05-12-1984 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
'' సంపూర్ణ కామజీత్అనగా హద్దు కోరికలకు అతీతం ''
ఈ రోజు బాప్దాదా తమ సర్వ శ్రేష్ఠమైన భుజాలను చూస్తున్నారు. అన్ని భుజాలు స్నేహము మరియు శక్తి ద్వారా విశ్వ పరివర్తన కార్యములో లగ్నమై ఉన్నాయి. భుజాలన్నీ ఒక్కరివే. అందువలన అందరిలో ఒకే లగ్నము(పట్టుదల) ఉంది - మా ఈశ్వరీయ పరివారానికి చెందిన మా సోదరీ - సోదరులు ఎవరైతే తండ్రిని మరియు తమ అసలైన పరివారాన్ని తెలుసుకోని కారణంగా పిల్లలై ఉండి కూడా భాగ్యవిధాత అయిన తండ్రి ద్వారా భాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవడం నుండి వంచితులుగా ఉన్నారో, అటువంటి వంచితమైన ఆత్మలను మేల్కొల్పాలి. ఎంతో కొంత అధికారమనే దోసిలి ద్వారా వారికి కూడా తండ్రి పరిచయమునిప్పించాలి. ఎందుకంటే మీరు మొత్తం వంశావళి వారికి పెద్దవారు. కనుక పెద్ద కుమారులు తండ్రి సమానమని మహిమ చేయబడ్డారు. అందువలన పెద్దవారికి అమాయక (తెలియని) తమ్ముళ్లు, చెల్లెళ్ల పట్ల దయ మరియు ప్రేమ స్వతహాగానే వస్తుంది. ఎలాగైతే హద్దు పరివారములోని పెద్దవారికి పరివారము పట్ల ధ్యాస ఉంటుందో, అలా అనంతమైన పరివారములో పెద్దవారైన మీకు ధ్యాస ఉంటుంది కదా. మీది ఎంత పెద్ద పరివారము! మొత్తం బేహద్ పరివారమంతా మీ ముందు ఉంటుందా? అందరి పట్ల దయా కిరణాలు, ఆత్మిక ఆశీర్వాదాల కిరణాలు, వరదానాల కిరణాలు వ్యాపింపజేసే మాస్టర్ సూర్యులు కదా. ఎలాగైతే సూర్యుడు ఎంత ఎత్తులో ఉంటే అంత నలువైపులా కిరణాలు వ్యాపింపజేస్తాడో, ఎత్తు తగ్గిపోతే నలువైపులా కిరణాలు వ్యాపింపజేయలేడో అలా మీరు అత్యంత ఉన్నతమైన తండ్రి సమానం అత్యంత ఉన్నతమైన స్థితిలో స్థితమైనప్పుడు అనంతమైన కిరణాలను వ్యాపింపజేయగలరు అనగా బేహద్ సేవాధారులుగా అవ్వగలరు. అందరూ ఇటువంటి బేహద్ సేవాధారులే కదా. సర్వ ఆత్మల మనోకామనలను పూర్తి చేసే కామధేనువులు కదా. అందరి మనోకామనలను పూర్తి చేయువారు, ఇప్పటివరకు మీ మనోకామనలనే పూర్తి చేసుకోవడంలో బిజీగా లేరు కదా? మీ మనోకామనలు పూర్తి అవ్వకుంటే ఇతరుల మనోకామనలను ఎలా పూర్తి చేస్తారు? అన్నిటికంటే అత్యంత పెద్ద కోరిక తండ్రిని పొందుకోవడం. ఈ శ్రేష్ఠ కామన పూర్తి అయితే అందులో అన్ని చిన్న చిన్న కామనలు ఇమిడిపోతాయి. శ్రేష్ఠమైన బేహద్ కోరిక ముందు ఇతర హద్దు కామనలు ఏవైనా మిగిలిపోతాయా? ఈ హద్దు కామనలు కూడా మాయను ఎదుర్కోనివ్వవు. ఈ హద్దు కామనలు బేహద్ స్థితి ద్వారా బేహద్ సేవను చేయించలేవు. హద్దు కామనలను కూడా సూక్ష్మ రూపంతో చెక్ చేసుకోండి. ముఖ్యమైనది కామ వికారపు అంశము లేక వంశము. అందువలన కామనల వశమైతే ఎదుర్కోలేరు. బేహద్ మనోకామనలను పూర్తి చేయువారిగా అవ్వలేరు. కామజీత్అనగా హద్దు కామనలను జయించినవారు. మీరు ఇటువంటి మనోకామనలను పూర్తి చేయు విశేషాత్మలు. మన్మనాభవ స్థితి ద్వారా హద్దులోని మనోకామనలను పూర్తి చేసి అనగా సమాప్తం చేసి ఇతరుల మనోకామనలను పూర్తి చేసే సమయమిది. తృప్త ఆత్మలే ఇతరుల మనోకామనలను పూర్తి చేయగలరు. ఇప్పుడు విశ్వం ముందు శబ్ధానికి అతీతమైన స్థితిలో స్థితమై ఉండే వానప్రస్థ అవస్థలో కామనాజీత్అనగా సంపూర్ణ కామజీత్ కి స్యాంపుల్ గా అవ్వండి. మీ చిన్న చిన్న సోదరీ - సోదరులు ఈ కామనతో పెద్దవారైన మీ వైపు చూస్తున్నారు. మా మనోకామనలను పూర్తి చేయమని, మా సుఖ-శాంతుల కోరికను పూర్తి చేయమని పిలుస్తున్నారు. కనుక మీరు ఏం చేస్తారు? మీ కోరికలను పూర్తి చేసుకుంటారా? లేక వారి కోరికలను పూర్తి చేస్తారా? అందరి హృదయం నుండి, నోటితో చెప్పడం కాదు లేక ఈ సంఘటిత వాయుమండల మర్యాదలనుసారం చెప్పడం కాదు, హృదయపూర్వకంగా 'ఇచ్ఛా మాత్రం అవిద్య' అను నినాదము వెలువడాలి.
చాలామంది పిల్లలు గొప్ప చతురులుగా ఉన్నారు. చతుర్సుజాన్ కి కూడా చతురత చూపిస్తారు. హద్దు కోరికగా ఉంటుంది కానీ చెప్పేేటప్పుడు ఇలా, ఇలా అని చెప్తూ, ఇది శుభమైన ఇచ్ఛ అని, సేవ పట్ల ఇచ్ఛ అని చెప్తారు. నిజానికి అది వారి స్వంత కోరిక కానీ బాహ్యానికి సేవా రూపంగా చేస్తారు. అందువలన బాప్దాదా మందహాసము చేస్తూ తెలిసినా, చూస్తున్నా, చతురతను అర్థం చేసుకున్నా చాలామంది పిల్లలకు బాహాటంగా సూచననివ్వరు(ఆదేశమునివ్వరు). కానీ డ్రామానుసారము తప్పకుండా సూచన(ఆదేశము) లభిస్తుంది. అదెలా జరుగుతుంది? హద్దు కోరికలు పూర్తి అయితే ప్రాప్తి రూపంగా ఉంటుంది కానీ లోపల ఒక కోరిక ఇంకొక కోరికకు జన్మనిస్తూ ఉంటుంది. అందువలన మానసిక చిక్కుల రూపంలో సూచన లభిస్తూ ఉంటుంది. బాహ్యము నుండి ఎంత హద్దు ప్రాప్తిలో తింటూ, తాగుతూ, పాడుతూ ఉండినా మానసిక చిక్కును దాచేందుకు సాధన చేస్తూ(ప్రయత్నిస్తూ) ఉంటారు. లోపల మనసు తృప్తిగా ఉండదు. అల్పకాలానికి తృప్తి ఉంటుంది కానీ సదాకాలపు తృప్త అవస్థ లేక 'తండ్రి లభించారు, ప్రపంచమంతా లభించింది' అనే పాట పాడలేరు. వారు తండ్రితో కూడా 'మీరైతే లభించారు కానీ ఇది కూడా తప్పకుండా కావాలి' అని చెప్తారు. కావాలి, కావాలి అనే కోరిక తీరదు అనగా తృప్తి చెందరు. సమయ ప్రమాణంగా ఇప్పుడు అందరి నుండి 'ఇచ్ఛా మాత్రం అవిద్య' అనే శబ్ధము రావాలి. అప్పుడు ఇతరుల కోరికలను పూర్తి చేయగలరు. ఇప్పుడిక కొద్ది సమయంలో మీలో ఒక్కొక్క శ్రేష్ఠమైన ఆత్మను ప్రజలు చైతన్య భండారంగా అనుభవం చేస్తారు. అందరూ మీ వద్దకు భికారులుగా అయ్యి వస్తారు. మీరే భర్పూర్ భండారాలు అనే శబ్ధము వెలువడ్తుంది. ఇంతవరకు ఎవరో ఉన్నారు అని వెతుకుతున్నారు కానీ వారు ఎవరో, ఎక్కడున్నారో స్పష్టంగా అర్థము చేసుకోలేకున్నారు. కానీ ఇప్పుడు సమయం అనే బాణము కనిపిస్తుంది. దారి చూపేందుకు బాణం గుర్తులు ఉంటాయి కదా. బాణము గుర్తు, ఇలా వెళ్లండి అని దారి చూపిస్తుంది. అలా అందరికీ ఇక్కడికి వెళ్లండి అని అనుభవమవుతుంది. ఇటువంటి భర్పూర్భండారంగా అయ్యారా? సమయం కూడా మీకు సహయోగిగా అవుతుంది. శిక్షకునిగా అవ్వదు, సహయోగిగా అవుతుంది. బాప్దాదా సమయానికి ముందే పిల్లలందరినీ సంపన్న స్వరూపంలో, భర్పూర్భండారం రూపంలో, ఇచ్ఛా మాత్రం అవిద్య, తృప్త స్వరూపంలో చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి నుండే సంస్కారము నింపుకోకుంటే అంతములో సంస్కారాన్ని నింపుకునేవారు చాలాకాలపు ప్రాప్తికి అధికారులుగా అవ్వలేరు. అందువలన విశ్వం కొరకు మీరు విశ్వ ఆధారమూర్తులు. విశ్వము ముందు మీరు జహాన్కే నూర్. ప్రపంచానికి కులదీపకులు. ఏ ఏ శ్రేష్ఠమైన మహిమలున్నాయో, ఆ శ్రేష్ఠ మహిమలన్నిటికి అధికారి ఆత్మలైన మీరిప్పుడు విశ్వం ముందు మీ సంపన్న రూపంలో ప్రత్యక్షమై చూపించండి. అర్థమయిందా!
ఇక్కడకు వచ్చిన విశేషమైన సేవాధారి పిల్లలందరికి విశేషమైన స్నేహ స్వరూపంతో బాప్దాదా స్నేహ స్వాగతం చేస్తున్నారు. రైట్హ్యాండ్పిల్లలకు సమానత అనే షేక్హ్యాండ్ఇస్తున్నారు. భలే వచ్చేశారు. అచ్ఛా.
విశ్వములో అందరి మనోకామనలు పూర్తి చేయువారు, సదా సంపన్న తృప్త ఆత్మలకు, విశ్వ ఆధారమూర్తులకు, పత్రి సమయంలో విశ్వ కళ్యాణము చేయాలనే శేష్ఠ్ర కామనలో స్థితమై ఉండేవారికి, విశ్వం ముందు మాస్టర్విశ్వ రక్షకులై అందరినీ రక్షించేవారికి, సర్వ శేష్ఠ్రమైన మహాన్ఆత్మలకు బాప్దాదా యాద్ప్యార్మరియు నమస్తే.
మీటింగ్కు వచ్చిన సోదరీ - సోదరులతో - సేవాధారి పిల్లలు సేవకు ప్లాన్లు మనసులో అయితే తయారు చేసుకొని ఉంటారు కానీ మీటింగ్లో ఆ ప్లాన్లు సాకారంలోకి తీసుకొచ్చేందుకు వర్ణన చేస్తారు. ఏ ఏ సేవలు జరుగుతున్నాయో, అవన్నీ బాగున్నాయనే అంటారు. సమయం సమీపానికి వస్తున్న కొలది, సమయం అందరి బుద్ధిని ఆందోళనలోకి తెస్తోంది(ఆందోళన పరుస్తోంది). ఈ సమయ ప్రమాణంగా ఎటువంటి శక్తిశాలి ప్లాను తయారు చేస్తారంటే, భూమి పై నాగలి నడపాలి. బీజము వేసేందుకు ముందు భూమిని దున్నుతారు కదా. దున్నినందున ఏమవుతుంది? హల్చల్అవుతుంది. ఆ తర్వాత ఏ విత్తనం వేస్తారో, అది సహజంగా సఫలతను పొందుతుంది. అలా ఇప్పుడు ఈ హల్చల్(ఆందోళన) అనే నాగలిని నడపండి. ఏ ఆందోళన? ఈ రోజు వినిపించాను కదా - ''ఎవరో ఉన్నారు'' అని అందరూ అర్థం చేసుకున్నారు, తెలుసుకున్నారు కానీ '' వీరే, వీరొక్కరే '' - ఈ ఆందోళన(హల్చల్) అనే నాగలిని నడపలేదు. అందరితో పాటు వీరు కూడా ఉన్నారు అనేంతవరకు చేరుకున్నారు కానీ ఉండేది వీరొక్కరే అనే బాణాన్ని ఇప్పుడు వేయండి. ఈ టచింగ్తో ఆత్మలు మీ ముందుకు రావాలి. ఇటువంటి హల్చల్జరిగినప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. అందుకు విధి ఏది? రకరకాల ప్రోగ్రామ్లు చేస్తూ ఉంటారు, కాన్ఫరెన్స్లు కూడా చేస్తూ ఉంటారు, ఇతరుల స్టేజి పైకి కూడా వెళ్తారు, మీ స్టేజిని కూడా తయారు చేసుకుంటారు, యోగ శిబిరాలు కూడా చేయిస్తారు, ఈ సాధనాలన్నీ సమీపానికైతే తెచ్చారు. ఏ ఏ అనుమానాలున్నాయో అవన్నీ నివృత్తి కూడా అయిపోయాయి. సమీపానికి కూడా వచ్చేశారు కానీ ఇప్పుడు వారసత్వాల అధికారానికి సమీపంగా రావాలి. వాహ్వాహ్అని మెచ్చుకునేవారిగా అయితే అయ్యారు, ఇప్పుడు వారసులుగా అవ్వాలి. ఇప్పుడు ''వీరే సత్యమైన దారి చూపేవారు, తండ్రితో మిలనము చేయించేవారు, రక్షించేవారు, తీసుకుపోయేవారు కాదు'' అనే శబ్ధము బిగ్గరగా రావాలి. కనుక ఇప్పుడు అందుకు విధి, వాతావరణము ఇలా ఉండాలి, స్టేజి రూపురేఖలు కూడా అలా ఉండాలి, అందరి సంకల్పము కూడా ఒక్కటిగా ఉండాలి. వాతావరణ ప్రభావము శక్తిశాలిగా ఉండాలి, ప్రేమభరిత వాతావరణమైతే ఉంటుంది కానీ శాంతి మరియు శక్తిలో ఇంకా కొంచెం చేర్చండి. ప్రపంచం లెక్కలో అయితే శాంతి కూడా అనుభవం చేస్తారు కానీ శాంతి బాణము ఎలా తగలాలంటే శాంతిసాగరుడు లేకుండా ఉండలేకపోవాలి. మీ సాంగత్య రంగు ఉన్నంత వరకు అయితే బాగుంటుంది కానీ రంగులో రంగరించబడాలి, అంతేకాక అదే రంగు వారిని ఆకర్షిస్తూ ఉండాలి, సమీపానికి తెస్తూ ఉండాలి, సంబంధములోకి తెస్తూ ఉండాలి, అటువంటి పక్కా రంగును అంటించండి. ఇంతవరకు ఏదైతే చేశారో అదంతా చాలా బాగా చేశారు కానీ ఇప్పుడు బంగారాన్ని తయారుచేశారు, అందులో రత్నాలు పొదగాలి. ఈనాటి ప్రపంచానికి ప్రత్యక్ష ప్రమాణం కావాలి. కనుక ప్రత్యక్ష ప్రమాణంగా శాంతి మరియు శక్తి అనుభవమవ్వాలి. అది ఒక ఘడియే కావచ్చు కానీ అనుభవం ఎటువంటిదంటే అనుభూతి శక్తి తప్పకుండా సమీప సంబంధంలోకి తెస్తుంది. కనుక ప్లాను ఏమో తయారుచేస్తారు. పోతే బాప్దాదా పిల్లల ధైర్యము, ఉమంగ-ఉత్సాహాలను చూచి సంతోషిస్తున్నారు. పిల్లలు సేవ చేయాలనే ఆసక్తితో ఉన్నారు. సేవ చేయాలనే లగ్నము బాగుంది. ఇప్పుడేదైనా కొత్తదనము ఉండాలని అందరి సంకల్పము తప్పకుండా నడుస్తుంది. నవీనతను తీసుకొచ్చేందుకు ముందు అందరిదీ ఒకే సంకల్పముండాలి. ఒకరు ఏదైనా చెప్తే(వినిపిస్తే) దానిని అందరూ స్వీకరించాలి. ఒకే సంకల్పంలో సదా దృఢంగా ఉండాలి. గోడలో ఒక ఇటుక కదిలినా, అది పూర్తి గోడనంతా కదిలిస్తుంది. కారణ అకారణంగా, పరిస్థితుల ప్రమాణంగా ఎవరి సంకల్పమైనా తేలికగా ఉంటే మొత్తం ప్రోగ్రామంతా తేలికైపోతుంది. అప్పుడు నేను చేసే తీరాలి, అందరి సహయోగం లభించే తీరాలి అని దృఢ సంకల్పం చేసిన తర్వాత మళ్లీ ప్రయత్నించండి. బాప్దాదా సేవ ద్వారా సంతోషంగా ఉన్నారు. ఇక తెలిపే విషయము ఏమీ లేదు. కానీ ఇప్పుడు బంగారులో రత్నాలు పొదిగితే దూరం నుండే ఆకర్షిస్తుంది.
విదేశాలలో కూడా పిల్లలు మంచి ధైర్యము చేస్తున్నారు. వారు మా మైకు చేరిందని, శబ్ధము కూడా వ్యాపించిందని స్వయం కూడా పరస్పరం నవ్వుతూ ఉంటారు. కానీ చిన్న శబ్ధము చేసేవారు వచ్చారు, పెద్ద శబ్ధము చేసేవారు కాదు. అయినా ఇంతవరకు అయితే చేరుకున్నారు. ధైర్యమైతే బాగా చేస్తారు. అచ్ఛా.
ఇప్పుడు మీ పూజ్య స్వరూపం ప్రత్యక్షమవ్వాలి. మీరు పూజ్యులు, పూజలు చేయించేవారు కాదు. ఇప్పుడు వీరే మా ఇష్టులు, పూర్వజులు, పూజ్యులు, వీరి ద్వారానే సర్వ మనోకామనలు పూర్త్తి అవ్వాలి అనే అనుభూతి జరగాలి. ఇప్పుడు మీ హద్దు సంకల్పాలు లేక హద్దు కామనలు సమాప్తమవ్వాలి, అప్పుడే ఈ అల వ్యాపిస్తుంది. ఇప్పుడు కూడా ఇంకా కొంచెం కొంచెం నాది - నాది అనేది ఉంది. నా సంస్కారం, నా స్వభావం అనేది కూడా సమాప్తమైపోవాలి. తండ్రి సంస్కారమే నా సంస్కారము. ఒరిజనల్సంస్కారమైతే అదే కదా. బ్రాహ్మణుల పరివర్తనే విశ్వ పరివర్తనకు ఆధారము. కనుక ఇప్పుడేం చేస్తారు? తప్పకుండా ఉపన్యసించాల్సిందే(భాషణ చేయాల్సిందే). కానీ మీరు ఎలా మాట్లడాలంటే, మీరు భాషలోకి రండి అనగా మాట్లాడండి, వారు భాషకు అతీతంగా వెళ్లిపోవాలి. మాట్లాడాల్సి వస్తుంది కదా. మీరు శబ్ధములోకి రండి, వారు శబ్ధానికి అతీతంగా వెళ్లిపోవాలి. ఊరకే మాటలు కాదు, అనుభవాలతో నిండిన మాటలుగా ఉండాలి. ఎప్పుడైనా, ఎవరైనా మాట్లాడితే ఒకసారి నవ్వే, ఒకసారి ఏడ్చే, ఒకసారి వైరాగ్యము కలిగించే అల తాత్కాలికంగా ఎలా వ్యాపిస్తుందో, అయినా వ్యాపిస్తుంది కదా, అలా అనుభూతి అయ్యే అల వ్యాపించాలి. ఇప్పుడిదే జరగాలి. ఎలాగైతే ప్రారంభంలో స్థాపన ఆది సమయంలో ఓం ధ్వనితో ప్రారంభమై ఎంతోమంది సాక్షాత్కరములోకి వెళ్లిపోయి, అల వ్యాపించిందో, అలా సభలో అనుభూతుల అల వ్యాపించాలి. కొంతమందికి శాంతి, కొంతమందికి శక్తి అనుభవమవ్వాలి. ఈ అల వ్యాపించాలి. కేవలం వినేవారిగా ఉండరాదు. అనుభవాల అల ఉండాలి. ఎలాగైతే ప్రవాహము ప్రవహిస్తూ ఉంటే ఆ ప్రవాహము క్రిందికి ఎవరు వచ్చినా వారికి శీతలత మరియు తాజాదనము అనుభవమవుతుందో అలా వారు కూడా శాంతి, శక్తి, ఆనందము, అతీంద్రియ సుఖాలను అనుభవం చేసి వెళ్లాలి. ఈ రోజు కూడా సైన్సు సాధనాలు వేడిని, చలిని అనుభవం చేయిస్తున్నాయి, మొత్తం గది అంతా ఆ అలలు వ్యాపిస్తాయి కదా. కనుక ఇంతమంది శివశక్తులు, పాండవులు, మాస్టర్శాంతి, శక్తులన్నిటి సాగరులు ఈ అలను వ్యాపింపజేయలేరా? మంచిది.
విశాల బుద్ధి గలవారు ఇంతమంది పోగయ్యారు. శక్తి సేన కూడా చాలా ఉంది. మధువనంలో ఒకే సమయంలో ఇంతమంది శ్రేష్ఠ ఆత్మలు రావడం చిన్న విషయమేమీ కాదు. ఇప్పుడైతే పరస్పరంలో కూడా సాధారణమైనవారు కనుక ఇది సాధారణ విషయంగా అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఎంత మహోన్నతమైన ఆత్మలు! ఇంతమంది మహాన్ఆత్మల సంఘటన మొత్తం కల్పంలో ఎప్పుడూ జరగదు. ఏ ఒక్కరి మహత్వం కూడా తక్కువైనదేమీ కాదు. ఇప్పుడైతే పరస్పరంలో కూడా సాధారణంగా భావిస్తున్నారు. పోను పోను విశేషతల అనుసారం విశేషాత్మలుగా భావిస్తారు. ఇప్పుడు చిన్న చిన్న తేలికైన విషయాలు చాలా గుర్తిస్తున్నారు, విశేషతలు తక్కువగా గుర్తిస్తున్నారు. కూర్చొని ఆలోచిస్తే ఒక్కొక్కరు ఎంతమంది భక్తుల పూర్వజులు? అందరూ ఇష్ట దేవీదేవతలే కదా. ఒక్కొక్క ఇష్టదేవునికి ఎంతమంది భక్తులుంటారు? తక్కువ గొప్పవారు కాదు కదా? ఒక మూర్తికే ఇంత మహత్వముంటే ఇంతమంది ఇష్టదేవులు పోగవుతే ఏమవుతుంది! శక్తిశాలురుగా ఉన్నారు. కానీ పరస్పరంలో కూడా దాగి ఉన్నారు, విశ్వము నుండి కూడా దాగి ఉన్నారు. నిజానికి ఒక్కొక్కరి విలువ లెక్కించలేనంతగా ఉంది. బాప్దాదా పిల్లల మహత్వాన్ని చూచినప్పుడు ఒక్కొక్క పుత్రుడు ఎంత మహోన్నతుడని ఎంతగానో గర్విస్తారు. స్వయాన్ని కూడా గొప్పగా భావిస్తారు, ఒకసారి భావించరు. నిజానికి మీరు చాలా మహోన్నతమైనవారు. సాధారణమైనవారు కాదు. కొంచెం ప్రత్యక్షత జరిగితే అప్పుడు మీరు కూడా మేము ఎవరు? అనేది తెలుస్తుంది. తండ్రి ఏమో అదే మహానతను చూస్తారు. తండ్రి ముందు అయితే అన్ని ప్రత్యక్షంగా ఉన్నాయి కదా. అచ్ఛా. ఒక్కొక్కరి మహానతను గురించిన క్లాసు కూడా ఒకటి చేయండి. అచ్ఛా.
Comments
Post a Comment