12-12-1984 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
'' విశేష ఆత్మల కర్తవ్యము ''
ఈ రోజు దిలారాం(మనసుకు ఆనందం/విశ్రాంతి కలిగించు) తండ్రి తన దిల్ ఖుశ్ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. మొత్తం విశ్వంలో సదా దిల్ ఖుశ్ (సంతోషంగా) ఉండే పిల్లలు మీరే. మిగిలినవారంతా ఎప్పుడో ఒకప్పుడు మానసిక బాధతో(దిల్దర్ద్) దు:ఖితులుగా ఉన్నారు. అటువంటి మానసిక బాధలను హరించే(పోగొట్టే) దు:ఖహర్త, సుఖదాత అయిన తండ్రికి పిల్లలైన మీరు సుఖస్వరూపులు. మిగిలిన అందరి నుండి మానసిక బాధతో చేసే ఆక్రందనలు - హాయ్, హాయ్(అయ్యో, అయ్యో) అనే శబ్ధాలు వెలువడ్తున్నాయి. కానీ దిల్ ఖుశ్ పిల్లలైన మీ హృదయాల నుండి వాహ్వాహ్అనే శబ్ధాలు వెలువడ్తున్నాయి. ఎలాగైతే స్థూల శరీర సంబంధమైన బాధలు రకరకాలుగా ఉన్నాయో, అలా ఈనాటి మనుష్యాత్మల మానసిక బాధలు కూడా అనేక రకాలుగా ఉన్నాయి. అప్పుడప్పుడు శారీరిక కర్మభోగము వలన కలిగే బాధలు, అప్పుడప్పుడు సంబంధ-సంపర్కాల ద్వారా దు:ఖితులుగా అయ్యే బాధలు, అప్పుడప్పుడు ధనము ఎక్కువగా వచ్చినా లేక తక్కువగా వచ్చినా రెండిటి చింత ద్వారా కలిగే బాధలు, అప్పుడప్పుడు ప్రకృతి ఆపదల ద్వారా ప్రాప్తించే దు:ఖము వలన కలిగే బాధలు, అప్పుడప్పుడు అల్పకాలిక కోరికల అప్రాప్తి ద్వారా కలిగే దు:ఖము వలన కలిగే బాధలు - ఇలా ఒక బాధ నుండి అనేక బాధలు పుట్టుకొస్తూ ఉంటాయి. విశ్వమే దు:ఖము, బాధలతో పిలిచేదిగా(ఆక్రందనలు చేసేదిగా) అయిపోయింది. ఇటువంటి సమయంలో సుఖమునిచ్చే సుఖ స్వరూప పిల్లలైన మీ కర్తవ్యమేది? జన్మ-జన్మల దు:ఖము, బాధలనే అప్పు నుండి అందరినీ విడిపించండి. ఈ పాత అప్పు దు:ఖము, బాధ కలిగించే జబ్బుగా అయిపోయింది. ఇటువంటి సమయంలో మీ అందరి కర్తవ్యమేమంటే దాతగా అయ్యి ఏ ఆత్మకు ఏ విధమైన అప్పు ద్వారా ఆ వ్యాధి అంటుకొని ఉందో, ఆ ఆత్మను ఆ ప్రాప్తి ద్వారా నిండుగా(భర్పూర్గా) చేయాలి. ఎలాగైతే శారీరిక కర్మభోగము వలన దు:ఖము, బాధలు అనుభవించే ఆత్మలు కర్మయోగులుగా అయ్యి కర్మయోగము ద్వారా కర్మభోగాన్ని సమాప్తం చేసుకోవాలో అలా కర్మయోగులుగా అయ్యే శక్తుల ప్రాప్తిని, మహాదానం రూపంలో ఇవ్వండి, వరదానం రూపంలో ఇవ్వండి. ఎందుకంటే స్వయం ఋణగ్రస్థులుగా అనగా శక్తిహీనులుగా ఖాళీగా ఉన్నారు. అటువంటి వారికి కర్మయోగము ద్వారా మీరు సంపాదించుకున్న శక్తిలో కొంత భాగమివ్వండి. మీ ఖాతా నుండి వారి ఖాతాలో జమ చేయండి. అప్పుడు వారు అప్పుల ద్వారా కలిగిన రోగము నుండి ముక్తులుగా అవ్వగలరు. ఇంత సమయం తండ్రికి డైరెక్టు వారసులుగా అయ్యి సర్వ శక్తుల వారసత్వాన్ని ఏదైతే జమ చేసుకున్నారో ఆ జమా ఖాతా నుండి విశాల హృదయంతో దానం చేయండి. అప్పుడు వారి మానసిక బాధలను సమాప్తి చేయగలరు. అంతిమ సమయం సమీపానికి వచ్చు కొలది, ఆత్మలకు భక్తి ద్వారా కలిగిన శక్తి కూడా సమాప్తమౌతూ ఉంది. ద్వాపర యుగం నుండి రజో గుణీ ఆత్మలైనా దాన-పుణ్యాల ద్వారా, భక్తి ద్వారా తమ ఖాతాలలో కొంత శక్తిని జమ చేసుకున్నారు. అందువలన తమ ఆత్మ నిర్వహణ కొరకు ఏవో కొన్ని శాంతి సాధనాలు ప్రాప్తించాయి. కానీ ఇప్పుడు తమోగుణీ ఆత్మలు అల్పకాలిక సుఖాల కొరకు, ఆత్మ నిర్వహణ కొరకు తమకు ప్రాప్తించిన సాధనాల నుండి కూడా ఖాళీ అయిపోయాయి అనగా లభించిన భక్తి ఫలాన్ని కూడా తిని ఖాళీ అయిపోయారు. ఇప్పుడు ఉండేది కేవలం నామధారి భక్తి. ఫలమునిచ్చే ఫలస్వరూప భక్తి కాదు. భక్తి వృక్షము చాలా విస్తారాన్ని పొందింది. ఈ వృక్షములో రంగు-రంగుల వైభవము, ప్రకాశమైతే ఉంది కానీ శక్తి హీనంగా అయినందున దాని నుండి ఫలము లభించజాలదు. ఎలాగైతే స్థూల వృక్షము పూర్తిగా విస్తారమై శిధిలావస్థకు చేరుకుంటే ఫలదాయకంగా అవ్వలేదు కానీ నీడనిచ్చేదిగా అవుతుందో అలా ఇప్పుడు భక్తి వృక్షము కూడా మనసుకు సంతోషము కలిగించే నీడనైతే ఇస్తూ ఉంది. గురువులను ఆశ్రయించాము, ముక్తి లభిస్తుంది, తీర్థయాత్రలు, దాన-పుణ్యాలు చేశాము, ప్రాప్తి లభిస్తుంది - ఈ మనసును సంతోషపరచే ఓదార్పు అనే నీడ ఇప్పుడు మిగిలి ఉంది. ''ఇప్పుడు కాకుంటే ఎప్పుడో ఒకప్పుడు లభిస్తుంది'' అనే నీడలో పాపం అమాయక భక్తులు విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ ఫలం లేదు. అందువలన అందరి ఆత్మ నిర్వహణ ఖాతాలు ఖాళీగా ఉన్నాయి. కనుక ఇటువంటి సమయంలో భర్పూర్గా(నిండుగా) ఉండే ఆత్మలైన మీ కర్తవ్యం ఏమంటే, మీరు జమ చేసుకున్న దాని నుండి(శక్తుల నుండి) ఇటువంటి ఆత్మలకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇప్పించడం. మీ వద్ద నిల్వ (జమ) ఉందా లేక సంపాదించుకొని మీ అంతకు మీరు తినేశారా? సంపాదించుకున్నాము, తినేశాము అనేవారిని రాజయోగులని అనరు, స్వరాజ్య అధికారులని అనరు. రాజుల భండారము(కోశాగారము) సదా నిండుగా ఉంటుంది. ప్రజలను పాలించే బాధ్యత రాజు పై ఉంటుంది. స్వరాజ్య అధికారి అనగా అన్ని ఖజానాలు నిండుగా ఉంటాయి. ఖజానాలు నిండుగా లేకుంటే వారు ఇప్పుడు కూడా ప్రజాయోగులే, రాజయోగులు కాదు. ప్రజలు సంపాదించుకుంటారు, తినేస్తారు. షావుకారు ప్రజలు కొద్దో గొప్పో జమ ఉంచుకుంటారు. కానీ రాజులు ఖజానాలకు అధికారులుగా ఉంటారు. కనుక రాజయోగులనగా స్వరాజ్య అధికారి ఆత్మలు. వారి ఏ ఖజానాలోనూ జమాఖాతా(నిల్వ) ఖాళీ అవ్వజాలదు. కనుక నా ఖజానాలు నిండుగా ఉన్నాయా? అని స్వయం పరిశీలించుకోండి. మీరు దాత పిల్లలు. అందరికి ఇవ్వాలనే భావన ఉందా లేక మీ అంతకు మీరు మస్త్గా(ఆనందంగా) ఉన్నారా? స్వంత పాలనలోనే సమయం గడిచిపోతోందా లేక ఇతరుల పాలన కొరకు కూడా సమయం, ఖజానాలు నిండుగా ఉన్నాయా? ఇక్కడ ఎవరైతే సంగమ యుగము నుండే ఆత్మిక పాలనా సంస్కారము గలవారుగా ఉంటారో, వారే భవిష్యత్తులో ప్రజలను పాలించేవారిగా, విశ్వానికి రాజులుగా అవ్వగలరు. రాజులా లేక ప్రజలా అనే స్టాంపు ఇక్కడ నుండే పడ్తుంది. ఇప్పుడు స్వయాన్ని బాగా పరిశీలించుకోండి. స్టాక్ చెక్ చేసుకోండి. సమయానికి ఒక్క అప్రాప్తి కూడా సంపన్నంగా అవ్వడంలో మోసము చేయరాదు. ఉదాహరణానికి స్థూల పదార్థాల స్టాకు జమ చేసుకున్నప్పుడు అన్ని పదార్థాలు జమ చేసుకొని ఒక చిన్న అగ్గిపెట్టె జమ చేసుకోకుంటే ధాన్యాన్ని ఏం చేసుకుంటారు? అనేక ప్రాప్తులుండినా ఒక్క అప్రాప్తి కూడా మోసం చేయగలదు. అలా ఒక్క అప్రాప్తి అది సంపన్నత అనే స్టాంపు వేయించుకునే అధికారిగా అవ్వడంలో మోసం చేస్తుంది.
యోగశక్తి ఉంది కదా, ఏదైనా గుణము తక్కువగా ఉన్నా పర్వాలేదు అని అనుకోకండి. యోగశక్తి లేక స్మృతిశక్తి గొప్పదే, అదే నంబర్వన్ శక్తి. కానీ ఏదైనా ఒక గుణము తక్కువైనా, లోపించినా అది సమయానికి ఫుల్ పాస్అవ్వడంలో ఫెయిల్ చేసేస్తుంది. ఇది చిన్నదే కదా అని భావించకండి. ఒక్కొక్క గుణము మహత్వమేదో, సంబంధమేదో దీనికి కూడా లోతైన లెక్కాచారముంది. దానిని గురించి తర్వాత వినిపిస్తాము.
విశేష ఆత్మలైన మీ కర్తవ్యమేది? ఈ రోజు విశేషంగా ఆ స్మృతిని ఇప్పించాము. ఈ సమయంలో ఢిల్లీ రాజధాని వారు వచ్చారు కదా. కనుక రాజ్య అధికారులను గురించిన విషయాలు వినిపించాము. రాజధానిలో మహళ్ళు ఊరకే లభించవు. పాలన చేసి ప్రజలను తయారు చేసుకోవాలి. ఢిల్లీ వారు జోరుగా ఏర్పాట్లు చేస్తూ ఉండవచ్చు కదా. రాజధానిలో ఉండాలి కదా, దూరంగా వెళ్ళరాదు కదా!
గుజరాత్ వారు ఇప్పుడు కూడా జతలో ఉన్నారు. సంగమ యుగములో మధువనం వారి జతలో ఉన్నారు కనుక రాజ్యములో కూడా జతలో ఉంటారు కదా. జతలో ఉండాలని దృఢ సంకల్పం చేశారు కదా. మూడవ వారు ఇండోర్ వారు. ఇండోర్అనగా ఇంట్లో ఉండేవారు. కనుక ఇండోర్జోన్వారు రాజ్యములోని ఇంట్లో ఉంటారు కదా. ఇప్పుడు కూడా మీరు తండ్రి హృదయమనే ఇంట్లో ఉండేవారు. కనుక మూడు జోన్ల వారి రాశి సమీపంగా కలుస్తుంది. సదా ఇలాగే ఈ భాగ్య రేఖను స్పష్టంగా, విస్తారంగా ప్రాప్తి చేసుకుంటూ ఉండాలి. మంచిది.
ఇలా సదా సంపన్నత కర్తవ్యాన్ని పాలన చేసేవారు, తమ దాతృత్వ శేష్ఠ్ర సంస్కారాలతో అందరి బాధలను నిర్మూలించేవారు, సదా స్వరాజ్య అధికారులుగా అయ్యి ఆత్మిక పాలన చేసేవారు, సర్వ ఖజానాలతో భండారాలను భర్ పూర్ చేసేవారు, మాస్టర్ దాతలు, వరదాతలు, ఇటువంటి రాజయోగి శేష్ఠ్ర ఆత్మలకు బాప్దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే.
పార్టీలతో అవ్యక్త బాప్దాదా కలయిక :- 1. సదా స్వయాన్ని సాక్షి స్థితి అను సీటు పై స్థితమైన ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? ఈ సాక్షి స్థితి అన్నిటికంటే ఫస్ట్ క్లాస్ శ్రేష్ఠమైన సీటు. ఈ సీటు పై కూర్చొని కర్మలు చేయడంలో లేక చూడడంలో చాలా మజా వస్తుంది(ఆనందం కలుగుతుంది). ఉదాహరణానికి సీటు బాగుంటే కూర్చోవడంలో మజా వస్తుంది కదా! సీటు బాగలేకుంటే కూర్చోవడంలో మజా ఉండదు. ఈ సాక్షీ స్థితి అనే సీటు అన్నిటికంటే శ్రేష్ఠమైన సీటు. ఈ సీటు పై సదా ఉంటున్నారా? ప్రపంచంలోని వారు కూడా ఈ రోజులలో సీటు కోసం పరుగెత్తుతున్నారు. మీకు ఎంత ఫస్ట్ క్లాస్ సీటు లభించింది! ఈ సీటు నుండి మిమ్ములను ఎవ్వరూ దించలేరు. ప్రపంచంలోని వారికెంతో భయముంటుంది. ఈ రోజు సీటు ఉంటుంది, రేపు ఉండదు. మీ సీటు అవినాశి సీటు. దాని పై నిర్భయంగా కూర్చోవచ్చు. కనుక సాక్షి స్థితి అనే సీటు పై సదా ఉంటున్నారా? అప్సెట్అయ్యేవారు సెట్అవ్వలేరు. సదా సీటు పై సెట్అయ్యి ఉండండి. ఇది ఎంత విశ్రాంతినిచ్చే సీటు అంటే దీని పై కూర్చొని ఏం చూడాలనుకుంటే దానిని చూడవచ్చు, ఏం అనుభవం చెయ్యాలనుకుంటే అది అనుభవం చెయ్యగలరు.
2. స్వయాన్ని ఈ సృష్టిలో కోట్లలో కొంతమంది, ఆ కొంతమందిలో కూడా కొంతమంది..... ఇటువంటి విశేష ఆత్మలుగా భావిస్తున్నారా? కోట్లలో తండ్రికి చెందిన వారిగా కొంతమందే అవుతారనే గాయనము ఎవరికైతే ఉందో వారు మేమే అనే సంతోషం సదా ఉంటుందా? విశ్వములోని అనేక ఆత్మలు తండ్రిని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మేము పొందుకున్నాము అనే సంతోషముందా? తండ్రికి చెందినవారిగా అవ్వడం అనగా తండ్రిని పొందడం. ప్రపంచం వెతుకుతూ ఉంది, మనము వారికి చెందినవారిగా అయిపోయాము. భక్తిమార్గములోని ప్రాప్తికి, జ్ఞాన మార్గములోని ప్రాప్తికి చాలా వ్యత్యాసముంది. జ్ఞానమంటే చదువు, కానీ భక్తి చదువు కాదు. భక్తి కొంత సమయము కొరకు ఆధ్యాత్మిక మనోరంజనము. కానీ సదాకాలపు ప్రాప్తి కొరకు సాధనము - జ్ఞానము. కనుక మీరు సదా ఈ స్మృతిలో ఉండి ఇతరులను కూడా సమర్థంగా చేయండి. ఏదైతే సంకల్పములో, స్వప్నములో కూడా లేదో - దానిని ప్రాక్టికల్ గా పొందుకున్నాము. తండ్రి ప్రతి మూల నుండి పిల్లలను వెలికి తీసి తమవారిగా చేసుకున్నారు. కనుక ఇదే సంతోషంలో ఉండండి.
3. అందరూ స్వయాన్ని ఒకే తండ్రికి చెందినవారిగా, ఒకే మతమును అనుసరించేవారిగా, ఏకరస స్థితిలో స్థితమై ఉండేవారిగా అనుభవం చేస్తున్నారా? ఎప్పుడైతే ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరని భావిస్తారో ఏకరస స్థితి వచ్చేస్తుంది. అలాంటి అనుభవముందా? ఎప్పుడైతే ఇతరులెవ్వరూ లేనేలేకుంటే బుద్ధి ఎక్కడకెళ్తుంది? వేరే ఎక్కడకు వెళ్లేందుకు అవకాశమే లేదు. ఉండేవారు ఒక్కరే. నాలుగైదు మార్గాలుంటే ఆలోచించేందుకు అవకాశముంటుంది. ఉండేది ఒకేదారి అయినప్పుడు ఎక్కడకెళ్తారు? కనుక ఇక్కడ మార్గము తెలిపేందుకు సహజ విధి - ఒకే తండ్రి, ఒకే మతము, ఏకరసములో ఉండే ఒకే పరివారము కనుక ఒకే మాట గుర్తుంచుకుంటే నంబరువన్ గా అవుతారు. ఒక్కరితో లెక్క తెలుసుకుంటే చాలు. ఎక్కడైనా ఉండండి, కానీ ఒక్కరి స్మృతి ఉంటే సదా తోడుగా ఉంటారు, దూరంగా ఉండరు. ఎక్కడైతే తండ్రి తోడు ఉంటుందో అక్కడ మాయ తోడుగా ఉండనే ఉండలేదు. తండ్రి నుండి దూరం అయితే మళ్లీ మాయ వచ్చేస్తుంది. ఊరకే రాదు. తండ్రికి దూరం అవ్వండి, మాయ రాదు. గొప్పతనమంతా ఒక్కరిదే.
అధర్ కుమారులతో బాప్దాదా కలయిక :- సదా ప్రవృత్తిలో ఉంటూ అలౌకిక వృత్తిలో ఉంటున్నారా? గృహస్థ జీవితానికి అతీతంగా ఉండేవారిగా, సదా ట్రస్టీ రూపంలో ఉండేవారిగా అనుభవం చేస్తున్నారా? ట్రస్టీలనగా సదా సుఖంగా ఉండేవారు, గృహస్థులనగా సదా దు:ఖములో ఉండేవారు. ఇప్పుడు మీరు ఎవరు? సదా సుఖంగా ఉండేవారు. ఇప్పుడు మీరు దు:ఖ ప్రపంచాన్ని వదిలేశారు. ఆ ప్రపంచం నుండి వెలుపలికి వచ్చేశారు. ఇప్పుడు మీరు సంగమ యుగములో, సుఖాల ప్రపంచములో ఉన్నారు. అలౌకిక ప్రవృత్తిలో ఉండేవారు, లౌకిక ప్రవృత్తిలోని వారు కాదు. పరస్పరములో కూడా అలౌకిక వృత్తి, అలౌకిక దృష్టి ఉండాలి.
ట్రస్టీతనానికి గుర్తు - సదా న్యారాగా, తండ్రికి ప్రియంగా ఉంటారు. అలా లేకుంటే వారు ట్రస్టీలు కారు. గృహస్థ జీవితమంటే బంధనాల జీవితం. ట్రస్టీ జీవితము నిర్బంధన జీవితము. ట్రస్టీలుగా అయితే అన్ని బంధనాలు సహజంగా సమాప్తమైపోతాయి. బంధన ముక్తులుగా ఉంటే సదా సుఖంగా ఉంటారు. వారి వద్దకు దు:ఖపు అల కూడా రాదు. ఒకవేళ సంకల్పములోనైనా నా ఇల్లు, నా పరివారము, ఇది నా పని అని వస్తే ఈ స్మృతి కూడా మాయను ఆహ్వానిస్తుంది. కనుక 'నాది' అనేదానిని 'నీది' గా చేసేయండి. ఎక్కడైతే 'నీది' ఉందో అక్కడ దు:ఖము సమాప్తం. 'నాది' అని అనుకుంటే వ్యాకులపడ్తారు. నీది అని అన్నారంటే ఆనందంగా ఉంటారు. ఇప్పుడు ఆనందంగా లేకుంటే ఇంకెప్పుడుంటారు. సంగమయుగమే ఆనందాల యుగము. అందువలన సదా ఆనందంగా ఉండండి. స్వప్నములో, సంకల్పములో కూడా వ్యర్థము ఉండరాదు. అర్ధకల్పమంతా వ్యర్థంగా పోగొట్టుకున్నారు. ఇప్పుడు పోగొట్టుకునే సమయం పూర్తి అయ్యింది. ఇది సంపాదించుకునే సమయం. ఎంత సమర్థంగా ఉంటారో అంత సంపాదించుకొని జమ చేసుకోగలరు. 21 జన్మలు ఆనందంగా తింటూ ఉండుటకు సరిపడునంతగా జమ చేసుకోవాలి. మీ వద్ద ఎంత స్టాక్ఉండాలంటే ఇతరులకు కూడా ఇవ్వగలగాలి. ఎందుకంటే మీరు దాత పిల్లలు. ఎంత జమ అవుతుందో అంత సంతోషము తప్పకుండా ఉంటుంది.
సదా ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు అనే లగ్నములో మగ్నమై ఉండండి. ఎక్కడ లగ్నముంటుందో అక్కడ విఘ్నము ఉండజాలదు. పగలుంటే రాత్రి ఉండదు, రాత్రి ఉంటే పగలు ఉండదు. అలాగే ఈ లగ్నము మరియు విఘ్నము. లగ్నము ఎంత శక్తిశాలి అంటే అది విఘ్నాన్ని భస్మం చేసేస్తుంది. ఇటువంటి లగ్నము కలిగిన నిర్విఘ్న అత్మలుగా ఉన్నారా? ఎంత పెద్ద విఘ్నమైనా మాయ విఘ్న రూపమై వచ్చినా, లగ్నమున్నవారు దానిని వెన్న నుండి వెంట్రుకను తీసినంత సులభంగా తీసేస్తారు. లగ్నమే అన్ని ప్రాప్తులను అనుభవం చేయిస్తుంది. ఎక్కడైతే తండ్రి ఉంటారో అక్కడ ప్రాప్తి తప్పకుండా ఉంటుంది. తండ్రి ఖజానా ఏదైతే ఉందో అదంతా పిల్లలదే.
మాతలతో :- మీరు శక్తి దళము కదా. మాతలు జగన్మాతలుగా అయ్యారు. ఇప్పుడు మీరు హద్దు మాతలు కాదు. సదా స్వయాన్ని జగన్మాతగా భావించండి. హద్దు గృహస్థంలో చిక్కుకునేవారు కాదు. బేహద్ సేవలో సదా సంతోషంగా ఉండేవారు. బాబా ఎంతో శ్రేష్ఠమైన పదవిని ఇప్పించారు. దాసీల నుండి శిరోకిరీటులుగా చేశారు. ''వాహ్ నా శ్రేష్ఠమైన భాగ్యము!'' ఇప్పుడిదే పాట పాడుతూ ఉండండి. తండ్రి ఇప్పుడు మాతలకు ఈ ఒక్క పనినే ఇచ్చారు. ఎందుకంటే మాతలు చాలా భ్రమించి, భ్రమించి అలసిపోయారు. కనుక మాతల అలసట చూసి, వారిని అలసట నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు. 63 జన్మల అలసట ఒక్క జన్మలోనే సమాప్తం చేసేశారు. ఒక్క సెకండులోనే సమాప్తం చేశారు. తండ్రికి చెందినవారిగా అయ్యారు, అలసట సమాప్తమైపోయింది. మాతలకు ఊయలలో ఊగడం, ఊపడం బాగుంటుంది కనుక తండ్రి మాతలకు సంతోషము, అతీంద్రియ సుఖము అనే ఊయలనిచ్చారు. ఆ ఊయలలోనే ఊగుతూ ఉండండి. సదా సుఖీలుగా, సౌభాగ్యవతులుగా అయ్యారు. అమరులైన తండ్రికి అమర పిల్లలుగా అయ్యారు. పిల్లలను చూసి బాప్దాదా కూడా సంతోషిస్తారు.
Comments
Post a Comment