05-03-1984 అవ్యక్త మురళి

05-03-1984         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

'' శాంతి శక్తి మహత్వము ''

శాంతి సాగరుడైన తండ్రి శాంతి అవతారమైన తన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఈ రోజు ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ అవసరమైనది శాంతి. మీరు ఆ శాంతి దాతకు పిల్లలు. వినాశీ ధనం ఎంత ఉన్నా కూడా వినాశీ సాధనాల ద్వారా శాంతిని తీసుకోవాలి అనుకుంటే సత్యమైన అవినాశి శాంతి లభించజాలదు. ఈ రోజు ప్రపంచంలో ధనవంతులుగా ఉన్నా, సుఖ సాధనాలు ఉన్నా అవినాశీ సదాకాలపు శాంతికి భికారులుగా ఉన్నారు. శాంతికి భికారిగా ఉన్న ఇటువంటి ఆత్మలకు మీరు మాస్టర్ శాంతి దాతలు. శాంతి భండారము, శాంత స్వరూపముగా ఉన్న ఆత్మలైన మీరు దోసిలి ఇచ్చి శాంతి కొరకు దాహముతో ఉన్న అందరి దాహమును శాంతి కావాలనే కోరికను పూర్తి చేయండి. అశాంతి పిల్లలను చూసి బాప్దాదాకు దయ కలుగుతుంది. ప్రయత్నం చేసి సైన్సు శక్తితో ఎక్కడి నుండి ఎక్కడకు చేరుకుంటున్నారు. ఎలాంటివి-ఎలాంటివి తయారు చేస్తున్నారు! పగలును రాత్రిగా కూడా తయారు చేయగలరు, రాత్రిని పగలుగా కూడా తయారు చేయగలరు. కానీ తమ ఆత్మ స్వధర్మం అయిన శాంతిని మాత్రం ప్రాప్తి చేసుకోలేరు. శాంతి వెనుక ఎంత ఉరుకులు-పరుగులు తీస్తారో అంత అల్పకాలిక శాంతిని పొందిన తర్వాత ఫలితం అశాంతియే లభిస్తుంది. అవినాశి శాంతి సర్వాత్మల ఈశ్వరీయ జన్మ సిద్ధ అధికారము. కానీ జన్మ సిద్ధ అధికారము కొరకు ఎంతో కష్టపడ్తారు. అది సెకండులో ప్రాప్తిస్తుంది(సెకండ్యొక్క ప్రాప్తి) కానీ సెకండులో లభించే ప్రాప్తి వెనుక పూర్తి పరిచయం లేని కారణంగా ఎన్నో దెబ్బలు తింటారు, పిలుస్తారు, అరుస్తారు, వ్యాకులపడ్తారు. ఇలా శాంతి వెనుక భ్రమించే తమ ఆత్మిక రూపం గల సోదరులకు సోదర-సోదర దృష్టిని ఇవ్వండి. ఈ దృష్టితోనే వారి సృష్టి మారిపోతుంది.

మీరందరూ శాంతి అవతార ఆత్మలు, సదా శాంత స్వరూపంలో స్థితులై ఉన్నారు కదా? సదాకాలం కొరకు అశాంతికి వీడ్కోలు ఇచ్చేశారు కదా! అశాంతికి వీడ్కోలు ఉత్సవం జరుపుకున్నారా లేక ఇప్పుడు జరుపుకోవాలా? ఎవరైతే ఇప్పటికీ అశాంతికి వీడ్కోలు ఉత్సవం జరుపుకోలేదో, ఇప్పుడు చేసుకోవాలో ఇక్కడ ఉన్నారా? అందుకు మీ తేదీని నిశ్చితం చెయ్యండి. ఎవరికైతే ఇప్పుడు ఉత్సవం జరపాలో వారు చేతులు ఎత్తండి. స్వప్నంలో కూడా ఎప్పుడూ అశాంతి రాకూడదు. స్వప్నాలు కూడా శాంతిమయంగా అయ్యాయి కదా! తండ్రి శాంతిదాత మీరు శాంతి స్వరూపులు. మీ ధర్మం కూడా శాంతి, కర్మ కూడా శాంతి. కనుక అశాంతి ఎక్కడ నుండి వస్తుంది? మీ అందరి కర్మ ఏమిటి? శాంతి ఇవ్వడము. ఇప్పుడు కూడా మీ అందరి భక్తులు హారతి ఇచ్చేటప్పుడు ఏమంటారు? శాంతిదేవా అని అంటారు. కనుక వారు ఇలా ఎవరికి హారతి ఇస్తారు? శాంతిదేవుని పిల్లలు సదా శాంతి మహాదానీ, వరదానీ ఆత్మలు. విశ్వంలో మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అయ్యి శాంతి కిరణాలను వ్యాపింపజేసేవారిగా ఉన్నారా! తండ్రితో పాటు మేము కూడా జ్ఞాన సూర్యులము అనే నశా ఉంది కదా!

సెకండ్లో స్వధర్మం యొక్క పరిచయాన్ని ఇచ్చి స్వ-స్వరూపంలో స్థితి చేయించగలరు కదా? తమ వృత్తి ద్వారా ఎలాంటి వృత్తి? ఈ ఆత్మకు కూడా అనగా ఈ సోదరునికి కూడా తండ్రి వారసత్వం లభించాలి. ఈ శుభ వృత్తి లేక శుభ భావనతో అనేక ఆత్మలకు అనుభవం చేయించగలరు. ఎందుకు? ఎందుకంటే భావనకు ఫలం తప్పకుండా లభిస్తుంది. మీ అందరికీ శ్రేష్ఠ భావన ఉంది. స్వార్థ రహిత భావన ఉంది. దయా భావన ఉంది. కళ్యాణం భావన ఉంది. ఇలాంటి భావనకు ఫలం లభించకపోవడం అనేది ఉండదు. బీజం శక్తిశాలిగా ఉన్నప్పుడు ఫలం తప్పకుండా లభిస్తుంది. కేవలం ఈ శ్రేష్ఠ భావన అనే బీజానికి సదా స్మృతి యొక్క నీళ్ళు ఇస్తూ ఉంటే సమర్థమైన ఫలం ప్రత్యక్ష ఫల రూపంలో తప్పకుండా ప్రాప్తించవలసే ఉంటుంది. అవుతుందా లేదా అనే ప్రశ్నే లేదు. సదా సమర్థ స్మృతి అనే నీళ్ళు ఉన్నాయి. అనగా సర్వాత్మల పట్ల శుభ భావన ఉంది కనుక విశ్వశాంతి అనే ప్రత్యక్ష ఫలం లభించవలసే ఉంటుంది. సర్వాత్మల జన్మ-జన్మల ఆశ తండ్రితో పాటు పిల్లలందరూ కూడా పూర్తి చేసుకుంటున్నారు మరియు సర్వాత్మలకు కూడా తప్పకుండా అవుతుంది.

ఇప్పుడు అశాంతి ధ్వని నలువైపులా ప్రతిధ్వనిస్తూ ఉంది. తనువు, మనసు, ధనము, జనులు అన్నివైపుల నుండి అశాంతిని అనుభవం చేస్తున్నారు, భయము సర్వ ప్రాప్తి సాధనాలను కూడా శాంతికి బదులుగా అశాంతిని అనుభవం చేయిస్తున్నాయి. ఈ రోజులలో ఆత్మలు ఏదో ఒక భయానికి వశీభూతులుగా ఉన్నారు. తింటున్నారు, నడుస్తున్నారు, సంపాదించుకుంటున్నారు, అల్పకాలిక సంతోషాలు కూడా జరుపుకుంటున్నారు కానీ రేపు ఏమవుతుందో అన్న భయంతో చేస్తున్నారు. కనుక ఎక్కడైతే భయం అనే సింహాససం ఉందో నాయకులు కూడా భయం అనే కుర్చీ పైన కూర్చొని ఉంటే ప్రజలు ఏం చేస్తారు! ఎంత పెద్ద నాయకులుగా ఉంటారో, అంత ఎక్కువ అంగరక్షకులు ఉంటారు. ఎందుకు? భయం ఉంది కదా! కావున భయం అనే సింహాసనం పై అల్పకాలిక సంతోషం ఎలా ఉంటుంది? శాంతి ఉంటుందా లేక అశాంతి ఉంటుందా? బాప్దాదా ఇలాంటి భయంతో కూడిన పిల్లలకు సదాకాలపు సుఖము, శాంతితో కూడిన జీవితాన్ని ఇచ్చేందుకు పిల్లలైన మీ అందరినీ శాంతి అవతార రూపంగా నిమిత్తంగా చేశారు. శాంతి శక్తితో ఖర్చు లేకుండా ఎక్కడ నుండి ఎక్కడ వరకు చేరుకోగలరు? ఈ లోకం నుండి కూడా అతీతంగా వెళ్తారు. తమ మధురమైన ఇంటికి (స్వీట్హోమ్) ఎంత సహజంగా చేరుకుంటారు. కష్టం అనిపిస్తుందా? శాంతి శక్తితో ప్రకృతిజీత్, మాయాజీత్ ఎంత సహజంగా అవుతారు! దేని ద్వారా? ఆత్మిక శక్తి ద్వారా. ఎప్పుడైతే ఆటంబాంబులు మరియు ఆత్మిక శక్తి రెండు శక్తుల కలయిక జరుగుతుందో ఆత్మిక శక్తితో అటామిక్ శక్తి కూడా సతోప్రధాన బుద్ధి ద్వారా సుఖం యొక్క కార్యములో వినియోగించినప్పుడు, రెండు శక్తుల కలయిక ద్వారా శాంతిమయ ప్రపంచము ఈ భూమి పై ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే - శాంతి, సుఖంతో నిండిన స్వర్గ రాజ్యంలో రెండు శక్తులూ ఉంటాయి. కావున సతోప్రధాన బుద్ధి అనగా సదా శ్రేష్ఠంగా సత్య కర్మ చేసే బుద్ధి. సత్యం అనగా అవినాశిగా కూడా ప్రతి కర్మ అవినాశీ ఆత్మ, అవినాశి తండ్రి స్మృతితో అవినాశి ప్రాప్తి ఇచ్చేదిగా ఉంటుంది. అందువలన సత్యమైన కర్మ అని అంటారు. ఈ విధంగా సదాకాలం కొరకు శాంతిని ఇచ్చేవారు శాంతి అవతారాలు. అర్థమయిందా. మంచిది.

సదా సతోపధ్రాన స్థితి ద్వారా సత్య కర్మలు చేసే ఆత్మలకు, సదా తమ శక్తిశాలీ భావన ద్వారా అనేకమంది ఆత్మలకు శాంతి ఫలాన్ని ఇచ్చేవారిగా, సదా మాస్టర్ దాతగా అయ్యి, శాంతి దేవతలుగా అయ్యి శాంతి కిరణాలను విశ్వంలో వ్యాపింపజేసేవారికి ఇలాంటి విశేష కార్యంలో తండిక్రి సహయోగిగా ఉన్న ఆత్మలకు బాప్దాదా పియ్ర స్మృతులు మరియు నమస్తే.

లండన్ నోబెల్ విజేత వైజ్ఞానికుడు జోసెఫ్సన్ బాప్దాదాతో కలుస్తున్నారు :-

శాంతి శక్తి యొక్క అనుభూతిని కూడా అనుభవం చేస్తున్నారా? ఎందుకంటే శాంతి శక్తి మొత్తం విశ్వాన్ని శాంతిమయంగా చేస్తుంది. మీరు కూడా శాంతిప్రియ ఆత్మలే కదా! శాంతి శక్తి ద్వారా సైలెన్స్ క్తిని కూడా యథార్ధ రూపంతో కార్యంలో వినియోగించినట్లయితే విశ్వకళ్యాణం చేసేందుకు నిమిత్తంగా అవ్వగలరు. సైన్సు శక్తి కూడా అవసరమే కాని సతోప్రధాన బుద్ధిగా అయితేనే ఆ శక్తిని యథార్ధ రూపంలో ప్రయోగించగలరు. ఈ రోజు యథార్థ పద్ధతితో ఈ శక్తిని కార్యంలో ఎలా వినియోగించాలి అనే జ్ఞానం లోపించింది. ఇదే సైన్సు. ఈ జ్ఞానం ఆధారంతో క్రొత్త సృష్టి స్థాపనకు నిమిత్తంగా అవుతుంది కానీ ఈ రోజు ఆ జ్ఞానం లేని కారణంగా వినాశనం వైపు ముందుకు వెళ్తూ ఉంది. కావున ఇప్పుడు ఈ సైన్సు శక్తిని సైలెన్స్ క్తి యొక్క ఆధారంతో చాలా మంచిగా కార్యంలో వినియోగించేందుకు నిమిత్తంగా అవ్వండి. దీనిలో నోబెల్ హుమతి తీసుకుంటారు కదా! ఎందుకంటే ఇప్పుడు ఈ కార్యమే అవసరంగా ఉంది. ఎప్పుడు ఏ కార్యం అవసరం ఉందో దానిలో నిమిత్తంగా అయ్యేవారిని అందరూ శ్రేష్ట ఆత్మ అనే దృష్టితో చూస్తారు. కనుక ఏమి చెయ్యాలో అర్థమయ్యిందా! ఇప్పుడు సైన్స్ రియు సైలెన్స్ కి ఎలాంటి సంబంధం ఉందో, రెండిటి సంబంధంతో ఎంత సఫలత లభిస్తుందో అని రీసెర్చి చెయ్యండి. రీసెర్చి చెయ్యాలి అనే అభిరుచి ఉంది కదా! ఇప్పుడిది చెయ్యాలి. ఇంత పెద్ద కార్యము చెయ్యాలి. ఇలాంటి ప్రపంచాన్ని తయారు చేస్తారు కదా! మంచిది.

యు. కె. గ్రూపుతో :- అల్లారు ముద్దు పిల్లలు ఎప్పుడూ తండ్రితో కలిసే ఉన్నారు. సదా తండ్రి తోడుగా ఉన్నారనే అనుభవం సదా ఉంటుంది కదా? ఒకవేళ తండ్రి తోడు నుండి కొంచెం దూరం అయినా మాయ నేత్రాలు చాలా చురుకుగా ఉంటాయి, అది చూసేస్తుంది. తండ్రి తోడు నుండి కొంచెం దూరం అయినా మిమ్ములను తనవారిగా చేసుకుంటుంది. అందువలన ఎప్పుడూ దూరం అవ్వకండి. సదా తోడుగా ఉండండి. స్వయం బాప్దాదాయే సదా తోడుగా ఉండే ఆఫర్ఇస్తూ ఉంటే తోడు తీసుకోవాలి కదా! ఆ తండ్రియే వచ్చి నా తోడుగా ఉండండి అని చెప్పే భాగ్యము మొత్తం కల్పంలో ఇలాంటి తోడు ఎప్పుడూ లభించదు. ఇలాంటి భాగ్యము సత్యయుగంలో కూడా ఉండదు. సత్యయుగంలో కూడా ఆత్మల సాంగత్యంలోనే ఉంటారు. మొత్తం కల్పంలో తండ్రి తోడు ఎంత సమయం లభిస్తుంది? చాలా తక్కువ సమయమే కదా! కనుక కొంచెం సమయంలో ఇంత గొప్ప భాగ్యం లభిస్తూ ఉంటే సదా ఉండాలి కదా! బాప్దాదా సదా పరిపక్వ స్థితిలో ఉండే పిల్లలను చూస్తున్నారు. ఎంతలో ప్రియాతి ప్రియమైన పిల్లలు బాప్దాదా ముందున్నారు. ఒక్కొక్క పుత్రుడు చాలా లవలీగా ఉన్నారు. బాప్దాదా ఎంతో ప్రేమతో ఎక్కడెక్కడి నుండో అందరినీ ఎన్నుకొని ఒకచోట పోగు చేశారు. ఇలా ఎన్నుకోబడిన పిల్లలు సదా పక్కాగా(పరిపక్వంగా) ఉంటారు. కచ్ఛాగా(పరిపక్వం కాకుండా) ఉండేందుకు వీలు లేదు.

పర్సనల్  మహావాక్యాలు :-

విశేష పాత్రధారులు అనగా ప్రతి అడుగు, ప్రతి సెకండ్ సదా అలర్ట్ (చురుకు) గా ఉండేవారు. సోమరులుగా, నిర్లక్ష్యంగా ఉండరు. సదా స్వయాన్ని నడుస్తూ-తిరుగుతూ, తింటూ-తాగుతూ అనంతమైన విశ్వ నాటక రంగ స్టేజి పై విశేష పాత్రధారీ ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? విశేష పాత్రధారులుగా ఉన్నవారికి సదా ప్రతి సమయం తమ కర్మ అనగా పాత్ర పై అటెన్షన్(గమనము) ఉంటుంది. ఎందుకంటే మొత్తం డ్రామా అంతా హీరో పాత్రధారి పై ఆధారపడి ఉంటుంది. కనుక మొత్తం డ్రామాకు ఆధారం మీరే కదా! విశేష ఆత్మలకు లేక విశేష పాత్రధారులకు సదా అంత అటెన్షన్ఉందా? విశేష పాత్రధారులు ఎప్పుడు కూడా సోమరులుగా ఉండరు. అలర్ట్(చురుకు) గా ఉంటారు. సోమరితనం ఎప్పుడూ రావడం లేదు కదా? చేస్తూనే ఉన్నాము, ఎలాగైనా చేరుకుంటాము,........ అని ఆలోచించడం లేదు కదా? చేస్తున్నారు కానీ ఏ వేగంతో చేస్తున్నారు? నడుస్తున్నారు కానీ ఏ వేగంతో నడుస్తున్నారు? వేగంలో అయితే అంతరం ఉంటుంది కదా! కాలినడకన నడిచేవారు ఎక్కడ, విమానంలో పయనించేవారు ఎక్కడ! కాలినడకన నడిచేవారినీ, విమానంలో వెళ్ళేవారిని కూడా నడుస్తున్నారనే అంటాము కానీ ఎంత వ్యత్యాసముంది! కేవలం నడుస్తున్నారు, బ్రహ్మకుమారులుగా అయ్యారు అనగా నడుస్తున్నారు కానీ ఏ వేగంతో? తీవ్రవేగం ఉన్నవారే సమయానికి గమ్యానికి చేరుకుంటారు లేకుంటే వెనుకనే ఉండిపోతారు. ఇక్కడ కూడా ప్రాప్తి అయితే ఉంటుంది కానీ సూర్యవంశీయుల ప్రాప్తి ఉంటుందా లేక చంద్రవంశీయుల ప్రాప్తి ఉంటుందా? తేడా అయితే ఉంటుంది కదా! కనుక సూర్యవంశంలోకి వచ్చేందుకు ప్రతి సంకల్పం, ప్రతి మాటలో సాధారణత్వం సమాప్తమవ్వాలి. ఎవరైనా హీరో పాత్రధారి సాధారణ పాత్ర చేసినట్లయితే అందరూ వారిని చూచి నవ్వుతారు కదా! కనుక నేను విశేష పాత్రధారిని అందువలన ప్రతి కర్మ విశేషంగా, ప్రతి అడుగు విశేషంగా, ప్రతి సెకండ్, ప్రతి సమయం, ప్రతి సంకల్పం శ్రేష్ఠంగా ఉండాలి అని సదా స్మృతిలో ఉండాలి. ఈ 5 నిమిషాలు సాధారణంగా గడిచాయి అని కాదు, 5 నిమిషాలు 5 నిమిషాలు కాదు. సంగమ యుగములోని 5 నిమిషాలు చాలా మహత్వపూర్ణమైనవి. 5 నిమిషాలు 5 సంవత్సరాల కంటే ఎక్కువే. అందువలన అంత అటెన్షన్ఉండాలి. వీరినే తీవ్ర పురుషార్థులని అంటారు. తీవ్ర పురుషార్థుల స్లోగన్ఏది? ఇప్పుడు లేకపోతే ఎప్పుడూ లేదు. ఇది సదా జ్ఞాపకం ఉంటుందా? ఎందుకంటే సదాకాలపు రాజ్యభాగ్యం ప్రాప్తించుకోవాలి అనుకుంటే అటెన్షన్ కూడా సదా ఉండాలి. ఇప్పుడు కొంచెం సమయం సదాకాలపు అటెన్షన్ చాలాకాలపు సదా ప్రాప్తి చేయించేది. కావున ప్రతి సమయం నడుస్తూ, నడుస్తూ ఎప్పుడైనా సాధారణతలోకి రావడం లేదు కదా అని గుర్తుండాలి, చెకింగ్ కూడా ఉండాలి. ఎలాగైతే తండ్రిని పరమాత్మ అని అంటారు, ఉన్నతంగా ఉన్నారు కదా! తండ్రి ఎలాగో పిల్లలు కూడా ప్రతి విషయంలో ఉన్నతంగా లేక శ్రేష్ఠంగా ఉండాలి.


కనుక ఇప్పుడు స్వంత పురుషార్థం కూడా తీవ్రంగా ఉండాలి అంతేకాక సేవలో కూడా తక్కువ సమయము తక్కువ శ్రమ కలగాలి కాని సఫలత ఎక్కువ ఉండాలి. ఒక్కరు అనేకమంది చేసేంత పని చేయ్యాలి. ఇలాంటి ప్లాను తయారు చెయ్యండి. పంజాబ్ చాలా పాతది. సేవ ఆది నుండి ఉన్నట్లయితే ఆది స్థానం వారు ఎవరో ఒక ఆదిరత్నాన్ని బయటకు తీయండి. పంజాబ్ వారిని సింహం అని అంటారు కదా! కనుక సింహ గర్జన చేస్తుంది. గర్జన అంటే చాలా పెద్ద శబ్ధము. ఇప్పుడు ఏమి చేస్తారో, ఎవరు చేస్తారో చూస్తాను.

Comments