02-03-1985 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
'' వర్తమాన ఈశ్వరీయ జన్మ అమూల్యమైన జన్మ ''
ఈ రోజు రత్నాగరుడైన తండ్రి తమ అమూల్యమైన రత్నాలను చూస్తున్నారు. ఇది అలౌకిక అమూల్యమైన రత్నాల దర్బారు. ఒక్కొక్క రత్నము అమూల్యమైనది. ఈ వర్తమాన సమయము విశ్వంలోని మొత్తం సంపద లేక విశ్వంలోని మొత్తం ఖజానా ఒక దగ్గరకు చేర్చండి, దానితో పోలిస్తే ఒక్కొక్క ఈశ్వరీయ రత్నము చాలా రెట్లు విలువైనది. ఒక్కొక్క రత్నమైన మీ ముందు విశ్వంలోని మొత్తం ఖజానాలు ఏమీ కావు. మీరు అంత గొప్ప అమూల్యమైన రత్నాలు. ఈ అమూల్య రత్నాలు సంగమ యుగంలో తప్ప మొత్తం కల్పంలో మరెప్పుడూ లభించజాలవు. సత్యయుగ దేవాత్మల పాత్ర ఈ సంగమయుగ ఈశ్వరీయ అమూల్య రత్నాలుగా తయారయ్యే మీ పాత్ర ముందు సెకండ్ నెంబరుగా అవుతుంది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానంగా ఉన్నారు. సత్యయుగంలో దైవీ సంతానంగా ఉంటారు. ఎలాగైతే ఈశ్వరునికి అందరికంటే శ్రేష్ఠమైన పేరు, మహిమ, జన్మ, కర్మ ఉందో అలా ఈశ్వరీయ రత్నాలకు లేక ఈశ్వరీయ సంతాన ఆత్మలైన మీకు సర్వ శ్రేష్ఠమైన విలువ ఉంది. ఈ శ్రేష్ఠమైన మహిమ లేక శ్రేష్ఠమైన విలువకు స్మృతి చిహ్నముగా ఇప్పుడు కూడా నవరత్నాల రూపంలో గాయనం మరియు పూజలు చేస్తారు. తొమ్మిది రత్నాలు భిన్న భిన్న విఘ్నవినాశక రత్నాలు అని గాయనం చేయబడ్తాయి. ఎలాంటి విఘ్నమో అలాంటి విశేషత గల రత్నంతో రింగు(ఉంగరం) తయారు చేసి ధరిస్తారు లేక లాకెట్లో వేసుకుని ధరిస్తారు లేక ఏదో ఒక రూపంలో ఆ రత్నాన్ని ఇంట్లో ఉంచుకుంటారు. ఇప్పుడు అంతిమ జన్మ వరకు విఘ్నవినాశక రూపంలో తమ స్మృతి చిహ్నాన్ని చూస్తున్నారు. నెంబర్ వారీగా అయితే తప్పకుండా ఉన్నారు కానీ నెంబర్ వారీగా ఉన్నా అందరూ అమూల్యంగా మరియు విఘ్న వినాశకులుగా ఉన్నారు. ఈ రోజు కూడా శ్రేష్ఠ స్వరూపంతో రత్నాలైన మిమ్ములను ఆత్మలు స్వమానంతో ఉంచుకుంటారు. చాలా ప్రేమతో, స్వచ్ఛతతో సంభాళించి ఉంచుకుంటారు. ఎందుకంటే మీరు స్వయాన్ని అంత యోగ్యులుగా భావించకపోవచ్చు కానీ తండ్రి ఆత్మలైన మీ అందరినీ యోగ్యులుగా భావించి తనవారిగా చేసుకున్నారు. ''నీవు నా వాడివి, నేను మీ వాడిని'' అని స్వీకరించారు. ఏ ఆత్మల పై తండ్రి దృష్టి పడిందో ఆ ఆత్మలు అమూల్యంగా అవుతూ ఉంటారు. ప్రభు దృష్టి కారణంగా ఈశ్వరీయ సృష్టిలో ఈశ్వరీయ ప్రపంచంలో శ్రేష్ఠ ఆత్మలగా అవ్వనే అవుతారు. పారసనాథుని సంబంధంలోకి వచ్చినందున పారస రంగు తప్పకుండా అంటుకుంటుంది. అందువలన పరమాత్మ ప్రేమ, దృష్టి లభించడం వలన మొత్తం కల్పమంతా చైతన్య దేవతల రూపంలో, అర్ధకల్పము జడ చిత్రాల రూపంలో లేక భిన్న-భిన్న స్మృతిచిహ్నాల రూపంలో ఉదాహరణానికి రత్నాల రూపంలో కూడా మీ స్మృతిచిహ్నం ఉంది. నక్షత్రాల రూపంలో కూడా మీ స్మృతిచిహ్నం ఉంది. ఏ రూపంలో మీ స్మృతిచిహ్నం ఉన్నా మొత్తం కల్పమంతా సర్వులకు ప్రియంగా ఉన్నారు. ఎందుకంటే అవినాశి ప్రేమసాగరుని ప్రేమ దృష్టి మొత్తం కల్పమంతా ప్రేమకు అధికారిగా తయారు చేస్తుంది. అందువలన భక్తులు అర్ధ ఘడియ, ఒక్క ఘడియ దృష్టి కొరకు, దృష్టి ద్వారా తృప్తి చెందాలని తపిస్తారు. అందువలన ఈ సమయంలోని ప్రేమ దృష్టి అవినాశి ప్రేమకు యోగ్యులుగా తయారు చేస్తుంది. అవినాశి ప్రాప్తి స్వత:గానే జరుగుతుంది. ప్రేమగా స్మృతి చేస్తారు, ప్రేమతో ఉంచుకుంటారు, ప్రేమతో చూస్తారు.
రెండవ విషయము - స్వచ్ఛత అనగా పవిత్రత. మీరు ఈ సమయంలో తండ్రి ద్వారా పవిత్రతను జన్మ సిద్ధ అధికారంగా ప్రాప్తి చేసుకుంటారు. పవిత్రత లేక స్వచ్ఛతను తమ స్వధర్మంగా తెలుసుకుంటారు. అందువలన పవిత్రతను స్వంతం చేసుకున్న కారణంగా ఎక్కడైతే మీ స్మృతిచిహ్నం ఉంటుందో అక్కడ పవిత్రత లేక స్వచ్ఛత ఇప్పుడు కూడా స్మృతిచిహ్న రూపంలో నడుస్తూ ఉంది అంతేకాక అర్ధకల్పమైతే పవిత్ర పాలన, పవిత్రతా ప్రపంచము ఉండనే ఉంటుంది. కావున అర్ధకల్పము పవిత్రతతోనే జన్మిస్తారు, పవిత్రతతోనే పాలింపబడ్తారు, మరో అర్ధకల్పము పవిత్రతతో పూజింపబడ్తారు.
మూడవ విషయము - గొప్ప మనసుతో శ్రేష్ఠంగా భావించి, విలువైనదిగా భావించి సంభాళిస్తారు, ఎందుకంటే ఈ సమయంలో స్వయం భగవంతుడు మాత-పిత రూపంలో పిల్లలైన మిమ్ములను సంభాళిస్తారు అనగా పాలన చేస్తారు. కావున అవినాశి పాలన అయిన కారణంగా, అవినాశి స్నేహంతో సంభాళించిన కారణంగా మొత్తం కల్పమంతా గొప్ప రాయల్టీతో, స్నేహంతో, గౌరవంతో సంభాళించబడ్తారు. ఇలాంటి ప్రేమ, స్వచ్ఛత, పవిత్రత మరియు స్నేహంతో సంభాళించబడేందుకు అవినాశి పాత్రులుగా అవుతారు. కావున ఎంత అమూల్యమైనవారో అర్థమయిందా? ప్రతి రత్నానికి ఎంతో విలువ ఉంది! కావున ఈరోజు రత్నాగరుడైన తండ్రి ప్రతి రత్నం విలువను చూస్తున్నారు. మొత్తం ప్రపంచంలోని అక్షోణి ఆత్మలు ఒకవైపు ఉన్నారు, కానీ పంచ పాండవులైన మీరు అక్షోణి కంటే శక్తిశాలి అయినవారు. అక్షోణి మీ ముందు ఒక్కరితో కూడా సమానం కాదు. మీరు ఇంత శక్తిశాలి అయినవారు. కావున ఎంత విలువైనవారిగా అయ్యారు. ఇంత విలువ ఉందని తెలుసా? లేక అప్పుడప్పుడు మిమ్ములను మీరు మర్చిపోతారా? మిమ్ములను మీరు మర్చిపోయినట్లయితే కలత చెందుతారు, బాధపడ్తారు. మిమ్ములను మీరు మర్చిపోకండి. సదా స్వయాన్ని విలువైన వారిగా భావించి నడవండి, కాని చిన్న తప్పు చెయ్యకండి. అమూల్యమైన వారు కాని తండ్రి జతలో ఉన్న కారణంగా అమూల్యమైన వారు. తండ్రిని మరిచి కేవలం స్వయాన్ని అమూల్యమని భావిస్తే తప్పు అవుతుంది. అమూల్యంగా తయారు చేసేవారిని మర్చిపోకండి. తయారయ్యారు కానీ తయారుచేసే వారి జతలో తయారయ్యారు. ఇది అర్థం చేసుకునే పద్ధతి. పద్ధతి మర్చిపోతే తెలివి, తెలివి తక్కువ రూపంలోకి మారిపోతుంది. తర్వాత 'నాది' అనేది వస్తుంది. పద్ధతిని మర్చిపోతే సిద్ధి అనుభవమవ్వదు. అందువలన విధి పూర్వకంగా స్వయాన్ని విలువైనవారని భావించి విశ్వానికి పూజ్యులుగా అవ్వండి. నేనేమీ కాను అని బాధపడకండి. నేనేమీ కాను అని ఆలోచించకండి. అలాగని అన్నీ నేనే అని కూడా భావించకండి. రెండూ తప్పే అవుతాయి. నేను ఉన్నాను కానీ తయారు చేసేవారు తయారు చేశారు, తండ్రిని తీసేసినట్లయితే పాపం అవుతుంది. తండ్రి ఉంటే పాపం లేదు. ఎక్కడ తండ్రి పేరు ఉందో అక్కడ పాపానికి నామ-రూపాలు కూడా ఉండవు. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ తండ్రి పేరు గుర్తులు ఉండవు. కావున స్వయం మీ విలువను అర్థం చేసుకున్నారా?
భగవంతుని దృష్టికి పాత్రులుగా అయ్యారు, ఇది సాధారణ విషయం కాదు. భగవంతుని పాలనకు పాత్రులుగా అయ్యారు. అవినాశి పవిత్రతకు జన్మ సిద్ధ అధికారానికి అధికారిగా అయ్యారు. జన్మ సిద్ధ అధికారము ఎప్పుడూ కష్టంగా ఉండదు. సహజంగా ప్రాప్తిస్తుంది. అందుకే అధికారి పిల్లలకు పవిత్రత కష్టంగా అనిపించదు. దీనిలో స్వయం అనుభవీగా ఉన్నారు. అధికారి పిల్లలకు పవిత్రత కష్టంగా అనిపించదు. ఎవరికైతే పవిత్రత కష్టమనిపిస్తుందో వారు ఎక్కువగా కదిలిపోతారు (డగ్మగ్ అవుతారు). పవిత్రత మీ స్వధర్మము, జన్మ సిద్ధ అధికారము కనుక సదా సహజంగా అనిపిస్తుంది. ప్రపంచంలోని వారు దూరం పరిగెడ్తారు. ఎందుకు? పవిత్రత కష్టంగా అనిపిస్తుంది. ఎవరైతే అధికారి ఆత్మలు కారో వారికి కష్టమే అనిపిస్తుంది. అధికారి ఆత్మ వస్తూనే పవిత్రత నా తండ్రి ఇచ్చిన అధికారము అందువలన పవిత్రంగా తయారవ్వాల్సిందే అని దృఢ సంకల్పం చేస్తారు. మనసును సదా పవిత్రత ఆకర్షిస్తూ ఉంటుంది. నడుస్తూ, నడుస్తూ అక్కడక్కడ మాయ పరీక్ష తీసుకునేందుకు వచ్చినా సంకల్ప రూపంలో, స్వప్నం రూపంలో వస్తుంది అయినా అధికారి ఆత్మ జ్ఞాన వంతులుగా ఉన్న కారణంగా భయపడరు. కానీ జ్ఞాన శక్తితో సంకల్పాలను పరివర్తన చేసుకుంటారు. ఒక్క సంకల్పం వెనుక అనేక సంకల్పాలను ఉత్పన్నం చెయ్యరు. అంశాన్ని వంశం రూపంలోకి తీసుకు రారు. ఏమయ్యింది, ఇది జరిగింది....... అని అనడమే వంశము. వినిపించాను కదా. ఎందుకు(క్యో) అనేదానితో క్యూ పెట్టేస్తారు. ఇది వంశాన్ని ఉత్పన్నం చేస్తుంది. వచ్చింది మరియు సదాకాలం కొరకు పోయింది. పేపర్ తీసుకునేందుకు వచ్చింది పాసయ్యారు, సమాప్తమయింది. మాయ ఎందుకు వచ్చింది? ఎక్కడ నుండి వచ్చింది? ఇక్కడ నుండి వచ్చిందా? అక్కడ నుండి వచ్చిందా? వచ్చి ఉండరాదు, ఎందుకు వచ్చింది?........ ఈ వంశం ఉండరాదు. మంచిది. వచ్చినా మీరు కూర్చోబెట్టుకోకండి, తరిమేయండి. ఎందుకు వచ్చింది? అని ఆలోచిస్తూ ఉంటే అది వచ్చి కూర్చుంటుంది. ముందుకు తీసుకెళ్లేందుకే వచ్చింది, పేపర్ తీసుకునేందుకు వచ్చింది, క్లాసును పెంచేందుకు, అనుభవీగా తయారు చేసేందుకు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? అలా వచ్చింది అని ఆలోచించకండి. మాయకు ఇలాంటి రూపం ఉంటుందా అని తర్వాత ఆలోచిస్తారు. ఎఱ్ఱగా ఉందా, పచ్చగా ఉందా లేక పసుపు పచ్చగా ఉందా అని ఈ విస్తారంలోకి వెళ్లిపోతారు. అందులోకి వెళ్లకండి. ఎందుకు భయపడ్తున్నారు? దాటుకోండి, గౌరవపూర్వకంగా పాస్ అవ్వండి. జ్ఞాన శక్తి ఉంది, అది శస్త్రము. మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉన్నారు, త్రికాలదర్శిగా ఉన్నారు, త్రివేణిగా ఉన్నారు. ఏం తక్కువగా ఉంది? త్వరగా భయపడకండి. చీమ వచ్చినా భయపడ్తారు. ఎక్కువగా ఆలోచిస్తారు. ఆలోచించడం అనగా మాయకు ఆతిథ్యం ఇవ్వడం. తర్వాత అది ఇల్లుగా తయారు చేసుకుంటుంది. మార్గ మధ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు ఏదైనా మురికి వస్తువు కనిపించినట్లయితే ఏం చేస్తారు? నిలబడి ఇది ఎవరు వేశారు? ఎందుకు వేశారు? ఏమయింది? ఇలా జరగరాదు అని ఆలోచిస్తారా లేక దాటుకొని వెళ్లిపోతారా? ఎక్కువగా వ్యర్థ సంకల్పాల వంశానికి జన్మనివ్వండి. అంశ రూపంలోనే సమాప్తి చెయ్యండి. మొదట సెకండ్ విషయంగా ఉంటుంది. తర్వాత దానిని గంటలలో, రోజులలో, నెలలలోకి పెంచుకుంటారు. నెల తర్వాత ఏమయింది అని అడిగినట్లయితే విషయం సెకండ్ మాత్రమే ఉంటుంది. అందులో భయపడకండి. లోతుగా వెళ్ళండి, జ్ఞాన లోతులలోకి వెళ్ళండి. మాటల లోతులలోకి వెళ్లకండి. బాప్దాదా ఇంత శ్రేష్ఠమైన విలువైన రత్నాలు, చిన్న చిన్న మట్టి కణాలతో ఆడుకుంటూ ఉన్నట్లు చూసినట్లయితే ఈ రత్నాలు, రత్నాలతో ఆడుకునేవారు మట్టి కణాలతో అడుకుంటున్నారు! అని అనుకుంటారు. రత్నాలతో ఆడుకోండి! రత్నాలు అని అంటారు.
బాప్దాదా ఎంతో అల్లారు ముద్దుగా, ప్రేమతో పాలించారు కాబట్టి మిమ్ములను మట్టి కణాలతో ఎలా చూడగలరు? మళ్లీ మురికిగా అయ్యి ఇప్పుడు శుభ్రం చెయ్యండి, శుభ్రం చెయ్యండి అని అంటారు. భయపడ్తారు కూడా. ఇప్పుడు ఎలా చెయ్యాలి? ఏం చెయ్యాలి? అని అంటారు. అసలు మట్టితో ఆడుకోవడమే ఎందుకు! అవి కూడా మట్టిలో పడి ఉండే కణాలే. కావున సదా తమ విలువను తెలుసుకోండి. మంచిది.
ఇలా మొత్తం కల్పంలో విలువైన ఆత్మలకు, పభ్రు పేమ్రకు పాతుల్రైన ఆత్మలకు, పభ్రు పాలనకు పాతుల్రుగా ఉన్న ఆత్మలకు, పవితత్ర జన్మ సిద్ధ అధికారంగా గల అధికారి ఆత్మలకు సదా ''తండ్రి మరియు నేను'' ఈ విధితో సిద్ధిని పొందే ఆత్మలకు సదా అమూల్య రత్నాలుగా అయ్యి రత్నాలతో ఆడుకునే రాయల్ పిల్లలకు బాప్దాదా పియ్రస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో :- 1. సదా తండ్రి నయనాలలో ఇమిడిపోయి ఉన్న ఆత్మగా స్వయాన్ని అనుభవం చేస్తున్నారా? నయనాలలో ఎవరు ఇమిడిపోతారు? ఎవరైతే చాలా తేలికగా బిందువుగా ఉన్నారో వారు. కనుక సదా బిందువుగా ఉన్నారు మరియు బిందువుగా అయ్యి తండ్రి నయనాలలో ఇమిడిపోయేవారు. బాప్దాదా మీ నయనాలలో ఇమిడిపోయి ఉన్నారు, మీరందరూ బాప్దాదా నయనాలలో ఇమిడిపోయి ఉన్నారు. నయనాలలోనే బాప్దాదా ఉన్నప్పుడు ఇంకేమీ కనిపించదు. కావున సదా ఈ స్మృతితో నేనున్నదే బిందువును అని డబల్లైట్గా ఉండండి. బిందువులో ఏ భారమూ లేదు. ఈ స్మృతి స్వరూపము సదా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. కళ్ళ మధ్యలో చూసినట్లయితే బిందువే ఉంటుంది. బిందువే చూస్తుంది. బిందువు లేకపోతే కనులు ఉన్నా చూడలేరు. కావున సదా ఇదే స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకొని ఎగిరే కళను అనుభవం చెయ్యండి. బాప్దాదా పిల్లల వర్తమానం మరియు భవిష్య భాగ్యాన్ని చూసి సంతోషంగా ఉన్నారు. వర్తమానము, భవిష్య భాగ్యాన్ని తయారు చేసే కలము. వర్తమానాన్ని శ్రేష్ఠంగా తయారు చేసుకునే సాధనము - పెద్దల సూచనలను సదా స్వీకరిస్తూ స్వయాన్ని పరివర్తన చేసుకోవడం. ఇదే విశేష గుణంతో వర్తమానం మరియు భవిష్య భాగ్యము శ్రేష్ఠంగా తయారవుతుంది.
2. అందరి మస్తకం పై భాగ్య నక్షత్రం మెరుస్తూ ఉంది కదా! సదా మెరుస్తోందా? అప్పుడప్పుడు మెరుస్తూ ఆరిపోతూ, వెలిగీ వెలగనట్లు అయితే లేదు కదా! అఖండ జ్యోతి అయిన తండ్రితో పాటు మీరు కూడా అఖండ జ్యోతిగా సదా వెలుగుతున్న నక్షత్రంగా అయ్యామని అనుభవం చేస్తున్నారా? అప్పుడప్పుడు దీపాన్ని లేక నక్షత్రాన్ని వాయువు కదిలించడం లేదు కదా! ఎక్కడ తండ్రి స్మృతి ఉంటుందో వారు అవినాశిగా వెలుగుతూ ఉన్న నక్షత్రాలు. వెలుగుతూ ఆరిపోతూ లేరు కదా! లైటు కూడా వెలుగుతూ, ఆరిపోతూ ఉంటే ఆర్పేస్తారు. ఎవ్వరికీ మంచిగా అనిపించదు. కావున మీరు కూడా సదా వెలుగుతూ ఉన్న నక్షత్రాలు. సదా జ్ఞాన సూర్యుడైన తండ్రితో ప్రకాశం తీసుకొని ఇతరులకు కూడా ప్రకాశాన్ని ఇచ్చేవారు. సేవ చేయాలనే ఉత్సాహ-ఉల్లాసాలు స్థిరంగా ఉంటాయి. అందరూ శ్రేష్ఠమైన ఆత్మలే. శ్రేష్ఠమైన తండ్రికి శ్రేష్ఠ ఆత్మలుగా ఉన్నారు.
స్మృతి శక్తితో సఫలత సహజంగా ప్రాప్తిస్తుంది. ఎంతెంత స్మృతి మరియు సేవలు జత జతలో ఉంటాయో ఆ రెండిటి బ్యాలన్స్ అంత సదా సఫలత యొక్క ఆశీర్వాదాలను స్వత:గానే ప్రాప్తి చేయిస్తుంది. అందువలన సదా శక్తిశాలి స్మృతి స్వరూప వాతావరణం తయారై శక్తిశాలి ఆత్మల ఆహ్వానం జరుగుతుంది అంతేకాక సఫలత లభిస్తుంది. లౌకిక కార్యము నిమిత్తంగా ఉంటుంది కానీ తండ్రి మరియు సేవతో లగ్నముంటుంది. లౌకికం కూడా సేవ పట్లనే ఉంటుంది. స్వంత లగ్నంతో చెయ్యరు. ఆదేశానుసారము చేస్తారు. అందువలన తండ్రి స్నేహమనే హస్తము ఇలాంటి పిల్లలకు తోడుగా ఉంటుంది. సదా సంతోషంగా పాడండి, నాట్యం చెయ్యండి, ఇదే సేవకు సాధనము. మీ సంతోషాన్ని చూసి ఇతరులు సంతోషిస్తారు. అదే సేవగా అవుతుంది. ఎంత మహాదానిగా అయితే ఖజానా అంత పెరుగుతూ ఉంటుందని బాప్దాదా పిల్లలకు సదా చెప్తారు. మహాదానిగా అవ్వండి, ఖజానాలను పెంచండి. మహాదానిగా అయ్యి బాగా దానం చెయ్యండి ఈ ఇవ్వడమే తీసుకోవడం. మంచి వస్తువు లభిస్తే అది ఇవ్వకుండా ఉండలేరు.
సదా తమ భాగ్యాన్ని చూసి సంతోషంగా ఉండండి. ఎంత గొప్ప భాగ్యము లభించింది. ఇంట్లో కూర్చునే భగవంతుడు లభించాడు. ఇంతకంటే గొప్ప భాగ్యము ఏముంటుంది! ఈ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకొని సంతోషంగా ఉండండి. దు:ఖం, అశాంతి సదా కాలం కొరకు సమాప్తమైపోతాయి. సుఖ స్వరూపంగా, శాంత స్వరూపంగా అవుతారు. ఎవరి భాగ్యాన్ని స్వయం భగవంతుడే తయారు చేస్తారో వారు ఎంత శ్రేష్ఠమైనవారు! కావున సదా కొత్త ఉత్సాహం, కొత్త ఉల్లాసాలను అనుభవం చేస్తూ ముందుకు వెళ్తూ ఉండండి ఎందుకంటే సంగమ యుగంలో ప్రతిరోజు కొత్త ఉత్సాహం, కొత్త ఉల్లాసం ఉంటుంది.
ఏదో నడుస్తున్నామని కాదు, కొత్త ఉల్లాసం, కొత్త ఉత్సాహం సదా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ప్రతిరోజు కొత్తదిగానే ఉంటుంది. సదా స్వయంలో లేక సేవలో ఏదో ఒక నవీనత తప్పకుండా కావాలి. స్వయాన్ని ఎంత ఉత్సాహ-ఉల్లాసాలలో ఉంచుకుంటే అంత కొత్త కొత్త టచింగ్లు వస్తూ ఉంటాయి. స్వయం ఏదో ఇతర విషయాలలో బిజీగా ఉన్నట్లయితే కొత్త టచింగ్ కూడా రాదు, మననం చేసినట్లయితే కొత్త ఉత్సాహం ఉంటుంది.
బంధనాలలో ఉన్నవారికి ప్రియ స్మృతులు ఇస్తూ :- బంధనాలలో ఉన్నవారి స్మృతి సదా తండ్రి వద్దకు చేరుకుంటుంది మరియు బాప్దాదా బంధనాలో ఉన్నవారందరికి యోగం అనగా స్మృతి యొక్క లగ్నాన్ని అగ్ని రూపంగా చేసుకోండి అని చెప్తున్నారు. లగ్నము అగ్ని రూపంగా అయినప్పుడు అగ్నిలో అన్నీ భస్మమైపోతాయి. కనుక ఈ బంధనాలు కూడా లగ్నమనే అగ్నిలో సమాప్తమైపోతాయి స్వతంత్ర ఆత్మగా అయ్యి ఏ సంకల్పము చేస్తే దాని సిద్ధిని ప్రాప్తి చేసుకుంటారు. స్నేహీలుగా ఉండండి. స్నేహంతో చేసే స్మృతి చేరుకుంటుంది. స్నేహానికి బదులుగా స్నేహం లభిస్తుంది. కానీ ఇప్పుడు స్మృతిని శక్తిశాలి అగ్ని రూపంగా చేసుకోండి. అప్పుడు సన్ముఖంలోకి చేరుకునే రోజు వచ్చేస్తోంది.
Comments
Post a Comment