31-12-1984 అవ్యక్త మురళి

  31-12-1984                    ఓంశాంతి                 అవ్యక్త బాప్ దాదా           మధువనము
  
'' కొత్త జ్ఞానం మరియు కొత్త జీవితం ద్వారా కొత్తదనపు మెరుపు చూపించండి. ''

ఈ రోజు నలువైపులా ఉన్న పిల్లలు సాకార రూపంలో లేక ఆకార రూపంలో కొత్త యుగం, కొత్త జ్ఞానం, కొత్త జీవితాన్ని ఇచ్చే బాప్‌దాదాతో కొత్త సంవత్సరం జరుపుకునేందుకు ఈ ఆత్మిక హైయెస్ట్‌(అత్యంత ఉన్నతమైన) మరియు హోలియెస్ట్‌(అత్యంత పవిత్రమైన) కొత్త దర్బారులో ఉపస్థితమై ఉన్నారు. బాప్‌దాదా వద్ద పిల్లలందరి హృదయపూర్వక ఉత్సాహ-ఉల్లాసాలు మరియు పరివర్తన చేసే ప్రతిజ్ఞల శుభ సంకల్పాలు, శుభ భావనలు, శుభ కోరికలు చేరుకున్నాయి. బాప్‌దాదా కూడా కొత్త విశ్వ నిర్మాతలందరికి, విశ్వపరివర్తక విశేష ఆత్మలకు, సదా పాత ప్రపంచపు పాత సంస్కారాలు, పాత స్మృతులు, పాత దేహ స్మృతి యొక్క భ్రాంతితో అతీతంగా ఉండేవారికి, పాత విషయాలన్నిటికి వీడ్కోలు ఇచ్చేవారికి, సదాకాలం కొరకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గడిచిపోయిన దానికి బిందువు పెట్టి స్వరాజ్య బిందువును(తిలకాన్ని) దిద్దుకునేవారికి స్వరాజ్య తిలకం యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పిల్లలందరికి ఈ వీడ్కోలు శుభాకాంక్షలతో పాటు కొత్త సంవత్సర విశేష కానుక - ''సదా తోడుగా ఉండండి, సదా సమానంగా ఉండండి, సదా హృదయ సింహానాధికారిగా శ్రేష్ఠమైన ఆత్మిక నశాలో ఉండండి'' అనే వరదానాల కానుక ఇస్తున్నారు. 

ఈ మొత్తం సంవత్సరమంతా ఇదే సమర్థమైన స్మృతి ఉండాలి - ''తోడుగా ఉన్నాము, తండ్రి సమానంగా ఉన్నాము.'' ఈ స్మృతి ఉంటే స్వత:గానే ప్రతి సంకల్పంలో వీడ్కోలు శుభాకాంక్షలను అనుభవం చేసుకుంటూ ఉంటారు. పాతవాటికి వీడ్కోలు ఇవ్వకపోతే నవీనత యొక్క శుభాకాంక్షలను అనుభవం చేయలేరు. అందువలన ఈ రోజు పాత సంవత్సరానికి వీడ్కోలు ఇస్తున్నారు. అలాగే పాత సంవత్సరంతో పాటు పాత విషయాలను వినిపించాను కదా! ఆ పాతవాటికి కూడా సదాకాలం కొరకు వీడ్కోలు ఇవ్వండి. కొత్త యుగము, కొత్త బ్రాహ్మణుల సుందర ప్రపంచము, కొత్త సంబంధము, కొత్త పరివారము, కొత్త ప్రాప్తులు ఉన్నాయి. అన్నీ కొత్తవే కొత్తవి. చూసినా ఆత్మిక దృష్టితో ఆత్మను చూస్తారు, ఆత్మిక విషయాలనే ఆలోచిస్తారు. కనుక అన్నీ కొత్తవి అయిపోయాయి కదా! పద్ధతి కొత్తది, ప్రేమ(ప్రీతి) కొత్తది, అన్నీ కొత్తవి. కావున సదా నవీనతతో కూడిన శుభాభినందనలతో ఉండండి. దీనినే ఆత్మిక శుభాకాంక్షలు అని అంటారు. ఒక్కరోజు కొరకు కాదు కానీ సదా ఆత్మిక శుభాకాంక్షలతో వృద్ధిని పొందుతూ ఉండండి. బాప్‌దాదా మరియు సర్వ బ్రాహ్మణ పరివారపు శుభాకాంక్షలు లేక ఆత్మిక ఆశీర్వాదాలతో పాలింపబడ్తున్నారు, నడుస్తున్నారు. ఇలా కొత్త సంవత్సరాన్ని ఎవ్వరూ జరుపుకోలేరు. వారు అల్పకాలం కొరకు జరుపుకుంటారు, మీరు అవినాశిగా సదా జరుపుకుంటారు. అక్కడ మనుష్యాత్మలు మనుష్యులతోనే జరుపుకుంటారు. శ్రేష్ఠ ఆత్మలైన మీరు తండ్రి అయిన పరమాత్మతో జరుపుకుంటారు. విధాత మరియు వరదాతతో జరుపుకుంటారు. అందువలన జరుపుకోవడం అనగా ఖజానాలతో, వరదానాలతో సదాకాలం కొరకు జోలె నింపుకోవడం. వారిది జరుపుకోవడం మరియు పోగొట్టుకోవడం, మీది జోలె నింపుకోవడం. అందుకే (నింపుకునేందుకే) బాప్‌దాదాతో జరుపుకుంటున్నారు కదా! వారు హ్యాపీ న్యూ ఇయర్‌, కొత్త సంవత్సర శుభాకాంక్షలు అని చెప్తారు. మీరు 'సదా(ఎవర్‌) హ్యాపీ న్యూ ఇయర్‌' అని అంటారు. మిమ్ములను ఈ రోజు సంతోషం మరియు రేపు దు:ఖ ఘటన దు:ఖీలుగా చేయదు. దు:ఖం కలిగించే ఎలాంటి ఘటన జరిగినా, అటువంటి సమయంలో కూడా సుఖ, శాంతి స్వరూప స్థితి ద్వారా సర్వులకు సుఖ, శాంతి కిరణాలను ఇచ్చే మాస్టర్‌ సుఖసాగరులుగా అయ్యి దాత పాత్రను అభినయిస్తారు. అందువలన ఘటన ప్రభావానికి అతీతంగా అవుతారు, అంతేకాక సదా సంతోషాన్ని అనుభవం చేస్తారు. కావున ఈ నూతన సంవత్సరంలో ఏ నవీనత చేస్తారు? కాన్ఫరెన్సులు చేశారు, మేళాలు చేశారు. ఇప్పుడు పాత పద్ధతులన్నిటితో, పాత నడవడికతో అలసిపోయే ఉన్నారు. ఏదో ఒక కొత్తదనం కావాలి అని అందరూ భావిస్తున్నారు. ఏ కొత్తదనం ఉండాలి, ఎలా ఉండాలి అనేది అర్థం చేసుకోలేరు. ఇలాంటి నవీనతను కోరుకునేవారికి కొత్త జ్ఞానం ద్వారా, కొత్త జీవితం ద్వారా నవీనత యొక్క మెరుపును అనుభవం చేయించండి. 'ఇది మంచిది' అని అయితే అర్థం చేసుకున్నారు. కానీ ఇది కొత్తది, ఈ కొత్త జ్ఞానమే కొత్త యుగాన్ని తీసుకొస్తూ ఉంది - ఈ అనుభవం ఇంకా గుప్తంగా ఉంది. కావాలి అని అయితే అంటారు. వారి కోరికను పూర్తి చేసేందుకు కొత్త జీవితం యొక్క ప్రత్యక్ష ఉదాహరణను వారి ముందుకు ప్రత్యక్ష రూపంలో తీసుకు రండి. దీనితో కొత్త మెరుపు వారికి అనుభవమవుతుంది. కనుక కొత్త జ్ఞానాన్ని ప్రత్యక్షము చేయండి. ప్రతి బ్రాహ్మణుని జీవితము నుండి నవీనత అనుభవమవ్వాలి. అప్పుడు నూతన సృష్టి యొక్క మెరుపు వారికి కనిపిస్తుంది. ఏ కార్యక్రమం చేసినా అందులో అందరికి కొత్తదనం అనుభవం అవ్వాలనే లక్ష్యముంచుకోండి. ఇక్కడ కూడా మంచి కార్యక్రమం జరుగుతోంది అనే రిమార్కు ఇచ్చేందుకు బదులు ఇది కొత్త జ్ఞానము, కొత్త ప్రపంచాన్ని తీసుకొచ్చే జ్ఞానము అని అనుభవమవ్వాలి. అర్థమయ్యిందా! కొత్త సృష్టి స్థాపనను అనుభవం చేయించే అలను వ్యాపింపజేయ్యండి. కొత్త సృష్టి రానే వచ్చేసింది అనగా మనందరి శుభ భావనల ఫలం లభించే సమయం వచ్చేసింది - ఇలాంటి ఉత్సాహ- ఉల్లాసాలు వారి మనసులో ఉత్పన్నం అవ్వాలి. అందరి మనసులో నిరాశకు బదులు శుభభావనల దీపం వెలిగించండి. ఏదైనా గొప్ప రోజును జరుపుకుంటే దీపాన్ని వెలిగిస్తారు. ఈ రోజులలో రాయల్‌ మైనపు వత్తులు(క్యాండిల్స్‌) వచ్చాయి. కావున అందరి మనసులో ఈ దీపం వెలిగించండి. కొత్త సంవత్సరాన్ని ఈ విధంగా జరుపుకోండి. శ్రేష్ఠ భావనల ఫలం అనే కానుక అందరికి ఇవ్వండి. మంచిది. 

సదా సర్వులకు కొత్త జీవితం, కొత్త యుగం యొక్క మెరుపును చూపించేవారు, కొత్త ఉత్సాహ - ఉల్లాసాల శుభాకాంక్షలు ఇచ్చేవారు, సర్వులను సదా సంతోషంగా తయారు చేసేవారు, విశ్వానికి క్రొత్త రచన యొక్క అనుభవం చేయించేవారు - ఇటువంటి సర్వ శ్రేష్ఠ కొత్త యుగ పరివర్తకులకు, విశ్వ కళ్యాణకారులకు, సదా తండ్రి తోడును అనుభవం చేసేవారు, సదా తండ్రికి తోడుగా ఉన్న పిల్లలకు బాప్‌దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే. 

పార్టీలతో :- 1. కొత్త సంవత్సరంలో కొత్త ఉత్సాహం, కొత్త ఉల్లాసం సదా ఉండాలి. ఈ దృఢ సంకల్పం అందరూ చేశారా? ఇది కొత్త యుగము, ఇందులో ప్రతి సంకల్పము కొత్త కంటే కొత్తగా ఉండాలి. ప్రతి కర్మ కొత్త కంటే కొత్తగా ఉండాలి. దీనినే కొత్త ఉత్సాహం, కొత్త ఉల్లాసం అని అంటారు. ఇలాంటి దృఢ సంకల్పం చేశారా? తండ్రి ఎలా అవినాశిగా ఉన్నారో, అలా తండ్రి ద్వారా ప్రాప్తి కూడా అవినాశి. అవినాశి ప్రాప్తిని దృఢ సంకల్పము ద్వారా ప్రాప్తి చేసుకోగలరు. కావున తమ కార్య స్థానానికి వెళ్ళి ఈ అవినాశి దృఢ సంకల్పాన్ని మర్చిపోరాదు. మర్చిపోవడం అనగా అప్రాప్తి, దృఢ సంకల్పము ఉండడం అనగా సర్వ ప్రాప్తి. 

సదా స్వయాన్ని పదమాపదమ్‌ భాగ్యశాలి ఆత్మగా భావించండి. ఏ అడుగునైతే స్మృతిలో వేస్తారో, ఆ ప్రతి అడుగులో పదమాల సంపాదన నిండి ఉంది. కావున సదా స్వయాన్ని ఒక్క రోజులో లెక్కలేనంత సంపాదన చేసుకునే పదామా పదమ్‌ భాగ్యశాలి ఆత్మగా భావించి ''ఓహో  నా శ్రేష్ఠ భాగ్యము!'' అనే సంతోషంతో సదా ఉండండి. మీరు సంతోషంగా ఉండుట చూచి ఇతరులకు కూడా ప్రేరణ లభిస్తూ ఉంటుంది. ఇదే సేవకు సహజ సాధనము. ఎవరైతే స్మృతి మరియు సేవలో సదా సంతోషంగా ఉంటారో వారు సురక్షితంగా ఉంటారు. విజయులుగా ఉంటారు. స్మృతి మరియు సేవ ఎలాంటి శక్తి అంటే దీనితో సదా ఎంతో ముందుకు వెళ్తూ ఉంటారు. కేవలం స్మృతి మరియు సేవల బ్యాలెన్స్‌ ఉండాలి. ఈ బ్యాలన్సే ఆశీర్వాదాలను ఇప్పిస్తుంది. ధైర్యశాలి పిల్లలకు ధైర్యం కారణంగా సదా సహాయం లభిస్తుంది. పిల్లలు ధైర్యంగా ఒక్క అడుగు వేస్తే వేయి అడుగులు తండ్రి సహాయం లభిస్తుంది. 

(రాత్రి 12 గంటల తర్వాత 1-1-1985 న విదేశీ సొదరీ సోదరులు కొత్త సంవత్సరం సంతోషంలో పాటలు పాడారు మరియు బాప్‌దాదా పిల్లలందరికి శుభాకాంక్షలు ఇచ్చారు.) 

ఎలాగైతే పిల్లలు తండ్రి పట్ల స్నేహంతో, స్మృతిలో పాటలు పాడుతూ లవలీనమవుతారో అలా తండ్రి కూడా పిల్లల స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారు. తండ్రి ప్రేమిస్తాడు, ప్రేమించబడ్తాడు కూడా. ప్రతి పుత్రుని విశేషత పైన తండ్రి కూడా అనురక్తునిగా అవుతాడు. కావున తమ విశేషత ఏదో తెలుసా? తండ్రి ఏ విశేషతతో మీ పై ప్రియంగా అయ్యాడు? తమ ఈ విశేషత ఏదో ప్రతి ఒక్కరికి తెలుసా? 

మొత్తం విశ్వంలో ఎంత కొద్దిమంది తండ్రికి ఇటువంటి స్నేహీ పిల్లలుగా ఉన్నారు. కావున బాప్‌దాదా స్నేహీ పిల్లలందరికి క్రొత్త సంవత్సర చాలా చాలా హృదయపూర్వక అల్లారు ముద్దు ప్రేమతో పదమా రెట్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మీరు ఎలా పాట పాడారో అలా బాప్‌దాదా కూడా పిల్లలను సంతోషపరచే పాట పాడ్తారు. తండ్రి పాట మనసుకు సంబంధించింది. మీరు నోటితో పాడ్తారు, తండ్రి విన్నారు. తండ్రిది కూడా మీరు విన్నారు కదా? 

ఈ నూతన సంవత్సరంలో సదా ప్రతి కర్మలో ఏదో ఒక విశేషత తప్పకుండా చూపిస్తూ ఉండండి. ప్రతి సంకల్పం విశేషంగా ఉండాలి. సాధారణంగా ఉండరాదు. ఎందుకు? విశేష ఆత్మల ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ విశేషంగానే ఉంటాయి. సదా ఉమంగ-ఉత్సాహాలతో ముందుకు వెళ్తూ ఉండండి. ఉత్సాహ-ఉల్లాసాలు విశేషమైన రెక్కలు. ఈ రెక్కల ద్వారా ఎంత పైకి ఎగరాలి అనుకుంటే అంత పైకి ఎగరగలరు. ఇవే రెక్కలు ఎగిరేకళను అనుభవం చేయిస్తాయి. ఈ రెక్కలతో ఎగిరిపోండి. విఘ్నాలు అక్కడకు చేరుకోలేవు. ఎలాగైతే అంతరిక్షంలోకి వెళ్తే భూమ్యాకర్షణ లాగలేదో అలా ఎగిరేకళలో ఉన్నవారిని విఘ్నాలు కొంచెం కూడా ఏమీ చెయ్యలేవు. సదా ఉత్సాహ-ఉల్లాసాలతో ముందుకు వెళ్ళడం, ఇతరులను తీసుకెళ్లడం. ఇదే విశేష సేవ. సేవాధారులను ఈ విశేషతతోనే సదా ముందుకు తీసుకెళ్తూ ఉండండి. 

విశేషంగా ఎన్నుకోబడిన అవ్యక్త మహావాక్యాలు 

లైట్‌ - మైట్‌ హౌస్‌ ఉన్నత స్థితి ద్వారా పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తంగా అవ్వండి. 

తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు ముందు స్వయం మీ మహిమ ఏదైతే ఉందో వాటన్నిటిని ప్రత్యక్షం చెయ్యండి. అప్పుడు తండ్రిని ప్రత్యక్షం చెయ్యగలరు. దీని కొరకు విశేష జ్వాలా స్వరూపం అనగా లైట్‌హౌస్‌ మరియు మైట్‌హౌస్‌ స్థితిని అర్థం చేసుకుంటూ అదే పురుషార్థంలో ఉండండి. విశేషంగా స్మృతి యాత్రను శక్తిశాలిగా చెయ్యండి. జ్ఞాన స్వరూప అనుభవీగా అవ్వండి. 

మెజారిటి భక్తుల కోరిక కేవలం ఒక్క సెకండు అయినా లైట్‌ను చూడాలని ఉంటుంది. ఈ కోరికను పూర్తి చేసేందుకు సాధనము పిల్లలలైన మీ నయనాలు. ఈ నయనాల ద్వారా తండ్రి జ్యోతి స్వరూపం సాక్షాత్కారమవ్వాలి. ఈ నయనాలు నయనాలుగా కనిపించరాదు, లైట్‌ గోళాలుగా కనిపించాలి. ఎలాగైతే ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలు కనిపిస్తాయో, అలా ఈ కంటిపాపలు నక్షత్రాల వలె మెరుస్తూ కనిపించాలి. అయితే అది స్వయం లైట్‌ స్వరూపంలో స్థితమై ఉన్నప్పుడే కనిపిస్తాయి. కర్మలో కూడా లైట్‌ అనగా తేలికదనం మరియు స్వరూపం కూడా లైట్‌, స్థితి కూడా లైట్‌గా ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి పురుషార్థం లేక స్థితి విశేష ఆత్మలైన మీకు ఉంటుందో అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. కర్మలోకి వస్తూ, విస్తారంలోకి వస్తూ, రమణీయతలోకి వస్తూ, సంబంధ-సంపర్కంలోకి వస్తూ, అతీతంగా అయ్యే అభ్యాసం చెయ్యండి. ఎలాగైతే సంబంధం లేక కర్మలోకి రావడం సహజమో అలా అతీతంగా అవ్వడం కూడా సహజం అవ్వాలి. ఇలాంటి అభ్యాసం ఉండాలి. అతి సమయంలో ఒక్క సెకండ్‌లో అంతం అవ్వాలి. ఇది అంతిమ స్థితి యొక్క పురుషార్థము. ఇప్పుడిప్పుడే అతి సంబంధంలో మరియు ఇప్పుడిప్పుడే ఎంత సంపర్కంలో ఉంటారో అంత అతీతంగా ఉండాలి. లైట్‌హౌస్‌లో ఇమిడిపోయినట్లుండాలి. ఈ అబ్యాసంతో లైట్‌హౌస్‌ మైట్‌హౌస్‌ స్థితి తయారుతుంది మరియు అనేక మంది ఆత్మలకు సాక్షాత్కారాలు అవుతాయి. ఇదే ప్రత్యక్షతకు సాధనము. 

ఇప్పుడు అంతిమంగా ఈ సీజన్‌ ఉండిపోయింది. ఇందులోనే ప్రత్యక్షత ఢంకా మ్రోగుతుంది. శబ్ధము బిగ్గరగా అవుతుంది. సైలెన్స్‌(శాంతి) ఉంటుంది కాని సైలెన్స్‌ ద్వారానే నగాడా(ఢంకా) మ్రోగుతుంది. ఎంతవరకు నోటి నగాడా ఎక్కువగా ఉంటుందో అంతవరకు ప్రత్యక్షత జరగదు. ఎప్పుడైతే ప్రత్యక్షతా నగాడా మ్రోగుతుందో అప్పుడు నోటి నగాడా ఆగిపోతుంది. సైన్సు పై సైలెన్స్‌ విజయం అని గాయనం కూడా ఉంది కానీ వాక్కు యొక్క విజయం అని లేదు. ఇప్పుడు ప్రత్యక్షత యొక్క విశేషత మేఘాల లోపల ఉంది. మేఘాలు చెదిరిపోతున్నాయి కానీ తొలగిపోవడం లేదు. శక్తిశాలి మాస్టర్‌ జ్ఞాన సూర్యులు లేక లైట్‌ మైట్‌ హౌస్‌ యొక్క స్థితికి ఎంత చేరుకుంటారో అంత ఈ మేఘాలు చెదిరిపోతాయి. మేఘాలు తొలగిపోతే సెకండ్‌లో ఢంకా మ్రోగుతుంది. 

ఎలాగైతే నలువైపులా అగ్ని కాలిపోతూ, ఒక మూల శీతలకుండం(చిన్న నీటితొట్టి) ఉంటే అందరూ అటువైపే పరుగెత్తి వెళ్తారో అలా శాంతి స్వరూపులుగా అయ్యి శాంతికుండాన్ని అనుభవం చేయించండి. శాంతిసాగరుని పిల్లలు ఎక్కడ ఉంటారో ఆ స్థానము శాంతికుండంగా ఉంటుంది. 

బ్రహ్మాబాబా సమానంగా బేహద్‌ కిరీటధారిగా అయ్యి నలువైపులా ప్రత్యక్షత లైట్‌ మరియు మైట్‌ను వ్యాపింప చెయ్యండి. తద్వారా ఆత్మలకు నిరాశ నుండి ఆశా కిరణాలు కనిపించాలి. అందరి వ్రేలు ఆ విశేష స్థానం వైపే ఉండాలి. ఎవరైతే ఆకాశం వైపు పైకి వ్రేలు చూపించి వెతుకుతూ ఉన్నారో వారికి ఈ భూమి పైన, వరదాన భూమి పై ధరిత్రి యొక్క నక్షత్రాలు ప్రత్యక్షమయ్యారని అనుభవం అవ్వాలి. సంఘటన రూపంలో శక్తిశాలి లైట్‌హౌస్‌ మైట్‌హౌస్‌ వైబ్రేషన్స్‌ను వ్యాపింపచేసే సేవ చెయ్యండి. ఇప్పుడు మా రచయిత లేక మాస్టర్‌ రచయితలు సంపన్నంగా లేక సంపూర్ణంగా అయ్యి మాతో తమ స్వాగతం ఎప్పుడు చేయించుకుంటారని అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రకృతి కూడా స్వాగతిస్తుంది. కావున వారు సఫలత మాలతో స్వాగతం చెయ్యాలి, ఆ రోజు తప్పకుండా వస్తుంది. సఫలత యొక్క భజంత్రీలు మ్రోగినప్పుడు ప్రత్యక్షతా భజంత్రీలు మ్రోగుతాయి, మ్రోగాల్సిందే కదా! 

భారతదేశం తండ్రి అవతరణ భూమి, అంతేకాక భారతదేశం ప్రత్యక్షతా శబ్ధాన్ని ప్రసిద్ధి చేసేందుకు నిమిత్తమైన భూమి. విదేశాల సహయోగం భారతదేశంలో ప్రత్యక్షత చేయిస్తుంది మరియు భారతదేశం యొక్క ప్రత్యక్షతా ధ్వని విదేశాల వరకు చేరుకుంటుంది. వాచాతో ప్రభావితం చేసేవారు ప్రపంచంలో కూడా అనేకమంది ఉన్నారు. కానీ మీ వాచాకు గల విశేషత ఏమంటే మీ మాటలు తండ్రి స్మృతిని ఇప్పించాలి. తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు సిద్ధి ఆత్మలు మార్గం చూపించాలి. ఇదే అతీతత్వం. ఎలాగైతే ఇప్పటివరకు ఈ రాజయోగి ఆత్మలు శ్రేష్ఠమైన వారని, రాజయోగం శ్రేష్ఠము, కర్తవ్యము శ్రేష్ఠము, పరివర్తన శ్రేష్ఠమైనదని ప్రసిద్ధి చెందిందో అలా వీరికి నేర్పించేవారు డైరెక్ట్‌ సర్వశక్తివంతుడు, జ్ఞాన సూర్యుడు సాకార సృష్టి పై ఉదయించారు అని ఇప్పుడు ప్రత్యక్షం చెయ్యండి. 

త్వర త్వరగా తండ్రి ప్రత్యక్షత జరగాలి అని మీరు భావిస్తే అందుకు తీవ్ర ప్రయత్నము - '' అందరు తమ వృత్తిని తమ కొరకు, ఇతరుల కొరకు పాజిటివ్‌గా ధారణ చెయ్యండి.'' నాలెడ్జ్‌ఫుల్‌గా భలే అవ్వండి కానీ తమ మనసులో నెగెటివ్‌ను ధారణ చెయ్యకండి. నెగెటివ్‌ అనగా చెత్త. కావున వృత్తిని శక్తిశాలిగా చేయండి. వైబ్రేషన్లను శక్తివంతంగా చేయండి. వాయుమండలాన్ని శక్తిశాలిగా చెయ్యండి. ఎప్పుడైతే నలువైపులా వాతావరణం సంపూర్ణ నిర్విఘ్నంగా, దయాహృదయంగా, శుభ భావన, శుభ కామన కలిగిందిగా అవుతుందో అప్పుడు మీ యొక్క ఈ లైట్‌ మైటే ప్రత్యక్షతకు నిమిత్తంగా అవుతుంది. నిరంతర సేవ మరియు తపస్సు ఈ రెండిటి బ్యాలెన్స్‌ ద్వారా ప్రత్యక్షత జరుగుతుంది. ఎలాగైతే సేవ యొక్క డైలాగ్‌ తయారు చేస్తారో అలా తపస్సు కూడా ఎలా చేయాలంటే అన్ని మిడతలు బాబా బాబా అంటూ తమ విశేష స్థానానికి చేరుకోవాలి. దీపపు పురుగులు బాబా బాబా అని అంటూ రావాలి, అప్పుడు ప్రత్యక్షత అని అంటారు. 

మైకుగా కూడా మీడియా సమానంగా ప్రత్యక్షతా ధ్వనిని వ్యాపింపజేసేవారిని తయారు చెయ్యండి. మీరు - భగవంతుడు వచ్చారు, భగవంతుడు వచ్చారు అని అంటారు, ఇది మామూలే అని వారు భావిస్తారు. కానీ మీ వైపు నుండి ఇతరులు చెప్పాలి, అథారిటీ గలవారు చెప్పాలి. మొదట మిమ్ములను శక్తుల రూపంలో ప్రత్యక్షం చేయాలి, శక్తులు ప్రత్యక్షమైనప్పుడు శివబాబా ప్రత్యక్షమవ్వనే అవుతారు. మంచిది - ఓంశాంతి.

Comments