24-02-1985 అవ్యక్త మురళి

 24-02-1985                    ఓంశాంతి                 అవ్యక్త బాప్ దాదా           మధువనము  

సంగమ యుగము సర్వ శ్రేష్ఠ ప్రాప్తుల యుగము

ఈ రోజు బాప్దాదా నలువైపుల ఉన్న ప్రాప్తి స్వరూపులైన విశేష ఆత్మలను చూస్తున్నారు. ఒకవైపు అల్పకాలిక ప్రాప్తులు పొందే అనేకమంది ఆత్మలున్నారు. వారిలో ప్రాప్తితో పాటు అప్రాప్తి కూడా ఉంది. ఈ రోజు ప్రాప్తి ఉంది, రేపు అప్రాప్తి ఉంది. కావున ఒకవైపు అనేక ప్రాప్తులతో అప్రాప్తి స్వరూపులుగా ఉన్నారు. ఇంకొకవైపు చాలా కొద్దిమంది సదాకాలిక ప్రాప్తి స్వరూపులైన విశేషాత్మలుగా ఉన్నారు. వారిరువురి మధ్య ఉన్న గొప్ప తేడాను బాప్దాదా చూస్తున్నారు. బాప్దాదా ప్రాప్తి స్వరూపులైన పిల్లలను చూసి హర్షిస్తున్నారు. ప్రాప్తి స్వరూపలైన పిల్లలు ఎంత పదమా పదమ్ భాగ్యశాలురు! ఎంత ప్రాప్తిని పొందారంటే విశేష ఆత్మలైన మీ ప్రతి అడుగులో పదమాలు ఉన్నాయి. లౌకికంలో ప్రాప్తి స్వరూప జీవితంలో విశేషంగా నాలుగు విషయాలలో ప్రాప్తి అవసరము. 1. సుఖమయ సంబంధాలు ఉండాలి. 2. స్వభావ-సంస్కారాలు సదా శీతలంగా, స్నేహీగా ఉండాలి. 3. సత్యంగా సంపాదించిన శ్రేష్ఠమైన సంపద ఉండాలి. 4. శ్రేష్ఠ కర్మలు, శ్రేష్ఠ సంపర్కం ఉండాలి. ఒకవేళ ఈ నాలుగు విషయాలు ప్రాప్తించి ఉంటే లౌకిక జీవితంలో కూడా సఫలత మరియు సంతోషము ఉంటాయి. కానీ లౌకిక జీవితములోని ప్రాప్తులు అల్పకాలికమైనవి. ఈ రోజు సుఖమయమైన సంబంధాలు ఉంటాయి, రేపు అవే సంబంధాలు దు:ఖమయంగా అవుతాయి. ఈ రోజు సఫలత ఉంటుంది, రేపు ఉండదు. వీటితో పోలిస్తే పాప్తి స్వరూపులైన, శ్రేష్ఠ ఆత్మలైన మీకు ఈ అలౌకిక శ్రేష్ఠ జీవితంలో నాలుగు విషయాలూ సదా ప్రాప్తించి ఉన్నాయి. ఎందుకంటే నేరుగా సుఖదాత, సర్వ ప్రాప్తుల దాతతో అవినాశి సంబంధముంది. ఈ అవినాశి సంబంధము ఎప్పుడూ దు:ఖము కలిగించదు, మోసము చేయదు. వినాశి సంబంధాలలో వర్తమాన సమయంలో దు:ఖము లేక మోసము ఉంది. అవినాశి సంబంధంలో సత్యమైన స్నేహముంది, సుఖమూ ఉంది. ఎందుకంటే సదా స్నేహము మరియు సుఖమయమైన సర్వ సంబంధాలు తండ్రి ద్వారా ప్రాప్తించాయి. ఒక్క సంబంధము లోటు కూడా లేదు. ఏ సంబంధము కావాలనుకుంటే ఆ సంబంధము ద్వారా ప్రాప్తిని అనుభవం చేయండి. ఏ ఆత్మకు ఏ సంబంధము ప్రియమైనదో ఆ సంబంధములో భగవంతుడు ప్రీతి యొక్క రీతిని నిభాయిస్తున్నారు. భగవంతుని సర్వ సంబంధీకునిగా చేసుకున్నారు. ఇటువంటి శ్రేష్ఠ సంబంధము కల్పమంతటిలో ఎప్పుడూ ప్రాప్తించజాలదు. కావున సంబంధాలు కూడా లభించాయి, జత జతలో ఈ అలౌకిక దివ్యజన్మలో సదా శ్రేష్ఠ స్వభావము, ఈశ్వరీయ సంస్కారాలు ఉన్న కారణంగా స్వభావ సంస్కారాలు ఎప్పుడూ దు:ఖమునివ్వవు. బాప్దాదా సంస్కారాలేవైతే ఉన్నాయో, అవే పిల్లల సంస్కారాలు. బాప్దాదాల స్వభావమేదైతే ఉందో, అదే పిల్లల స్వభావము. స్వ-భావము అనగా సదా ప్రతి ఒక్కరి పట్ల స్వ-అనగా ఆత్మిక భావము. స్వ అని శ్రేష్ఠమును కూడా అంటారు. స్వయం యొక్క భావము లేక శ్రేష్ఠ భావమే స్వభావంగా ఉండాలి. సదా మహాదాని, దయాహృదయులు, విశ్వకళ్యాణకారి తండ్రి యొక్క ఈ సంస్కారాలే మీ సంస్కారాలు. అందువలన స్వభావ-సంస్కారాలు సదా సంతోషాన్ని కలిగిస్తాయి. అదే విధంగా సత్యమైన సంపాదన ద్వారా చేసుకున్న సుఖమయ సంపాదన ఉంది. కావున అవినాశి ఖజానాలు ఎన్ని లభించాయి! ప్రతి ఖజానా యొక్క గనులకు మీరు యజమానులు. కేవలం ఒక్క ఖజానా కాదు, తరగని లెక్కలేనన్ని ఖజానాలు లభించాయి. వాటిని ఖర్చు పెట్టండి, తినండి పెంచుకుంటూ ఉండండి. అవి ఎంతగా ఖర్చు చేస్తే అంతగా పెరుగుతూ ఉంటాయి. మీరు అనుభవజ్ఞులే కదా! స్థూల సంపదను ఎందుకు సంపాదిస్తారు? పప్పు, రొట్టె(పప్పు, అన్నం) సుఖంగా తినేందుకు, పరివారము సుఖంగా ఉండేందుకు, ప్రపంచంలో మంచి పేరు ఉండేందుకు కదా! ఎంతటి సుఖ సంతోషాల భోజనం లభిస్తోందో మిమ్ములను మీరు చూసుకోండి. పప్పు, రొట్టె తినండి, భగవంతుని గుణగానం చేయండి అన్న మహిమ కూడా ఉంది. ఇటువంటి మహిమ గల భోజనాన్ని మీరు తింటున్నారు. అంతేకాక బ్రాహ్మణ పిల్లలైన మీకు, బ్రాహ్మణ పిల్లలు భోజనం నుండి ఎప్పుడూ వంచితులుగా అవ్వరని బాప్దాదా గ్యారెంటీ ఉంది. రుచులతో కూడిన భోజనం లభించకపోవచ్చు, కానీ పప్పు, రొట్టె (సాధారణ భోజనం) తప్పకుండా లభిస్తుంది. భోజనము కూడా ఉంది, మంచి పరివారము కూడా ఉంది మరియు పేరు కూడా ఎంత ప్రఖ్యాతంగా ఉంది! మీ పేరు ఎంత ప్రసిద్ధమైనదంటే, ఇప్పుడు చివరి జన్మ వరకు మీరు చేరుకున్నా కానీ మీ జడ చిత్రాల పేర్లతో అనేక ఆత్మలు తమ పనులను సిద్ధింపజేసుకుంటున్నారు. దేవీ దేవతలైన మీ పేర్లు వారు వాడుకుంటూ తమ పనులను సిద్ధింపజేసుకుంటున్నారు. మీ పేరు ఇంతగా ప్రసిద్ధమయ్యాయి. ఒక్క జన్మ మాత్రమే పేరు ప్రసిద్ధమవ్వడం కాదు, మొత్తం కల్పమంతా మీ పేరు ప్రసిద్ధమయ్యింది. కావున మీరు సుఖమయమైన, సత్యమైన సంపన్నవంతులు. తండ్రి సంపర్కములోకి రావడంతో సంపర్కము కూడా శ్రేష్ఠంగా తయారయ్యింది. మీ సంపర్కము ఎంత శ్రేష్ఠమైనదంటే ఒక్క క్షణ కాలపు మీ జడచిత్రాల సంపర్కం కొరకు కూడా ఎంతో దాహంతో ఉన్నారు. కేవలం ఒక్క సెకండు దర్శన సంపర్కానికి కూడా ఎంత దాహంతో ఉన్నారు! ఎన్నో రాత్రులు జాగరణ చేస్తూ ఉంటారు. కేవలం క్షణ మాత్రపు దర్శన సంపర్కము కొరకు పిలుస్తూ ఉంటారు, ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. పిలుస్తూ కేవలం ముందుకు వెళ్లేందుకు ఎంతగా సహిస్తూ ఉంటారు! అది కేవలం చిత్రమే, అలాంటి చిత్రాలు ఇంట్లో కూడా ఉంటాయి అయినా ఒక్క క్షణ మాత్రపు సన్ముఖ సంపర్కము కొరకు ఎంతగా దాహంతో ఉన్నారు! ఒక్క అనంతమైన తండ్రికి చెందినవారిగా అయిన కారణంగా మొత్తం విశ్వంలోని సర్వ ఆత్మలతో సంబంధము ఏర్పడింది. కావున నాలుగు విషయాలు అవినాశిగా ప్రాప్తించాయి. అందువలన మీది సదా సుఖమయమైన జీవితము, ప్రాప్తి స్వరూప జీవితము. బ్రాహ్మణుల జీవితంలో అప్రాప్తి వస్తువేదీ ఉండదు - ఇదే మీ పాట. మీరు ఇటువంటి ప్రాప్తి స్వరూపులుగా ఉన్నారు కదా లేక అలా అవ్వాలా? కావున ఈ రోజు ప్రాప్తి స్వరూప పిల్లలను చూస్తున్నారని వినిపించాము కదా! ఈ శ్రేష్ఠమైన జీవితము కొరకు ప్రపంచములోని వారు ఎంత కష్టపడ్తున్నారు! కానీ మీరు ఏం చేశారు? కష్టపడ్డారా లేక ప్రేమించారా? ప్రేమతో తండ్రిని మీ వారిగా చేసేసుకున్నారు. ప్రపంచంలోని వారు కష్టపడ్తున్నారు, మీరు ప్రేమతో పొందేశారు. బాబా అని అన్నారు, ఖజానాల తాళంచెవి లభించింది. ప్రపంచంలోని వారిని అడిగితే వారేమంటారు? సంపాదించడం చాలా కష్టం, ఈ ప్రపంచంలో నడవడం చాలా కష్టం అని అంటారు. మరి మీరేమంటారు? ప్రతి అడుగులో పదమాలు సంపాదించాలని అంటారు. నడవడం ఎంత సహజం! ఇప్పుడు ఎగిరేకళ ఉంది కావున నడవడం నుండి కూడా రక్షింపబడ్డారు. నడవడమేమిటి, మేము ఎగరాలి అని మీరంటారు. ఎంత వ్యత్యాసము! బాప్దాదా ఈ రోజు విశ్వంలోని పిల్లలందరిని చూస్తున్నారు. అందరూ తమ తమ ప్రాప్తుల లగ్నంలో నిమగ్నమై ఉన్నారు. కానీ రిజల్టు ఏమిటి? అందరూ వెతకడంలో నిమగ్నమై ఉన్నారు. సైన్సు వారిని చూడండి, తమ పరిశోధనలో ఎంతగా బిజీగా ఉన్నారంటే వారికి ఇంకేమీ స్ప్రుశించదు(తోచదు). మహాన్ ఆత్మలను చూడండి, ప్రభువును పొందే అన్వేషణలో నిమగ్నమై ఉన్నారు. చిన్న భ్రాంతి కారణంగా ప్రాప్తుల నుండి వంచితులై ఉన్నారు. ఆత్మయే పరమాత్మ లేక పరమాత్మ సర్వవ్యాపి అన్న ఈ భ్రాంతి కారణంగా వెతకడంలోనే ఉన్నారు. ప్రాప్తుల నుండి వంచితులుగా ఉన్నారు. సైన్సువారు కూడా ఇప్పుడు ఇంకా ముందు ఉంది, ముందు ఉందంటూ, చంద్రునిలో, తారలలో ప్రపంచాన్ని తయారు చేస్తామంటూ వెతుకుతూ, వెతుకుతూ తప్పిపోయారు. శాస్త్రవాదులను చూడండి, శాస్త్రాల వలయంలో పడి విస్తారంలో మునిగి పోయారు. శాస్త్రాలను అర్థం చేసుకోవాలనే లక్ష్యము ఉంచుకొని అర్థము నుండి వంచితులైపోయారు. రాజకీయ నేతలు కుర్చీల కొరకు(పదవుల కొరకు) ఉరుకులు, పరుగులు తీస్తూ నిమగ్నమై ఉన్నారు. ప్రపంచంలోని ఏమీ తెలియని అజ్ఞానీ ఆత్మలు వినాశీ ప్రాప్తుల గడ్డిపోచల ఆధారమునే నిజమైన ఆధారంగా భావిస్తూ కూరున్నారు. కానీ మీరేం చేశారు? వారన్నీ పోగొట్టుకున్నారు, మీరు పొందేశారు. భ్రాంతులను చెరిపేసుకున్నారు. కావున ప్రాప్తి స్వరూపులుగా అయిపోయారు. కావున మీరు సదా ప్రాప్తి స్వరూప శ్రేష్ఠ ఆత్మలు.

విశ్వంలోని అనేక ఆత్మల మధ్య శ్రేష్ఠ ఆత్మలైన మీ గుర్తించే నేత్రము శక్తిశాలిగా ఉందని బాప్దాదా విశేషంగా డబల్ విదేశీ పిల్లలకు అభినందనలు తెలుపుతున్నారు. మీరు గుర్తించారు, పొందారు. కావున బాప్దాదా డబల్ విదేశీ పిల్లల గర్తించే నేత్రమును చూసి ఓహో  పిల్లలూ! అంటూ పిల్లల గుణగానము చేస్తున్నారు. దూరదేశ వాసులుగా, భిన్న భిన్న ధర్మాలకు చెందినవారిగా, భిన్న భిన్న ఆచార వ్యవహారాలకు చెందినవారిగా, మీ వాస్తవిక తండ్రి నుండి దూరంగా ఉంటున్నా సమీపంగా గుర్తించేశారు. సమీప సంబంధంలోకి వచ్చేశారు. బ్రాహ్మణ జీవితములోని ఆచార వ్యవహారాలను, మీ ఆది ఆచార వ్యవహారాలుగా భావిస్తూ సహజంగానే మీ జీవితంలోకి స్వీకరించారు. ఇటువంటి వారినే విశేషమైన లవ్లీ మరియు లక్కీ(ప్రియమైనవారు మరియు అదృష్టవంతులైన) పిల్లలని అంటారు. ఎలాగైతే పిల్లలకు విశేషమైన సంతోషము ఉందో అలా బాప్దాదాకు కూడా విశేషమైన సంతోషము ఉంది. బ్రాహ్మణ ప్రపంచంలోని ఆత్మలు విశ్వంలో మూల మూలలకు చేరుకున్నారు. కానీ మూల మూలలో ఉన్న తప్పిపోయిన శ్రేష్ఠ ఆత్మలు మళ్లీ తమ పరివారంలోకి వచ్చి చేరుకున్నారు. తండ్రి వెతికారు, మీరు గుర్తించారు కావున ప్రాప్తులకు అధికారులుగా అయిపోయారు. మంచిది.

ఇటువంటి అవినాశి పాప్త్రి స్వరూపులైన పిల్లలకు, సదా సర్వ సంబంధాలను అనుభవం చేసుకునే పిల్లలకు సదా అవినాశి సంపన్నులైన పిల్లలకు, సదా తండ్రి సమానంగా శేష్ఠ్ర సంస్కారాలను కలిగి ఉంటూ సదా స్వయం యొక్క భావనతో ఉండే సర్వ పాప్త్రుల భాండాగారాలైన సర్వ పాప్త్రుల మహాదాని పిల్లలకు బాప్దాదా పియ్ర స్మృతులు మరియు నమస్తే.

యుగల్స్ తో అవ్యక్త బాప్దాదా మిలనము :-

ప్రవృత్తిలో ఉంటూ సర్వ సంబంధాల నుండి అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా ఉన్నారు కదా! చిక్కుకుపోయిన వారిగా లేరు కదా? పంజరంలోని పక్షులైతే కారు కదా! ఎగిరే పక్షులే కదా! కొద్దిగా బంధనమున్నా చిక్కుకుపోయేలా చేస్తుంది. బంధనముక్తులుగా ఉన్నట్లయితే సదా ఎగురుతూ ఉంటారు. కావున ఏ విధమైన బంధనమూ లేదు. దేహానిదీ లేదు, సంబంధాలదీ లేదు, ప్రవృత్తిదీ లేదు, పదార్థాలది కూడా లేదు. ఏ బంధనమూ లేనివారిని అతీతమైనవారని, ప్రియమైనవారని అంటారు. స్వతంత్రులు సదా ఎగిరే కళలో ఉంటారు, పరతంత్రులు కొద్దిగా ఎగురుతారు కూడా, మళ్లీ బంధనాలు వారిని ఆకర్షించి క్రిందకు తీసుకొస్తాయి. కావున ఒకసారి క్రింద, ఒకసారి పైన - ఈ విధంగా సమయం గడిచిపోతుంది. సదా ఒకే రకంగా ఎగిరేకళ స్థితికి, ఒకసారి క్రింద, ఒకసారి పైన ఉండే స్థితికి, రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. మరి మీరు ఏ స్థితి గలవారు? సదా నిర్బంధనులు, సదా స్వతంత్రులే కదా! సదా తండ్రి జతలో ఉండేవారేనా? ఎటువంటి ఆకర్షణకు ఆకర్షితులయ్యేవారు కాదు కదా! ఆ జీవితమే ప్రియమైనది. ఎవరైతే తండ్రికి ప్రియంగా అవుతారో, వారి జీవితం సదా ప్రియంగా అవుతుంది. గొడవల జీవితము కాదు. ఈ రోజు ఇది జరిగింది, నిన్న అది జరిగింది అని అనరు. కానీ సదా తండ్రి తోడుగా ఉండేవారు, ఏకరస స్థితిలో ఉండేవారు. అది ఆనందాల జీవితము. ఆనందంలో లేకపోతే తప్పకుండా తికమకపడ్తారు. ఈ రోజు ఈ సమస్య వచ్చింది, రేపు మరొకటి వచ్చింది, ఈ దు:ఖధామము యొక్క విషయాలు దు:ఖధామంలో అయితే రానే వస్తాయి. కానీ సంగమ యుగ బ్రాహ్మణులుగా ఉన్నట్లయితే దు:ఖము క్రిందే ఉండిపోతుంది. దు:ఖధామము నుండి తొలగిపోయినప్పుడు దు:ఖము కనిపిస్తున్నా మిమ్ములను స్పర్శించదు. కలియుగాన్ని విడిచిపెట్టేశారు, తీరాన్ని వదిలేశారు. ఇప్పుడు సంగమ యుగానికి చేరుకున్నారు. కావున సంగమ యుగము సదా ఉన్నతంగా కనిపిస్తుంది. సంగమ యుగ ఆత్మలు సదా ఉన్నత స్థితి గలవారు. క్రింది స్థితి గలవారు కాదు. తండ్రి ఎగిరింపజేసేందుకు వచ్చారు కనుక ఎగిరేకళ నుండి క్రిందకు రావడం ఎందుకు? క్రిందకు రావడం అనగా చిక్కుకోవడం. ఇప్పుడు రెక్కలు లభించాయి కనుక ఎగురుతూ ఉండండి. క్రిందకు రానే రాకండి. మంచిది.

అధర్ కుమారులను ఉద్దేశించి :-

అందరూ ఒక్కరి ప్రేమలోనే మగ్నమై ఉండేవారు కదా? ఒకటి తండ్రి, రెండు మేము, మూడవవారు ఎవ్వరూ లేరు. వీరినే ప్రేమలో మగ్నమై ఉండేవారని అంటారు. నేను మరియు నా బాబా. ఇది తప్ప నావారెవరైనా ఉన్నారా? నా పిల్లలు, నా మనవలు..... ఇలాగైతే లేరు కదా. నా అనేదాంట్లో మమత ఉంటుంది. నాది అనేది సమాప్తమవ్వడం అంటే మమత సమాప్తమవ్వడం. కావున మొత్తం మమత అనగా మొత్తం మోహమంతా తండ్రి పైనే. కనుక మారిపోయింది, శుద్ధ మోహంగా అయిపోయింది. తండ్రి సదా శుద్ధమైనవారు కావున మోహం మారి ప్రేమగా అయిపోయింది. నా తండ్రి ఒక్కరే, ఈ ఒక్క 'నా' ద్వారా అన్నీ సమాప్తమైపోతాయి మరియు ఒక్కరి స్మృతి సహజమైపోతుంది. కావున మీరు సదా సహజ యోగులు. నేను శ్రేష్ఠ ఆత్మను మరియు నా తండ్రి అంతే! శ్రేష్ఠ ఆత్మలుగా భావించినందున శ్రేష్ఠ కర్మలు స్వతహాగా జరుగుతాయి, శ్రేష్ఠ ఆత్మల ముందు మాయ రాజాలదు.

మాతలను ఉద్దేశించి :-

మాతలు సదా తండ్రి జతలో సంతోషమనే ఊయలలో ఊగేవారే కదా! గోప గోపికలు సదా సంతోషంలో నాట్యం చేసేవారు లేక ఊయలలో ఊగేవారు. కావున తండ్రి జతలో ఉండువారు సంతోషముతో నాట్యం చేస్తారు. తండ్రి జతలో ఉంటే సర్వ శక్తులు జతలో ఉన్నట్లే. తండ్రి తోడు శక్తిశాలిగా తయారు చేస్తుంది. తండ్రి తోడుగా ఉండేవారు సదా నిర్మోహులుగా ఉంటారు. వారిని ఎవరి మోహమూ విసిగించదు(సతాయించదు). కావున నిర్మోహులుగా ఉన్నారా? ఎటువంటి పరిస్థితి వచ్చినా ప్రతి పరిస్థితిలో నిర్మోహులే. ఎంతగా నిర్మోహులుగా ఉంటారో అంత స్మృతి మరియు సేవలో ముందుకు వెళ్తూ ఉంటారు.

మధువనానికి వచ్చిన సేవాధారులను ఉద్దేశించి :-

సేవ ఖాతా జమ అయ్యింది కదా! ఇప్పుడు కూడా మధువనం వాతావరణంలో శక్తిశాలి స్థితిని తయారు చేసుకునేందుకు అవకాశం లభించింది, భవిష్యత్తుకు కూడా జమ అయ్యింది. కావున డబల్ ప్రాప్తి జరిగింది. యజ్ఞ సేవ అనగా శ్రేష్ఠమైన సేవ. శ్రేష్ఠ స్థితిలో స్థితమై సేవ చేయడం ద్వారా పదమా రెట్లు ఫలంగా అయిపోతుంది. ఏ సేవ చేసినా, ముందుగా శక్తిశాలి స్థితిలో సేవాధారిగా అయ్యి సేవ చేస్తున్నానా అని చూసుకోండి. సాధారణ సేవాధారులు కాదు, ఆత్మిక సేవాధారులు. ఆత్మిక సేవాధారుల ఆత్మిక మెరుపు, ఆత్మిక నశా సదా ప్రత్యక్ష రూపంలో ఉండాలి. రొట్టెలు ఒత్తుతున్నా స్వదర్శన చక్రము తిరుగుతూ ఉండాలి. లౌకిక నిమిత్త స్థూల కార్యమైనా, స్థూలమూ, సూక్ష్మమూ రెండూ జతజతలో ఉండాలి అనగా చేతుల ద్వారా స్థూల కార్యము చేయండి, బుద్ధి ద్వారా మనసా సేవ చేయండి. అప్పుడు డబల్ అయిపోతుంది. చేతుల ద్వారా కర్మ చేస్తున్నా స్మృతి శక్తి ద్వారా ఒకే స్థానంలో ఉంటున్నా చాలా సేవ చేయగలరు. లైట్ హౌస్(ప్రకాశ స్థంభము) ఒకే స్థానములో స్థిరంగా ఉంటూ నలువైపులా సేవ చేస్తుంది. మధువనం అయితే లైట్ హౌస్ కదా! అటువంటి సేవాధారులు స్వంతానికి మరియు ఇతరులకు శ్రేష్ఠ ప్రాలబ్ధాన్ని తయారు చేయగలరు మంచిది. ఓంశాంతి.

ఈ రోజు బాప్దాదా రాత్రంతా పిల్లలందరితో మిలనం జరిపారు. ఉదయం 7గం||లకు ప్రియ స్మృతులు తెలిపి వీడ్కోలు తీసుకున్నారు. ఉదయం క్లాసు బాప్దాదాయే చేశారు.

బాప్దాదా ద్వారా మహావాక్యాలు రోజూ వింటూ వింటూ మహాన్ ఆత్మలుగా అయిపోయారు. కావున ఈ రోజున ఇదే పాఠాన్ని పూర్తి రోజంతా మహావాక్యాలు వింటూ మహాన్ గా అయిపోయానని మనస్ఫూర్తిగా వినండి. గొప్పలో కంటే గొప్ప కార్యము చేసేందుకు సదా నిమిత్తంగా ఉన్నాను. ప్రతి ఆత్మ పట్ల మనసు ద్వారా, వాక్కు ద్వారా, సంపర్కము ద్వారా మహాదానీ ఆత్మలుగా అయ్యి సదా మహాన్ యుగాన్ని ఆహ్వానం చేసే అధికారీ ఆత్మలు మీరు. ఇదే గుర్తుంచుకోండి.

సదా అటువంటి మహాన్ స్మృతిలో ఉండే శేష్ఠ్ర ఆత్మలకు, చాలాకాలం తర్వాత కలిసిన పిల్లలకు బాప్దాదా పియ్రస్మృతులు మరియు శుభోదయం. కాబోయే మరియు వర్తమాన చకవ్రర్తులకు తండి నమస్తే. మంచిది.

Comments