01-05-1984 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
'' విస్తారంలో సారానికి గల సౌందర్యము ''
బాప్దాదా విస్తారాన్ని కూడా చూస్తున్నారు, విస్తారంలో సార స్వరూప పిల్లలను కూడా చూస్తున్నారు. విస్తారము ఈ ఈశ్వరీయ వృక్షానికి అలంకారము. సార స్వరూప పిల్లలు ఈ వృక్షానికి ఫల స్వరూపులు. విస్తారము సదా వెరైటీ రూపంగా ఉంటుంది, వెరైటీ స్వరూపానికి గల రౌనక్(ప్రకాశము) బాగుందనిపిస్తుంది. వెరైటీ ప్రకాశము(రౌనక్) తప్పకుండా వృక్షానికి అలంకారంగా ఉంటుంది. కానీ సార స్వరూపమైన ఫలము శక్తిశాలిగా ఉంటుంది. విస్తారాన్ని చూసి సదా సంతోషిస్తారు. ఫలాన్ని చూసి శక్తిశాలిగా అయ్యే శుభమైన ఆశ ఉంచుకుంటారు. బాప్దాదా కూడా విస్తారము మధ్యలో సారమును చూస్తున్నారు. విస్తారములో సారము ఎంత సుందరంగా అనిపిస్తుంది! ఇది అందరూ అనుభవము చేశారు. సారము యొక్క పర్సెంటేజ్(శాతము) మరియు విస్తారము యొక్క పర్సెంటేజ్ రెండిటిలో ఎంతో తేడా ఉంటుంది. ఇది కూడా తెలుసు కదా! విస్తారము యొక్క విశేషత విస్తారానిది. విస్తారము కూడా అవసరమే కానీ విలువ సార స్వరూప ఫలానికి ఉంటుంది. అందువలన బాప్దాదా రెండిటిని చూసి సంతోషిస్తారు. విస్తారము అనే ఆకుల పై ప్రేమ ఉంది, పూల పైనా ప్రేమ ఉంది, ఫలాల పై కూడా ప్రేమ ఉంది. అందువలన బాప్దాదా పిల్లల సమానంగా సేవాధారిగా అయ్యి పిల్లలను కలుసుకునేందుకు రావలసే వస్తుంది. సమానంగా అవ్వనంతవరకు సాకార మిలనం జరుపుకోలేరు. విస్తారంగా ఉన్న ఆత్మలు కావచ్చు, సారస్వరూపం గల ఆత్మలు కావచ్చు ఇద్దరూ తండ్రికి చెందినవారిగా అయ్యారు అనగా పిల్లలుగా అయ్యారు. అందువలన తండ్రికి నెంబర్ వారీగా ఉన్న పిల్లలందరి మిలనం చేసుకోవాలి అనే భావనకు ఫలము ఇవ్వవలసే ఉంటుంది. భక్తులకు కూడా భక్తికి ఫలము అల్పకాలిక ప్రాప్తి అవ్వనే అవుతుంది. కనుక పిల్లల అధికారము పిల్లలకు తప్పకుండా ప్రాప్తిస్తుంది.
ఈ రోజు మురళి నడిపించేందుకు రాలేదు. దూర-దూరం నుండి అందరూ వచ్చారు కావున మిలనం చేస్తాననే ప్రతిజ్ఞను నిలబెట్టుకునేందుకు వచ్చాను. కొంతమంది కేవలం ప్రేమతో కలుస్తారు, కొంతమంది జ్ఞానంతో కలుస్తారు, కొంతమంది సమాన స్వరూపంతో కలుస్తారు. కానీ తండ్రి అయితే అందరినీ కలవాల్సిందే. ఈ రోజు అన్ని వైపుల నుండి వచ్చిన పిల్లల విశేషతను చూస్తున్నారు. ఒకటి ఢిల్లీ వారి విశేషతను చూస్తున్నారు. ఢిల్లీ సేవకు ఆది స్థానము అంతేకాక ఆదిలో కూడా సేవాధారులకు సేవను ప్రారంభించేందుకు యమునా నది తీరమే లభించింది(ప్రాప్తించింది). యమునా నది తీరానికి వెళ్లి సేవ చేశారు కదా! సేవకు బీజం కూడా ఢిల్లీలో యమునా నది తీరములోనే మొదలయ్యింది అంతేకాక రాజమహల్ కూడా యమునా నదీ తీరంలోనే ఉంటుంది. అందువలన గోపీవల్లభుడు, గోప-గోపికలతో పాటు యమునా నదీ తీరం కూడా మహిమ చేయబడింది. బాప్దాదా స్థాపనకు నిమిత్తమైన ఆ శక్తిశాలీ పిల్లల టి.వి చూస్తున్నారు. కావున ఢిల్లీవారి విశేషత వర్తమాన సమయంలోనూ ఉంది, భవిష్యత్తులో కూడా ఉంది. సేవకు పునాది స్థానమే కాక రాజ్యానికి కూడా పునాది స్థానమే. పునాది స్థానపు నివాసులు ఇంత శక్తిశాలిగా ఉన్నారు కదా! ఢిల్లీ వారి పై సదా శక్తిశాలిగా ఉండే బాధ్యత ఉంది. ఢిల్లీ నివాసి నిమిత్త ఆత్మలకు సదా ఈ బాధ్యతా కిరీటం పెట్టబడి ఉంది కదా! కిరీటం ఎప్పుడూ తీసేయడం లేదు కదా! ఢిల్లీ నివాసులు అనగా సదా బాధ్యతా కిరీటధారులు. ఢిల్లీ వారి విశేషత అర్థమయ్యిందా! సదా ఈ విశేషతను కర్మలలోకి తీసుకురావాలి. మంచిది.
రెండవవారు - అల్లారు ముద్దు అపురూపమైన కర్ణాటక పిల్లలు. వీరు భావనను మరియు స్నేహపూరిత నాటకాన్ని చాలా బాగా చూపిస్తారు. ఒకవైపు అత్యంత భావన మరియు చాలా చాలా స్నేహీలు. రెండవ వైపు ప్రపంచం లెక్కతో(దృష్టిలో) ఉన్నత విద్యలో ప్రసిద్ధి గాంచిన వారు కూడా కర్ణాటకలో ఉన్నారు. కావున భావన మరియు పదవికి అధికారులు ఇరువురూ ఉన్నారు. అందువలన కర్ణాటక ద్వారా శబ్ధం పెద్దగా వ్యాపించవచ్చు. ఇది శబ్ధాన్ని బిగ్గరగా చేసే ధరణి. ఎందుకంటే వి.ఐ.పి.లు ఉన్నప్పటికీ భావన మరియు శ్రద్ధ గల ధరణి అయిన కారణంగా నిరహంకారులుగా ఉన్నారు. వారు సహజ సాధనంగా అవ్వగలరు. కర్ణాటక భూమి ఈ విశేష కార్యము కొరకు నిమిత్తంగా ఉంది. కేవలం తమ ఈ విశేషతను భావన మరియు నిరహంకార స్థితి రెండిటిని సేవలో సదా తోడుగా ఉంచుకోవాలి. ఈ విశేషతను ఎలాంటి వాతావరణములోనూ వదిలేయరాదు. కర్ణాటక అనే నావకు ఈ రెండు చేతుల వంటివి. ఈ రెండిటిని జత జతలో ఉంచుకోవాలి. ముందు వెనుక కాదు. అలా జత జతలో ఉంటే సేవ అనే నావ ధరణికి గల సఫలత అను విశేషతను చూపిస్తుంది. రెండిటి బ్యాలన్స్ పేరును ప్రసిద్ధి చేస్తుంది. మంచిది.
సదా స్వయాన్ని సార స్వరూపం అనగా ఫల స్వరూపంగా తయారు చేసుకునేవారు, సదా సార స్వరూపంలో స్థితులై ఇతరులను కూడా సార స్థితిలో స్థితం చేసేవారు, సదా శక్తిశాలి ఆత్మలు, శక్తిశాలి స్మృతి స్వరూపులు, శక్తిశాలి సేవాధారులు, ఇటువంటి సమాన స్వరూపంతో మిలనం జరుపుకునే శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment