24-02-1984 అవ్యక్త మురళి

24-02-1984         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

'' బ్రాహ్మణ జన్మ - అవతరణ జన్మ ''

బాప్దాదా శబ్ధములోకి వస్తూ అందరినీ శబ్ధానికి అతీతంగా ఉండే స్థితికి తీసుకెళ్ళేందుకు వ్యక్త దేశంలోకి, వ్యక్త శరీరంలోకి అవ్యక్తంగా చేసేందుకు ప్రవేశిస్తారు. సదా స్వయాన్ని అవ్యక్త స్థితి కలిగిన సూక్ష్మ ఫరిస్తాగా భావించి వ్యక్త దేహంలోకి అవతరిస్తున్నారా? అందరూ అవతరించే అవతారాలు ఈ స్మృతిలో సదా ప్రతి కర్మ చేస్తూ కర్మ బంధనాల నుండి ముక్తులుగా కర్మాతీత అవతారాలుగా ఉన్నారు కదా. అవతారం అనగా పై నుండి శ్రేష్ఠ కర్మ చేసేందుకు క్రిందకు వచ్చేవారు. మీరందరూ కూడా ఉన్నతమైన పై స్థితి నుండి క్రిందికి అనగా దేహాన్ని ఆధారంగా తీసుకొని సేవ కొరకు కర్మలు చేసేందుకు పాత దేహంలో, పాత ప్రపంచంలోకి వస్తారు. కానీ స్థితి పైననే ఉంటుంది. అందువలన అవతారాలు సదా పరమాత్మ సందేశాన్ని తీసుకొస్తారు. సంగమయుగీ శ్రేష్ఠ ఆత్మలైన మీ అందరూ కూడా పరమాత్మ సందేశం ఇచ్చేందుకు పరమాత్మతో మిలనం చేయించేందుకు అవతరించారు. ఈ దేహం ఇప్పుడు మీది(తమది) కాదు. దేహం కూడా తండ్రికి ఇచ్చేశారు. ''అంతా నీదే'' అని అన్నారు అనగా నాది ఏమీ లేదు. ఈ దేహం సేవార్థం తండ్రి లోన్ఇచ్చారు. లోన్(తాకట్టు)గా లభించిన వస్తువు పై నాది అనే అధికారం ఉండజాలదు. నా దేహం కానప్పుడు దేహ భావము ఎలా రాగలదు. ఆత్మ కూడా తండ్రికి చెందినదిగా అయ్యింది. దేహం కూడా తండ్రికి చెందినదిగా అయినప్పుడు 'నేను' మరియు 'నాది' ఎక్కడి నుండి వచ్చింది? 'నాది' కేవలం ఒక్క బేహద్ కే ఉంది, ''నేను తండ్రివాడిని.'' తండ్రి ఎలా ఉన్నారో అలా నేను మాస్టర్ గా ఉన్నాను. కనుక ఇది బేహద్ లో నాదిగా ఉంది, హద్దులోని 'నాది' విఘ్నాలలోకి తీసుకొస్తుంది. బేహద్లోని నాది నిర్విఘ్నంగా విఘ్నవినాశకులుగా చేస్తుంది. అలాగే హద్దులో 'నాది', 'నాది-నాది' అనే వలయంలోకి తీసుకొస్తుంది మరియు బేహద్లోని నాది జన్మల వలయాల నుండి విడిపిస్తుంది.

బేహద్లో నాది అనగా ''నా బాబా'' అనుకుంటే హద్దు నుండి ముక్తులుగా అవుతారు కదా! అవతారంగా అయ్యి దేహాన్ని ఆధారంగా తీసుకొని సేవకు సంబంధించిన కర్మలోకి రండి. తండ్రి లోన్ (కుదువ పెట్టబడిన వస్తువు)గా సేవ కొరకు ఇచ్చారు. కావున ఏ ఇతర వ్యర్థ కార్యంలో ఉపయోగించరాదు. లేకుంటే తాకట్టులో మోసం చేసిన ఖాతా తయారవుతుంది. అవతారాలు వ్యర్థం ఖాతాను తయారు చేసుకోరు. వచ్చారు, సందేశం ఇచ్చారు మరియు వెళ్ళిపోయారు. మీరందరూ కూడా సేవార్థం, సందేశం ఇచ్చేందుకు బ్రాహ్మణ జన్మలోకి వచ్చారు. బ్రాహ్మణ జన్మ అవతరణ జన్మ, సాధారణ జన్మ కాదు. కనుక సదా స్వయాన్ని అవతరించిన విశ్వకళ్యాణకారిగా, సదా శ్రేష్ఠమైన అవతరించిన శ్రేష్ఠ ఆత్మను అనే నిశ్చయం మరియు నషాలో ఉండండి. తాత్కాలికంగా వచ్చారు మరియు వెళ్ళాలి కూడా. 'ఇప్పుడు వెళ్ళాలి' అని సదా జ్ఞాపకం ఉంటుందా? అవతారాన్ని వచ్చాను 'ఇప్పుడు వెళ్ళాలి' ఈ స్మృతి అతీతంగా మరియు అపరమ్అపారమైన ప్రాప్తిని అనుభూతి చేయించేది. ఒకవైపు అతీతంగా, మరోవైపు అపరమ్అపారమైన ప్రాప్తి. రెండు అనుభవాలు జత జతలో ఉంటాయి. ఇలాంటి అనుభవీమూర్తులుగా ఉన్నారు కదా! మంచిది.

ఇప్పుడు విన్నదానిని స్వరూపంలోకి తీసుకు రావాలి. వినడము అనగా తయారవ్వడము. ఈ రోజు విశేషించి తోటివారిని కలుసుకునేందుకు వచ్చాను. పరస్పరములో ఒకటయ్యాము కదా! సత్యమైన శిక్షకుడు, నిమిత్త టీచర్లను కలుసుకునేందుకు వచ్చారు, సేవాసాథీలను కలుసుకునేందుకు వచ్చారు. మంచిది.

సదా 'బేహద్ నాది' అనే స్మృతి స్వరూపంగా ఉన్నవారికి, సదా 'బేహద్ నా బాబా' అనే సమర్ధ స్థితిలో ఉండు వారికి, సదా ఉన్నతమైన స్థితిలో స్థితమై దేహాన్ని ఆధారంగా తీసుకొని అవతరించే అవతార పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే.

టీచర్స్ తో  :- 

ఇది సదా సేవాధారులుగా ఉండే ఆత్మల యొక్క సంఘటన కదా. సదా స్వయాన్ని అనంతమైన విశ్వ సేవాధారిగా భావిస్తున్నారా? హద్దు సేవాధారిగా అయితే లేరు కదా? అందరూ బేహద్ కు చెందినవారే కదా? ఎవరినైనా ఏ స్థానం నుండి ఏ స్థానానికి పంపించినా తయారుగా ఉన్నారా? అందరూ ఎగిరే పక్షులే కదా? తమ దేహభావమనే కొమ్మ నుండి కూడా ఎగిరే పక్షులే కదా? అన్నింటికంటే ఎక్కువగా తమవైపు ఆకర్షించే కొమ్మ ఈ దేహ భ్రాంతి. పాత సంస్కారాలు కొంచెమైనా తమవైపు ఆకర్షిస్తున్నాయంటే దేహ భ్రాంతి ఉన్నది. నా స్వభావం ఇలా ఉంది, నా సంస్కారం ఇలా ఉంది, ఇది నా పద్ధతి, ఇది నా అలవాటు ఇవన్నీ దేహ భావపు గుర్తులు. కావున ఈ కొమ్మ నుండి ఎగిరే పక్షులుగా ఉన్నారా? దీనినే కర్మాతీత స్థితి అని అంటారు. ఏ బంధనమూ లేదు. కర్మాతీతం అనగా కర్మలకు అతీతంగా అవ్వడం కాదు. కర్మ బంధనాలకు అతీతంగా అవ్వడం కనుక దేహం యొక్క కర్మలు, ఉదాహరణానికి కొంతమంది నేచర్- విశ్రాంతిగా ఉండాలి, విశ్రాంతిగా సమయానికి తినాలి, విశ్రాంతిగా నడవటం ఇవి కూడా కర్మ బంధనాలే ఇవి తమవైపు ఆకర్షిస్తాయి. ఈ కర్మ బంధనాలు అనగా అలవాట్లకు కూడా అతీతంగా ఉండాలి, ఎందుకంటే నిమిత్తంగా ఉన్నారు కదా!

ఎంతవరకు మీరందరూ నిమిత్త ఆత్మలు కర్మ బంధనాలతో, దేహ సంస్కార - స్వభావాలతో అతీతంగా అవ్వరో అంతవరకు ఇతరులను ఎలా తయారు చేస్తారు? ఉదాహరణానికి శరీరిక రోగం కర్మభోగంగా అయ్యి తమవైపు లాగుతుందో ఇదే విధంగా ఏ కర్మ బంధనమైనా తనవైపు ఆకర్షిస్తే - ఇది కూడా కర్మభోగమే ఇది విఘ్నాలు వేస్తుంది. ఎలాగైతే శారీరిక వ్యాధి అనే కర్మభోగం తనవైపు మాటిమాటికీ లాగుతూ ఉంటుంది, బాధిస్తూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది కదా! కావున ధ్యాస అటువైపు వెళ్తుంది. బాగానే ఉన్నాము కాని ఏం చెయ్యాలి? కర్మ బంధనం కఠినంగా ఉంది అని అంటారు. అలా ఏదైనా విశేషమైన పాత స్వభావ-సంస్కారం లేక అలవాటైనా తన వైపు ఆకర్షిస్తూ ఉందంటే అది కూడా కర్మభోగమే అవుతుంది. ఏ కర్మభోగమైనా కర్మ యోగిగా తయారవ్వనివ్వదు. కనుక దీనితో కూడా అతీతంగా అవ్వాలి. ఎందుకు? అందరూ నెంబర్ వన్  లోకి వెళ్ళే ఆత్మలు కదా! ఒకటో నెంబర్(నెంబర్వన్) యొక్క అర్థము - ప్రతి విషయంలో విజయం సాధించేవారు. ఏ లోపమూ ఉండరాదు. టీచర్లు అంటే అర్థము - సదా తమ మూర్తి ద్వారా కర్మాతీతులుగా ఉన్న బ్రహ్మాబాబాను మరియు అతీతంగా, ప్రియంగా ఉన్న శివబాబాను అనుభూతి చేయించేవారు. ఈ విశేషత ఉంది కదా! మీరు స్నేహితులు కదా, స్నేహితులుగా ఎలా అవుతారు? సమానంగా అవ్వకుండా స్నెేహితులుగా అవ్వలేరు. కనుక మీరందరూ తండ్రికి స్నేహితులు, ఈశ్వరీయ స్నేహితులు. సమానంగా అవ్వడమే స్నేహము. తండ్రి అడుగులో అడుగు వేసేవారు. ఎందుకంటే స్నేహితులుగా కూడా ఉన్నారు. అంతేకాక ప్రియునికి ప్రేయసులుగా కూడా ఉన్నారు. కనుక ప్రేయసులు సదా ప్రియుని అడుగు పైన అడుగు పెడ్తారు. ఇది ఆచారము కదా! వివాహము జరిగినప్పుడు ఏమి చేయిస్తారు? ఇదే చేయిస్తారు కదా! ఈ పద్ధతి కూడా ఎక్కడి నుండి తయారయ్యింది? మీతోనే తయారయ్యింది! మీది బుద్ధి రూపీ పాదము. వారు స్థూల పాదముగా భావించారు. మీరు ప్రతి సంబంధం ద్వారా విశేషత యొక్క సంబంధాన్ని నిభాయించే నిమిత్తంగా ఉన్న ఆత్మలు మీరు.

నిమిత్త టీచర్లకు ఇతరుల కంటే చాలా సహజ సాధనము. ఇతరులకు సంబంధంలో ఉండవలసి పడ్తుంది మీ సంబంధము సదా సేవ మరియు తండ్రితో ఉంటుంది. లౌకిక కార్యము చేస్తున్నా సమయము అవుతూనే సేవకు వెళ్ళాలి అని సదా ఇదే జ్ఞాపకము ఉంటుంది అంతేకాక లౌకిక కార్యము ఎవరి కోసము అయితే చేస్తారో వారి స్మృతి స్వతహాగానే వస్తుంది. ఉదాహరణానికి లౌకికంలో పిల్లల కొరకు అమ్మ-నాన్న సంపాదిస్తారు. కావున స్వత:గానే వారి జ్ఞాపకం వస్తుంది. అలా మీరు కూడా ఏ సమయంలో లౌకిక కార్యం చేసినా ఎవరి కోసం చేస్తారు? సేవ కొరకు చేస్తారా? లేక తమ కొరకు చేస్తారా? ఎందుకంటే సేవలో ఎంత వినియోగిస్తారో అంత సంతోషము ఉంటుంది. ఎప్పుడూ లౌకిక సేవ అని భావించి చెయ్యకండి. ఇది కూడా ఒక సేవా పద్ధతి. రూపం భిన్నంగా ఉంది కానీ సేవ కొరకే లేకుంటే చూడండి. లౌకిక సేవ చేసి సేవా సాధనం లేకపోయినట్లయితే ఎక్కడి నుండి రావాలి? ఎలా రావాలి? జరగడం లేదు. ఎప్పుడు అవుతుందో తెలియదు! ఈ సంకల్పాలతో వ్యర్థంగా సమయం పోగొట్టుకోవడం లేదు కదా? అందువలన లౌకిక వ్యాపారం చేస్తున్నప్పుడు ఈ మాటలు ఎప్పుడూ మాట్లాడకండి. ఇది అలౌకిక ఉద్యోగము సేవకు నిమిత్తంగా ఉంది అనుకొంటే ఎప్పుడూ భారంగా అనిపించదు. లేకుంటే అప్పుడప్పుడు - ఎప్పటివరకు అవుతుంది, ఏమవుతుంది? అని భారంగా అయిపోతారు. ఇది మీ కొరకు చాలా సహజంగా ప్రాలబ్ధాన్ని తయారు చేసే సాధనము.

తనువు, మనసు, ధనము మూడు వస్తువులు ఉన్నాయి కదా! మూడు వస్తువులూ సేవలో వినియోగిస్తున్నట్లయితే మూడింటి ఫలము ఎవరికి లభిస్తుంది? మీకు లభిస్తుందా? లేక తండ్రికి లభిస్తుందా? మూడు విధానాలతో మీ ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోండి. కనుక ఇది ఇతరుల కంటే అధిక ప్రాలబ్ధం అయ్యింది. అందువలన ఎప్పుడూ కూడా ఇందులో భారంగా అవ్వకండి. కేవలం భావాన్ని మార్చుకోండి. లౌకికం కాదు, అలౌకిక సేవ కొరకే చేస్తున్నామని భావాన్ని మార్చుకోండి అర్థమయిందా? ఇది ఇంకా డబల్ సమర్పితము(సరెండర్) అయ్యింది అనగా ధనంతో సహా సమర్పితం అయ్యారు అన్నీ తండ్రి కొరకు చేస్తున్నారు. సమర్పితమంటే అర్థము ఏమిటి? మీ వద్ద ఏది ఉన్నా తండ్రి కొరకు అనగా సేవ కొరకు ఉంది. దీనినే సమర్పితము అంటారు. మేము సమర్పితము అవ్వలేదు అనుకున్నవారు చేతులెత్తండి! వారికి ఉత్సవాన్ని జరుపుతాము. పిల్లలు - మనవళ్ళు కూడా పుట్టారు. ఇంకా సమర్పితము అవ్వలేదు అని అంటున్నారు. తమ పెళ్ళి రోజును జరుపుకోండి కాని వివాహము అవ్వలేదు అని మాత్రం అనకండి. ఏమనుకుంటున్నారు, మొత్తం గ్రూపు అంతా సమర్పితమైన గ్రూప్ కదా!

బాప్దాదా డబల్ విదేశీయులను లేక డబల్ విదేశాలలో నిమిత్తంగా ఉన్న టీచర్లను చాలా మహిమ చేస్తారు. ఊరకే మహిమ చెయ్యరు. ప్రేమతో విశేషమైన శ్రమ కూడా చేస్తున్నారు. శ్రమ అయితే చాలా చేయవలసి ఉంటుంది. కానీ ప్రేమతో చేస్తే కష్టం అనుభవమవ్వదు. చూడండి ఎంతెంత దూరం నుండి గ్రూపును తయారు చేసుకొని తీసుకు వచ్చారు! కనుక బాప్దాదా పిల్లల శ్రమ చూసి బలిహారమవుతారు. డబల్ విదేశాలలో నిమిత్త సేవాధారులలో ఒక్క విశేషత చాలా బాగుంటుంది. ఎలాంటి విశేషత ఉందో తెలుసా? (అనేక విశేషతలు చెప్పారు) ఏ ఏ విశేషతలైతే చెప్పారో అవి స్వయం పరిశీలించుకొని ఏదైనా తక్కువగా ఉంటే నింపుకోండి. ఎందుకంటే విశేషతలైతే చాలా మంచి మంచివి తీశారు. బాప్దాదా వినిపిస్తున్నారు - ఒక్క విశేషత డబల్ విదేశీ సేవాధారులలో చూశారు. అదేమంటే బాప్దాదా ఏ డైరెక్షన్ఇస్తే దానిని చేసి తీసుకు రావడం. దానిని ప్రాక్టికల్ లోకి తీసుకు వచ్చేందుకు సదా ఎన్ని ప్రయత్నాలు చెయ్యవలసి వచ్చినా ప్రాక్టికల్ లోకి తీసుకు రావల్సిందే అనే లక్ష్యం ప్రాక్టికల్ గా బాగుంది. ఉదాహరణానికి గ్రూపును తీసుకు రావలసిందిగా బాప్దాదా చెప్పారు, కనుక గ్రూపులు కూడా తీసుకొస్తున్నారు.

బాప్దాదా వి.ఐ.పి.ల సేవ చెయ్యమని చెప్పారు. మొదట ఎంతో కష్టం, చాలా కష్టము అనేవారు. కానీ చెయ్యాల్సిందే అని ధైర్యం ఉంచుకున్నారు. ఇప్పుడు రెండు సంవత్సరాల నుండి గ్రూపులు వస్తున్నాయి కదా! లండన్నుండి వి.ఐ.పి.లు రావడం చాలా కష్టం అనేవారు. కానీ ఇప్పుడు చూడండి ప్రత్యక్ష ప్రమాణం చూపించారు కదా! ఈసారి భారతదేశం వారు కూడా రాష్ట్రపతిని తీసుకొచ్చి చూపించారు. అయినా డబల్ విదేశీయులకు  డైరెక్షన్ లభించింది, చెయ్యాల్సిందే అనే ఉత్సాహం ఈ లగ్నము(పట్టుదల) ధ్యాస మంచిగా ఉంది. ప్రాక్టికల్ గా ఫలితం చూసి బాప్దాదా ఈ విశేషతను మహిమ చేస్తారు. సెంటర్ తెరుస్తారు, అది పాత విషయం అయ్యింది. అవి తెరుస్తూనే ఉంటారు ఎందుకంటే అక్కడ సాధనాలు చాలా సహజంగా ఉన్నాయి. ఇక్కడ నుండి అక్కడకు వెళ్ళి తెరవగలరు. ఈ భారతదేశంలో అలాంటి సాధనాలు లేవు. అందువలన విదేశాలలో సెంటర్ తెరవడం పెద్ద విషయం కాదు. కానీ మంచి మంచి వారస్ క్వాలిటీ ఉన్న వారిని తయారు చెయ్యాలి. ఒకటి వారస్ క్వాలిటీ  తయారు చెయ్యడం, రెండవది బిగ్గరగా శబ్ధాన్ని వ్యాపింపజేసే వారిని తయారు చెయ్యడము. రెండూ అవసరమే. సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలతో తనువు, మనసు, ధనం సహితంగా ఉంటూ కూడా సమర్పణ బుద్ధితో ఉండేవారిని వారస్ క్వాలిటీ అని అంటారు. వారస్ క్వాలిటీ వారిని కూడా బయటికి తీయాలి. దీని పై కూడా విశేష గమనముంచండి. ప్రతి సేవాకేంద్రంలో ఇలాంటి వారస్ క్వాలిటీ ఉంటే సేవాకేంద్రం అన్నింటికంటే నెంబర్వన్ లోకి వెళ్తుంది.

ఒకటి సేవలో సహయోగులుగా అవ్వాలి, రెండవది పూర్తిగా సమర్పణ అవ్వాలి. ఇలాంటి వారసులు ఎంతమంది ఉన్నారు? ప్రతి సేవాకేంద్రంలో ఇలాంటి వారసులు ఉన్నారా? ఈశ్వరీయ విద్యార్థులను తయారు చెయ్యడం సేవలో సహయోగులుగా అయ్యేవారి లిస్ట్అయితే చాలా పొడవుగా ఉంటుంది. కానీ వారసులు ఎవరో కొంతమంది మాత్రమే ఉంటారు. ఏ సమయంలో ఎవరికి ఏ శ్రీమతము లభిస్తుందో ఆ ప్రమాణంగా నడుస్తూ ఉండాలి. కావున రెండు లక్ష్యాలూ ఉంచుకోండి. అలాంటి వారిని తయారు చెయ్యాలి మరియు ఇలాంటి వారినీ తయారు చెయ్యాలి. ఇలాంటి వారస్ క్వాలిటీ గలవారు ఒక్కరు అనేక సెంటర్లు తెరిచేందుకు నిమిత్తంగా అవుతారు. ఈ లక్ష్యంతో కూడా ప్రత్యక్షత జరుగుతూ ఉంటుంది. తమ విశేషతను అర్థం చేసుకున్నారు కదా! మంచిది.

సంతుష్టంగానే ఉన్నారా లేక అడగవలసి ఉంటుందా, మీరు సంతుష్టంగా చేసేవారు. ఇతరులను సంతుష్టంగా చేసేవారు స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు కదా! అప్పుడప్పుడు సేవ కొంచెం తక్కువగా జరగడం చూసి అలజడిలోకి రావడం లేదు కదా? సేవాకేంద్రంలో ఏదైనా విఘ్నము వచ్చినప్పుడు విఘ్నాన్ని చూసి భయపడ్తున్నారా? చాలా పెద్ద విఘ్నము వచ్చిందని అనుకోండి ఎవరైనా మంచివారు, విశేషమైనవారు వ్యతిరేకంగా అయ్యి సేవలో మిమ్ములను విసిగిస్తారు అప్పుడేం చేస్తారు? భయపడ్తారా? ఒకటి - వారి పట్ల కళ్యాణ భావంతో దయ చూపించడం వేరే విషయం. రెండవది - స్వ హెచ్చు తగ్గులవ్వడం లేక వ్యర్థ సంకల్పాలు నడవడం - దీనిని అలజడిలోకి రావడం అని అంటారు. సంకల్పాల సృష్టిని కూడా రచించకండి. ఈ సంకల్పం కూడా కదిలించరాదు. దీనిని అచంచలమైన స్థిరమైన స్థితి అని అంటారు. అలాగని క్రొత్తదేమీ లేదని సోమరులుగా కూడా అవ్వరాదు. సేవ కూడా చెయ్యాలి, వారి పట్ల దయాహృదయులుగా కూడా అవ్వాలి. కానీ అలజడిలోకి రాకూడదు. కనుక సోమరితనంలోకి రానివారు, ఫీలింగ్ లోకి రానివారుగా అవ్వండి. సదా ఏ వాతావరణంలో, వాయుమండలంలో ఉన్నా అచలంగా స్థిరంగా ఉండాలి. ఎవరైనా ఎప్పుడైనా నిమిత్తంగా ఉన్నవారు సలహా ఇస్తే అందులో సంశయంలోకి రాకండి, ఇలా ఎందుకు చెప్తున్నారు? లేక ఇది ఎలా జరుగుతుంది? అని ఆలోచించకండి. ఎందుకంటే ఎవరైతే నిమిత్తంగా ఉంటారో వారు అనుభవీలుగా అయినవారు ప్రాక్టికల్ గా నడిచేవారు కొంతమంది క్రొత్తవారూ ఉన్నారు. కొంతమంది పాతవారు కూడా ఉన్నారు. కానీ ఏ సమయంలో ఏ విషయం వారి ముందుకు వస్తుందో, ఆ విషయం కారణంగా అంత స్పష్టమైన బుద్ధితో ఆది-మధ్య-అంత్యాలను తెలుసుకోలేరు. కేవలం వర్తమానాన్ని మాత్రమే తెలుసుకోగలరు. అందువలన కేవలం వర్తమానాన్ని చూసి ఆది మధ్యము ఆ సమయంలో స్పష్టమవ్వకుంటే సంశయంలోకి వస్తారు (కన్ఫ్యూజ్అవుతారు). ఏ డైరెక్షన్అయినా స్పష్టం అవ్వకపోయినా ఎవ్వరూ కన్ఫ్యూజ్అవ్వకండి. దీనిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. ధైర్యంగా చెప్పండి. వారికి కొంత సమయం ఇవ్వండి. ఆ సమయంలోనే తికమక పడుతూ ఇది కాదు, అది కాదు, ఇలా చెయ్యకండి అని అనకండి. ఎందుకంటే డబల్ విదేశీయులు ఎక్కువగా ఫ్రీ మైండ్(స్వచ్ఛంగా ఉండే మనసు) గలవారు. అందువలన ఫ్రీ మైండ్ తో కాదని కూడా అనేస్తారు. అందువలన ఏదైనా విషయం కొద్దిగా లభించినప్పుడు దానిని ముందు గంభీరతతో ఆలోచించండి. అందులో ఏదో ఒక రహస్యం తప్పకుండా దాగి ఉంటుంది. దీని రహస్యం ఏమిటి అని వారిని అడగవచ్చు. దీని వలన ఏ లాభం ఉంటుంది? మాకు ఇంకా స్పష్టంగా అర్థం చేయించండి అని అడగండి, కానీ ఎప్పుడు ఆదేశాన్ని తిరస్కరించినందువలన తికమక పడ్తారు. విశేషించి ఈ కొంచెం అటెన్షన్ డబల్ విదేశీ పిల్లలకు ఇస్తున్నారు. లేకపోతే ఏమవుతుంది. ఉదాహరణానికి నిమిత్తంగా ఉన్న మీ అక్కయ్యల డైరెక్షన్ను తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. అంతేకాక అలజడిలోకి వచ్చినట్లయితే మిమ్ములను చూసి మీరు ఎవరి కోసం నిమిత్తంగా అయ్యారో వారిలో ఈ సంస్కారం నిండుతుంది. తర్వాత ఎప్పుడైనా కొందరు అలుగుతారు. ఇంకోసారి మరికొంత మంది అలుగుతారు. తర్వాత సెంటరులో ఇదే ఆట నడుస్తుంది అర్థమయ్యిందా? మంచిది,

Comments