06-03-1985 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
'' సంగమ యుగము ఉత్సవాల యుగము, బ్రాహ్మణ జీవితము ఉత్సాహాల యుగము ''
ఈ రోజు పవిత్రమైన, ఉన్నతమైన తండ్రి తన హోలీ మరియు సంతోషంగా ఉన్న హంసలతో హోలీ జరుపుకునేందుకు వచ్చారు. త్రిమూర్తి తండ్రి హోలీ దివ్య రహస్యాన్ని మూడు రకాలుగా వినిపించేందుకు వచ్చారు. సంగమ యుగము హోలీ యుగము. సంగమ యుగము ఉత్సవాల యుగము. శ్రేష్ఠ ఆత్మలైన మీకు ప్రతి రోజు, ప్రతి సమయము ఉత్సాహంతో నిండిన ఉత్సవము. అజ్ఞానీ ఆత్మలు స్వయాన్ని ఉత్సాహంగా ఉంచుకునేందుకు ఉత్సవము జరుపుకుంటారు. కానీ శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలైన మీకు ఈ బ్రాహ్మణ జీవితమే ఉత్సాహంతో కూడిన జీవితము. సదా సంతోషంగా నాట్యం చేస్తూ, శక్తిశాలి జ్ఞానామృతాన్ని త్రాగుతూ, సుఖాన్ని కలిగించే పాటలు పాడుతూ, హృదయ పూర్వక స్నేహంతో పాటలు పాడుతూ తమ శ్రేష్ఠ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అజ్ఞానీ ఆత్మలు ఒక్క రోజు జరుపుకుంటారు. అల్పకాలిక ఉత్సాహంలోకి వస్తారు తర్వాత ఎలా ఉన్నవారు అలాగే ఉంటారు. మీరు ఉత్సవము జరుపుకుంటూనే హోలీగా అవుతారు, ఇతరులను కూడా హోలీగా చేస్తారు. వారు కేవలం జరుపుకుంటారు. మీరు జరుపుకుంటూనే తయారవుతారు. మనుషులు మూడు రకాలుగా హోలీ జరుపుకుంటారు. ఒకటి - అగ్నితో కాల్చే హోలీ, రెండవది - రంగులు వేసుకునే హోలీ, మూడవది - మంగళ మిలనము చేసే హోలీ. ఈ మూడు ఆత్మిక స్నేహానికి సంబంధించినవే. కానీ వారు స్థూల రూపంలో జరుపుకుంటూ ఉంటారు. ఈ సంగమ యుగంలో మహాన్ ఆత్మలైన మీరు తండ్రివారిగా అవ్వడం అనగా హోలీగా అవుతున్నట్లయితే మొదట ఏం చేస్తారు? మొదట పాత స్వభావ సంస్కారాలను యోగ అగ్నితో భస్మం చేస్తారు అనగా కాలుస్తారు. కాల్చిన తర్వాతనే స్మృతి ద్వారా తండ్రి సాంగత్యం అనే రంగు అంటుకుంటుంది. మీరు కూడా మొదట కాల్చే హోలీ జరుపుకుంటారు. తర్వాత ప్రభు సాంగత్యం అనే రంగులో రంగరించబడ్తారు అనగా తండ్రి సమానంగా తయారవుతారు. తండ్రి జ్ఞానసాగరుడు, అయితే పిల్లలు కూడా తండ్రి సాంగత్య రంగులో జ్ఞాన స్వరూపంగా అవుతారు. తండ్రి గుణాలు మీ గుణాలుగా అవుతాయి. తండ్రి శక్తులు మీ ఖజానాలుగా అవుతాయి, మీ ఆస్తిగా అవుతాయి. కావున ఇలాంటి సాంగత్య రంగు అవినాశిగా అంటుకొని జన్మ-జన్మాంతరాలకు ఈ రంగు అవినాశిగా అవుతుంది. సాంగత్య రంగు అంటుకున్నప్పుడు ఈ ఆత్మిక రంగుతో హోలీ జరుపుకుంటే ఆత్మ-పరమాత్మల మిలనము అనగా తండ్రి మరియు పిల్లల శ్రేష్ఠ మిలన మేళా సదా జరుగుతూనే ఉంటుంది. అజ్ఞానీ ఆత్మలు తమ ఈ ఆత్మిక హోలీని స్మృతి చిహ్న రూపంలో జరుపుకోవడం ప్రారంభించారు. ఉత్సాహంతో నిండిన మీ ప్రాక్టికల్ జీవితాన్ని భిన్న-భిన్న రూపాలలో స్మృతి చిహ్నంగా జరుపుకొని అల్పకాలం కొరకు సంతోషిస్తారు. ప్రతి అడుగులో తమ శ్రేష్ఠ జీవితంలో ప్రాప్తించిన విశేషతలను జ్ఞాపకం చేసుకొని కొంత సమయం కొరకు వారు కూడా సంతోషాలు జరుపుకుంటూ ఉంటారు. ఈ స్మృతిచిహ్నాన్ని చూసి లేక విని ఇవి మా విశేషతల స్మృతి చిహ్నమని సంతోషిస్తారు కదా! మీరు మాయను కాల్చేశారు, వారు హోళికను తయారు చేసి కాలుస్తారు. ఎంత రమణీయ కథలు తయారు చేశారంటే అవి విని మా విషయాలను ఎలా తయారు చేశారు అని మీకు నవ్వు వస్తుంది. హోలి ఉత్సవము మీ భిన్న-భిన్న ప్రాప్తుల స్మృతి రూపంలో జరుపుకుంటారు. ఇప్పుడు మీరు సదా సంతోషంగా ఉంటారు. సంతోష ప్రాప్తికి స్మృతిచిహ్నాన్ని చాలా సంతోషంగా ఉండి హోలీ జరుపుకుంటారు. ఆ సమయంలో అన్ని దు:ఖాలు మర్చిపోతారు. మీరు సదా కాలం కొరకు దు:ఖం మర్చిపోయారు. మీ సంతోషపు ప్రాప్తిని స్మృతిచిహ్నాన్ని జరుపుకుంటారు.
ఇంకొక విషయం - జరుపుకునే సమయంలో చిన్న పెద్ద చాలా తేలికగా అయ్యి తేలికగా జరుపుకుంటారు. ఆ రోజు కొరకు అందరి మూడ్(స్వభావం) కూడా తేలికగా ఉంటుంది. కావున ఇది మీరు డబల్లైట్గా అయినందుకు స్మృతి చిహ్నము. ప్రభువు సాంగత్యము రంగులో రంగరించబడినట్లయితే డబల్ లైటుగా అవుతారు కదా! కావున ఇది ఈ విశేషత యొక్క స్మృతి చిహ్నము. ఇంకొక విషయము - ఈ రోజు చిన్న పెద్ద ఏ సంబంధం వారైనా సమాన స్వభావంతో ఉంటారు. చిన్న మనవడు కూడా తాతగారికి రంగు పూస్తాడు. అన్ని సంబంధాల వారు తమ వయసును మర్చిపోతారు. సమాన భావంలోకి వచ్చేస్తారు. ఇది కూడా విశేషించి మీ సమాన భావం అనగా సోదర-సోదర స్థితి, ఇతర దేహ సంబంధం యొక్క దృష్టి ఉండదు. ఇది సోదర-సోదర సమాన స్థితికి స్మృతిచిహ్నము. ఇంకొక విషయము - ఈ రోజు భిన్న భిన్న రంగులతో బాగా పిచికారి నింపి ఒకరినొకరు రంగులతో రంగరించుకుంటారు. ఇది కూడా ఈ సమయంలో మీ సేవకు స్మృతిచిహ్నము. ఏ ఆత్మకైనా తమ దృష్టి అనే పిచికారి ద్వారా ప్రేమ స్వరూపంగా చేసే రంగు, ఆనంద స్వరూపంగా చేసే రంగు, సుఖం, శాంతి, శక్తులనే ఎన్ని రంగులు వేస్తారు? సదా అంటుకొని ఉండే రంగులు వేస్తారు. తొలగించే పని ఉండదు, శ్రమ చెయ్యవలసిన అవసరం ఉండదు ఇంకా ఈ రంగులలోనే సదా మునిగి ఉండాలని ప్రతి ఆత్మ కోరుకుంటుంది. అందరి వద్ద ఆత్మిక రంగుల ఆత్మిక దృష్టి అనే పిచికారి ఉంది కదా! హోలి ఆడతారు కదా! ఈ ఆత్మిక హోలీ మీ అందరి జీవితం యొక్క స్మృతి చిహ్నము. బాప్దాదాతో మంగళ మిలనము ఎలా జరుపుకున్నారంటే ఈ మిలనం చేస్తూ చేస్తూ తండ్రి సమానంగా అయిపోయారు, తండ్రితో కంబైండ్గా అయిపోయారు. ఎవ్వరూ వేరు చెయ్యలేరు.
ఇంకొక విషయము - ఈ రోజు గడిచిపోయిన విషయాలన్నింటిని మర్చిపోయే రోజు. 63 జన్మలలో గడిచిపోయిన వాటిని మర్చిపోతారు కదా! గడిచిపోయిన విషయాలకు బిందువు పెడ్తారు కదా! అందువలన హోలీని గడిచిందేదో గడిచిపోయిందనే అర్థంలో కూడా చెప్తారు. ఎలాంటి కఠినమైన శత్రువైనా మరిచి మిలనం చేసే రోజు అని అంగీకరిస్తారు. మీరు కూడా ఆత్మకు శత్రువులైన రాక్షస సంస్కారాలు, రాక్షస స్వభావాన్ని మరిచి ప్రభువు మిలనం జరుపుకున్నారు కదా! సంకల్పమాత్రం కూడా పాత సంస్కారాలు స్మృతిలోకి రాకూడదు. ఇది కూడా మీరు మర్చిపోయే విశేషతకు స్మృతి చిహ్నంగా జరుపుకుంటున్నారు. కావున మీ విశేషతలు ఎన్ని ఉన్నాయో విన్నారు కదా? మీ ప్రతి గుణము, ప్రతి విశేషత, కర్మకు వేరు వేరు స్మృతిచిహ్నాలు తయారు చేశారు. ఎవరి ప్రతి కర్మ స్మృతి చిహ్నంగా తయారవుతుందో ఎవరిని స్మృతి చేసి సంతోషంలోకి వస్తారో వారు స్వయంగా ఎంత మహాన్గా ఉన్నారు. మీరు ఎవరో మీకు అర్థం అయ్యిందా? హోలీగానే ఉన్నారు కానీ ఎంత విశేషంగా ఉన్నారు!
డబల్ విదేశీయులకు భలే తమ ఈ శ్రేష్ఠత యొక్క స్మృతిచిహ్నము తెలియకపోయినా తమ స్మృతి యొక్క మహత్వాన్ని ప్రపంచం వారు గుర్తు చేసుకొని స్మృతిచిహ్నాన్ని జరుపుకుంటున్నారు. హోలీ అంటే ఏమిటో అర్థమయిందా? మీరందరూ రంగులో రంగరించబడే ఉన్నారు. ప్రేమ రంగులో ఎలా రంగరించబడి ఉన్నారంటే తండ్రి తప్ప ఇంకేమీ కనిపించకుండా రంగరించబడ్డారు. స్నేహంలోనే తింటూ, త్రాగుతూ, నడుస్తూ, పాడుతూ, నాట్యం చేస్తూ ఉంటారు. పక్కా రంగు అంటుకుందా లేక కచ్ఛాగా ఉందా? ఎలాంటి రంగు అంటుకుంది? కచ్ఛా రంగా లేక పక్కా రంగా? గడిచిపోయిన దానికి బిందువు పెట్టారా? పొరపాటున కూడా పాత విషయాలు జ్ఞాపకం రాకూడదు. ఏం చెయ్యాలి వచ్చేసిందని అంటారు కదా. ఇది పొరపాటుగా వచ్చిందని అంటారు కదా! ఇది కొత్త జన్మ, కొత్త మాటలు, కొత్త సంస్కారాలు, కొత్త ప్రపంచము. ఈ బ్రాహ్మణుల ప్రపంచము కూడా కొత్తది, బ్రాహ్మణుల భాష కూడా కొత్తది కదా! ఆత్మ భాష కొత్తది కదా. వారు ఏమంటారు, మీరు ఏమంటారు? పరమాత్మ పట్ల కూడా అన్నీ కొత్త విషయాలే ఉన్నాయి. కావున భాష కూడా కొత్తది. పద్ధతులు, ఆచారాలు కొత్తవే. సంబంధ సంపర్కాలు కూడా కొత్తవే. అన్నీ కొత్తవే అయినాయి. పాతది సమాప్తమైపోయింది. కొత్తది మొదలయింది. కొత్త పాటలు పాడ్తారు, పాతవి కాదు. ఎందుకు, ఏమిటి అనేవి పాత పాటలు. ఆహా, ఓహో, వాహ్ ఇవి కొత్త పాటలు. కావున ఎలాంటి పాటలు పాడుకుంటారు? అయ్యో అయ్యో అనే పాటలు పాడడం లేదు కదా! అయ్యో అయ్యో అనేవారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, మీరు కాదు. కావున అవినాశి హోలి జరుపుకున్నారు అనగా గడిచిపోయిన దానికి బిందువు పెట్టి సంపూర్ణ పవిత్రంగా అయ్యారు. తండ్రి సాంగత్య రంగులో రంగరించబడ్డారు. కావున హోలీ జరుపుకున్నారు కదా!
సదా 'తండ్రి మరియు నేను' జత జతలో ఉన్నాము, సంగమ యుగమంతా సదా జతలో ఉంటాము. వేరుగా అవ్వనే అవ్వలేము. ఇలాంటి ఉత్సాహ-ఉల్లాసాలు 'నేను మరియు నా బాబా' అని హృదయంలో ఉంది కదా! లేక తెర వెనుక మూడవవారు కూడా ఎవరైనా ఉన్నారా? అప్పుడప్పుడు ఎలుక, అప్పుడప్పుడు పిల్లి బయటకు రావడం లేదు కదా! అన్నీ సమాప్తమైపోయాయి కదా! తండ్రి లభించారంటే అన్నీ లభించినట్లే. పొందాల్సిందేమీ ఉండదు. సంబంధీకులు మిగలరు. ఖజానా ఉండదు, శక్తి, గుణాలు, జ్ఞానం, పొందవలసిన ప్రాప్తి ఏదీ ఉండదు. కనుక ఇంకేమి కావాలి, దీనినే హోలీ జరుపుకోవడమని అంటారు. అర్థమయిందా?
మీరు ఎంత సంతోషంగా ఉంటారు? నిశ్చింత చక్రవర్తి, గుడ్డి గవ్వ లేకుండా చక్రవర్తి. ఇలాంటి సంతోషంలో ఎవ్వరూ ఉండరు. ప్రపంచంలోని షావుకార్లందరి కంటే షావుకారు కావచ్చు లేక ప్రపంచంలో ఎవరైనా ప్రసిద్ధమైన వ్యక్తి కావచ్చు, చాలా గొప్ప శాస్త్రవాది కావచ్చు, వేద పాఠాలు చదువుకున్నవారు కావచ్చు, మూఢ భక్తులు కావచ్చు, నెంబర్వన్ సైన్సువారు(విజ్ఞానవేత్తలు) కావచ్చు, ఏ వృత్తి వారికైనా ఇలాంటి సంతోషకరమైన సంతోషంతో కూడిన జీవితం, మొత్తం విశ్వమంతా తిరగండి, ఎవరైనా లభించినట్లయితే తీసుకు రండి. అందుకే పాటలు పాడ్తారు కదా! మధువనంలో, తండ్రి ప్రపంచంలో సంతోషాలే సంతోషాలు ఉన్నాయి. తింటున్నా సంతోషమే, నిదురిస్తున్నా సంతోషమే. మాత్ర వేసుకొని నిద్రపోవాల్సిన అవసరం లేదు. తండ్రి జతలో నిద్రపోతే టాబ్లెట్(మాత్ర) వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒంటరిగా నిదురిస్తే హై బి.పి. ఉంటుంది, బాధ ఉంటుంది. కావున మాత్ర వేసుకోవాల్సి వస్తుందని అంటారు. తండ్రి తోడుగా ఉన్నారు. తండ్రి జతలో నిదురిస్తున్నారు. ఇదియే టాబ్లెట్(మాత్ర). ఎటువంటి సమయం మళ్లీ వస్తుందంటే ఆదిలో మందులు ఉండేవి కావు. జ్ఞాపకం ఉంది కదా! ఆదిలో ఎంత సమయం మందులు ఉండేవి కావు, అవును కొంచెం వెన్న, మీగడ తినేవారు. మందులు తినేవారు కాదు. ఆదిలో అభ్యాసం చేయించారు కదా! ఇది పాత శరీరం. అంతిమంలో ఆదిలో ఉన్న రోజులు మళ్లీ వస్తాయి. విచిత్రమైన సాక్షాత్కారాలన్నీ చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి సాక్షాత్కారమవ్వాలని చాలా మందికి కోరిక ఉంటుంది. చివరి వరకు ఎవరైతే దృఢంగా ఉంటారో వారికి సాక్షాత్కారాలు అవుతాయి. మళ్లీ అదే సంఘటన యొక్క భట్టి ఉంటుంది. సేవ పూర్తి అయిపోతుంది. ఇప్పుడు సేవ కారణంగా అక్కడక్కడ చెదిరిపోతున్నారు. మళ్లీ నదులన్నీ సాగరంలో ఇమిడిపోతాయి. కాని సమయం సున్నితంగా ఉంటుంది. సాధనాలు ఉన్నా పని చేయవు. అందువలన బుద్ధి లైన్ చాలా స్పష్టంగా ఉండాలి. ఇప్పుడు ఏం చెయ్యాలో టచ్ అవుతుంది. ఒక్క సెకండ్ ఆలస్యం అయినా కూడా వెళ్లిపోయినట్లే. ఎలాగైతే వారు కూడా బటన్ నొక్కడంలో ఒక్క సెకండు ఆలస్యం చేసినా ఫలితం ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా ఒక్క సెకండ్ టచింగ్ కావడంలో ఆలస్యం అయినా చేరుకోవడం కష్టమవుతుంది. వారు కూడా ఎంత ఏకాగ్రంగా కూర్చుంటారు. కావున ఇది బుద్ధి యొక్క టచింగ్. ఆదిలో ఇంట్లో కూర్చుంటూనే ధ్వని వచ్చేది. రండి చేరుకోండి, ఇప్పుడే బయలుదేరండి అని పిలుపు వినిపించేది, వెంటనే బయలుదేరేవారు. అలాగే చివర్లో కూడా తండ్రి పిలుపు వినిపిస్తుంది. సాకారంలో పిల్లలందరినీ పిలిచారు కదా. అలాగే ఆకార రూపంలో పిల్లందరినీ రండి, రండి అని ఆహ్వానిస్తారు. రండి మరియు జతలో(తోడుగా) వెళ్లండి. ఇలా సదా తమ బుద్ధి స్పష్టంగా ఉండాలి. ఏకాగ్రత ఎటువైపు అయినా వెళ్లినట్లయితే తండ్రి పిలుపు, తండ్రి ఆహ్వానం మిస్(దూరం) అవుతుంది. ఇవన్నీ జరగనే జరుగుతాయి.
మేమైతే చేరుకుంటామని టీచర్లు అనుకుంటున్నారు. మీకు అక్కడే తండ్రి డైరెక్షన్ (మార్గదర్శనం) ఇవ్వవచ్చు కూడా. అక్కడ ఏదైనా విశేషమైన పని ఉండవచ్చు, అక్కడ ఎవరికైనా శక్తి ఇవ్వాల్సి ఉండవచ్చు. జతలో తీసుకు వెళ్లడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతాయి కానీ తండ్రి ఆజ్ఞానుసారంగా ఉండాలి. మన్మతంతో కాదు, ఆకర్షణతో కాదు. అయ్యో నా సెంటర్ అని జ్ఞాపకం రాకూడదు, ఫలానా విద్యార్థిని కూడా తోడుగా తీసుకు వెళ్ళాలి, వీరు అనన్యులు(ఇతరుల కంటే మంచివారు) సహాయకులు, ఇలా ఉండరాదు. ఎవరి కోసమైనా ఆగినట్లయితే మీరు ఉండిపోతారు. ఇలా తయారుగా ఉన్నారు కదా! వీరిని ఎవర్రెడీ అని అంటారు. ఎల్లప్పుడు అన్నీ సర్దుకొని ఉంటారు. ఆ సమయంలో సర్దుకోవాలనే సంకల్పం రాకూడదు. ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి అని అనుకోరాదు. సాకారంలో జ్ఞాపకం ఉంది కదా, సేవాధారి పిల్లల స్థూల బ్యాగ్లు, సూట్కేసులు సదా రెడీగా ఉండేవి. రైలు వచ్చేందుకు 5 నిమిషాలు ఉండేది. అప్పుడు వెళ్లమని ఆదేశం లభించేది. కనుక బ్యాగులు సర్దబడి రెడీగా ఉండేవి. ఒక స్టేషన్ ముందే రైలు చేరుకునేది మరియు వీరు వెళ్లేవారు. ఇలా కూడా అనుభవం చేశారు కదా! ఇక్కడ కూడా మానసిక స్థితిలో సూట్కేసు, బ్యాగ్ తయారుగా ఉండాలి. తండ్రి పిలిచారు, పిల్లలు హాజరైపోవాలి. దీనినే ఎవరెడీగా ఉన్నారని అంటారు. మంచిది.
సదా సాంగత్య రంగులో రంగరించబడి సదా గడిచిపోయిన దానికి బిందువు ఉంచి వర్తమానం మరియు భవిష్యత్తును శేష్ఠ్రంగా తయారు చేసుకుంటూ, సదా పరమాత్మతో మిలనం జరుపుకుంటూ, సదా పత్రి కర్మ స్మృతిలో ఉంటూ చేసేవారు అనగా పత్రి కర్మను స్మృతి చిహ్నంగా చేసుకునే వారికి, సదా సంతోషంలో నాట్యం చేస్తూ పాడుతూ సంగమయుగ సంతోషాలు జరుపుకునే వారికి, ఇటువంటి తండ్రి సమానంగా తండ్రి పత్రి సంకల్పాన్ని గహ్రించేవారు, సదా బుద్ధి శేష్ఠ్రంగా మరియు స్పష్టంగా ఉంచుకునే హోలీ హ్యాపి హంసలకు బాప్దాదా పియ్రస్మృతులు మరియు నమస్తే.
బాప్దాదా పిల్లలందరి ఉత్తరాలకు జవాబు ఇస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు
నలువైపులా దేశ-విదేశాల పిల్లలందరి స్నేహంతో నిండిన, ఉత్సాహం-ఉల్లాసాలతో నిండిన లెటర్లు, అక్కడక్కడ తమ ప్రతిజ్ఞలతో నిండిన పురుషార్థపు లెటర్లు మరియు సందేశాలన్నీ బాప్దాదాకు లభించాయి. బాప్దాదా హోలీ హంసలందరికి సదా 'తండ్రి ఎలా ఉంటే నేను అలాగే' అనే స్మృతినిప్పించే విశేష స్లోగన్ను వరదాన రూపంలో జ్ఞాపకం ఇప్పిస్తున్నారు. ఏ కర్మ చేస్తున్నా, సంకల్పం చేస్తున్నా మొదట పరిశీలించుకోండి, తండ్రి సంకల్పమే నా సంకల్పము, తండ్రి కర్మయే నా కర్మగా ఉందా అని సెకండ్లో పరిశీలించుకొని సాకారంలోకి తీసుకు రండి. ఎల్లప్పుడూ తండ్రి సమానంగా శక్తిశాలి ఆత్మగా అయ్యి సఫలతను అనుభవం చేసుకుంటారు. సఫలత జన్మ సిద్ధ అధికారమని సహజ ప్రాప్తిని అనుభవం చేస్తారు. నేను స్వయం సఫలతా నక్షత్రాన్ని. సఫలత నా నుండి దూరమవ్వజాలదు. సఫలత అనే మాల సదా మెడలో తిరుగుతూ ఉంది అనగా ప్రతి కర్మలో అనుభవం చేసుకుంటూ ఉంటారు. బాప్దాదా ఈ రోజు హోలీ సంఘటనలో హోలీ హంసలైన మీ అందరినీ సన్ముఖంలో చూస్తున్నారు, హోలి జరుపుకుంటున్నారు. అందరినీ స్నేహంతో చ్తూస్తున్నారు. అందరి విశేషతల వెరైటీ సుగంధాన్ని తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి విశేషతది ఎంత మధురమైన సుగంధము. తండ్రి ప్రతి విశేష ఆత్మను విశేషతలతో చూస్తూ ఓహో నా సహజయోగి పిల్లలు, ఓహో నా పదమా పదమ్ భాగ్యశాలి పిల్లలూ! అని పాటలు పాడ్తున్నారు. అందరు తమ తమ విశేషతలు మరియు పేరు సహితంగా సన్ముఖంలో స్వయాన్ని అనుభవం చేస్తూ ప్రియస్మృతులు స్వీకరించండి అంతేకాక తండ్రి ఛత్రఛాయలో ఉంటూ మాయతో భయపడకండి. చిన్న విషయము పెద్ద విషయము కాదు. చిన్నదానిని పెద్దదిగా చేయకండి. పెద్దదానిని చిన్నదిగా చెయ్యండి. ఉన్నతంగా ఉన్నట్లయితే పెద్దది చిన్నదిగా అవుతుంది. క్రింద ఉన్నట్లయితే చిన్నది కూడా పెద్దదిగా అవుతుంది. అందువలన బాప్దాదా జతలో ఉన్నారు. హస్తము ఉంది కావున భయపడకండి. బాగా ఎగరండి. ఎగిరేకళతో సెకండ్లో అన్నిటినీ దాటుకోండి. తండ్రి తోడు సదా సురక్షితంగా ఉంచుతుంది, భవిష్యత్లో కూడా ఉంచుతుంది. మంచిది. అందరినీ అల్లారు ముద్దు పిల్లలూ, అపురూప పిల్లలూ! అంటూ బాప్దాదా హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Comments
Post a Comment