15-04-1984 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
''స్నేహీ, సహయోగీ, శక్తిశాలీ పిల్లల మూడు స్థితులు''
బాప్దాదా సేహీ, సహయోగీ, శక్తిశాలి పిల్లలందరిని చూస్తున్నారు. స్నేహీ పిల్లలలో కూడా రకరకాల స్నేహం ఉన్న పిల్లలున్నారు. ఒక రకం - ఇతరుల శ్రేష్ఠ జీవితాన్ని చూసి, ఇతరుల పరివర్తన చూసి, వారితో ప్రభావితులై స్నేహీలుగా అయ్యేవారు. రెండవ రకం - ఏదో ఒక గుణం కావచ్చు, సుఖము లేక శాంతి కావచ్చు, కొద్దిపాటి అనుభవం వలన కలిగే ప్రభావాన్ని చూసి స్నేహితులుగా అయ్యేవారు. మూడవ రకం - సాంగత్యం అనగా సంఘటనలో శుద్ధ ఆత్మల తోడును అనుభవం చేసే స్నేహీ ఆత్మలు. నాల్గవ రకం - పరమాత్మ స్నేహీ ఆత్మలు. అందరూ స్నేహితులే కానీ స్నేహంలో కూడా నంబరు ఉంది. యథార్ధ స్నేహితులు అనగా తండ్రిని యథార్ధంగా తెలుసుకొని స్నేహితులుగా అవ్వడం.
అలాగే సహయోగి ఆత్మలలో కూడా రకరకాల సహయోగులు ఉన్నారు. ఒకరు భక్తి సంస్కారం అనుసారంగా సహయోగులు. మంచి విషయాలు ఉన్నాయి, స్థానం బాగుంది, మంచి జీవితం కలిగినవారు, మంచి స్థానంలో చేసినట్లయితే మంచి ఫలం లభిస్తుంది, ఇదే ఆధారంతో ఇదే ఆకర్షణతో సహయోగులుగా అయిన వారు అనగా తమ వద్ద ఉన్న కొద్దిపాటి తనువు-మనసు-ధనాలను వినియోగించువారు. రెండవవారు - జ్ఞాన యోగాల ధారణ ద్వారా కొంత ప్రాప్తి చేసుకున్న ఆధారంతో సహయోగులుగా అయ్యేవారు. మూడవవారు - ఒక్క తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ లేరు. ఒక్కరే తండ్రి, సర్వ ప్రాప్తులు లభించే స్థానం ఒక్కటే, తండ్రి కార్యమే నా కార్యము, ఈ విధంగా తమ తండ్రి, తమ ఇల్లు, తమ కార్యము శ్రేష్ఠ ఈశ్వరీయ కార్యము అని భావించి సదాకాలము కొరకు సహయోగులుగా అయినవారు. కావున అంతరము(తేడా) ఉంది కదా!
అలాగే శక్తిశాలి ఆత్మలు, ఇందులో కూడా భిన్న భిన్న స్థితులు కలిగినవారు ఉన్నారు. కేవలం జ్ఞానం ఆధారంతో - నేను ఆత్మ శక్తి స్వరూపాన్ని, సర్వ శక్తివంతుడైన తండ్రికి బిడ్డను అని తెలుసుకొని శక్తిశాలి స్థితిలో స్థితులయ్యే ప్రయత్నం చేస్తారు. కానీ కేవలం తెలుసుకున్నంత వరకే అయినందున ఈ జ్ఞాన పాయింట్స్మృతిలో వచ్చినప్పుడు ఆ పాయింటు శక్తిశాలి అయిన కారణంగా కొంత సమయం వరకు శక్తిశాలిగా అవుతూ, మళ్లీ పాయింటును మర్చిపోగానే శక్తి పోతుంది. కొంచెమైనా మాయ ప్రభావం పడిందంటే జ్ఞానాన్ని మరపింపచేసి బలహీనులుగా తయారు చేస్తుంది. రెండవవారు - జ్ఞాన చింతన కూడా చేస్తారు, వర్ణన కూడా చేస్తారు, ఇతరులకు శక్తిశాలి విషయాలను వినిపిస్తారు, ఆ సమయంలో సేవ చేసినందుకు ఫలం లభించిన కారణంగా స్వయాన్ని చింతన చేసే సమయం వరకు లేక వర్ణన చేసే సమయం వరకు శక్తిశాలిగా అనుభవం చేస్తారు కాని సదాకాలం కొరకు కాదు. మొదటిది - చింతన చేసే స్థితి, రెండవది - వర్ణన చేసే స్థితి.
మూడవవారు - సదా శక్తిశాలి ఆత్మలు. కేవలం చింతన, వర్ణన మాత్రమే చెయ్యరు కాని మాస్టర్సర్వ శక్తివంతుల స్వరూపంగా అవుతారు. స్వరూపంగా అవ్వడం అనగా సమర్థంగా అవ్వడం. వారి ప్రతి అడుగు, ప్రతి కర్మ స్వత:గానే శక్తిశాలిగా ఉంటాయి. స్మృతి స్వరూపంగా ఉంటారు. అందువలన సదా శక్తిశాలి స్థితి ఉంటుంది. శక్తిశాలి ఆత్మ సదా స్వయాన్ని సర్వ శక్తివంతుడైన తండ్రితో కంబైండుగా అనుభవం చేస్తుంది అంతేకాక సదా శ్రీమతం అనే చేయి ఛత్రఛాయ రూపంలో అనుభవం అవుతుంది. శక్తిశాలి ఆత్మలు సదా దృఢత అనే తాళం చెవికి అధికారిగా ఉన్న కారణంగా సఫలత అనే ఖజానాకు యజమానులుగా అనుభవం చేస్తారు. సదా సర్వ ప్రాప్తుల ఊయలలో ఊగుతూ ఉంటారు. సదా తమ శ్రేష్ఠ భాగ్యము గురించి మనసులో పాటలు పాడుకుంటూ ఉంటారు. సదా ఆత్మిక నశాలో ఉన్న కారణంగా పాత ప్రపంచ ఆకర్షణతో సహజంగా, అతీతంగా ఉంటారు. శ్రమ చెయ్యవలసిన అవసరం ఉండదు. శక్తిశాలి ఆత్మల ప్రతి కర్మ, మాట స్వతహాగా, సహజంగా సేవ చేయిస్తూ ఉంటుంది. స్వ పరివర్తన లేక విశ్వ పరివర్తన శక్తిశాలిగా ఉన్న కారణంగా సఫలత అయ్యే ఉంది. ఈ అనుభవం సదా ఉంటుంది. ఏ కార్యంలోనైనా ఏమి చెయ్యాలి? ఏమవుతుంది? అని సంకల్పములో కూడా ఉండదు. సఫలతా మాల సదా జీవితంలో వేయబడే ఉంటుంది. విజయుడను, విజయ మాలలో ఉండేవాడిని, విజయం నా జన్మ సిద్ధ అధికారము - ఈ స్థిరమైన నిశ్చయము స్వతహాగా మరియు సదా ఉండనే ఉంటుంది. అర్థమయ్యిందా! ఇప్పుడు నేనెవరు అని స్వయానికి స్వయం ప్రశ్నించుకోండి. శక్తిశాలి ఆత్మలు మైనారిటీగా ఉన్నారు. స్నేహీ, సహయోగీ ఆత్మలు ఇందులో కూడా భిన్న భిన్న వెరైటీగా ఉండేవారు మెజారిటీగా ఉన్నారు. కావున ఇప్పుడు ఏం చేస్తారు? శక్తిశాలిగా అవ్వండి. సంగమ యుగంలోని శ్రేష్ఠమైన సుఖాన్ని అనుభవం చెయ్యండి. అర్థమయ్యిందా! కేవలం తెలుసుకునే వారిగా కాదు, పొందేవారిగా అవ్వండి. మంచిది.
మీరు మీ ఇంటికి వచ్చారు లేక మీ తండ్రి ఇంటికి వచ్చి చేరుకున్నారు. ఇది చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు. మీరు కూడా చాలా సంతోషిస్తున్నారు కదా! ఈ సంతోషం సదా స్థిరంగా ఉండాలి. కేవలం మధువనం వరకు కాదు. సంగమ యుగమంతా తోడుగా ఉండాలి. పిల్లల సంతోషంలో తండ్రి కూడా సంతోషంగా ఉన్నారు. ఎక్కడెక్కడి నుండో వచ్చి సహించి చేరుకున్నారు కదా! వేడి-చలి ఆహార పానీయాలు అన్నిటినీ సహించి చేరుకున్నారు. మట్టి-దుమ్ముల వర్షం కూడా కురిసింది. ఇదంతా పాత ప్రపంచంలో జరుగుతూనే ఉంటుంది. అయినా విశ్రాంతి లభించింది కదా! విశ్రాంతి తీసుకున్నారా? మూడు అడుగులు లభించకపోతే రెండు అడుగుల జాగా అయితే లభించింది. రెండు అడుగులే అయినా మీ ఇల్లు, దాత ఇల్లు మధురమనిపిస్తు౦ది కదా. భక్తిమార్గం యాత్రల కంటే మంచి స్థానం. ఛత్రఛాయలోకి వచ్చేశారు. ప్రేమ పాలనలోకి వచ్చేశారు. యజ్ఞం జరిగే శ్రేష్ఠ ధరణి పైకి చేరుకున్నారు. యజ్ఞ ప్రసాదానికి అధికారిగా అవ్వడం ఎంతో మహోన్నతమైనది. ఒక్క కణం కూడా అనేక మహోన్నతాలతో సమానం. ఇది అందరికీ తెలుసు కదా! వారు ఒక్క కణం ప్రసాదం లభించాలని దాహముతో ఉన్నారు కాని మీకు బ్రహ్మ భోజనం పొట్ట నిండా లభిస్తుంది. కావున మీరు ఎంత భాగ్యశాలురు! ఈ మహత్వంతో బ్రహ్మ భోజనం తిన్నట్లయితే సదాకాలం కొరకు మనసు కూడా మహాన్గా తయారవుతుంది.
మంచిది - అందరికంటే ఎక్కువగా పంజాబ్వారు వచ్చారు. ఈ సారి ఎక్కువగా ఎందుకు పరుగులు తీసి వచ్చారు? ఇంత సంఖ్య ఎప్పుడూ రాలేదు. స్పృహలోకి వచ్చేశారు. అయినా బాప్దాదా ఈ శ్రేష్ఠ విశేషతనే చూస్తున్నారు - పంజాబ్లో సత్సంగానికి, అమృతవేళకు మహత్వం ఉంది. చెప్పులు వేసుకోకుండా కూడా అమృతవేళ చేరుకుంటారు. బాప్దాదా కూడా పంజాబ్నివాసీ పిల్లలకు ఈ మహత్వాన్ని తెలుసుకున్న వారిని ఉన్నతమైన దృష్టితో చూస్తున్నారు. పంజాబ్నివాసులు అనగా సదా ఆత్మిక సాంగత్య రంగులో రంగరించబడినవారు. సదా సత్సంగంలో ఉండేవారు. అలాగే ఉన్నారు కదా? పంజాబ్వారంతా అమృతవేళ సమర్థంగా అయ్యి మిలనం జరుపుకుంటున్నారా? పంజాబ్వారిలో అమృతవేళలో సోమరితనం లేదు కదా? కావున పంజాబ్విశేషతను సదా గుర్తుంచుకోండి. మంచిది.
ఈస్ట్రన్(తూర్పు) జోన్వారు కూడా వచ్చారు. ఈస్ట్రన్కు ఏ విశేషత ఉంది? (సన్రైజ్) సూర్యుడు సదా ఈస్ట్లోనే ఉదయిస్తాడు. సూర్యుడు అనగా ప్రకాశ కిరణాల సముదాయము. కావున ఈస్ట్రన్జోన్వారందరు మాస్టర్జ్ఞాన సూర్యులు. సదా అంధకారాన్ని నిర్మూలించేవారు, ప్రకాశాన్ని ఇచ్చేవారు కదా! ఈ విశేషత ఉంది కదా! ఎప్పుడూ మాయ అంధకారంలోకి రానివారు. అంధకారాన్ని నిర్మూలించే మాస్టర్దాతలుగా అయ్యారు కదా! సూర్యుడు దాత కదా. కావున అందరూ మాస్టర్సూర్యులు అనగా మాస్టర్దాతలుగా అయ్యి విశ్వానికి ప్రకాశాన్ని ఇచ్చే కార్యంలో బిజీగా ఉంటున్నారు కదా! ఎవరైతే స్వయం బిజీగా ఉంటారో విశ్రాంతి(ఫుర్సత్తు)గా ఉండరో అటువంటి వారి కొరకు మాయకు కూడా ఫుర్సత్తు(సమయం) ఉండదు. కావున ఈస్ట్రన్జోన్వారు ఏమనుకుంటున్నారు? ఈస్ట్రన్జోన్లోకి మాయ వస్తుందా? వచ్చినా నమస్కరించేందుకు వస్తుందా లేక మిక్కీమౌస్(కార్టూన్బొమ్మ) లాగా తయారు చేస్తుందా? కార్టూన్బోమ్మల ఆట మంచిగా అనిపిస్తుందా? ఈస్ట్రన్జోన్లోని గద్ద్ది(సింహాసనం) తండ్రి గద్ది కావున రాజ్య సింహాసనం అయ్యింది కదా! రాజ్య సింహాసనం ఉన్నవారు రాజులుగా ఉంటారా లేక మిక్కీమౌస్గా ఉంటారా? కావున అందరూ మాస్టర్జ్ఞాన సూర్యులుగా ఉన్నారా? జ్ఞాన సూర్యుల ఉదయం కూడా అక్కడ నుండే జరిగింది కదా! తూర్పు నుండే ఉదయం జరిగింది. తమ విశేషతను అర్థం చేసుకున్నారా? ప్రవేశించే శ్రేష్ఠమైన సింహాసనం అనగా మీరు వరదానీ స్థానంలోని శ్రేష్ఠ ఆత్మలు. ఈ విశేషత ఏ ఇతర జోన్లో లేదు. కావున సదా తమ విశేషతను విశ్వ సేవలో వినియోగించండి. ఏ విశేషతను చేస్తారు? సదా మాస్టర్జ్ఞాన సూర్యులు, సదా ప్రకాశాన్ని ఇచ్చే మాస్టర్దాతలు. మంచిది. అందరూ కలుసుకునేందుకు వచ్చారు. సదా శ్రేష్ఠమైన మిలనం జరుపుతూ ఉండండి. మేళా అనగా కలుసుకోవడం. ఒక్క సెకండు కూడా మిలన మేళాతో వంచితులు అవ్వరాదు. నిరంతర యోగుల అనుభవం పక్కా చేసుకొని వెళ్ళండి. మంచిది.
సదా ఒక్క తండ్రి స్నేహంలో ఉండేవారికి, స్నేహీ ఆత్మలకు, ప్రతి అడుగు ఈశ్వరీయ కార్యంలో సహయోగులుగా ఉన్న ఆత్మలకు, సదా శక్తిశాలీ స్వరూపంగా ఉన్న శ్రేష్ఠ ఆత్మలకు, సదా విజయం పొందిన అధికారాన్ని అనుభవం చేసేవారికి, విజయీ పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో :-ఒకే బలము మరియు ఒకే నమ్మకంతో సదా ఉన్నతిని పొందుతూ ఉండండి. సదా ఒక్క తండ్రి వారము, ఒక్క తండ్రి శ్రీమతం పై నడవాలి. ఇదే పురుషార్థంతో ముందుకు వెళ్తూ ఉండండి. శ్రేష్ఠ జ్ఞాన స్వరూపంగా అయ్యే అనుభవం చెయ్యండి. మహాన్యోగిగా తయారయ్యే గుహ్యతలోకి వెళ్ళండి. ఎంత జ్ఞాన గుహ్యతలోకి వెళ్తారో అంత అమూల్య అనుభవాల రత్నాలను ప్రాప్తి చేసుకుంటారు. ఏకాగ్రబుద్ధి గలవారిగా అవ్వండి. ఏకాగ్రత ఎక్కడ ఉంటే అక్కడ సర్వ ప్రాప్తుల అనుభవం ఉంటుంది. అల్పకాలిక ప్రాప్తుల వెనుక వెళ్ళకండి. అవినాశి ప్రాప్తి చేసుకోండి. వినాశీ విషయాలలో ఆకర్షితులుగా అవ్వకండి. సదా స్వయాన్ని అవినాశి ఖజానాలకు యజమానులుగా భావించి బేహద్లోకి రండి. హద్దులోకి రాకండి. బేహద్ఆనందము మరియు హద్దులోని ఆకర్షణలో ఉండే సంతోషానికి రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. అందువలన తెలివి గలవారిగా అయ్యి తెలివితో పని తీసుకోండి. అంతేకాక వర్తమానాన్ని మరియు భవిష్యత్తును శ్రేష్ఠంగా తయారు చేసుకోండి.
Comments
Post a Comment