17-04-1984 అవ్యక్త మురళి

17-04-1984                    ఓంశాంతి                 అవ్యక్త బాప్ దాదా           మధువనము 

''పదమాపదమ్ భాగ్యశాలుల గుర్తు''

ఈ రోజు భాగ్యవిధాత తండ్రి భాగ్యవంతులైన పిల్లలందరిని చూస్తున్నారు. ప్రతి బ్రాహ్మణ ఆత్మ భాగ్యశాలి ఆత్మగా ఉన్నాడు. బ్రాహ్మణులుగా అవ్వడం అనగా భాగ్యశాలురుగా అవ్వడం. భగవంతుని వారిగా అవ్వడం అనగా భాగ్యశాలురుగా అవ్వడం. అందరూ భాగ్యశాలురే కాని తండ్రివారిగా అయిన తర్వాత తండ్రి ద్వారా వారసత్వ రూపంలో భిన్న భిన్న ఖజానాలు పాప్తిస్తాయి. ఆ శ్రేష్ఠమైన వారసత్వ అధికారాన్ని ప్రాప్తి చేసుకొని వాటిని, అధికారిగా జీవితంలో నడిపించడం లేక ప్రాప్తించిన అధికారాన్ని సదా సహజ పద్ధతి ద్వారా వృద్ధిని ప్రాప్తి చేసుకోవడంలో నెంబర్వార్గా అవుతారు. కొందరు భాగ్యశాలురుగా ఉండిపోతారు. కొందరు సౌభాగ్యశాలురుగా అవుతారు. కొందరు వెయ్యి, కొందరు లక్ష, కొందరు పదమాపదమ్భాగ్యశాలురుగా అవుతారు. ఎందుకంటే ఖజానాలను విధితో (పద్ధతిగా) కార్యంలో వినియోగించడం అనగా వృద్ధిని పొందడం. స్వయాన్ని సంపన్నంగా చేసుకునే కార్యంలో అయినా వినియోగించండి, స్వయం యొక్క సంపన్నత ద్వారా ఇతర ఆత్మలకు సేవ చేసే కార్యంలో అయినా వినియోగించండి. వినాశి ధనాన్ని ఖర్చు చేస్తే తరిగిపోతుంది. అవినాశి ధనాన్ని ఖర్చు చేస్తే పదమాల రెట్లు పెరుగుతుంది. అందువలన ఖర్చు చెయ్యండి, తినండి అనే సామెత ఉంది. ఎంత ఖర్చు చేస్తారో, తింటారో అంత చక్రవర్తులకు చక్రవర్తి అయిన తండ్రి ఇంకా సంపన్నంగా చేస్తారు. అందువలన ప్రాప్తించిన ఖజానాల భాగ్యాన్ని సేవార్థం వినియోగించినవారు ముందుకు వెళ్తారు. పదమాపదమ్భాగ్యశాలురు అనగా ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేసుకునేవారు. అంతేకాక ప్రతి సంకల్పం ద్వారా లేక మాట, కర్మ, సంపర్కం ద్వారా పదమాలను, పదమా రెట్లు సేవాధారిగా అయ్యి సేవలో వినియోగించేవారు. పదమాపదమ్భాగ్యశాలురు సదా విశాల హృదయులుగా, అవినాశి అఖండ మహాదానులుగా, సర్వుల పట్ల సర్వ ఖజానాలను ఇచ్చే దాతలుగా ఉంటారు. సమయం లేక కార్యక్రమం ప్రమాణంగా, సాధనాల ప్రమాణంగా సేవ చేసే సేవాధారులు కాదు, అఖండ మహాదానులుగా ఉంటారు. వాచాతో కాకుంటే మనసా లేక కర్మణా ద్వారా సేవ చేస్తూ ఉంటారు. సంబంధ - సంపర్కాల ద్వారా ఏదో ఒక పద్ధతి ద్వారా తరగని అఖండ ఖజానాలను దానం చేసే నిరంతర సేవాధారులుగా ఉంటారు. సేవ భిన్న భిన్న రూపాలలో ఉంటుంది. కానీ సేవ అనే లంగరు సదా నడుస్తూ ఉంటుంది. ఎలాగైతే నిరంతర యోగులుగా ఉన్నారో అలా నిరంతర సేవాధారులుగా అవ్వండి. నిరంతర సేవాధారులు సేవ యొక్క శ్రేష్ఠ ఫలమును నిరంతరం తింటూ, ఇతరులకు తినిపిస్తూ ఉంటారు. అనగా స్వయం సదాకాలపు ఫలం తింటూ ప్రత్యక్ష స్వరూపంగా అవుతారు.

పదమాపదమ్భాగ్యశాలి ఆత్మలు సదా పద్మాసన నివాసి అనగా కమలపుష్ప స్థితి యొక్క ఆసన నివాసిగా, హద్దు ఆకర్షణ మరియు హద్దు ఫలాన్ని స్వీకరించుట నుండి అతీతంగా మరియు తండ్రికి, బ్రాహ్మణ పరివారానికి, విశ్వానికి ప్రియంగా ఉంటారు. ఇలాంటి శ్రేష్ఠ సేవాధారి ఆత్మకు సర్వ ఆత్మలు హృదయపూర్వక స్నేహంతో సంతోష పుష్పాలు సమర్పిస్తారు. స్వయం బాప్దాదా కూడా ఇలాంటి నిరంతర సేవాధారి పదమాపదమ్భాగ్యశాలి ఆత్మ పై స్నేహ పుష్పాలు కురిపిస్తారు. పదమాపదమ్భాగ్యశాలి ఆత్మలు సదా మెరుస్తున్న తమ భాగ్య నక్షత్రం ద్వారా ఇతర ఆత్మలను కూడా భాగ్యవంతులుగా తయారుచేసే ప్రకాశాన్ని ఇస్తారు. బాప్దాదా ఇలాంటి భాగ్యశాలి పిల్లలను చూస్తున్నారు. దూరంగా ఉండవచ్చు, సన్ముఖంలో ఉండవచ్చు కానీ సదా తండ్రిని హృదయంలో ఇముడ్చుకొని ఉన్నారు. అందువలన సమానంగా ఉండి సమీపంగా ఉంటారు. ఇప్పుడు నేను ఎలాంటి భాగ్యశాలిని అని మిమ్ములను మీరు ప్రశ్నించుకోండి. మిమ్ములను మీరు తెలుసుకోగలరు కదా! ఇతరులు చెప్తే అంగీకరిస్తారు లేక అంగీకరించరు. కాని స్వయాన్ని గురించి నేనెవరు? అని అందరికీ తెలుసు. అర్థమయిందా! అయినా బాప్దాదా చెప్తున్నారు - భాగ్యహీనుల నుండి భాగ్యశాలురుగా అయితే అయ్యారు. అనేక రకాల దు:ఖాలు, బాధల నుండి రక్షింపబడ్డారు. స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఒకటి - స్వర్గంలోకి రావడం, రెండవది - రాజ్యాధికారులుగా అవ్వడం. అందరూ స్వర్గంలోకి వచ్చేవారే కానీ ఎప్పుడు మరియు ఎక్కడ వస్తారు అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. బాప్దాదా రిజిస్టర్లో స్వర్గంలోకి వచ్చేవారి లిస్ట్లో పేరు వచ్చేసింది. ప్రపంచంలోని వారి కంటే ఇది మంచిదే కానీ మంచి కంటే మంచిగా అయితే లేదు. కనుక ఏం చేస్తారు? ఏ జోన్నెంబర్వన్లోకి వస్తుంది. ప్రతిజోన్విశేషత ఎవరిది వారికి ఉంది.

మహారాష్ట్ర విశేషత ఏమిటో తెలుసా? మహాన్గా అయితే ఉండనే ఉన్నారు, కానీ విశేషమైన విశేషత ఏమని గాయనం చెయ్యబడ్తుంది? మహారాష్ట్రలో గణపతి పూజ ఎక్కువగా జరుగుతుంది. గణపతిని ఏమంటారు? విఘ్నవినాశకుడు అని అంటారు. ఏ కార్యము ఆరంభించినా మొదట గణేశాయ నమ: అని అంటారు. కావున మహారాష్ట్ర వారు ఏం చేస్తారు? ప్రతి మహాన్కార్యంలో శ్రీ గణేశ్చేస్తారు కదా! మహారాష్ట్ర అనగా సదా విఘ్నవినాశక రాష్ట్రము. కావున సదా విఘ్న వినాశకులుగా అయ్యి స్వయం మరియు ఇతరుల పట్ల ఇదే మహానతను చూపిస్తారు. మహారాష్ట్రలో విఘ్నాలు ఉండరాదు. అందరూ విఘ్న వినాశకులుగా అవ్వాలి. వస్తాయి, దూరం నుండే నమస్కారం చేస్తాయి. కావున ఇలాంటి విఘ్నవినాశక గ్రూపును తీసుకొచ్చారు కదా! మహారాష్ట్ర వారు సదా తమకు గల ఈ మహానతను(గొప్పతనాన్ని) విశ్వం ముందు చూపించాలి. విఘ్నాలతో భయపడేవారు కారు కదా. విఘ్నవినాశకులు ఛాలెంజ్చేసేవారు. అక్కడ కూడా మహారాష్ట్రలో పరాక్రమాన్ని చూపిస్తారు కదా! మంచిది.

యు.పి. వారు ఏ అద్భుతం చూపిస్తారు? యు.పి. విశేషత ఏమిటి? తీర్థస్థానాలు కూడా చాలా ఉన్నాయి. నదులు కూడా చాలా ఉన్నాయి. జగద్గురువులు కూడా అక్కడే ఉన్నారు. నాలుగు మూలలలో నలుగురు జగద్గురువులు ఉన్నారు కదా! మహామండలేశ్వరులు యు.పి.లో ఎక్కువగా ఉన్నారు. హరిద్వారము యు.పి.లోని విశేషత. కావున హరిద్వారము అనగా హరి వద్దకు వెళ్లే ద్వారము గురించి తెలిపే సేవాధారులు యు.పి.లో ఎక్కువగా ఉండాలి. తీర్థస్థానం అయిన కారణంగా యు.పి.లో పండాలు చాలామంది ఉన్నారు. వారు తిని-త్రాగేవారు కానీ మీరు సత్యమైన మార్గాన్ని తెలిపే ఆత్మిక సేవాధారీ పండాలు. తండ్రితో మిలనం జరుపుకునేవారు, తండ్రికి సమీపంగా తీసుకొచ్చేవారు. ఇలాంటి పాండవులైన పండాలు యు.పి.లో విశేషంగా ఉన్నారా? యు.పి. వారు విశేషంగా ఇలాంటి పాండవుల నుండి పండాలుగా అయ్యే ప్రత్యక్ష రూపం చూపించాలి. అర్థమయిందా!

మైసూర్విశేషత ఏమిటి? అక్కడ చందనం(గంధం చెట్లు) కూడా ఉన్నాయి, విశేషించి గార్డెన్(బృందావన్) కూడా ఉంది. కావున కర్ణాటక వారు విశేషించి సదా ఆత్మిక గులాబీలు. సదా సుగంధభరితమైన చందనంగా అయ్యి విశ్వంలో సుగంధమును అనండి లేక ఆత్మిక గులాబీల సుగంధమనండి, విశ్వాన్ని గార్డన్గా చెయ్యాలి, విశ్వంలో చందనము యొక్క సువాసనను వ్యాపింపజేయాలి. చందన తిలకం ఇచ్చి సుగంధభరితంగా, శీతలంగా చెయ్యాలి. చందనం శీతలంగా కూడా ఉంటుంది. కావున అన్నిటికంటే ఎక్కువగా ఆత్మిక గులాబీలు కర్ణాటక నుండి వెలువడ్తారు కదా! ఈ ప్రత్యక్ష ప్రమాణాన్ని తీసుకు రావాలి.

ఇప్పుడు అందరూ తమ తమ విశేషతల ప్రత్యక్ష రూపాన్ని చూపించాలి. అన్ని జోన్ల నుండి వికసించిన ఆత్మిక గులాబీలను తీసుకు రావాల్సి పడ్తుంది, తీసుకొచ్చారు కూడా. కొంచెం కొంచెం తీసుకొచ్చారు కానీ పుష్పగుచ్ఛాన్ని తీసుకు రాలేదు. మంచిది.

విదేశాల మహిమ అయితే చాలా వినిపించాము. విదేశాల విశేషత - దూరంగా కూడా చాలా త్వరగా(వేగంగా) అవుతారు, దగ్గరగా కూడా చాలా త్వరగానే అవుతారు. బాప్దాదా విదేశీ పిల్లల అతీతత్వం మరియు ప్రియత్వాన్ని చూసి సంతోషిస్తారు. ఆ జీవితం అయితే గడిచిపోయింది. ఎంత చిక్కుకుపోయి ఉండేవారో ఇప్పుడు అంత అతీతంగా కూడా అయ్యారు. అందువలన విదేశాల అతీతత్వం మరియు ప్రియత్వం బాప్దాదాకు కూడా ప్రియంగా అనిపిస్తుంది. అందువలన విశేషించి బాప్దాదా కూడా ప్రియస్మృతులు ఇస్తున్నారు. తమ విశేషతలో ఇమిడిపోయారు కదా! ఇలా అతీతంగా మరియు ప్రియంగా ఉన్నారు కదా! ఆకర్షణ(మోహము) లేదు కదా! అయినా చూడండి విదేశీయులు అతిధులుగా అయ్యి ఇంటికి వచ్చినట్లయితే అతిథులను సదా ముందుంచడం జరుగుతుంది. అందువలన భారతీయులకు విదేశీయులను చూసి విశేషంగా సంతోషమవుతుంది. కొంతమంది అతిథులు ఎలా ఉంటారంటే వారు ఆతిథ్యము ఇచ్చేవారిగా అయ్యి కూర్చుంటారు. విదేశీయులకు సదా ఇదే నడవడిక ఉంది. అతిథులుగా అయ్యి వస్తారు, ఇంటివారిగా అయ్యి కూర్చుంటారు. అయినప్పటికీ అనేక గోడలను త్రెంచి తండ్రి వద్దకు, మీ వద్దకు వచ్చారు కావున 'ముందు మీరు' అని అంటారు కదా! భారతదేశం విశేషత భారతదేశానిది, విదేశాల విశేషత విదేశాలది. మంచిది.

పద్మాసనధారులందరికి, పదమాపదమ్భాగ్యశాలురకు, సదా ప్రతి సెకండు, ప్రతి సంకల్పంలో నిరంతరము 84 గంటల దేవీలు ప్రసిద్ధంగా ఉన్నారు. కావున ఇప్పుడు 84లో గంట మ్రోగిస్తారా లేక ఇంకా ఇప్పుడు కూడా వేచి ఉండాలా! విదేశాలలో అయితే భయంతో జీవిస్తున్నారు. కావున ఎప్పుడు గంటలు మ్రోగిస్తారు. విదేశాల వారు మ్రోగిస్తారా లేక దేశంవారు మ్రోగిస్తారా? 84 అనగా నలువైపులా గంటలు మ్రోగాలి. సమాప్తి సమయంలో హారతి ఇస్తున్నట్లయితే జోరు జోరుగా గంటలు మ్రోగిస్తారు కదా! అప్పుడు సమాప్తి అవుతుంది. హారతి ఇవ్వడం అనగా సమాప్తి అవ్వడం. కావున ఇప్పుడు ఏం చేస్తారు?

పద్మాసనధారులందరికి పదమాపదమ్భాగ్యశాలురకు, సదా ప్రతి సెకండు, ప్రతి సంకల్పంలో నిరంతర సేవాధారీ, సదా విశాల హృదయులుగా అయ్యి సర్వ ఖజానాలను ఇచ్చేవారికి, మాస్టర్ దాతలకు, సదా స్వయం యొక్క సంపన్నత ద్వారా ఇతరులనకు కూడా సంపన్నంగా తయారు చేసేవారికి, శ్రేష్ఠ భాగ్య అధికారులకు, సదా శ్రేష్ఠమైన ఋజువునిచ్చే సుపుత్రులైన పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే.

పంజాబ్నివాసుల పట్ల :- తండ్రి కూర్చున్నారు అందువలన ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏది జరిగినా అది కళ్యాణకారిగానే ఉంటుంది. మీరైతే అందరివారు. హిందువులు కాదు, సిక్కులు కాదు, తండ్రికి చెందినవారు కనుక అందరివారు. కనుక పాకిస్తాన్లో కూడా ఇదే అనేవారు కదా - మీరు అల్లా పిల్లలు మీకు ఏ విషయంతో సంబంధం లేదు. అందువలన మీరు ఈశ్వరునికి చెందినవారు. ఇంకెవ్వరివారు కాదు. ఏం జరిగినా భయపడేవారు కాదు. ఎంత నిప్పు అంటుకున్నా పిల్లి పిల్లలు సురక్షితంగానే ఉంటాయి. కానీ యోగయుక్తంగా ఉన్నవారే సురక్షితంగా ఉంటారు. నేను తండ్రివాడిని అని చెప్తూ ఇంకొకరిని స్మృతి చేసేవారు కాదు. ఇలాంటి వారికి సహాయం లభించదు. భయపడకండి, గాభరాపడకండి, ముందుకు వెళ్ళండి. స్మృతి యాత్రలో, ధారణలలో, చదువులో అన్ని సబ్జెక్ట్లతో ముందుకు వెళ్ళండి. ఎంత ముందుకు వెళితే అంత సహజంగా ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు.

2. అందరూ తమను ఈ సృష్టి డ్రామాలో విశేష పాత్రధారులుగా భావిస్తున్నారా? మీ కల్పక్రితపు చిత్రాన్ని ఇప్పుడు చూస్తున్నారా? ఇదే బ్రాహ్మణ జీవితంలోని అద్భుతము. సదా ఎలా ఉండేవారము, ఎలా అయ్యాము అని ఇదే విశేషతను గుర్తు చేసుకోండి. గుడ్డి గవ్వ నుండి వజ్ర తుల్యంగా అయ్యారు. దు:ఖ ప్రపంచం నుండి సుఖ ప్రపంచంలోకి వచ్చేశారు. మీరందరూ ఈ డ్రామాలో హీరో-హీరోయిన్పాత్రధారులు. ఒక్కొక్క బ్రహ్మకుమార్బ్రహ్మకుమారి తండ్రి సందేశాన్ని వినిపించే సందేశీలు. భగవంతుని సందేశాన్ని వినిపించే సందేశీలు ఎంత శ్రేష్ఠమైనవారయ్యారు! కావున సదా ఇదే కార్యానికి నిమిత్తంగా అవతరించి ఉన్నారు. పై నుండి క్రిందకు ఈ సందేశాన్ని ఇచ్చేందుకు వచ్చారు. ఇదే స్మృతి సంతోషాన్ని ఇప్పిస్తుంది. ''సంతోషాల ఖజానాకు యజమానిని'' అని తమ వృత్తిని సదా జ్ఞాపకం ఉంచుకోండి. ఇదే మీ టైటిల్.

3. సదా స్వయాన్ని సంగమయుగీ శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? సత్యమైన బ్రాహ్మణులు అనగా సదా సత్యమైన తండ్రి పరిచయాన్ని ఇచ్చేవారు. బ్రాహ్మణుల పని కథ చెప్పడం. మీరు కథ చెప్పరు కాని సత్యమైన పరిచయం వినిపిస్తారు. ఇలాంటి సత్యమైన తండ్రి యొక్క సత్య పరిచయాన్ని ఇచ్చే బ్రాహ్మణ ఆత్మలమనే నశా ఉండాలి. బ్రాహ్మణులు దేవతల కంటే శ్రేష్ఠమైనవారు. అందువలన బ్రాహ్మణుల స్థానం పిలక పై చూపిస్తారు. పిలక ఉన్న బ్రాహ్మణులు అనగా ఉన్నతమైన స్థితిలో ఉండేవారు. ఉన్నతంగా ఉన్నట్లయితే క్రింద అందరూ చిన్నగా ఉంటారు. ఏ విషయమూ పెద్దదిగా అనిపించదు. పైన కూర్చొని క్రింద వస్తువు చూసినట్లయితే అది చిన్నదిగా అనిపిస్తుంది. ఏదైనా సమస్య పెద్దదిగా అనిపిస్తుందంటే అందుకు కారణం - క్రింద కూర్చొని చూస్తారు. పై నుండి చూస్తే శ్రమ చేసే పని ఉండదు. కావున సదా పిలక ఉన్న బ్రాహ్మణులము అని జ్ఞాపకం ఉంచుకోండి. తద్వారా పెద్ద సమస్య కూడా సెకండులో చిన్నదిగా అవుతుంది. సమస్యతో భయపడేవారు కాదు, దాటుకునేవారు. సమస్యను సమాధాన పరిచేవారు. మంచిది.

ఈ రోజు ఉదయం (18-04-1984) అమృతవేళ ఒక సోదరుడు గుండెపోటు రావడంవలన తమ పాత శరీరం మధువనంలోనే వదిలారు. ఆ సమయంలోఅవ్యక్త బాప్దాదా ఉచ్ఛరించిన మహావాక్యాలు

అందరూ డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని సాక్షిగా చూసే శ్రేష్ఠ ఆత్మలుగా ఉన్నారు కదా! ఏ దృశ్యం డ్రామాలో జరిగినా దానిని కళ్యాణకారి అని అంటారు. క్రొత్తది ఏమీ లేదు. (వారి లౌకిక వదినతో) ఏం ఆలోచిస్తున్నావు? సాక్షి స్థితి సీటులో కూర్చొని అన్ని దృశ్యాలను చూసినట్లయితే మీకు కూడా కళ్యాణముంది, ఆ ఆత్మకు కూడా కళ్యాణముంది. ఇది అర్థం చేసుకున్నారు కదా! స్మృతిలో శక్తి రూపంగా ఉన్నారు కదా! శక్తి సదా విజయీగా ఉంటుంది. విజయులు శక్తి రూపంగా అయ్యి మొత్తం పాత్రను అభినయించేవారు. ఈ పాత్ర కూడా ఉంది. పాత్రను అభినయిస్తూ ఎప్పుడూ ఏ ఇతర సంకల్పము చేయరాదు. ప్రతి ఆత్మకు తమ తమ పాత్ర ఉంది. ఇప్పుడు ఆ ఆత్మకు శాంతి మరియు శక్తుల సహయోగం ఇవ్వండి. ఇంతమంది దైవీ పరివారం సహయోగం ప్రాప్తిస్తూ ఉంది. అందువలన ఏమీ ఆలోచించవలసిన విషయం లేదు. ఇది మహోన్నతమైన తీర్థ స్థానం కదా! మహాన్ఆత్మ, మహాన్తీర్థ స్థానము. సదా మహానత గురించే ఆలోచించండి. అందరూ స్మృతిలో కూర్చున్నారు కదా! ఒక అల్లారు ముద్దు పుత్రుడు తమ ఈ పాత శరీర లెక్కాచారాన్ని పూర్తి చేసుకొని తమ కొత్త శరీరాన్ని తయారు చేసుకునేందుకు వెళ్ళిపోయాడు. అందువలన మీరందరూ ఇప్పుడు ఆ భాగ్యశాలి ఆత్మకు శాంతి, శక్తుల సహయోగాన్ని ఇవ్వండి. ఇదే విశేషమైన సేవ. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలలోకి వెళ్ళకండి. కానీ స్వయం మీరు కూడా శక్తి స్వరూపులు. విశ్వంలో శాంతి కిరణాలను వ్యాపింపజేయండి. శ్రేష్ఠ ఆత్మ, సంపాదన చేసుకునే ఆత్మ అందువలన ఆలోచించాల్సిన అవసరం ఏదీ లేదు అర్థమయిందా!

Comments