇప్పుడిప్పుడే శీతలస్వరూపము. ఎప్పుడైతే రెండు స్వరూపాలలో స్థితులవ్వటము వస్తుందో అప్పుడే ఏకరస స్థితి ఉండగలదు. రెండింటి సమానత కావాలి, ఇదే వర్తమానపు పురుషార్థము.
ఈ పుష్పాన్ని ఎందుకు ఇస్తున్నాము? అనేక జన్మలు తండ్రి పూజనేదైతే చేసారో దానికి రిటర్నుగా ఒక్క జన్మలో బాప్ దాదా ఇస్తారు. ఎవరైతే అతీతముగా ఉంటారో వారే అతి ప్రియముగా ఉంటారు. ఒకవేళ సర్వులకు అతి ప్రియముగా అవ్వాలంటే అన్ని విషయాల నుండి ఎంత అతీతంగా అవుతారో అంతగానే సర్వులకు ప్రియముగా అవుతారు. ఎంత అతీతత్వమో అంత ప్రియత్వము. ఇలా ఎవరైతే అతీతముగా మరియు ప్రియముగా ఉంటారో వారికి బాప్ దాదాల సహాయము లభిస్తుంది. అతీతముగా అవుతూ ఉండటము అనగా ప్రియముగా అవుతూ ఉండటము, ఒకవేళ ఏ ఆత్మకైనా ప్రియముగా అవ్వలేకపోయినట్లయితే ఆ కారణంగా ఆ ఆత్మ సంస్కారాలు మరియు స్వభావముల నుండి అతీతముగా అవ్వలేకపోవటము జరుగుతుంది. ఎంతగా ఎవరినుండైతే అతీతపు అనుభవము ఉంటుందో అంతగా స్వతహాగనే ప్రియంగా అవుతూఉంటారు. ప్రియంగా అయ్యేందుకు పురుషార్థము కాకుండా అతీతంగా అయ్యేందుకు పురుషార్థము చెయ్యాలి. అతీతంగా అయ్యేందుకు ప్రాలబ్ధము - ప్రియంగా అవ్వటము. ఇది ఇప్పటి ప్రాలబ్దము. తండ్రి ఏవిధంగా అందరికీ ప్రియమైనవారో అలా పిల్లలు కూడా మొత్తము జగత్తులోని ఆత్మలందరికీ ప్రియంగా అవ్వాలి. వారి నడవడికలో అతీతత్వమును తేవడమే అందుకు పురుషార్థమని వినిపించాము. జగత్తులో అతీతంగా మరియు జగత్తులో ప్రియంగా అయ్యేందుకు ఈ పుష్పము. ఈ గ్రూపులో హర్షితత్వము కూడా ఉంది, ఇప్పుడు హర్షితములో ఏం కలపాలి? ఆకర్షణామూర్తులుగా ఎలా అవుతారు? ఎప్పుడైతే మీ బుద్ధి సర్వ ఆకర్షణల నుండి దూరమైపోతుందో అప్పుడే ఆకర్షణమూర్తులుగా అవుతారు. ఎప్పటివరకైతే ఏదైనా ఆకర్షణ బుద్ధిలో ఉంటుందో అటువంటివారు ఆకర్షితులుగా ఉండరు. ఎవరైతే ఆకర్షణమూర్తులుగా అవుతారో వారే ఆకారీమూర్తులుగా అవుతారు. తండ్రి ఆకారీగా ఉంటూ కూడా ఆకర్షణామూర్తిగా ఉండేవారు కదా! ఎంతెంతగా ఆకారీనో అంతంగా ఆకర్షణ ఉంటుంది. ఏవిధంగా వారు పృధ్వి నుండి దూరంగా స్పేస్(అంతరిక్షము)లోకి వెళ్ళినప్పుడు భూమ్యాకర్షణ నుండి దూరంగా ఉంటారో, అలా మీరు పాత ప్రపంచపు ఆకర్షణ నుండి దూరంగా వెళ్తారు. అప్పుడిక కోరుకోకపోయినా కూడా ఆకర్షణామూర్తులుగా అయిపోతారు. సాకారములో ఉన్నా కానీ అందరినీ ఆకారీలుగా చూడాలి. సేవకు కూడా చాలా బలము లభిస్తుంది. ఒకటేమో మీ పురుషార్థపు బలము. మరొకటి ఇతరులకు సేవ చేసినందువలన కూడా బలము లభిస్తుంది. కావున రెండు బలాలూ ప్రాప్తిస్తాయి. బాప్ దాదా స్నేహము ఎలా ప్రాప్తిస్తుందో తెలుసా? ఎంతెంతగా తండ్రి కర్తవ్యములో సహయోగులుగా అవుతారో అంతంతగానే స్నేహము లభిస్తుంది. కర్తవ్యపు సహయోగము ద్వారా స్నేహము లభిస్తుంది. అటువంటి అనుభవము ఉందా? ఏ రోజైతే కర్తవ్యమునకు అధిక సహయోగులుగా ఉంటారో ఆ రోజు విశేషంగా స్నేహపు అనుభవము ఎక్కువగా ఉంటుందా? సదా సహయోగులు, సదా స్నేహులు. స్వమానము ఎలా ప్రాప్తిస్తుంది? ఎంత నిర్మాణులో అంత స్వమానులు. మరియు ఎంతెంతగా బాప్ దాదాకు సమానులో అంతగానే స్వమానులు. నిర్మాణులుగా కూడా అవ్వాలి, సమానముగా కూడా అవ్వాలి. అటువంటి పురుషార్థమునే చెయ్యాలి. నిర్మాణతలో కూడా తక్కువ ఉండకూడదు, సమానతలో కూడా తక్కువ ఉండకూడదు. ఇంకా స్వమానములో కూడా తక్కువ ఉండకూడదు. మీ స్వమానపు పరిశీలనను సమానతతో చూసుకోవాలి.
బాప్ దాదాల సాక్షాత్కారమును మీ నుండి చేయించేందుకు ఎలా అవ్వవలసి ఉంటుంది? ఏ వస్తువు సాక్షాత్కారమైనా ఎందులో ఉంటుంది? దర్పణములో. కావున మీరు దర్పణముగా అవ్వవలసి ఉంటుంది. ఎప్పుడైతే సంపూర్ణముగా అర్పణ అవుతారో అప్పుడే దర్పణంగా అవుతారు. సంపూర్ణ అర్పణమే శ్రేష్ఠ దర్పణము, ఈ దర్పణములోనే స్పష్టముగా సాక్షాత్కారము జరుగుతుంది. ఒకవేళ యథా యోగ్యము, యథాశక్తి అర్పణమైనట్లయితే దర్పణము కూడా యథా యోగ్యము, యథాశక్తిగా ఉంటుంది. సంపూర్ణ అర్పణము అనగా స్వయము యొక్క భానము నుండి కూడా అర్పణము. స్వయమును ఏమని భావించాలి? అందరూ బాప్ దాదాల సాక్షాత్కారమును చేయించాలి - అన్నదే విశేషంగా కుమారీల కర్తవ్యము. కేవలము వాణి ద్వారా కాకుండా తమ ముఖము ద్వారా సాక్షాత్కారము చేయించాలి. సాకారములో తండ్రి విశేషతలు ఏవైతే ఉండేవో, వాటిని మీలో తీసుకురావాలి. ఇది విశేష గ్రూపు. ఎవరైతే తమకు తాముగా ముందుకు వచ్చి సేవా 'బాధ్యతను తీసుకుంటారో వారే అర్జునులు (విజయులు), అల్లా సమానులు అని సాకారములో ఏవిధంగా ఈ గ్రూపుకు చెప్పబడిందో అలా ఈ గ్రూపు కూడా అల్లా సమానంగా అవ్వాలి. ఏవిధంగా మస్తిష్కములో ఈ తిలకము మెరుస్తూ ఉందో ఆవిధంగా ఈ సృష్టిలో స్వయమును కూడా అలా మెరిసేటట్లుగా చేసి చూపించాలి. అటువంటి లక్ష్యమును ఉంచాలి. సేవలో సహయోగిగా అయిన కారణంగా బాప్ దాదాల విశేషమైన స్నేహము కూడా ఉంది. సహయోగము మరియు స్నేహముతో పాటు ఇప్పుడు శక్తినికూడా నింపాలి. ఇప్పుడు శక్తి రూపంగా అవ్వాలి. శక్తులలో కూడా విశేషంగా ఏ శక్తిని నింపాలి? సహనశక్తి. ఎవరిలో అయితే సహనశక్తి తక్కువగా ఉంటుందో వారిలో సంపూర్ణత కూడా తక్కువగా ఉంటుంది. విశేషంగా ఈ శక్తిని ధారణ చేసి శక్తి స్వరూపంగా అయిపోవాలి. తృప్త ఆత్మగా ఎవరైతే ఉంటారో వారి విశేష గుణము - నిర్భయత మరియు సంతుష్టంగా ఉండటము. ఎవరైతే స్వయం సంతుష్టులుగా ఉంటారో మరియు ఇతరులను సంతుష్టముగా ఉంచుతారో అటువంటి వారిలో సర్వగుణాలూ వచ్చేస్తాయి. ఎంతెంతగా శక్తి స్వరూపులుగా ఉంటారో అంతగా బలహీనత ఎదురుగా ఉండజాలదు. కావున శక్తిస్వరూపులుగా అయ్యి వెళ్ళాలి. బ్రహ్మాకుమారీలుగా కూడా కాదు, కుమారీ రూపములో అక్కడక్కడా బలహీనత వచ్చేస్తుంది, కానీ శక్తిరూపములో సంహారశక్తి ఉంది. శక్తులు ఎల్లప్పుడూ విజయులు. శక్తుల మెడలో ఎల్లప్పుడూ విజయమాల ఉంటుంది. శక్తి రూపపు విస్మృతి ద్వారా విజయము కూడా దూరమైపోతుంది కావున ఎల్లప్పుడూ స్వయమును శక్తులుగా భావించాలి.
పిల్లలు తండ్రికన్నా ఎక్కువ ఇంద్రజాలికులు. ఎందుకంటే, బాబాను ఎలా కావాలనుకుంటే అలా తయారుచేసేస్తారు. ఏది కావాలనుకుంటే దానిని తయారుచెయ్యగలరు అని తండ్రిని గూర్చిన గాయనము ఉంది. కానీ భగవంతుని ఎలా కావాలంటే అలా తయారుచెయ్యగలవారు ఎవరు? పిల్లలు. అవ్యక్తంలో ఉన్నవారిని కూడా వ్యక్తములోకి తీసుకువస్తారు. దీనిని ఇంద్రజాలము అని అనరా? అవ్యక్తమయ్యే రోజు దగ్గరలో ఉంది కాబట్టే అవ్యక్తమయ్యే లిఫ్ట్ లభించింది. జ్ఞానమూర్తులు మరియు స్మృతిమూర్తులు రెండింటిలో సమానంగా అవ్వాలి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు జ్ఞానమూర్తులుగా, ఎప్పుడు కావాలనుకుంటే, అప్పుడు
స్మృతిమూర్తులుగా అవ్వాలి. ఎవరైతే స్వయము ఎంతగా స్మృతిమూర్తులుగా అయ్యి ఉంటారో అంతగానే వారు, ఇతరులకు తండ్రి స్మృతిని ఇప్పించగలరు. స్మృతిమూర్తులుగా అయ్యి అందరికీ స్మృతిని కలిగించాలి.
సమయము కొరకు ఎదురు చూస్తున్నారా లేక సమయము మీకొరకు ఎదురు చూస్తుందా? సమయము కొరకు మీరు ఎదురుచూడకూడదు. ఎప్పుడు సమయము వచ్చినా రెడీగా ఉండేటట్లుగా మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ ఎవర్ రెడీగా ఉంచుకోవాలి. ఎదురుచూడటమును సమాప్తము చేసి ఏర్పాట్లను, చేసుకోవాలి. ఎప్పుడైతే మీ ఏర్పాట్లు పూర్తవుతాయో అప్పుడిక ఎదురుచూసే ఆవశ్యకతయే ఉండదు. దీనినే ఎవర్ రెడీ అని అంటారు. అన్నింటిలోనూ ఎవర్ రెడీ. కేవలము సేవలోనే కాకుండా పురుషార్థములో కూడా ఎవర్ రెడీ. సంస్కారములను సమీపముగా చేసుకోవటములో కూడా ఎవర్ రెడీ. విశేషమైన స్నేహము ఉంది. కావున విశేషంగా తయారుచేసే విషయాలు వినిపించబడుతున్నాయి. వృక్షములో తరువాత తరువాత వచ్చే పూలు, ఆకులు ఎలా ఉంటాయి? మొదట వచ్చినవి పాతగా అయిపోతాయి మరియు తరువాత వచ్చినవి చాలా సుందరంగా ఉంటాయి. మరి వీరు కూడా తరువాత వచ్చారు, కానీ చాలా ప్రియమైనవారు. తరువాత వచ్చినవి చాలా కోమలంగా ఉంటాయి. ఇక్కడ కోమలత్వములో ఏముంది? ఎంతటి కోమలత్వమో అంతటి వేడి. కేవలము కోమలంగా ఉన్నట్లయితే ఎవరైనా పీకేయవచ్చు. కోమలంగా ఉండటముతో పాటు అద్భుతమును కూడా చెయ్యాలి. కోమలత్వము మరియు అద్భుతము-రెండూ కలసి ఉన్నట్లయితే అద్భుతమును చేసి చూపిస్తారు. ఈ మొత్తము గ్రూపువారు అద్భుతమును చేసి చూపించేవారు. ఏదేని అద్భుతమును చేసి చూపించాలి అన్న లక్ష్యమును ఉంచాలి. అప్పుడు పెద్దవారు పెద్దవారే కానీ చిన్నవారు అల్లా సమానులు అని అంటారు. ఎటువంటి కర్మ చేస్తారో అటువంటి పేరు వస్తుంది. ఒకవేళ శ్రేష్ఠ కార్యము చేసినట్లయితే శ్రేష్ఠమణి అని పేరు వస్తుంది. శ్రేష్ఠమణులు అన్ని కార్యాలనూ శ్రేష్ఠంగా చెయ్యవలసి ఉంటుంది. మనస్సు-వాణి-కర్మలలో సరళత మరియు సహనశీలత, ఈ రెండూ అవసరము. ఒకవేళ సరళత ఉండి సహనశీలత లేనట్లయితే కూడా శ్రేష్ఠులు కారు. కావున సరళత మరియు సహనశీలత రెండూ తోడుతోడుగా ఉండాలి. ఒకవేళ సహనశీలత లేకుండా సరళత వచ్చినట్లయితే దానిని అమాయకత్వము అని అనబడుతుంది. సరళతతో పాటు సహనశీలత ఉన్నట్లయితే శక్తి స్వరూపులు అని అనబడతారు. శక్తులలో సరళత మరియు సహనశీలత రెండు గుణాలు అవసరము. ఎక్కడ సహనశీలత అధికంగా ఉంది, ఎక్కడ సరళత అధికంగా ఉంది అన్నదానిని ఇప్పటి రిజల్టులో చూస్తారు. ఇప్పుడు ఈ రెండింటిని సమానంగా తయారుచేసుకోవాలి. మధురత కూడా కావాలి, శక్తి రూపము కూడా కావాలి. చాలామంది దేవతల చిత్రాలను చూస్తారు, మరి అందులో ఏం చూసారు? ఎంతటి జ్వాలనో అంతటి శీతలత. కర్తవ్యము జ్వాలగా ఉంటుంది. ముఖము శీతలముగా ఉంటుంది. ఇదే అంతిమ స్వరూపము.
ఓంశాంతి, యోగము ద్వారా తరగని ఖజానాలను ప్రాప్తి చేసుకొనుటకు జీవనంలో ఏమేమి త్యాగము చేయాలి? బాబా సమానముగా ఎవరు తయారవుతారు? యోగం కష్టంగా ఎవరికి అనిపిస్తుంది? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళిలో తెలిపించారు. శివబాబా యాద్ హై?
ReplyDelete