28-11-1984 అవ్యక్త మురళి



  28-11-1984                    ఓంశాంతి                 అవ్యక్త బాప్ దాదా           మధువనము 

'' సంకల్పాలను సఫలము చేసుకునేందుకు సహజ సాధనము ''

ఈ రోజు విశ్వ రచయిత విశ్వ కళ్యాణకారి అయిన తండ్రి విశ్వ భ్రమణము చేసేందుకు విశేషంగా పిల్లలందరి బాగోగులు పర్యవేక్షించుటకు నలువైపులకు వెళ్లారు. జ్ఞానయుక్త ఆత్మలైన పిల్లలను కూడా చూశారు. స్నేహీ సహయోగులైన పిల్లలను కూడా చూశారు, భక్తులైన పిల్లలను కూడా చూశారు, అజ్ఞానీ పిల్లలను కూడా చూశారు. తమ-తమ లగ్నములో మగ్నమై ఉన్న భిన్న-భిన్న ఆత్మలను చూశారు. కొందరు ఏదో కార్యమును చేసే లగ్నములో నిమగ్నమై ఉన్నారు, మరికొందరు తెంచే కార్యములో ఉన్నారు, మరికొందరు కలిపే కార్యములో నిమగ్నమై ఉన్నారు కానీ అందరూ తప్పకుండా నిమగ్నమై ఉన్నారు. అందరి మనసులో ఏదైనా లభించాలి, ఏదైనా తీసుకోవాలి, ఏదైనా పొందాలి అన్న సంకల్పమే ఉంది. ఇదే లక్ష్యముతో ప్రతి ఒక్కరు తమ-తమ కార్యములో లగ్నమై ఉన్నారు. హద్దులోని ప్రాప్తి ఉంది అయినా ఎంతో కొంత లభించాలి లేక ఏదో విధంగా తయారవ్వాలి అన్న పట్టుదలను, తపనను అన్నివైపులా చూశారు. వారందరి మధ్యలో బ్రాహ్మణ పిల్లలను విశేషంగా చూశారు. దేశంలో లేక విదేశాలలో పిల్లలందరిలో ఇప్పుడు ఏదైనా చేసెయ్యాలి, అనంతమైన కార్యములో ఏదైనా విశేషతను చేసి చూపించాలి అన్న సంకల్పమునే చూశారు. స్వయంలో కూడా ఏదైనా విశేషతను ధారణ చేసి విశేష ఆత్మగా అవ్వాలి అన్న ఉత్సాహమును మెజారిటీ పిల్లలలో చూశారు. ఉత్సాహ-ఉల్లాసాలనే బీజమును స్వ పురుషార్థము ద్వారా తోడు తోడుగా సమయము యొక్క వాతావరణము ద్వారా అందరిలో ప్రత్యక్ష రూపములో చూశారు. ఇదే ఉల్లాసమనే బీజాన్ని పదే పదే నిరంతరము తయారు చేసుకునే అటెన్షన్ఇచ్చే నీటిని మరియు చెకింగ్అనగా సదా వృద్ధిని పొందే విధి రూపీ సూర్యకాంతిని ఇస్తూ ఉండడంలో నంబరువారీగా అయిపోయారు. బీజమును నాటడమైతే అందరికి వస్తుంది కానీ పాలన చేసి ఫలస్వరూపంగా తయారు చేయడంలోనే తేడా ఏర్పడ్తుంది.

బాప్దాదా అమృతవేళ నుండి రోజంతా పిల్లల ఆట అనండి లేక లగ్నముతో పురుషార్థమనండి రోజూ చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ స్వయం గురించి, సేవ గురించి, ఇక ఇప్పటి నుండి ఇది చేస్తాము, ఇలా చేస్తాము, తప్పకుండా చేస్తాము అని చాలామంది ఉత్సాహముతో కూడుకున్న సంకల్పాలను చేస్తారు. చేసి చూపిస్తాము అని ఇటువంటి శ్రేష్ఠ సంకల్పాల బీజాలను నాటుతూ ఉంటారు. బాప్దాదాతో జరిపే ఆత్మిక సంభాషణలో కూడా చాలా మధురాతి మధురమైన మాటలు మాట్లాడ్తారు. కానీ సంకల్పమును అనగా బీజమును ప్రాక్టికల్లోకి తీసుకొచ్చే పాలన చేసినప్పుడు ఏంజరుగుతుంది? ఏదో ఒక విషయములో వృద్ధి చేసే విధిలో లేక ఫలస్వరూపముగా తయారు చేసే విశేషతలో యథాశక్తి నంబరువారీగా అయిపోతారు. ఏదైనా సంకల్ప రూపీ బీజమును ఫలీ భూతము చేసుకునేందుకు సహజ సాధనం ఒక్కటే. అదేమంటే సదా బీజరూపుడైన తండ్రి నుండి అన్నివేళలా సర్వశక్తుల రూపీ బలమును ఆ బీజములో నింపుతూ ఉండాలి. బీజ రూపము ద్వారా మీ సంకల్ప రూపీ బీజము సహజంగా మరియు స్వత:గా వృద్ధి పొందుతూ ఫలీభూతమైపోతుంది. కానీ బీజ రూపములో నిరంతరము కనెక్షన్(సంబంధం) లేని కారణంగా ఇతర ఆత్మలను లేక సాధనాలను వృద్ధికి విధిగా చేసుకుంటారు. ఈ కారణంగా ఇలా చేయాలా, అలా చేయాలా వీరిలా చేయాలా అంటూ ఈ విస్తారములో సమయాన్ని మరియు శ్రమను ఎక్కువగా వినియోగిస్తారు. ఎందుకంటే ఏదో ఒక ఆత్మను లేక సాధనాన్ని తమ ఆధారంగా చేసేసుకుంటారు. సాగరము నుండి నీరు మరియు సూర్యుని నుండి సూర్యరశ్మి లభించేందుకు బదులుగా ఎన్ని సాధనాల రూపీ నీటి ద్వారా ఆత్మలను ఆధారంగా భావిస్తూ శక్తిని(సకాశ్) ఇచ్చినా బీజము ఫలీభూతమవ్వజాలదు. కావున శ్రమ చేసిన తర్వాత, సమయాన్ని వినియోగించిన తర్వాత ప్రత్యక్ష ఫలము యొక్క ప్రాప్తి లభించనప్పుడు నడుస్తూ నడుస్తూ ఉత్సాహం తగ్గిపోతుంది. అంతేకాక స్వయంతో లేక సహచరులతో లేక సేవతో నిరాశులుగా అయిపోతారు. కాసేపు సంతోషము, మరికాసేపు ఉదాసీనత, ఈ రెండు అలలు బ్రాహ్మణ జీవితమనే నావను ఒక్కోసారి కదిలిస్తూ, ఒక్కోసారి నడిపిస్తూ ఉంటాయి. ఈ రోజులలో చాలామంది పిల్లల జీవిత గతి విధులు ఈ విధంగా కనిపిస్తున్నాయి - నడుస్తున్నారు కూడా, కార్యాన్ని కూడా చేస్తున్నారు కానీ ఏ విధంగా అవ్వాలో అటువంటి అనుభవం చేసుకోవడం లేదు. కావున సంతోషము ఉంది, కానీ సంతోషములో నాట్యము చేస్తూ ఉండడం లేదు. నడుస్తున్నారు కానీ తీవ్రగతితో(వేగంగా) నడవడం లేదు. శ్రేష్ఠ జీవితం గలవారిగా అయిపోయాము, తండ్రికి చెందినవారిగా అయిపోయాము. దు:ఖము, బాధల ప్రపంచము నుండి ప్రక్కకు తప్పుకున్నామని సంతుష్టంగా కూడా ఉన్నారు. కానీ సంతుష్టత మధ్యలో అప్పుడప్పుడు అసంతుష్టత అలలు కోరుకోకపోయినా, అర్థం చేసుకోలేకపోయినా వచ్చేస్తాయి. ఎందుకంటే జ్ఞానము సహజమైనది, స్వస్థితి కూడా సహజమైనది. కానీ సంబంధ-సంపర్కాలలో అతీతంగా మరియు ప్రియంగా అయ్యి ప్రీతిని నిర్వర్తించడంలో కాసేపు సహజంగా, మరికాసేపు కష్టంగా అయిపోతుంది.

బ్రాహ్మణ పరివారము మరియు సేవా ప్రవృత్తి. దీనినే సంబంధ-సంపర్కమని అంటారు. ఇందులో ఏదో ఒక విషయము ద్వారా ఎలా అనుభవం చేసుకోవాలో అలా అనుభవం చేసుకోరు. ఈ కారణంగానే రెండు అలలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు సమయము యొక్క సమీపత కారణంగా ఈ పురుషార్థ వేగము సమయానుసారంగా సంపూర్ణ గమ్యానికి చేర్చలేదు. ఇప్పుడు విఘ్నవినాశకులుగా అయ్యి విశ్వములోని విఘ్నాల మధ్యలో ఉన్న దు:ఖితులైన ఆత్మలకు సుఖ - శాంతులను అనుభూతి చేయించాలి. బహుకాలంగా నిర్విఘ్న స్థితిలో ఉన్నవారే విఘ్న వినాశక కార్యమును చేయగలరు. ఇప్పటివరకు తమ జీవితంలో వస్తున్న విఘ్నాలను తొలగించుకోవడంలోనే బిజీగా ఉంటే అందులోనే శక్తిని వినియోగిస్తూ ఉంటే మరి ఇతరులకు శక్తిని ఇవ్వడంలో ఎలా నిమిత్తులుగా అవ్వగలరు? నిర్విఘ్నులుగా అయ్యి శక్తుల స్టాకును జమ చేసుకోండి. అప్పుడు శక్తి రూపంగా అయ్యి విఘ్నవినాశక కార్యాన్ని చేయగలరు అర్థమయ్యిందా!

విశేషంగా రెండు విషయాలు చూశారు. భారతదేశంలో అజ్ఞానీ పిల్లలు సీటు తీసుకోవడంలో లేక సీటును ఇప్పించడంలో నిమగ్నమై ఉన్నారు. రాత్రింబవళ్ళు స్వప్నంలో కూడా వారికి సీటే కనిపిస్తోంది. బ్రాహ్మణ పిల్లలు సెట్అవ్వడంలో నిమిగ్నమై ఉన్నారు. సీటు లభించింది కానీ సెట్అవుతున్నారు. విదేశాలలో తాము తయారుచేసిన వినాశకారి శక్తి నుండి రక్షించుకునే సాధనాలను వెతకడంలో నిమగ్నమై ఉన్నారు. మెజారిటీ వారి జీవితము, జీవితముగా లేదు ప్రశ్నార్థకంగా అయిపోయింది. అజ్ఞానులు రక్షించుకోవడంలో నిమగ్నమై ఉన్నారు, జ్ఞానులు ప్రత్యక్షతా జెండాను ఎగురవేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఇవే విశ్వములోని స్థితి-గతులు. ఇప్పుడిక దు:ఖము, వ్యాకులతల నుండి రక్షించండి. భిన్న-భిన్న వ్యాకులతలలో భ్రమిస్తున్న ఆత్మలకు శాంతిని ఆధారంగా ఇవ్వండి. మంచిది.

సదా సంపన్న స్థితి అనే సీటు పై సెట్అయ్యి ఉండేవారికి, స్వ విఘ్నవినాశకులు మరియు విశ్వ విఘ్నవినాశకులకు, బీజరూపులైన తండి సంబంధము ద్వారా పత్రి శేష్ఠ్ర సంకల్పరూపీ బీజమును ఫలీభూతముగా చేసి పత్య్రక్ష ఫలమును భుజించేవారికి, సదా సంతుష్టంగా ఉండేవారికి, సంతుష్టమణి పిల్లలకు బాప్దాదా పియ్రస్మృతులు మరియు నమస్తే.

హాస్టల్ కుమారీలతో బాప్దాదా కలయిక :-

1. మీ భాగ్యాన్ని చూసి హర్షితంగా ఉంటున్నారు కదా! తప్పుడు మార్గంలోకి వెళ్ళడం నుండి రక్షింపబడ్డారు. పోగొట్టుకునేందుకు బదులు సంపాదించుకునే జీవితాన్ని తయారు చేసుకున్నారు. లౌకిక జీవితంలో జ్ఞానము లేనందున అంతా పోగొట్టుకోవడమే పోగొట్టుకోవడం, జ్ఞానీ జీవితంలో ప్రతి సెకను సంపాదనే సంపాదన. నిజానికి బ్రాహ్మణులందరూ భాగ్యశాలులే అయినా కుమారీలు డబల్ భాగ్యశాలులు. కుమారీ జీవితంలో బ్రహ్మకుమారీలుగా అవ్వడం, బ్రాహ్మణులుగా అవ్వడం చాలా గొప్ప విషయం, చిన్న విషయం కాదు. చాలా గొప్ప విషయం. మేము ఎంత గొప్పవారిగా అయ్యాము అన్న నశా ఉంటోందా? సాధారణ కుమారీ నుండి శక్తి రూపంగా అయ్యారు. మీరు మాయను సంహరించే శక్తులు కదా! మాయకు భయపడేవారు కాదు, సంహరించేవారు. బలహీనులు కారు, సాహసవంతులు. ఇప్పుడు చిన్న చిన్న విషయాలకు గాభరాపడడం లేదు కదా? సదా శ్రేష్ఠ ప్రాప్తిని గుర్తుంచుకుంటే చిన్న చిన్న విషయాలు అసలు ఏమీ అనిపించవు. ఇప్పుడు పూర్తి జీవితాన్ని వ్యాపారం చేశారా(అర్పించారా) లేక హాస్టలులో ఉన్నంతకాలం వరకు చేశారా? ఎప్పుడూ ఎవ్వరూ శ్రేష్ఠ జీవితము నుండి సాధారణ జీవితములోకి తెలిసి తెలిసి వెళ్ళలేరు. ఎవరైనా లక్షాధికారిని నిరుపేదగా అవ్వమంటే అవుతారా? పరిస్థితుల కారణంగా ఎవరైనా అలా అయినా అది బాగుండదు. కనుక ఈ జీవితం స్వరాజ్య అధికారి జీవితం. దీని నుండి జీవితంలోకి వెళ్ళలేరు. ఇప్పుడు వివేకవంతులుగా అయ్యి అనుభవం చేస్తున్నారా లేక పరస్పరం సాంగత్యముతో నడుస్తున్నారా? మీ బుద్ధిలో నిర్ణయం తీసుకున్నారా? మీ వివేకంతో నిర్ణయం తీసుకొని ఈ జీవితాన్ని చేసుకున్నారు కదా లేక తల్లిదండ్రులు చెప్పిన కారణంగా వచ్చారా? మంచిది.

2. కుమారీలు తమను తాము ఆఫర్ చేసుకున్నారా(అర్పించుకున్నారా)? సేవ కొరకు ఎక్కడకు పంపితే అక్కడకు వెళ్తారా? పక్కా వ్యాపారం(సౌదా) చేశారా లేక కచ్ఛా వ్యాపారం చేశారా? పక్కా వ్యాపారం అయితే ఎక్కడ కూర్చోబెడ్తే అక్కడ, ఏది చేయిస్తే అది చేస్తాము ఇలా తయారుగా ఉన్నారా? ఒకవేళ ఏదైనా బంధనం ఉంటే అది పక్కా సౌదా కాదు. ఒకవేళ మీరు స్వయం తయారుగా ఉంటే ఎవ్వరూ ఆపలేరు. మేకను బంధించి కూర్చోబెడ్తారు, సింహాన్ని ఎవరూ బంధించలేరు. కనుక సింహము ఎవరి బంధనంలోకైనా ఎలా రాగలదు? అది అడవిలో ఉంటున్నా స్వతంత్రంగా ఉంటుంది. కనుక మీరెవరు? సింహమేనా? సింహము అనగా మైదానములోకి వచ్చేవారు. ఒకే బలము, ఒకే విశ్వాసము ఉన్నపుడు ధైర్యం పిల్లలది - సహాయము తండ్రిది. ఎటువంటి కఠినమైన బంధనాలున్నా ధైర్యము ఆధారం పై ఆ కఠినమైన బంధనాలు కూడా సహజంగా వదిలిపోతాయి. ఎలాగైతే జైలు తాళాలు కూడా తెరుచుకున్నాయని చూపిస్తారో, అలా మీ బంధనాలు కూడా తెగిపోతాయి. కావున అలా అవ్వండి. ఒకవేళ కొద్దిగా అయినా బంధనముంటే దానిని యోగాగ్నిలో భస్మం చేసేయండి. భస్మమైపోతే నామ-రూపాలు కూడా అదృశ్యమవుతాయి. కేవలం తెంచినట్లయితే మళ్లీ ముడివేయవచ్చు, కనుక తెంచకండి, వాటిని భస్మం చేస్తే సదా కొరకు ముక్తులైపోతారు.

ఎన్నుకోబడిన అవ్యక్త మహావాక్యాలు.

సరళచిత్తులుగా అయితే సఫలత లభిస్తూ ఉంటుంది - బ్రాహ్మణుల ముఖ్య సంస్కారము సర్వస్వత్యాగి. త్యాగము ద్వారానే జీవితంలో సరళత మరియు సహనశీలత అనే గుణాలు సహజంగా వచ్చేస్తాయి. ఎవరిలో అయితే సరళత, సహనశీలత ఉంటాయో వారు ఇతరులను కూడా తప్పకుండా ఆకర్షిస్తారు. అంతేకాక ఒకరికొకరు స్నేహితులుగా అవ్వగలరు. ఎవరైతే స్వయం సరళచిత్తులుగా ఉంటారో వారు ఇతరులను కూడా సరళచిత్తులుగా చేయగలరు. సరళచిత్తులు అనగా ఏ విషయాన్ని విన్నారో, చూశారో, అది సారయుక్తంగా ఉంటుంది. సారమునే తీసుకుంటారు. స్వయం ఏ మాటలు మాట్లాడ్తారో ఏ కర్మలు స్వయం చేస్తారో అందులో కూడా సారం నిండి ఉంటుంది.

సరళ పురుషార్థులెవరైతే ఉంటారో వారు ఇతరులను కూడా సరళ పురుషార్థులుగా చేస్తారు. సరళ పురుషార్థులు అన్ని విషయాలలో ఆల్రౌండర్లుగా ఉంటారు. ఏ విషయంలోనూ లోపం కనిపించదు. ఏ విషయంలోను ధైర్యం తగ్గిపోదు. ఇది ఇప్పుడు చేయలేము అనే మాటలు వారి నోటి నుండి వెలువడవు. ఒక్క ఈ సరళతా గుణము ద్వారా అన్ని విషయాలలో ఉదాహరణగా అయ్యి పాస్విత్ఆనర్అవుతారు. ఉదాహరణానికి సాకార బాబాను ఎంతటి జ్ఞాన సంపన్నులో అంతటి సరళ స్వభావులుగా చూశారు కదా! వాటిని బాల్యతనపు సంస్కారాలని అంటారు. వృద్ధులలో వృద్ధునిగా, చిన్నవారిలో చిన్నవారిగా ఉన్నారు. అలా తండ్రిని అనుసరించి సరళచిత్తులుగా అవ్వండి.

ఇతరుల సంస్కారాలను సరళంగా తయారుచేసే సాధనము - హాజీ(అలాగేనండి) అని అనడం. మీరు ఇక్కడ ఎంత హాజీ-హాజీ అని అంటారో అక్కడ సత్యయుగంలో మీ ప్రజలు అంత హాజీ-హాజీ అంటారు. ఒకవేళ ఇక్కడ నాజీ-నాజీ(కాదండీ-కాదండీ) అన్నట్లయితే అక్కడ కూడా ప్రజలు దూరం నుండే నమస్కారం చేస్తారు. కావున కాదు అన్న పదమును తొలగించాలి. ఏ విషయమైనా ముందు హాజీ అని అనాలి. దీని ద్వారా సంస్కారాలలో సరళత వచ్చేస్తుంది. సఫలతా మూర్తులుగా అయ్యేందుకు ముఖ్య గుణాలైన సరళత మరియు సహనశీలతలను ధారణ చేయండి. ఎలాగైతే ధైర్యమున్న మనుష్యులెవరైనా ఆలోచించి, అర్థం చేసుకొని కార్యము చేస్తే సఫలత లభిస్తుందో అలా ఎవరైతే సరళ స్వభావులుగా, సహనశీలురుగా ఉంటారో వారు తమ సహనశీలతా శక్తితో ఎటువంటి కఠినమైన సంస్కారాలు గలవారినైనా శీతలంగా చేసేస్తారు. కఠినమైన కార్యాన్ని సహజంగా చేస్తారు.

మీ స్మృతిచిహ్నాలైన దేవతల చిత్రాలను ఏవైతే తయారుచేస్తారో వారి ముఖములో సరళతను తప్పకుండా చూపిస్తారు. ఈ విశేషమైన గుణమును చూపిస్తారు. రూపురేఖలలో సరళతను దేనినైతే మీరు అమాయకత్వమని అంటారో ఆ సరళతను చూపిస్తారు. ఎవరెంత సహజ పురుషార్థులుగా ఉంటారో వారు మనసులో కూడా సరళంగా, బాబాతో కూడా సరళంగా, వాచాలో కూడా సరళంగా, కర్మలో కూడా సరళంగా ఉంటారు. వారినే ఫరిస్తాలని అంటారు. ఈ సరళతా గుణాన్ని ధారణ చేయడంతో పాటు ఇముడ్చుకునే, సహించుకునే శక్తి కూడా తప్పకుండా ఉండాలి. ఒకవేళ ఇముడ్చుకునే మరియు సహించుకునే శక్తి లేకుంటే సరళత చాలా అమాయక రూపాన్ని ధరిస్తుంది, అక్కడక్కడ అమాయకత్వము చాలా భారీ నష్టాన్ని కలిగిస్తుంది. కావున అటువంటి సరళచిత్తులుగా అవ్వకండి.

సరళతా గుణము కారణంగా తండ్రిని కూడా భోళానాథుడని అంటారు. కానీ వారు భోళానాథునితో పాటు ఆల్మైటీ అథారిటీగా(సర్వశక్తివంతునిగా) కూడా ఉన్నారు. కేవలం భోళానాథుడే కాదు, కావున మీరు కూడా సరళతా గుణమును ధారణ చేయండి. కానీ మీ శక్తి స్వరూపాన్ని కూడా సదా గుర్తుంచుకోండి. ఒకవేళ శక్తి స్వరూపాన్ని మర్చిపోతే కేవలం అమాయకంగా అయితే మాయ తుపాకి గుండు తగులుతుంది. కావున మాయ ఎదుర్కోక ముందే నమస్కారము చేసేటంతంటి శక్తి స్వరూపులుగా అవ్వండి. చాలా సావధానంగా, జాగ్రత్తగా, తెలివైనవారిగా ఉండాలి. మాటలు కూడా సరళంగా ఉండాలి. ప్రతి కర్మ కూడా సరళతా సంపన్నంగా ఉండునంత విశేషతా సంపన్నంగా అవ్వండి. సదా ఒకరి మతం పై, ఒక్కరితోనే సర్వ సంబంధాలు, ఒక్కరితోనే సర్వ ప్రాప్తులు పొందుతూ సదా ఏకరసంగా ఉండే సహజ అభ్యాసిగా అవ్వండి. సదా సంతోషంగా ఉండండి, సంతోష ఖజానాను పంచండి.

సరళతా గుణాన్ని జీవితములో తీసుకొచ్చేందుకు వర్తమాన సమయంలో కేవలం ఒక విషయం పై తప్పకుండా ధ్యాస ఉంచాలి. మీ స్థితి స్తుతి ఆధారం పై ఉండరాదు. ఒకవేళ స్తుతి ఆధారంగా స్థితి ఉన్నట్లయితే ఏ కర్మ చేస్తారో, దాని ఫలము కావాలనే కోరిక లేక లోభము ఉంటుంది. ఒకవేళ నింద జరిగినట్లయితే అనాథలుగా అయిపోతారు. తమ స్థితిని వదిలేస్తారు. అంతేకాక యజమానిని(తండ్రిని) మర్చిపోతారు. కావున మా స్తుతి(మహిమ) జరగాలని ఎప్పుడూ అనుకోకండి. స్తుతి ఆధారంగా స్థితిని ఉంచుకోకండి. అప్పుడే సరళచిత్తులని అంటారు. సరళతను తమ నిజ స్వరూపంగా తయారు చేసుకోవడం వలన సర్దుకునే శక్తి కూడా సహజంగా వచ్చేస్తుంది. సరళ స్వభావం గలవారు ఎవరైతే ఉంటారో వారు అందరికీ స్నేహితులుగా ఉంటారు. వారికి అందరి ద్వారా సహయోగము కూడా తప్పకుండా లభిస్తుంది. కనుక వారు అన్ని విషయాలలోనూ ఎదుర్కోవడం లేక సర్దుకోవడం సహజంగా చేయగలరు. ఎవరెంత సరళ స్వభావం గలవారిగా ఉంటారో వారిని మాయ ఎదుర్కోవడం కూడా అంత తక్కువగా ఉంటుంది. వారు అందరికీ ప్రియంగా అవుతారు.


సరళ స్వభావం గలవారికి వ్యర్థ సంకల్పాలు ఎక్కువగా నడవవు. వారి సమయం కూడా వ్యర్థంగా పోదు. వ్యర్థ సంకల్పాలు నడవని కారణంగా వారి బుద్ధి విశాలంగా, దూరదృష్టి గలవారిగా ఉంటుంది. అందువలన వారి ముందు ఏ సమస్య కూడా ఎదుర్కోజాలదు. ఎంతగా సరళత ఉంటుందో, అంత స్వచ్ఛత కూడా ఉంటుంది. స్వచ్ఛత అందరినీ తనవైపుకు ఆకర్షిస్తుంది. స్వచ్ఛత అనగా సత్యత మరియు శుభ్రత. అవి తమ స్వభావాన్ని సరళంగా చేసుకున్నప్పుడే వస్తాయి. సరళ స్వభావం గలవారు బహురూపులుగా అవ్వగలరు. కోమలమైన పదార్థాన్ని ఏ రూపంలోకి తీసుకొస్తే ఆ రూపంలోకి రాగలదు. ఇప్పుడు మీరు గోల్డుగా అయ్యారు కానీ బంగారాన్ని అగ్నిలో కరిగించండి. అప్పుడు మౌల్డ్కుడా అవ్వగలరు. ఈ లోపము కారణంగా సేవలో సఫలత తగ్గిపోతుంది. స్వయం లేక ఇతరుల గతాన్ని చూడకుంటే సరళచిత్తులుగా అవుతారు. సరళచిత్తులుగా ఎవరైతే ఉంటారో వారిలో మధురతా గుణం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. వారి నయనాల ద్వారా, ముఖము ద్వారా, నడవడిక ద్వారా, మధురత ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. ఎవరెంత స్పష్టంగా ఉంటారో, వారు అంత సరళంగా మరియు శ్రేష్ఠంగా ఉంటారు. స్పష్టత శ్రేష్ఠతకు సమీపంగా ఉంటుంది. అంతేకాక ఎంత స్పష్టత ఉంటుందో అంత సఫలత కూడా ఉంటుంది.

Comments