26-11-1984 అవ్యక్త మురళి

26-11-1984                    ఓంశాంతి                 అవ్యక్త బాప్ దాదా           మధువనము

'' సత్యమైన సహయోగులే సత్యమైన యోగులు ''

ఈ రోజు పిల్లలు మిలనము చేసే రోజు. పిల్లల స్నేహాన్ని చూస్తున్నారు. ఒకే బలము, ఒకే నమ్మకం అనే ఛత్రఛాయ క్రింద పిల్లలు ఉమంగ-ఉత్సాహాలలో ఉన్నందున వారి పట్టుదలను (లగ్నాన్ని) అలజడి కొద్దిగానైనా చలింపజేయలేక పోయింది. స్నేహం వలన ఆటంకాలు, అలసట మారిపోయి మార్గాన్ని సహజంగా అనుభవం చేసి వచ్చి చేరుకున్నారు. దీనినే '' హిమ్మతే బచ్చే మదదే బాప్(పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం చేస్తారు) '' అని అంటారు. ఎక్కడ ధైర్యముంటుందో అక్కడ ఉల్లాసం కూడా ఉంటుంది. ధైర్యం లేకుంటే ఉల్లాసం కూడా ఉండదు. ఇలా సదా ధైర్యము, ఉత్సాహంలో ఉండే పిల్లలు ఏకరస స్థితి ద్వారా మొదటి నంబరు తీసుకుంటారు. ఎటువంటి కఠినంలో కఠినమైన పరిస్థితి అయినా ధైర్యము మరియు ఉల్లాసం అనే రెక్కల ద్వారా సెకండులో ఎగిరేకళ అనే ఉన్నత స్థితి ద్వారా ప్రతి పెద్ద మరియు కఠినమైన పరిస్థితి కూడా చిన్నదిగా, సహజమైనదిగా అనుభవం అవుతుంది. ఎందుకంటే ఎగిరేకళ ముందు చిన్న చిన్న విఘ్నాలు ఆట్లాడుకునే ఆట బొమ్మలుగా అనుభవమవుతాయి. ఎంత భయంకరమైన విషయాలైనా భయానికి బదులు స్వాభావికంగా న్యాచురల్గా అనుభవమవుతాయి. బాధ కలిగించే విషయాలు దృఢతను ఇప్పించేవిగా అనుభవమవుతాయి. ఎంత దు:ఖమయ దృశ్యాలు చూస్తున్నా(వచ్చినా), సంతోషము కలిగించే ఢంకాలు మీ పై దు:ఖము కలిగించే దృశ్యాల ప్రభావాన్ని పడనీయవు. ఇంకా శాంతి మరియు శక్తి ద్వారా ఇతరుల దు:ఖము, బాధలు అనే అగ్నిని చల్లార్చే శీతల జలము వలె అందరి పట్ల సహయోగిగా అవుతాయి. ఇటువంటి సమయంలో దు:ఖముతో విలవిలలాడుతున్న ఆత్మలకు సహయోగము చాలా అవసరము. ఈ సహయోగము ద్వారానే శ్రేష్ఠమైన యోగాన్ని అనుభవం చేస్తారు. అందరూ మీరు చేసే ఈ సత్యమైన సహయోగాన్నే సత్యమైన యోగంగా అంగీకరిస్తారు. ఇలాగే హాహాకారాలు జరిగే సమయంలో సత్యమైన సహయోగుల నుండి సత్యమైన యోగులుగా అవ్వాలి. ఈ ప్రత్యక్షత ద్వారా ప్రత్యక్ష ఫలంగా జయ జయ ధ్వనులు వినిపిస్తాయి. ఇటువంటి సమయానికే ''ఒక బిందువు కొరకు దాహముతో ఉండిన మాకు...... ఏక్ బూంద్ కే ప్యాసే'' అనే మహిమ ఉంది. ఈ శాంతి శక్తి ద్వారా ఒక సెకండు కలిగే అనుభూతి అనే బిందువు, విలవిలలాడుతున్న ఆత్మలకు తృప్తిని అనుభవం చేయిస్తుంది. ఇటువంటి సమయంలో లభించే ఒక సెకండు ప్రాప్తి వారికి అనేక జన్మల తృప్తి లేక ప్రాప్తి కలిగిందని అనుభవం చేయిస్తుంది. కానీ చాలాకాలం నుండి అభ్యాసం చేసే ఆత్మలే తమ శక్తిశాలి స్థితి ద్వారా ఒక సెకండులో దాహముతో ఉన్న వారి దాహాన్ని తీర్చగలరు. ఇప్పుడు చెక్ చేసుకోండి - ఇటువంటి దు:ఖము, బాధలు కలిగించే భయంకర వాయుమండలం మధ్య ఒక సెకండులో మాస్టర్ విధాత, మాస్టర్ వరదాత, మాస్టర్ సాగరులుగా అయ్యి ఇటువంటి శక్తిశాలి స్థితిని అనుభవం చేయించగలరా? ఇటువంటి సమయంలో ఏమి జరుగుతూ ఉందని చూస్తూ, వినడంలో మునిగిపోతే సహయోగులుగా అవ్వలేరు. ఆ దృశ్యాలు చూడాలి, వినాలనే కోరిక నామమాత్రంగా ఉన్నా, అది అందరి కోరికలను పూర్తి చేసే శక్తిశాలి స్థితిని తయారు చేసుకోనివ్వదు. అందువలన మీరు సదా మీ అల్పకాలిక ఇచ్ఛా మాత్రం అవిద్య అనే శక్తిశాలి స్థితిలో ఉండేందుకు ఇప్పటి నుండే అభ్యాసం చేయండి. ప్రతి సంకల్పము, ప్రతి శ్వాసలో అఖండ సేవాధారి, అఖండ సహయోగుల నుండి యోగులుగా అవ్వండి. ఎలాగైతే ఖండిత మూర్తికి ఏ విలువా లేదో, పూజనీయంగా అయ్యేందుకు అధికారము లేదో, అలా ఖండిత సేవాధారులు, ఖండిత యోగులు ఇటువంటి సమయంలో అధికారాన్ని ప్రాప్తి చేయించే అధికారులుగా అవ్వలేరు. ఇప్పుడు ఇటువంటి శక్తిశాలి సేవ చేయాల్సిన సమయం సమీపానికి వస్తోంది. సమయం గంటను మ్రోగిస్తూ ఉంది. ఎలాగైతే భక్తులు తమ ఇష్ట దేవీ దేవతలను గంటలు మ్రోగించి నిదుర లేపుతారో, నిద్రపుచ్చుతారో, నైవేద్యము(భోగ్) పెట్తారో, అలా ఇప్పుడు సమయం గంట మ్రోగించి ఇష్ట దేవీ దేవతలను అలర్ట్ చేస్తూ ఉంది( హెచ్చరిస్తూ ఉంది ). మేల్కొనే ఉన్నారు కానీ పవిత్ర ప్రవృత్తిలో ఎక్కువ బిజీగా అయిపోయారు. దాహముతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చేందుకు, సెకండులో అనేక జన్మలకు ప్రాప్తి చేయించే శక్తిశాలి స్థితిని అభ్యాసము చేసేందుకు తయారవ్వమని సమయం గంటను మ్రోగిస్తూ ఉంది. ప్రత్యక్షము చేయించే పర్దా తెరుచుకునే సమయం, సంపన్న ఇష్ట దేవాత్మలైన మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంది. అర్థమయ్యిందా. సమయం మ్రోగించే గంటనైతే మీరందరూ విన్నారు కదా. మంచిది.

ప్రతి పరిస్థితిని ఎగిరేకళ ద్వారా సహజంగా దాటుకునేవారు, చాలాకాలపు అభ్యాసము ద్వారా సెకండులో పాప్త్రి చేయించుట ద్వారా తృప్తి చేయించే అఖండ సేవాధారులు, అఖండ యోగులు, సదా మాస్టర్ దాత, వరదాత స్వరూపులు, సదా ఇచ్ఛా మాత్రం అవిద్య స్థితి ద్వారా అందరి ఇచ్ఛలను(కోరికలను) పూర్తి చేసేవారు - ఇటువంటి మాస్టర్ సర్వశక్తివాన్ సమర్థులైన పిల్లలకు బాప్దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే.

(గంగేదాది కాన్పూర్లో జరిగిన సమాచారాన్ని బాప్దాదాకు వినిపించారు). మీరు సదా అచల్ అడోల్ఆత్మ కదా. ప్రతి పరిస్థితిలో తండ్రి ఛత్రఛాయను అనుభవం చేసినవారు కదా? బాప్దాదా తమ పిల్లలను సదా సురక్షితంగా ఉంచుతారు. సదా సురక్షితంగా ఉండే ధనము తండ్రి ద్వారా లభించింది. అందువలన తండ్రి స్నేహము మరియు చేయి సదా జతలో ఉంది. ''నథింగ్ న్యూ(కొత్తదేమీ కాదు).'' ఈ విషయం బాగా అభ్యాసం అయ్యింది కదా. జరిగిపోయిందంతా ''నథింగ్ న్యూ.'' ఇప్పుడు ఏదైతే జరుగుతూ ఉందో అది కూడా నథింగ్ న్యూ  స్వతహాగా టచ్ అవుతూ(తెలుస్తూ) ఉంటుంది. ఇప్పుడు రిహార్సల్ జరుగుతూ ఉంది. ఇటువంటి సమయంలో సురక్షితంగా ఉండేందుకు, సేవ చేసేందుకు ఏ సాధనము ఉండాలో, ఏ స్వరూపములో ఉండాలో అందుకు రిహార్సల్ జరుగుతుంది. ఫైనల్(చివరి) సమయంలో హాహాకారాల మధ్య జయ జయ ధ్వనులు జరుగుతాయి. అతి తర్వాత అంతమై కొత్త యుగము ప్రారంభమవుతుంది. ఇటువంటి సమయంలో వద్దనుకున్నా అందరి మనసు ద్వారా ఈ ప్రత్యక్షతా ఢంకా మ్రోగుతుంది. దృశ్యము నాజూకుగా ఉంటుంది. కానీ ప్రత్యక్షతా ఢంకాలు మ్రోగుతాయి. కనుక రిహార్సల్ ద్వారా దాటుకున్నారు. చింతలేని చక్రవర్తిగా అయ్యి పాత్రను అభినయించారు. పాత్ర చాలా బాగా చేశావు, ఎలాగైనా వచ్చి చేరుకున్నావు. స్నేహ స్వరూపమంటే ఇదే. మంచి ఆలోచన చేస్తే అసోచ్(ఆలోచన లేకుండా)గా  అవ్వనే అవుతారు. ఏదైతే జరిగిపోయిందో అది వాహ్వాహ్! ఇందులో కూడా చాలామందికి కొంత కళ్యాణమే ఉంటుంది. అందువలన కాలిపోవడంలో కూడా కళ్యాణమే, రక్షింపబడుటలో కూడా కళ్యాణమే ఉంది. హాయ్(అయ్యో) అని అనరు, అయ్యో కాలిపోయింది అని అనరాదు. ఇందులో కూడా కళ్యాణముంది. రక్షింపబడినప్పుడు ఎలాగైతే వాహ్వాహ్ అని, వాహ్ రక్షింపబడ్డాడు అని అంటారో అలా కాలిపోయే సమయంలో కూడా వాహ్వాహ్! అని అనుకోవాలి. దీనినే ఏకరస స్థితి అని అంటారు. రక్షించడం మీ కర్తవ్యము కానీ కాలాల్సిన వస్తువు కాలిపోవాల్సిందే. ఇందులో కూడా లెక్కాచారముంటుంది. మీరు ఎలాగైనా చింతలేని చక్రవర్తులే. ఒకటి పోయింది, లక్ష వచ్చింది(పొందాము). ఇది బ్రాహ్మణుల స్లోగన్. పోగొట్టుకోలేదు కానీ పొందారు. అందువలన ఏ చింతా లేదు. ఇంకా ఏదో మంచిది లభిస్తుంది. అందువలన కాలిపోవడమూ ఆటే, రక్షింపబడడమూ ఆటే. రెండూ ఆటలే. వీరు ఎంత చింతలేని చక్రవర్తులుగా ఉన్నారు! అని అందరూ చూస్తారు. తగులబడ్తున్నా మీరు చక్రవర్తులే ఎందుకంటే ఛత్రఛాయ లోపల ఉన్నారు. వారు ఏమవుతుందో, ఎలా అవుతుందో, ఎలా తింటాము, ఎలా నడుస్తాము అని చింతలో ఉంటారు. కానీ పిల్లలైన మీకు చింత ఉండనే ఉండదు. అచ్ఛా.

ఇప్పుడు ఏర్పాట్లు చేసుకోవాలి కదా. మేము ఎలాగైనా వెళ్లిపోతామని మీ వరకే అనుకోకండి, అందరినీ ఎలాగైనా తీసుకెళ్తామని అనుకోండి. అందరికీ సాక్షాత్కారము చేయించి, తృప్తిపరచి, ప్రత్యక్షతా ఢంకాను మ్రోగించిన తర్వాత వెళ్తాము. ముందు ఎందుకు వెళ్లాలి! మీరు తండ్రి జత జతలో (వెంట) వెళ్తారు. అద్భుతమైన ప్రత్యక్షతా దృశ్యాన్ని కూడా అనుభవం చేసి వెళ్తారు కదా! ఇది కూడా ఎందుకు మిగిలిపోవాలి. ఈ మానసిక భక్తి, మానసిక పూజ, ప్రేమ పుష్పాలు........ ఈ అంతిమ దృశ్యము చాలా అద్భుతంగా ఉంటుంది. అడ్వాన్స్ పార్టీలో ఎవరు ఉంటారనేది వేరే విషయం. కానీ ఈ దృశ్యము చూడడమైతే చాలా అవసరము. ఎవరైతే అంతము చేశారో, వారే అంతా చేశారని అంటారు. అందుకే తండ్రి అంతిమ సమయంలో వచ్చినందున అన్నీ చేశారు కదా. కనుక తండ్రి జతలో ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ వెంట ఎందుకు వెళ్లరాదు? ఈ పాత్ర కూడా కొంతమందికే ఉంటుంది. కనుక వెళ్లాలనే సంకల్పం చేయకండి. వెళ్లిపోయినా మంచిదే, ఉంటే చాలా మంచిది. ఒంటరిగా వెళ్లినా అడ్వాన్స్ పార్టీలో సేవ చేయాల్సి వస్తుంది. అందువలన వెళ్లాలని అనుకోకండి, అందరినీ వెంట తీసుకెళ్లాలి, దీనిని గురించి ఆలోచించండి. మంచిది. ఈ అనుభవం కూడా జరిగింది. ఏమి జరిగినా దాని ద్వారా అనుభవమనే డిగ్రీ పెరుగుతుంది. ఎలాగైతే వారి చదువులో డిగ్రీ పెరుగుతుందో, ఇది కూడా అనుభవం చేశారు అంటే డిగ్రీ పెరిగింది.

పార్టీలతో కలయిక -

అందరూ స్వయాన్ని స్వరాజ్య అధికారులుగా భావిస్తున్నారా? ఇప్పుడు ఈ సంగమ యుగంలో స్వరాజ్యము, భవిష్యత్తులో విశ్వ రాజ్యము. స్వరాజ్య అధికారులే విశ్వ రాజ్య అధికారులుగా అవుతారు. స్వయాన్ని స్వరాజ్య అధికారులుగా, కర్మేంద్రియాలను కర్మచారులుగా(పని చేసేవారిగా) భావించి మీ అధికారముతో నడిపిస్తున్నారా లేక ఎప్పుడైనా ఏదైనా కర్మేంద్రియం రాజుగా అవుతోందా? స్వయం మీరు రాజుగా ఉన్నారా లేక ఎప్పుడైనా ఏదైనా కర్మేంద్రియం రాజుగా అయిపోతోందా? ఎప్పుడూ ఏ కర్మేంద్రియము మోసం చేయడం లేదు కదా? ఒకవేళ దేనితోనైనా మోసపోయారంటే దు:ఖము తీసుకుంటారు. మోసము దు:ఖమును ప్రాప్తి చేయిస్తుంది. మోసపోకుంటే దు:ఖముండదు. కనుక మీరు స్వరాజ్య ఖుషీలో, నషాలో, శక్తిలో ఉండేవారు. స్వరాజ్యము వలన కలిగే నషా, ఎగిరేకళలోకి తీసుకెళ్లే నషా. హద్దులోని నషా నష్టాన్ని కలిగిస్తుంది. ఈ బేహద్ నషా, అలౌకిక ఆత్మిక నషా సుఖాన్ని ప్రాప్తి చేయించేది. కనుక యథార్థమైన రాజ్యమంటే రాజులది, ప్రజా రాజ్యమంటే గలాటాల రాజ్యము. ఆది నుండి రాజుల రాజ్యమే ఉండేది. ఇప్పుడు చివరి జన్మలో ప్రజారాజ్యము నడుస్తోంది. ఇప్పుడు మీరు రాజ్యాధికారులుగా అయ్యారు. అనేక జన్మలు భికారులుగా ఉన్నారు, ఇప్పుడు భికారుల నుండి అధికారులుగా అయ్యారు. బాప్దాదా సదా - పిల్లలూ, సంతోషంగా ఉండండి, జీవించి ఉండండి అని అంటారు. మీరు స్వయాన్ని ఎంత శ్రేష్ఠమైన ఆత్మగా భావించి, శ్రేష్ఠ కర్మలు, శ్రేష్ఠ మాటలు, శ్రేష్ఠ సంకల్పాలు చేస్తారో, అంత ఈ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా శ్రేష్ఠ ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ఈ స్వరాజ్యము మీ జన్మ సిద్ధ అధికారము. ఇదే మిమ్ములను జన్మ-జన్మలకు అధికారులుగా చేస్తుంది. అచ్ఛా.

అవ్యక్త బాప్దాదా వారి అమూల్యమైన ప్రేరణదాయక మహావాక్యాలు

1. అందరూ ఒక విషయం కొరకు వేచి ఉన్నారు, అది ఏది? ప్రారంభం నుండి ఉన్న చిక్కు ప్రశ్న - 'నేను ఎవరు?' చివరి వరకు కూడా అదే ఉంది. భవిష్యత్తులో నేను ఎవరు? లేక మాలలో ఎక్కడుంటాను? ఇది తెలుసుకునేందుకు అందరూ వేచి ఉన్నారు. ఇప్పుడు ఈ వేచి ఉండడం ఎప్పుడు పూర్తి అవుతుంది? అందరూ పరస్పరము 8 లో ఎవరుంటారు, 100 లో ఎవరుంటారు అని ఆత్మిక సంభాషణ కూడా చేస్తారు. 16 వేలను గురించి అయితే ప్రశ్నే లేదు. చివరికి 8 లో లేక 100లో ఎవరు ఉంటారు? విదేశీయులు మేము ఏ మాలలో ఉంటాము అని ఆలోచిస్తారు. ప్రారంభంలో వచ్చినవారు లాస్ట్ సో ఫాస్ట్ కదా, మాకు స్థానం ఉంటుందా లేక చివర్లో వచ్చేవారికి ఉంటుందా? అని ఆలోచిస్తారు. చివరికి లెక్క ఏది? రిజిస్టరైతే తండ్రి వద్ద ఉంది కదా. ఇంకా ఫిక్స్ చేయలేదు. పిల్లలైన మీరు కూడా ఆర్ట్ కాంపిటిషన్లో చిత్రాలు ఎలా ఎన్నుకున్నారు? మొదట కొన్ని వేరుగా తీశారు. తర్వాత వాటికి ఒకటి, రెండు, మూడు అని నంబరు కేటాయించారు. అలాగే మీరు మొదట ఎన్నుకోబడ్తారు. తర్వాత నంబరువార్ ఫిక్స్ అవుతారు. ఇప్పుడు ఎన్నుకోబడ్డారు కానీ ఫిక్స్ అవ్వలేదు. వెనుక వచ్చేవారి విషయమెలా ఉంటుంది? సదా చివరి వరకు కొన్ని సీట్లు అలాగే ఉంటాయి. రిజర్వేషన్ ఉన్నా చివరి వరకు కొంత కోటా అలాగే ఉంచుతారు. కానీ అటువంటివారు కోట్లలో కొంతమంది, అందులో కూడా ఏ ఒక్కరో ఉంటారు.

అచ్ఛా, మీరంతా ఏ మాలలో ఉన్నారు? మీ పై మీరు నమ్మకముంచండి. మీ అందరి ఆశలు పూర్తి అయ్యే ఏదో ఒక అద్భుతమైన విషయము జరుగుతుంది. అష్టరత్నాల విశేషత ఒక ప్రత్యేక విషయము ద్వారా జరుగుతుంది. అష్టరత్నాలు ప్రాక్టికల్గా స్మృతిచిహ్నము వలె విశేషంగా అష్టశక్తులు. ప్రతి శక్తి వారి జీవితంలో ప్రాక్టికల్గా కనిపిస్తుంది. ఒకవేళ ఒక శక్తి అయినా ప్రాక్టికల్ జీవితంలో తక్కువగా కనిపిస్తే, ఖండిత మూర్తికి ఎలాగైతే పూజ జరగదో, అలా ఒక్క శక్తి తక్కువగా కనిపించినా అష్టదేవతల లిస్ట్ లో ఇంతవరకు ఫిక్స్ అవ్వలేదని అంటారు. రెండవ విషయం - అష్ట దేవతలు విశేషంగా భక్తులకు ఇష్టులని అనబడ్తారు. ఇష్టులనగా మహాన్ పూజ్యులు. ఇష్టుల ద్వారా ప్రతి భక్తునికి అన్ని ప్రకారాలైన విధులు, సిద్ధులు ప్రాప్తి అవుతాయి. ఇక్కడ కూడా ఎవరైతే అష్టరత్నాలుగా ఉంటారో, వారు సర్వ బ్రాహ్మణ పరివారము ముందు ఇప్పుడు కూడా ఇష్టులుగా అనగా ప్రతి సంకల్పము ద్వారా, నడవడిక ద్వారా విధి మరియు సిద్ధుల మార్గదర్శనము చేసేవారు. అందరి ముందు అలాగే మహాన్ మూర్తులుగా గౌరవింపబడ్తారు. కనుక వారిలో అష్టశక్తులు కూడా ఉంటాయి, పరివారము ముందు ఇష్టులుగా అనగా శ్రేష్ఠ ఆత్మలు, మహాన్ఆత్మలు, వరదానీ ఆత్మల రూపంలో ఉంటారు. ఇది అష్టరత్నాల విశేషత. అచ్ఛా.

2. ప్రపంచంలోని వైబ్రేషన్ల నుండి లేక మాయ నుండి సురక్షితంగా ఉండే సాధనము -

సదా ''ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు'' - ఎవరైతే ఈ లగ్నములో మగ్నమై ఉంటారో వారు రకరకాల మాయ దాడుల నుండి రక్షింపబడి ఉంటారు. ఎలాగైతే యుద్ధము జరిగే సమయంలో బాంబులు వేసినప్పుడు, భూగర్భములోకి వెళ్లిపోతే బాంబుల ప్రభావము వారి పై ఉండదో, అలా ఎంతవరకు లగ్నములో మగ్నమై ఉంటారో ప్రపంచములోని వైబ్రేషన్ల నుండి, మాయ నుండి రక్షింపబడి ఉంటారు, సదా సురక్షితంగా ఉంటారు. మాయకు దాడి చేసే ధైర్యముండదు. కనుక లగ్నములో మగ్నమై ఉండండి. ఇదే రక్షక సాధనము.

3. తండ్రికి సమీపంగా ఉండు రత్నాల గుర్తులు -

తండ్రికి సమీపంగా ఉండువారి పై తండ్రి సత్యమైన సాంగత్య రంగు అంటుకుని ఉంటుంది. సత్యమైన సాంగత్య రంగు - ఆత్మీయత. కనుక సమీప రత్నాలు సదా ఆత్మిక స్థితిలో స్థితమై ఉంటారు. శరీరంలో ఉంటున్నా భిన్నంగా ఉంటారు. ఆత్మిక స్థితిలో స్థితమై ఉంటారు. శరీరాన్ని చూస్తున్నా చూడరు. అంతేకాక కనిపించని వస్తువైన ఆత్మ ఏదైతే ఉందో అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇదే కదా అద్భుతము. ఆత్మిక మస్తీలో ఉండేవారే తండ్రిని సాథీగా చేసుకోగలరు. ఎందుకంటే తండ్రి ఆత్మ కదా.

4. పాత ప్రపంచంలో అన్ని ఆకర్షణల నుండి దూరమయ్యేందుకు సహజమైన యుక్తి -

సదా 'నేను అవినాశి ఖజానాకు యజమానిని' అన్న నశాలో ఉండండి. సుఖము, శాంతి, ఆనందము...... మొదలైన తండ్రి ఖజానాలేవైతే ఉన్నాయో ఆ గుణాలన్నీ నావే. ఎందుకంటే పుత్రుడు తండ్రి ఆస్తికి స్వతహాగా యజమానిగా ఉంటాడు. అధికారి ఆత్మకు తన అధికారము గురించిన నషా ఉంటుంది. నషాలో అంతా మర్చిపోతారు కదా. ఎలాంటి స్మృతి ఉండదు(ఏవీ గుర్తుండవు). ''తండ్రి మరియు నేను'' అని ఒక్కరి స్మృతి మాత్రమే ఉండాలి. ఈ స్మృతి ద్వారానే పాత ప్రపంచ ఆకర్షణల నుండి స్వతహాగా దూరమైపోతారు. నషాలో ఉండేవారి ముందు సదా లక్ష్యము(నిశానా) కూడా స్పష్టంగా ఉంటుంది. లక్ష్యమేమంటే ఫరిస్తా మరియు దేవత.

5. ఇది ఒక సెకండులోని అద్భుతమైన ఆట. దీని ద్వారా పాస్ విత్ ఆనర్ అయిపోవాలి. ఇది ఒక సెకండు ఆట. ఇప్పటికిప్పుడే శరీరంలోకి రావాలి, ఇప్పటికిప్పుడే అవ్యక్త స్థితిలో స్థితమైపోవాలి. ఈ సెకండు ఆట ఆడే అభ్యాసముందా? ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా అవ్వాలంటే అలా, ఆ స్థితిలో స్థితమై ఉండాలి. చివరి పేపరు (పరీక్ష) ఒక్క సెకండుదే ఉంటుంది. ఎవరైతే ఆ సెకండులో ఆందోళనలోకి వస్తారో, వారు ఫెయిల్అవుతారు. స్థిరంగా, అచలంగా ఉంటే పాస్అవుతారు. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ ఉందా? ఇప్పుడిటువంటి అభ్యాసము తీవ్రంగా ఉండాలి. ఎంత గలాటా జరుగుతున్నా, అంత మీ స్థితి అతి శాంతిగా ఉండాలి. ఎలాగైతే సాగరం బయటికి శబ్ధము చేస్తూ లోపల పూర్తి శాంతిగా ఉంటుందో, అటువంటి అభ్యాసముండాలి. కంట్రోలింగ్ పవర్ గలవారు మాత్రమే విశ్వాన్ని కంట్రోల్ చేయగలరు. ఎవరైతే స్వయాన్ని కంట్రోల్ చేసుకోలేరో వారు విశ్వము పై రాజ్యమునెలా చేయగలరు? సర్దుకునే శక్తి(సమేట్నే కీ శక్తి) కావాలి. ఒక్క సెకండులో విస్తారం నుండి సారములోకి వెళ్లిపోవాలి, మరో సెకండులో సారం నుండి విస్తారములోకి వచ్చేయాలి. దీనినే అద్భుతమైన ఆట అని అంటారు.

6. అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగుతూ ఉండండి -

మీరు అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగుతూ ఉండడం చూసి ఆత్మలంతా దు:ఖితుల నుండి సుఖీలుగా అయిపోవాలి. మీ కనులు, నోరు, ముఖము అన్నీ సుఖమునివ్వాలి. ఇటువంటి సుఖదాయులుగా అవ్వండి. ఇలా ఎవరైతే సుఖదాయులుగా అవుతారో వారికి సంకల్పములో కూడా దు:ఖపుటల రాజాలదు.

Comments