02-02-1970 అవ్యక్త మురళి

   * 02-02-1970        ఓంశాంతి        అవ్యక్త బాప్ దాదా       మధువనము  

ఆత్మిక శక్తి యొక్క పరిశీలన 

ఈ రోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి ప్రొజెక్టర్ షోను చూస్తున్నారు. మీరు కూడా ప్రొజెక్టర్ షోను పెట్టారు కదా? దాని ద్వారా చిత్రాన్ని చూసే ఆ ప్రొజెక్టర్ ఏది? ప్రతి ఒక్కరి నయనాలు ప్రొజెక్టర్ వంటివి. ఈ ప్రొజెక్టర్ ద్వారా ఎటువంటి చిత్రాన్ని ప్రపంచానికి చూపించగలరు?  అది సైన్సు శక్తి యొక్క ప్రొజెక్టరైతే ఇది ఈశ్వరీయ శక్తి ప్రొజెక్టర్. ప్రొజెక్టర్ ఎంతెంత పవర్‌ఫుల్ గా ఉంటుందో అంతగానే దృశ్యము కూడా చాలా స్పష్టముగా కనిపిస్తుంది. అలాగే పిల్లలైన మీ అందరి ఈ దివ్య నేత్రాలు ఎంతెంత స్పష్టంగా అనగా ఆత్మికతతో సంపూర్ణంగా ఉంటాయో అంతగానే పిల్లలైన మీ నయనాల ద్వారా అనేక చిత్రాలను చూడగలుగుతారు. ప్రొజెక్టర్ ద్వారా చూసినంత స్పష్టంగా కనిపించగలవు. కావున ఈ నయనాల ద్వారా బాప్-దాదా మరియు పూర్తి రచన యొక్క స్థూల సూక్ష్మ-మూల, మూడు లోకాల చిత్రాలు కనిపించగలవు, మీ ఎదురుగా ఎవరు వచ్చినా కానీ మీ నయనాల ద్వారానే సర్వ సాక్షాత్కారాలను పొందగలరు. లైటు ఎంత కాంతివంతముగా ఉంటుందో చిత్రముకూడా అంతగానే కాంతివంతముగా ఉంటుంది. బల్బు ఎంత శక్తివంతముగా ఉంది? అన్న దానిని బాప్ దాదా ఎలా చూస్తారో తెలుసా? తమ బల్బు ఏ విధంగా, ఎంత శాతంలో ఉంది అన్న విషయం ఎవరికైతే తెలుసో వారు చేతులెత్తండి? మా ఆత్మ ఎంత శక్తిశాలిగా ఉంది అన్నదాని పరిశీలన ఏ ఆధారముతో చేసుకోగలరు? (చార్టు ద్వారా) అదికూడా మొత్తానికి చెందిన విషయమైపోయింది. ఏ విషయము ద్వారా మీ పరిశీలన చేసుకోగలరు? లైటులో ఏ విశేషత ఉంటుంది? దానిలోని విశేష గుణము - ఏ వస్తువు ఎలా ఉందో అలాగే అంత స్పష్టంగా చూడటానికి వస్తుంది. అంధకారములో ఏ వస్తువునైనా ఆ వస్తువుగానే చూడటానికి వీలు కాదు. కావున అస్పష్టతను స్పష్టము చెయ్యటము లైటు విశేషత, ఈ విధంగా మీ లైటు శాతాన్ని పరిశీలించుకునే విధానము ఇదే. ఒకటేమో మీ పురుషార్థపు మార్గము స్పష్టమౌతుంది అనగా లైను క్లియర్ గా కనిపిస్తుంది. రెండవ విషయము మీ భవిష్య స్టేటస్(హోదా) కూడా కనిపిస్తుంది. మూడవ విషయము - మీరు ఎవరి సేవనైతే చేస్తారో ఆ సమయములో మీ స్వ ప్రకాశము పవర్ ఫుల్ గా ఉన్నట్లయితే వారికి కూడా అంతగానే మార్గము సహజంగా మరియు స్పష్టంగా చూపించగలరు. వారు కూడా తమ పురుషార్థములో సహజంగానే నడుస్తారు. వారి లక్ష్యము, గమ్యము సహజంగా కనిపిస్తుంది. లైటు శాతము ఎంత ఎక్కువగా ఉంటుందో అంతగానే అన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవేళ లైటు శాతము తక్కువ అయినట్లయితే స్వయము కూడా పురుషార్థములో స్పష్టముగా ఉండరు మరియు ఎవరికైతే మార్గాన్ని చూపిస్తారో వారు కూడా సహజంగా మరియు స్పష్టంగా తమ మార్గము మరియు గమ్యమును తెలుసుకోలేరు. ఎవరి లైటు అయితే పవర్‌ఫుల్ గా ఉంటుందో వారు స్వయమూ చిక్కుకోరు, ఇతరులనూ చిక్కుకోనీరు. కావున మీ పురుషార్థమును మీ సేవద్వారా అనగా ఎవరి సేవనైతే చేస్తారో వారి మార్గము స్పష్టముగా ఉంటోందా అన్నదానిని బట్టి చూసుకోగలరు. ఒకవేళ మార్గము స్పష్టముగా లేనట్లయితే మీ లైటు శాతము తక్కువగా ఉంది. కొందరు స్వయమే అడుగడుగులో దెబ్బలు తింటారు మరియు వారి రచన కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక్కొక్కరు మాస్టర్ రచయితలు, కావున మాస్టర్ర చయితలు వారి రచననుండి కూడా వారి శక్తిని పరిశీలించగలరు. బీజము ఎటువంటిదో ఫలముకూడా అటువంటిదే వెలువడుతుంది. ఒకవేళ బీజము శక్తిశాలిది కానట్లయితే అక్కడక్కడా పూలు వస్తాయి, ఫలాలు వస్తాయి కానీ అవి స్వీకరింపచేసేందుకు యోగ్యమైనవిగా ఉండవు. చాలా సుందరమైన, సుగంధభరితమైనవేవైతే ఉంటాయో, మంచి ఫలాలు ఏవైతే ఉంటాయో వాటినే కొంటాము కదా! ఒకవేళ బీజమే శక్తిశాలిగా లేనట్లయితే దానినుండి ఉద్భవించే రచన కూడా స్వీకరింపజేసేందుకు యోగ్యముగా ఉండదు. కావున మీ లైటు శాతమును పెంచండి. దిన ప్రతిదినము అందరి మస్తకము మరియు నయనాలు ఎలా సేవ చేస్తాయంటే - మీ ప్రొజెక్టర్ షో సేవ చేస్తున్నట్లుగా ఉంటుంది. ఎవరు మీ ఎదురుగా వచ్చినా వారు చిత్రాన్ని మీ నయనాలలో చూస్తారు. నయనాలను చూడటంతోనే బుద్ధియోగము ద్వారా అనేక సాక్షాత్కారాలు కలుగుతాయి. అటువంటి సాక్షాత్కారమూర్తులుగా మిమ్మల్ని తయారు చేసుకోవాలి. కానీ ఎవరైతే ఎల్లప్పుడూ సాక్షి స్థితిలో స్థితులై ఉంటారో వారే సాక్షాత్కార మూర్తులుగా అవ్వగలరు. వారి నయనాలు ప్రాజెక్టర్ పని చేస్తాయి. వారి మస్తకము ఎల్లప్పుడూ మెరుస్తున్నట్లుగా కనిపిస్తుంది. హోలీ తరువాత వేషాలు వేస్తారు కదా! దేవతలను అలంకరించి ముస్తకముపై బల్బును వెలిగిస్తారు. ఈ వేషాలను ఎందుకు తయారు చేస్తారు? ఇది ఏ సమయపు ప్రాక్టికల్ రూపము? ఈ సమయముది. వారు మళ్ళీ స్మృతి చిహ్నాలను తయారు చేస్తూ వస్తారు. కావున చూసేందుకు ఒక్కొక్కరి మస్తకములో లైటు కనిపించాలి. వినాశన సమయములో కూడా ఈ లైటు రూపము మీకు చాలా సహాయము ఇస్తుంది. ఎవరు ఎటువంటి ఆలోచనలతో మీ ముందుకు వచ్చినా, వారు ఈ దేహాన్ని చూడకుండా మెరుస్తూ ఉన్న ఈ బల్బును చూస్తారు. చాలా కాంతివంతమైన లైటు ఏదైతే ఉంటుందో, దానిని ఎప్పుడు చూసినా ఆ కాంతి కారణంగా మిగిలిన అన్ని విషయాలు దాగిపోతాయి. అలాగే మీ అందరి లైటు ఎంతెంతగా కాంతివంతముగా ఉంటుందో అంతగానే వారికి మీ దేహమును చూస్తున్నా గానీ కనిపించదు. ఎప్పుడైతే దేహమును చూడనే చూడరో అప్పుడు తమోగుణీ దృష్టి మరియు వృత్తి స్వతహాగనే సమాప్తమైపోతాయి. ఈ పరీక్షలు రానున్నాయి. అన్నిరకాల పరిస్థితులను పాస్ అవ్వాలి.

ఈ గ్రూపు ఏదైతే ఉందో దీనికి తమాషాకు ఒక పేరు పెట్టారు. ఈ రోజు వరసలో ఈ విషయంపై చిట్ చాట్(సంభాషణ) జరిగింది. ఎవరో తమాషాకు ఇలా అన్నారు. పెద్ద అక్కయ్యలు మా హెడ్స్ మరి మేము కాము మరి బాప్ దాదా వీరికి ఏమని పేరు పెట్టారంటే పెద్దవారైతే హెడ్సే కానీ మీరు హ్యాండిల్, మోటారులో హ్యాండిల్ లేకుండా పని నడవదు. హ్యాండిల్ ద్వారానే మోటారును ఎటు కావాలంటే అటు తిప్పగలము. కావున హెడ్స్ కూడా ఈ హ్యాండిల్స్ లేకుండా సేవను హ్యాండిల్ చెయ్యలేరు. గ్రూపు ఏదైతే ఉందో మీరు హ్యాండిల్స్ పేరు లేకుండా హెడ్స్ ఏమీ చెయ్యలేరు. ఎవరు వచ్చినా ముందు ముందుగా వారిని హ్యాండిల్ చేసేవారు ఈ హ్యాండిలే కదా! మరి మీ ఫైన్ ఇంతటి బాధ్యత ఉంది. ఒకవేళ హ్యాండిల్ అయిన మీరు సరిగా లేనట్లయితే సేవ హ్యాండిలింగ్ కూడా మంచిగా ఉండదు. కానీ కేవలము దీనిని కూడా చూడాలి హ్యాండిల్లో అయితే ఉన్నారు కానీ మీరు ఎప్పుడూ హ్యాండిల్ చెయ్యవద్దు. హెడ్ కు హ్యాండ్ గా అయ్యి ఉండాలి. బాబాకు కూడా కుడిభుజం ఉంది కదా, అలాగే ఎడమభుజం కూడా ఉంది! కుడి చేతికి పూర్తి శక్తి ఉంటుంది. అయినా చెయ్యే కదా హెడ్ కాదు, హ్యాండిలే కదా! కానీ ఎలా హ్యాండిల్ చెయ్యాలి, ఎలా బాప్ దాదాకు రైట్ హ్యాండ్ గా అవ్వాలి, ఇందుకొరకు ఇక్కడకు వచ్చారు. ఈ గ్రూపు ఎటువంటిదంటే ఒక్కొక్కరు అద్భుతాన్ని చెయ్యగలరు. సేవను నవీణ రూపంలోకి తీసుకురాగలరు. సేవలో సఫలతను తీసుకువచ్చేందుకు రెండు విషయాలను ధ్యానములో ఉంచుకోవాలి. అన్ని విషయాలలో సహయోగులుగా అయితే ఉన్నారు. కానీ సేవలో సఫలతను తీసుకువచ్చేందుకు నిమిత్తమైన విశేష గ్రూపు ఇది. ఇందు కొరకు రెండు విషయాలను విశేషముగా ధ్యానములో ఉంచుకోవాలి. ఒకటి- నిషానా(గురి) పూర్తిగా మరియు నషా కూడా పూర్తిగా ఉండాలి. నషా మరియు నిషానా - ఈ రెండు విషయాలు ఈ గ్రూపులో విశేషంగా రావాలి, గురి సరిగ్గా ఉన్నప్పుడు ఒక్క వేటుతో ఎవరినైనా మరజీవులుగా చెయ్యగలరు. మంచి గురి కలిగినవారు ఒతే తుపాకీ గుండుతో సరియైన గురిని వేస్తారు. ఎవరికైతే గురి చూడటము రాదో, వారికి 3-4 సార్లు గురి చెయ్యవలసి వస్తుంది. ఒకవేళ మీ స్థితిని గురించిన గురి కూడా మరియు ఇతరులకు సేవ చేసే గురి కూడా మంచిగా ఉన్నట్లయితే మరియు వీటికి తోడుతోడుగా నషా కూడా ఎల్లప్పుడూ ఏకరసంగా ఉన్నట్లయితే సేవలో సఫలతను ఎక్కువగా పొందగలరు. ఒక్కోసారి నషా దిగిపోతుంది. ఒక్కోసారి గురి తొలగిపోతుంది. ఈ రెండు విషయాలు సరిగ్గా ఉండాలి. ఎవరిలో ఎంతగా స్వయం నషా ఉంటుందో అంతగానే గురిని సరి చేసుకోగలరు. సర్వీసబుల్ గా అయితే ఉన్నారు, కానీ సేవలో ఇప్పుడు ఏ విశేషతను తీసుకురావాలి? ఎవరి ఒక్క క్షణము, ఒక్క సంకల్పము కూడా సేవ లేకుండా జరగవో, ఎవరి ప్రతి క్షణము సేవ గురించే ఉంటుందో అటువంటి వారిని సర్వీసబుల్ అని అయినప్పుడు మరి సమయము, సంకల్పము సేవలో కాకుండా వేరేగా గడచిపోకూడదు. ఆజ్ఞ లభిస్తుంది. పురుషార్థములో నడుస్తున్నప్పుడు సంపూర్ణంగా అవ్వటంలో అడ్డంకిని వేసేదిగా ఏ విఘ్నము కనిపిస్తుంది? విశేషమైన విఘ్నము వ్యర్ధ సంకల్పాల రూపంలో కనిపిస్తుంది. మరి దీని నుండి రక్షించుకొనేందుకు ఏం చెయ్యాలి? ఒకటేమో ఎప్పుడూ లోపలి రెస్టు మరియు బయటి రెస్టును తీసుకోకండి. ఒకవేళ రెస్టులో లేనట్లయితే వేస్ట్ గా పోదు. రెండవ విషయము - స్వయమును ఎల్లప్పుడూ గెస్ట్ గా (అతిధిగా) భావించండి. ఒకవేళ గెస్ట్ గా భావించినట్లయితే, రెస్టు తీసుకోనట్లయితే వేస్ట్ గా(వ్యర్ధంగా) పోవు. అది సంకల్పమైనా, సమయమైనా, ఇదే సహజమైన పద్ధతి. అచ్ఛా, ఇప్పుడు మళ్ళీ సమాప్తినాడు అందరి మస్తకముపై బల్బు ఎంత పవర్ కలిగిఉందో దానిని చూస్తాము. శక్తి శాలీగా అయినట్లయితే మాయ ఆ పవర్ ముందుకు వచ్చే సాహసము చెయ్యదు. బల్బు ఎంత పవర్ లో ఉంటుందో అంతగా ఎవరూ ఎదిరించలేరు. అటువంటి పవర్ ఫుల్ స్థితిని చూస్తాము. సర్వీసబుల్ గా ఉన్నారు, ఇప్పుడు పవర్ ఫుల్ గా అవ్వండి. ఏక్టివ్ గా (చురుకుగా) అయితే ఉన్నారు కానీ ఎక్యురేట్ గా (సరియైనవారిగా) అవ్వండి. మరి ఈ గ్రూపుకు విశేష ముద్రగా దేనిని వెయ్యాలి? ఎక్యురేట్. ఏ విషయములోనైనా ఎల్లప్పుడూ ఎక్యురేట్. మనసా ద్వారా, వాచ ద్వారా, కర్మణా ద్వారా - మూడింటిలో ఎక్యురేట్. అచ్ఛా!

Comments

  1. ఓంశాంతి, సర్వీసులో సఫలతను ఎక్కువగా ఎప్పుడు పొందగలరు? సేవాధారులు అని ఎవరిని అంటారు? ఆజ్ఞాకారులు అని ఎవరిని అంటారు? ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి? వ్యర్థ సంకల్పములు విఘ్నముగా వస్తుంటాయి. వీటి నుండి తప్పించుకొనుటకు ఏమి చేయాలి? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళిలో తెలిపించారు. శివబాబా యాద్ హై?

    ReplyDelete

Post a Comment