21-02-1985 అవ్యక్త మురళి

 21-02-1985                    ఓంశాంతి                 అవ్యక్త బాప్ దాదా           మధువనము  

'' శీతలతా శక్తి ''

ఈ రోజు జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు తమ లక్కీ, లవ్లీ(భాగ్యశాలి, ప్రియమైన) నక్షత్రాలను చూస్తున్నారు. ఈ ఆత్మిక నక్షత్ర మండలాన్ని మొత్తం కల్పంలో ఎవ్వరూ చూడలేరు. ఆత్మిక నక్షత్రాలైన మిమ్ములను లేక ఈ అతీతమైన మరియు ప్రియమైన(న్యారే, ప్యారే) నక్షత్ర మండలాన్ని జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు చూస్తున్నారు. ఈ ఆత్మిక నక్షత్ర మండలాన్ని సైన్సు శక్తి గలవారు చూడలేరు. సైలెన్సు శక్తి గలవారు ఈ నక్షత్ర మండలాన్ని చూడగలరు, తెలుసుకోగలరు. కనుక ఈ రోజు నక్షత్ర మండలంలో విహరిస్తూ రకరకాల నక్షత్రాలను చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు. ప్రతి నక్షత్రం జ్ఞాన సూర్యుని ద్వారా సత్యత యొక్క లైట్-మైట్(ప్రకాశం-శక్తి) తీసుకొని, తండ్రి సమానంగా సత్యతా శక్తితో ఎంత సంపన్నంగా సత్య స్వరూపంగా అయ్యారో మరియు జ్ఞాన చంద్రుని ద్వారా శీతలతా శక్తిని ధారణ చేసి చంద్రుని సమానంగా ఎంత శీతల స్వరూపంగా అయ్యారో చూస్తున్నారు. ఈ రెండు శక్తులు సత్యత మరియు శీతలత సదా సహజంగా సఫలతను ప్రాప్తి చేయిస్తాయి. ఒకవైపు సత్యతా శక్తి వలన కలిగే శ్రేష్ఠమైన నశా గలవారు, రెండవ వైపు ఎంత ఉన్నతమైన నశా ఉందో అంత శీతలత ఆధారంతో ఎలాంటి ఉల్టా నశా లేక క్రోధంతో ఉన్న ఆత్మనైనా శీతలంగా తయారు చేసేవారు. ఎంత అహంకారపు నశాలో ''నేను-నేను'' అనేవారు కావచ్చు, శీతలతా శక్తితో నేను-నేను అనేందుకు బదులు ''బాబా బాబా'' అని అనడం ప్రారంభించాలి. సత్యతను కూడా శీతలతా శక్తితో ఋజువు చేస్తే సిద్ధి ప్రాప్తిస్తుంది. లేకుంటే శీతలతా శక్తి లేకుండా సత్యతను ఋజువు చేసే లక్ష్యంతో చేసినట్లయితే సిద్ధి ప్రాప్తిస్తుంది కానీ అజ్ఞానులు సిద్ధిని మొండితనంగా భావిస్తారు. అందువలన సత్యత మరియు శీతలత - ఈ రెండు శక్తులు సమానంగా మరియు జతలో ఉండాలి. ఎందుకంటే ఈ రోజు విశ్వంలోని ప్రతి మానవుడు ఏదో ఒక అగ్నిలో కాలిపోతున్నాడు. ఇలా అగ్నిలో కాలుతున్న ఆత్మను మొదట శీతలతా శక్తితో శీతలంగా చేయండి. అప్పుడు శీతలత ఆధారంతో సత్యతను తెలుసుకోగలరు.

శీతలతా శక్తి అనగా ఆత్మిక స్నేహ శక్తి. చంద్రుడైన తల్లి, స్నేహమనే శీతలతతో ఎలాంటి చెడిపోయిన పిల్లలనైనా మార్చేస్తుంది. కనుక స్నేహం అనగా శీతలతా శక్తి. ఎలాంటి అగ్నిలో కాలిపోయిన ఆత్మనైనా శీతలంగా చేసి సత్యతను ధారణ చేయించేందుకు యోగ్యంగా చేస్తుంది. మొదట చంద్రుని శీతలతతో యోగ్యంగా అవుతారు. తర్వాత జ్ఞాన సూర్యుని సత్యతా శక్తితో యోగులుగా అవుతారు. కనుక జ్ఞాన చంద్రుని శీతలతా శక్తి తండ్రి ముందుకు వెళ్లేందుకు యోగ్యులుగా చేస్తుంది. యోగ్యులుగా అవ్వకపోతే యోగులుగా కూడా అవ్వలేరు. కనుక సత్యతను తెలుసుకునేందుకు ముందు శీతలంగా అవ్వాలి. సత్యతను ధారణ చేసే శక్తి కావాలి. కనుక శీతలతా శక్తి గల ఆత్మ స్వయం కూడా సంకల్పాల వేగంలో, మాటలలో, సంపర్కంలో ప్రతి పరిస్థితిలో శీతలంగా ఉంటుంది. సంకల్పాల వేగం తీవ్రంగా ఉన్న కారణంగా చాలా వృథా కూడా అవుతుంది అంతేకాక కంట్రోల్ చేయడంలో కూడా సమయం పోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కంట్రోల్(అదుపు) చెయ్యాలి లేక పరివర్తన చెయ్యాలి అంటే ఇందులోనే సమయం మరియు శక్తి ఎక్కువగా వినియోగించాల్సి ఉంటుంది. యథార్థ వేగంతో నడిచేవారు అనగా శీతలతా శక్తి స్వరూపంగా ఉండేవారు వ్యర్థం నుండి రక్షింపబడ్తారు. ప్రమాదం నుండి రక్షించబడ్తారు. ఇది ఎందుకు, ఏమిటి, ఇలా కాదు, అలా - ఈ వ్యర్థమైన తీవ్ర వేగం నుండి ముక్తులవుతారు. ఎలాగైతే వృక్షం నీడ ఎలాంటి బాటసారికైనా విశ్రాంతిని ఇస్తుందో సహయోగం చేస్తుందో, అలా శీతలతా శక్తి గలవారు ఇతర ఆత్మలకు కూడా తమ శీతల ఛాయ ద్వారా సహయోగమనే విశ్రాంతినిస్తారు. ఈ ఆత్మ దగ్గరకు వెళ్ళి రెండు క్షణాలైనా వారి శీతలత ఛాయలో శీతలతా సుఖాన్ని, ఆనందాన్ని తీసుకోవాలనే ఆకర్షణ ఉంటుంది. ఎలాగైతే నలువైపులా ఎండ ఎక్కువగా ఉంటే నీడ గల స్థానాన్ని వెతుక్కుంటారో, అలా ఆత్మల దృష్టి లేక ఆకర్షణ ఇలాటి ఆత్మల వైపు వెళ్తుంది. ఇప్పుడు విశ్వంలో వికారాల అగ్ని ఇంకా తీవ్రం అవ్వనున్నది. ఎలాగైతే నిప్పు అంటుకుంటే మనుష్యులు ఆర్తనాదాలు చేస్తూ శీతలత ఆధారాన్ని వెతుకుతారో అలా ఈ మనుష్య ఆత్మలు శీతల ఆత్మలైన మీ వద్దకు తపిస్తూ వస్తారు. కొన్ని శీతల బిందువులనైనా మా పై వేయండి(చల్లండి) అని ఆర్తనాదాలు చేస్తారు. ఒకవైపు వినాశనం చేసే అగ్ని, రెండవ వైపు వికారాల అగ్ని, మూడవ వైపు దేహము మరియు దేహ సంబంధాలు, పదార్థాల పై తగుల్పాటు(లగావ్) అగ్ని, నాల్గవ వైపు పశ్చాత్తాప అగ్ని. నాలుగువైపులా అగ్నియే అగ్ని కనిపిస్తుంది. కావున ఇలాంటి సమయంలో శీతలతా శక్తి గల మీ (ఆత్మల) వద్దకు పరుగు తీస్తూ వచ్చి ఒక సెకండు కాలమైనా శీతలంగా చేయమని అంటారు. ఇటువంటి సమయంలో స్వయం మీలో ఎంత శీతలతా శక్తి జమ అయ్యి ఉండాలంటే నలువైపులా ఉన్న అగ్ని సెగ స్వయానికి తగలరాదు. నలువైపులా ఉన్న అగ్నిని నిర్మూలించే శీతలతా వరదానాన్ని ఇచ్చే శీతలా దేవీలుగా అవ్వండి. ఒకవేళ నాలుగు ప్రకారాల అగ్నిలో దేని అంశ మాత్రం అయినా మిగిలి ఉంటే నాలుగువైపులా ఉన్న అగ్ని, అంశ మాత్రం మిగిలి ఉన్న అగ్నిని పట్టుకుంటుంది. అగ్ని అగ్నిని పట్టుకుంటుంది కదా! కావున దీనిని చెక్ చేసుకోండి.

వినాశ జ్వాల యొక్క అగ్నితో రక్షించుకునే సాధనం నిర్భయతా శక్తి. నిర్భయత వినాశన జ్వాల ప్రభావం ద్వారా డగ్ మగ్ అవ్వనివ్వదు. అలజడిలోకి తీసుకురాదు. నిర్భయత్వ ఆధారంతో వినాశన జ్వాలలో భయభీతులైన ఆత్మలకు శీతలతా శక్తిని ఇస్తారు. ఆత్మ, భయం వలన కలిగే అగ్ని నుండి రక్షించబడి శీతలత కారణంగా సంతోషంగా నాట్యం చేస్తుంది. వినాశనాన్ని చూస్తున్నా స్థాపన దృశ్యాలు చూస్తుంది. వారి నయనాలలో ఒక కంటిలో ముక్తి(స్వీట్ ¬మ్), రెండవ కంటిలో జీవన్ముక్తి అనగా స్వర్గం ఇమిడి ఉంటాయి. వారికి తమ ఇల్లు మరియు తమ రాజ్యమే కనిపిస్తాయి. అయ్యో పోయారు, చనిపోయారు అని జనులు బాధతో అరుస్తారు కానీ మీరు మధురమైన ఇంటికి, మధురమైన రాజ్యంలోకి వెళ్లారని అంటారు. కొత్తదేమీ కాదు. మా ఇల్లు, మా రాజ్యము అనే గజ్జెలు ధరించి సంతోషంగా నాట్యం చేస్తూ జతలో వస్తారు. వాళ్ళు ఆర్తనాదాలు చేస్తారు, మీరు జతలో వస్తారు. వినడంలోనే అందరికి సంతోషం కలుగుతూ ఉంటే ఇక ఆ సమయంలో ఎంత సంతోషంగా ఉంటారు! కావున నాల్గు రకాల అగ్నితో శీతలంగా అయ్యారు కదా? వినిపించాను కదా - వినాశనం జ్వాల నుండి రక్షించుకునే సాధనము - నిర్భయత. అలాగే వికారాల అంశ మాత్రపు అగ్ని నుండి రక్షించుకునేందుకు సాధనము - తమ ఆది, అనాది వంశాన్ని గుర్తు చేసుకోండి. అనాది తండ్రి వంశంలోని సంపూర్ణ సతోప్రధాన ఆత్మను. ''ఆది వంశములోని దేవాత్మను.'' దేవాత్మ అనగా 16 కళా సంపన్నం, సంపూర్ణ నిర్వికారి ఆత్మను. ఈ విధంగా అనాది ఆది వంశాన్ని గుర్తు చేసుకుంటే వికారాల అంశం కూడా సమాప్తమైపోతుంది.

ఇలాగే మూడవది - దేహము, దేహ సంబంధాలు మరియు పదార్థాలపై మమకారం అనే అగ్ని. ఈ అగ్ని నుండి రక్షించుకునే సాధనము - తండ్రిని ప్రపంచంగా చేసుకోండి. తండ్రియే ప్రపంచంగా అయినప్పుడు మిగిలినవన్నీ అసారంగా అవుతాయి. కాని మీరు ఏం చేస్తారో తర్వాత ఇంకొక రోజు వినిపిస్తాను. తండ్రియే ప్రపంచము అని గుర్తుంటే దేహం, సంబంధాలు, పదార్థాలు ఏవీ ఉండవు. అన్నీ సమాప్తమైపోతాయి.

నాల్గవ విషయము :- పశ్చాత్తాపమనే అగ్ని - దీనికి సహజ సాధనము - సర్వ ప్రాప్తి స్వరూపులుగా అవ్వడం. అప్రాప్తి పశ్చాత్తాపం కలిగిస్తుంది. ప్రాప్తి పశ్చాత్తాపాన్ని నిర్మూలిస్తుంది. ఇప్పుడు ప్రతి ప్రాప్తిని ఎదురుగా ఉంచుకొని చెక్ చేసుకోండి. ఏ ప్రాప్తిని అనుభవం చేసుకోకుండా ఉండిపోలేదు కదా! ప్రాప్తుల లిస్టు అయితే ఉంది కదా! అప్రాప్తి అనగా - పశ్చాత్తాపం సమాప్తం. ఇప్పుడు ఈ నాలుగు విషయాలను పరిశీలించుకోండి. అప్పుడే శీతలతా స్వరూపంగా అవుతారు. ఇతరుల అగ్నిని చల్లార్చే శీతల యోగిగా లేక శీతల దేవిగా అవుతారు. కనుక శీతల శక్తి అంటే ఏమిటో అర్థమయ్యింది కదా! సత్యతా శక్తిని గురించి వినిపించాను కూడా. మున్ముందు కూడా వినిపిస్తాను. కనుక తారామండలంలో ఏం చూశామో వినిపించాము కదా! విస్తారం తర్వాత వినిపిస్తాను. మంచిది.

సదా చందున్రి సమానం శీతలతా శక్తి స్వరూప పిల్లలకు, సత్యతా శక్తి ద్వారా సత్యయుగాన్ని తీసుకొచ్చే పిల్లలకు, సదా శీతలతా ఛాయతో సర్వుల హృదయాలకు విశ్రాంతినిచ్చే పిల్లలకు, సదా నలువైపులా ఉన్న అగ్ని నుండి సురక్షితంగా ఉండే శీతలయోగి, శీతలదేవి పిల్లలకు జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చందున్రి పియ్ర స్మృతులు మరియు నమస్తే.

విదేశీ టీచర్ సోదరీ - సోదరులతో అవ్యక్త బాప్దాదా కలయిక

ఇది ఎలాంటి గ్రూప్? (రైట్ హ్యాండ్ సేవాధారుల గ్రూప్) ఈ రోజు బాప్దాదా తన స్నేహితులను కలుసుకునేందుకు వచ్చారు. స్నేహితుల సంబంధం రమణీయంగా ఉంటుంది. ఎలాగైతే తండ్రి పిల్లల స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారో, అలా పిల్లలు కూడా తండ్రి స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారు. కనుక ఇది లవ్లీన్ గ్రూప్. తింటూ, త్రాగుతూ, నడుస్తూ ఎక్కడ లీనమై ఉంటున్నారు? ప్రేమలోనే ఉంటున్నారు కదా! లవలీనంగా ఉండే ఈ స్థితి సదా ప్రతి విషయంలో సహజంగానే తండ్రి సమానంగా చేసేస్తుంది. ఎందుకంటే తండ్రి ప్రేమలో లీనమై ఉంటారు కనుక సాంగత్య రంగు అంటుకుంటుంది కదా! కష్టము లేక శ్రమ నుండి ముక్తులుగా అయ్యేందుకు సహజ సాధనము - లవలీనమై ఉండడం. ఈ లవలీన అవస్థ అదృష్టము. ఈ అవస్థలో మాయ రాలేదు. కావున ఇది బాప్దాదాకు అత్యంత స్నేహంగా, సమీపంగా, సమానంగా ఉండే గ్రూప్. మీ సంకల్పము మరియు తండ్రి సంకల్పానికి తేడా లేదు. ఇలా సమీపంగా ఉన్నారు కదా. అప్పుడే తండ్రి సమానం విశ్వ కళ్యాణకారులుగా అవ్వగలరు. తండ్రి సంకల్పమే పిల్లల సంకల్పము, తండ్రి మాటలే పిల్లల మాటలు. కావున మీ ప్రతి కర్మ ఎలా అవ్వాలి? అద్దము. కనుక ప్రతి కర్మ తండ్రి కనిపించే దర్పణముగా అవ్వాలి. ఇలాంటి గ్రూప్గా ఉన్నారు కదా! చాలా అద్దాలు ఉంటాయి. ప్రపంచంలో కూడా పెద్దది చిన్నదిగా, చిన్నది పెద్దదిగా కనిపించే అద్దాలు చాలా తయారు చేస్తారు. కావున మీ ప్రతి కర్మ అనే దర్పణం ఏం చూపిస్తుంది? మీరు మరియు తండ్రి డబల్ గా కనిపించాలి. మీలో తండ్రి కనిపించాలి. మీరు తండ్రితో పాటు కనిపించాలి. ఎలాగైతే బ్రహ్మబాబాలో సదా డబల్ కనిపించేవారో అలా మీలో ప్రతి ఒక్కరిలో సదా తండ్రి కనిపిస్తూ ఉంటే డబల్ కనిపించినట్లే కదా! ఇలాంటి అద్దముగా ఉన్నారా? సేవాధారులు విశేషించి ఏ సేవకు నిమిత్తంగా ఉన్నారు! తండ్రిని ప్రత్యక్షం చేసేదే విశేషమైన సేవ. కావున ప్రతి కర్మ మాట సంకల్పం ద్వారా తండ్రిని చూపించాలి. సదా ఇదే కార్యంలో ఉంటున్నారు కదా! ఎవరైనా ఆత్మ ఎప్పుడైనా ఏ ఆత్మనైనా చూస్తూ వీరు చాలా బాగా మాట్లాడ్తారు, వీరు చాలా బాగా సేవ చేస్తారు, వీరు చాలా బాగా దృష్టినిస్తారు అని అన్నట్లయితే అది కూడా తండ్రిని చూడలేదు, ఆత్మను చూశారు. ఇది కూడా తప్పే. మిమ్ములను చూసి నోటి నుండి 'బాబా' అని రావాలి. అప్పుడే శక్తిశాలి దర్పణమని అంటారు. ఒంటరిగా ఆత్మ కనిపించకూడదు. తండ్రి కనిపించాలి. వీరినే యథార్థ సేవాధారి అని అంటారు. అర్థమయిందా! మీ ప్రతి సంకల్పంలో, మాటలో ఎంతగా బాబా బాబా అని ఉంటే అంత ఇతరులకు మీ ద్వారా బాబా కనిపిస్తారు. ఈ రోజు సైన్సు సాధనాలతో మొదట ఏ వస్తువు చూపిస్తారో అది అదృశ్యమై మరొకటి కనిపిస్తుందో అలా మీ సైలెన్స్ శక్తి మిమ్ములను చూపిస్తూ మిమ్ములను అదృశ్యం చేసి తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి. ఇలాంటి శక్తిశాలి సేవ జరగాలి. తండ్రితో సంబంధం జోడించినట్లయితే ఆత్మలు సదా శక్తిశాలిగా అవుతాయి. మన ఆత్మతో సంబంధం జోడింపబడ్తే సదా కొరకు శక్తిశాలిగా అవ్వలేరు. అర్థమయిందా! సేవాధారుల విశేష సేవ ఏమిటి? తమ ద్వారా తండ్రిని చూపించాలి. మిమ్ములను చూడాలి, బాబా పాటలు పాడడం ప్రారంభించాలి. ఇలాంటి సేవ చేస్తారు కదా! మంచిది.

అందరూ అమృతవేళ దిల్ ఖుష్ మిఠాయి(మనసును సంతోషపెట్టే మిఠాయి) తింటున్నారా? సేవాధారి ఆత్మలు రోజూ మనసుకు ఇష్టమైన మిఠాయి తింటూ ఉంటే ఇతరులకు కూడా తినిపిస్తారు. తర్వాత మీ వద్దకు బలహీనమైన మాటలు రావు. జిజ్ఞాసులు ఈ మాటలు తీసుకొని రారు. లేకుంటే ఇందులో కూడా సమయం ఇవ్వవలసి వస్తుంది కదా! తర్వాత ఈ సమయం కూడా రక్షించబడుతుంది మరియు ఇదే సమయంలో అనేక మందికి దిల్ ఖుష్ మిఠాయి తినిపిస్తూ ఉంటారు. మంచిది.

మీరందరూ సదా సంతోషంగా ఉంటున్నారా? ఎప్పుడూ ఏ సేవాధారులు ఏడ్వడం లేదు కదా! మనసులో కూడా ఏడ్వడం జరుగుతుంది. కేవలం కనులతోనే కాదు, కనుక ఏడ్చేవారు కారు కదా! మంచి ఫిర్యాదులు చేసేవారా? తండ్రి ముందు ఫిర్యాదు చేస్తున్నారా? ఇలా నాతో ఎందుకు జరుగుతుంది! నాకే ఇలాంటి పాత్ర ఎందుకు! నా సంస్కారాలే ఇలా ఎందుకు ఉన్నాయి! నాకే ఇలాంటి జిజ్ఞాసులు ఎందుకు లభించారు లేక నాకే ఇలాంటి దేశం ఎందుకు లభించింది ఇలాంటి ఫిర్యాదులు చేసేవారైతే కాదు కదా? ఫిర్యాదు అనగా భక్తి యొక్క అంశము, ఎలా ఉన్నా పరివర్తన చెయ్యడం సేవాధారుల విశేష కర్తవ్యము. దేశం కావచ్చు, జిజ్ఞాసులు కావచ్చు, తమ సంస్కారాలు కావచ్చు, తోటివారు కావచ్చు ఫిర్యాదుకు బదులు పరివర్తన చేసే కార్యంలో లగ్నము చేయండి. సేవాధారులు ఎప్పుడూ ఇతరుల బలహీనతలు చూడరు, ఇతరుల బలహీనతలు చూస్తూ ఉంటే స్వయం మీరు కూడా బలహీనమవుతారు. అందువలన సదా ప్రతి ఒక్కరి విశేషతను చూడండి, విశేషతను ధారణ చెయ్యండి, విశేషతనే వర్ణించండి. ఇదే సేవాధారులకు విశేషంగా ఎగిరే కళకు సాధనము. అర్థమయిందా! ఇంకా సేవాధారులు ఏం చేస్తారు? చాలా మంచి మంచి ప్లాన్లు తయారు చేస్తారు. ఉల్లాస-ఉత్సాహాలు కూడా బాగున్నాయి. తండ్రి మరియు సేవతో స్నేహం కూడా మంచిగా ఉంది. ఇప్పుడు ముందు ఏం చెయ్యాలి?

ఇప్పుడు విశ్వంలో విశేషంగా రెండు శక్తులున్నాయి.1. రాజ్యాధికార శక్తి 2. ధర్మాధికార శక్తి ధర్మ నేతలు మరియు రాజకీయ నాయకులు. ఇతర వృత్తుల వారు కూడా వేరు వేరుగా ఉన్నారు కానీ అధికారం(శక్తి) ఈ ఇరువురితో ఉంది. కావున ఇప్పుడు ఈ రెండు శక్తులకు స్పష్టంగా ఎటువంటి అనుభవం అవ్వాలంటే, ధర్మశక్తి కూడా ఇప్పుడు శక్తిహీనంగా అయ్యింది, రాజ్యాధికారం కలిగిన వారు కూడా మాలో పేరుకు రాజ్యాధికారం ఉంది కానీ అధికారం(శక్తి) లేదు అని అనుభవం చెయ్యాలి. ఎలా అనుభవం చేయించాలి, అందుకు సాధనం ఏది? రాజకీయ నాయకులు లేక ధర్మ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి ''పవిత్రతను మరియు ఏకతను(ఐకమత్యం)'' అనుభవం చేయించండి. ఈ లోపం కారణంగానే రెండు సత్తాలు(శక్తులు) బలహీనంగా ఉన్నాయి. కావున పవిత్రత ఏమిటి ఐకమత్యం ఏమిటి - దీని పై వారికి స్పష్టమైన వివరణ లభించినట్లయితే వారు స్వయమే, మేము బలహీనంగా ఉన్నాము వీరు శక్తిశాలిగా ఉన్నారు అని అర్థం చేసుకుంటారు. దీని కొరకు విశేషంగా మననం చెయ్యండి. ధర్మ సత్తాను, ధర్మ సత్తా హీనంగా చేసేందుకు విశేషమైన పద్ధతి - పవిత్రతను ఋజువు చేయడం. రాజ్య సత్తా కలిగిన వారి ముందు ఐకమత్యాన్ని ఋజువు చేయడం. ఈ టాపిక్ పై మననం చెయ్యండి. ప్లాన్ తయారు చెయ్యండి, వారి వద్దకు చేర్చండి. ఈ రెండు శక్తులను ఋజువు చేసినట్లయితే ఈశ్వరీయ సత్తా జెండా చాలా సహజంగా ఎగురవేయబడ్తుంది. ఇప్పుడీ రెండింటి వైపు విశేషమైన గమనం(అటెన్షన్) కావాలి. లోపల అర్థం చేసుకుంటారు కానీ ఇంకా బాహ్య అభిమానం ఉంది. పవిత్రత మరియు ఐకమత్యాల శక్తితో వీరి సమీప సంపర్కంలోకి వచ్చే కొలది స్వయం వారే మన వర్ణన చెయ్యడం ప్రారంభిస్తారు. అర్థమయిందా! ఎప్పుడైతే రెండు అధికారాలను బలహీనంగా ఋజువు చేస్తారో అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. మంచిది.

సేవాధారి గ్రూప్ అయితే సదా సంతుష్టంగానే ఉంటారు. తమతో, తోటివారితో, సేవతో అన్ని రకాలుగా సంతుష్ట యోగులుగా ఉంటారు. ఈ సంతుష్టతా సర్టిఫికెట్ తీసుకున్నారు కదా! బాప్దాదా, నిమిత్త దాదీ, దీదీలు అందరూ అవును, వీరు సంతుష్ట యోగులు అని మీకు సర్టిఫికెట్ ఇవ్వాలి. నడుస్తూ, తిరుగుతూ కూడా సర్టిఫికెట్ లభిస్తుంది. మంచిది. ఎప్పుడూ మూడ్ ఆఫ్ అవ్వడం లేదు కదా? సేవతో ఎప్పుడైనా అలసిపోయి మూడ్ ఆఫ్(ఉదాసీనంగా) అవ్వడం లేదు కదా? ఏం చెయ్యాలి, ఇంత నాకు ఎందుకు పట్టింది? ఇలా అయితే లేరు కదా!


ఇప్పుడీ విషయాలన్నీ స్వయంలో చెక్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా అలా ఉన్నట్లయితే పరివర్తన చేసుకోవాలి. ఎందుకంటే సేవాధారి అనగా స్టేజి పై అన్ని పనులు చేసేవారు. స్టేజిపై ప్రతి అడుగు శ్రేష్ఠంగా మరియు యుక్తి యుక్తంగా వెయ్యవలసి ఉంటుంది. నేను ఫలానా దేశంలో సెంటరులో కూర్చుని ఉన్నానని ఎప్పుడూ భావించకండి. కాని విశ్వం అనే స్టేజి పై కూర్చుని ఉన్నాను. ఈ స్మృతిలో ఉన్నట్లయితే ప్రతి కర్మ స్వత:గానే శ్రేష్ఠంగా అవుతుంది. మిమ్ములను అనుసరించేవారు కూడా చాలామంది ఉన్నారు. అందువలన సదా మీరు తండ్రిని అనుసరిస్తూ ఉంటే మిమ్ములను అనుసరించే వారు కూడా తండ్రిని అనుసరిస్తారు. కావున పరోక్షంగా తండ్రిని అనుసరించిన వారిగా అవుతారు. ఎందుకంటే మీ ప్రతి కర్మ ఫాలో ఫాదర్ గా ఉంది. అందువలన ఇది సదా స్మృతిలో ఉంచుకోండి. మంచిది. ప్రేమ కారణంగా కష్టానికి అతీతంగా ఉన్నారు.

Comments