02-04-1984 అవ్యక్త మురళి

02-04-1984         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బిందువు మహత్వము

భాగ్యవిధాత అయిన బాబా ఈరోజు భాగ్యవంతులైన పిల్లలందరితో కలిసేందుకు వచ్చారు. భాగ్యవిధాత అయిన బాబా పిల్లలందరికీ భాగ్యమును తయారుచేసుకునేందుకు అతి సహజ విధిని తెలుపుతున్నారు-కేవలము బిందువు లెక్కను తెలుసుకోండి. బిందువు లెక్కఅన్నింటికన్నా సహజము. బిందు మహత్వమును తెలుసుకుంటే మహానులుగా అయిపోతారు. అన్నింటికంటే సహజము మరియు మహత్వపూర్ణమయిన బిందువు లెక్కను అందరూ మంచిగా తెలుసుకున్నారు కదా! బిందువు అని అనటము మరియు బిందువుగా అవ్వటము. బిందువుగా అయ్యి బిందువైన బాబాను గుర్తు చెయ్యాలి. బిందువుగా ఉండేవారు మరియు ఇప్పుడు బిందు స్థితిలో స్థితులై బిందువయిన బాబా సమానంగా అయ్యి మిలనము జరుపుకోవాలి. దీనిని మిలనము జరుపుకునే యుగము, ఎగిరే కళ యుగము అని అంటారు. బ్రాహ్మణ జీవితము ఉన్నదే మిలనము చేసుకునేందుకు మరియు జరుపుకునేందుకు. ఈ విధిద్వారా సదా కర్మ చేస్తూనే కర్మబంధనమునుండి ముక్తులై కర్మాతీత స్థితిని అనుభవము చేస్తారు. కర్మ బంధనములోకి రారు కానీ సదా బాబాయొక్క సర్వ సంబంధాలలో ఉంారు. చేయించే బాబా నిమిత్తముగా చేసి చేయిస్తున్నారు. కనుక స్వయం సాక్షీలుగా అయ్యారు, కనుక ఈ సంబంధపు స్మృతి బంధనముక్తులుగా తయారుచేస్తుంది. ఎక్కడైతే సంబంధముతో చేస్తారో అక్కడ బంధనము ఉండదు. నేను చేసాను, అని అలోచించినట్లయితే సంబంధమును మర్చిపోవటము మరియు బంధనము తయారవ్వటము అవుతుంది. సంగమయుగము బంధనముక్తము, సర్వ సంబంధ యుక్తము, జీవనముక్త స్థితిని అనుభవము చేసే యుగము. కనుక సంబంధములో ఉంటామా లేక బంధనములోకి వస్తామా అన్నది చెక్ చేసుకోండి. సంబంధములో స్నేహం కారణంగా ప్రాప్తి ఉంటుంది, బంధనములో పెనుగులాట, టెన్షన్ కారణంగా దుఃఖము మరియు అశాంతుల అలజడి ఉంటుంది కనుక ఎప్పుడైతే బాబా బిందువుయొక్క సహజ లెక్కను నేర్పించారో అప్పుడిక దేహ బంధనముకూడా సమాప్తమైపోయింది. దేహము మీది కాదు, బాబాకు ఇచ్చేసారు కనుక బాబాదైపోయింది. ఇప్పుడు మీ అసలైన బంధనము, నా శరీరము లేక నా దేహము - అన్న ఈ బంధనము సమాప్తమైపోయింది. నా దేహము అని అంటారా, మీకు అధికారము ఉందా? ఇచ్చేసిన వస్తువుపై మీకు ఎక్కడ అధికారముంటుంది? ఇచ్చేసారా లేక మీ దగ్గరే ఉంచుకున్నారా? చెప్పటమైతే మీది అని, కానీ అనుకోవటము నాది అని, ఇలాగైతే కాదు కదా!

నీది అని ఎప్పుడైతే అంటారో అప్పుడిక నాది అన్న బంధనము సమాప్తమైపోయింది. ఈ హద్దు మేరా(నాది) అన్నది మోహపు దారము. దారము అనండి, సంకెళ్ళు అనండి, తాడు అనండి, ఇది బంధనములో బంధిస్తుంది. అన్నీ మీవే, అన్న ఈ సంబంధము ఎప్పుడైతే జోడించేసారో అప్పుడిక బంధనము సమాప్తమై సంబంధము తయారవుతుంది. ఎటువంటి బంధనమైనా, అది దేహమునకు చెందినదైనా, స్వభావమునకు చెందినదైనా, మనసుకు లోబడిపోవటమైనా.... బాబాతో సర్వ సంబంధాలలో, సదా సంబంధములో లోటు ఉన్నట్లుగా ఈ బంధనము నిరూపిస్తుంది. చాలామంది పిల్లలు సదా మరియు సర్వ సంబంధాల బంధనమునుండి ముక్తులై ఉంటారు, మరికొందరు పిల్లలు సమయానుసారంగా మతలబుతో సంబంధమును జోడిస్తారు, కనుక బ్రాహ్మణ జీవితపు అలౌకిక ఆత్మిక మజాను పొందటమునుండి వంచితులుగా మిగిలిపోతారు. స్వయానికి స్వయముతోగానీ లేక ఇతరులనుండి గానీ సంతుష్టతకు చెందిన ఆశీర్వాదాలను తీసుకోలేరు. బ్రాహ్మణ జీవితము శ్రేష్ఠ సంబంధాల జీవితము, ఉన్నదే బాబా మరియు సర్వ బ్రాహ్మణ పరివారమునుండి ఆశీర్వాదములను తీసుకునే జీవితము. ఆశీర్వాదము అనగా శుభ భావనలు, శుభ కామనలు. బ్రాహ్మణులైన మీ ఈ జన్మయే బాప్దాదాల ఆశీర్వాదము అనండి, వరదానము అనండి, ఈ ఆధారముతోనే ఉంది. మీరు భాగ్యవంతులైన శ్రేష్ఠమైన విశేష ఆత్మలు అని బాబా అంారు, ఈ స్మృతిరూపీ ఆశీర్వాదము లేక వరదానముద్వారా శుభ భావన, శుభ కామనలతో బ్రాహ్మణులైన మీ నూతన జీవితము, నూతన జన్మ లభించింది. సదా ఆశీర్వాదాలను తీసుకుంటూ ఉండాలి. ఇదే సంగమయుగపు విశేషత. కానీ వీటన్నింకీ ఆధారము సర్వ శ్రేష్ఠ సంబంధము. సంబంధము నాది-నాది అన్న సంకెళ్ళను, బంధనమును క్షణములో సమాప్తము చేసేస్తుంది. మరియు సంబంధమునకు కల మొదటి స్వరూపము, అదికూడా సహజ విషయము - బాబాకూడా బిందువు, నేను కూడా బిందువును మరియు సర్మాత్మలు కూడా బిందువే. కనుక బిందువు లెక్కనే ఉంది కదా! ఈ బిందువులో జ్ఞాన సింధువు(సముద్రము) ఇమిడి ఉంది. ప్రపంచము లెక్కలో కూడా బిందువు 10ని 100గా చేస్తుంది 100ను1000గా చేస్తుంది. బిందువును పెట్టుకుంటూ పోండి మరియు సంఖ్యను పెంచుకుంటూపోండి. మరి మహత్వము దేనికి ఉంది. బిందువుకే కదా! ఇలా బ్రాహ్మణ జీవితములో సర్వ ప్రాప్తులకు ఆధారము బిందువు.

చదువు రానివారు కూడా బిందువును సహజంగా అర్థం చేసుకోగలరు కదా! ఎవరు ఎంత బిజీగా ఉన్నా, అనారోగ్యముతో ఉన్నా, బుద్ధి బలహీనంగా ఉన్నాగానీ బిందువు లెక్కను అందరూ తెలుసుకోగలరు. మాతలుకూడా లెక్కపెట్టడంలో తెలివైనవారుగా ఉంటారు కదా! కనుక బిందువు లెక్క ఎల్పప్పుడు గుర్తుండాలి. అచ్ఛా!

అన్ని స్థానాలనుండి వచ్చి మీ స్వీట్ హోమ్ కు చేరుకున్నారు. బాప్దాదాకూడా పిల్లలందరికీ తమ భాగ్యమును తయారుచేసుకున్నందుకు అభినందలను ఇస్తారు. మీ ఇంటికి వచ్చారు. ఇదే మీ ఇల్లు, దాత ఇల్లు. మీ ఇల్లు. ఆత్మ మరియు శరీరమునకు విశ్రాంతిని ఇచ్చే ఇల్లు. విశ్రాంతి లభిస్తోంది కదా! డబల్ ప్రాప్తి. ఆరామ్(విశ్రాంతి)కూడా లభిస్తుంది, రామ్ కూడా  లభిస్తారు. కనుక డబల్ ప్రాప్తి కలిగింది కదా! బాబా ఇంటికి పిల్లలే అలంకారాలు. ఇంికి అలంకారాలైన పిల్లలను బాప్దాదా చూస్తున్నారు. అచ్ఛా!

సదా సర్వ సంబంధాల ద్వారా బంధనముక్తులు, కర్మాతీత స్థితిని అనుభవమును చేసేవారు, సదా బిందు మహత్వమును తెలుసుకుని మహానులుగా అయ్యేవారు, సదా సర్వ ఆత్మలద్వారా సంతుష్టతకు చెందిన శుభ భావనలు, శుభ కామనలనే ఆశీర్వాదాలను తీసుకునేవారు, అందరికీ ఇటువంటి ఆశీర్వాదాలను ఇచ్చేవారు, సదా స్వయమును సాక్షిలుగా భావించి నిమిత్త భావముతో కర్మ చేసేవారు అయిన అటువంటి సదా అలౌకిక ఆత్మిక ఆనందములను జరుపుకునేవారు, సదా సంతోషపు జీవితములో ఉండేవారు, భారమును సమాప్తము చేసేవారు అయిన అటువంటి సదా భాగ్యవంత ఆత్మలకు భాగ్య విధాత బాబా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీలతో - సమయము తీవ్రగతితో వెళ్తూ ఉంది. సమయము ఏవిధంగా తీవ్రగతితో పోతూ ఉందో అలా బ్రాహ్మణులందరూ తీవ్రగతితో ఎగురుతారు. అంత తేలికగా డబల్ లైట్ గా అయ్యారా? ఇప్పుడు విశేషంగా ఎగిరించే సేవ ఉంది. అలా ఎగిరింపచేస్తున్నారా? ఏ విధితో అందరినీ ఎగిరింపచెయ్యాలి? క్లాస్ వింటూ-వింటూ క్లాస్ ను చేయించేవారుగా అయ్యారు. మీరు ఏ విషయము మొదలుపెట్టినా దానికి ముందే ఆ విషయమునకు చెందిన పాయింట్స్ అందరి వద్ద ఉంటాయి. మరి ఏవిధితో ఎగిరింపచెయ్యాలి అన్న దీని ప్లాన్ ను తయారుచేసారా? తేలికగా అయ్యేందుకు ఇప్పుడు విధి కావాలి. ఈ భారమే కిందకి పైకి తీసుకువస్తుంది. కొందరికి కొన్నింటి  గురించి భారమైతే మరికొందరికి మరికొన్నింటి గురించి భారము. స్వ సంస్కారాలకు చెందిన భారమైనా, సంఘఠనకు చెందిన భారమైనా... భారము ఎగరనివ్వదు. ఇప్పుడు ఎవరైనా ఎగిరినాగానీ అది ఇతరుల జోరుతో జరుగుతుంది. ఆటబొమ్మ ఉంది, దానిని ఎగిరింపచేస్తారు, తరువాత ఏమౌతుంది? ఎగిరి మరలా కిందకు వచ్చేస్తుంది. తప్పకుండా ఎగురుతుంది కానీ సదా ఎగరదు. ఇప్పుడు ఎప్పుడైతే సర్వ బ్రాహ్మణ ఆత్మలు ఎగురుతారో అప్పుడు ఇతర ఆత్మలను ఎగరింపచేసి బాబా సమీపమునకు చేర్చగలరు. ఇప్పుడైతే ఎగరింపచెయ్యటము తప్ప, ఎగరటము తప్ప మరే ఇతర విధి లేదు. ఎగిరే గతియే విధి. కార్యము ఎంత ఉంది మరియు సమయము ఎంత ఉంది?

ఇప్పుడు తక్కువలో తక్కువ 9 లక్షలమంది బ్రాహ్మణులైతే మొదట కావాలి. సంఖ్య అయితే ఎక్కువగా ఉంటుంది కానీ మొత్తము విశ్వముపై రాజ్యము చెయ్యాలంటే తక్కువలో తక్కువ 9 లక్షలమందైతే ఉండాలి. సమయ ప్రమాణంగా శ్రేష్ఠ విధి కావాలి. ఎగిరింప చేసే విధియే శ్రేష్ఠ విధి. దానికి ప్లాన్ తయారుచెయ్యండి. చిన్న-చిన్న సంఘఠనలను తయారుచెయ్యండి. అవ్యక్త పాత్రకూడా ఎన్ని సంవత్సరాలు కొనసాగింది! సాకార పాలన, అవ్యక్త పాలనలో ఎంత సమయము గడిచిపోయింది! ఇప్పుడు ఏదైనా నవీనతను చెయ్యాలి కదా! ప్లాన్ తయారుచెయ్యండి. ఎగరటము మరియు కిందకు రావటము అనే చక్రము తిరగటము ఇప్పుడు పూర్తయిపోయింది. కనుక 84లో ఎప్పుడైతే ఈ చక్రము పూర్తవుతుందో అప్పుడు స్వదర్శన చక్రము దూరమునుండే ఆత్మలను సమీపంగా తీసుకువస్తుంది. స్మృతిచిహ్నములో ఏం చూపిస్తారు? ఒక్క చోట కూర్చునే చక్రమును పంపారు మరియు ఆ స్వదర్శన చక్రము స్వయమే ఆత్మలను సమీపంగా తీసుకువచ్చింది. స్వయము వెళ్ళరు, చక్రమును పంపిస్తారు. కనుక మొదట ఈ చక్రము పూర్తవ్వాలి, అప్పుడే స్వదర్శన చక్రము తిరగాలి. మరి ఇప్పుడు 84లో ఈ విధిని ఆచరించండి, అప్పుడు అన్ని హద్దు చక్రాలు సమాప్తమైపోవాలి. ఇలానే ఆలోచించారు కదా! అచ్ఛా!

టీచర్స్ తో - టీచర్లు ఉన్నదే ఎగిరే కళ కలవారుగా! నిమిత్తంగా అవ్వటము - ఇదే ఎగిరే కళకు సాధనము. కనుక నిమిత్తంగా అయ్యారు అంటే డ్రామా అనుసారంగా ఎగిరే కళకు సాధనము లభించినట్లు. ఈ విధిద్వారా సదా సిద్ధిని పొందే శ్రేష్ఠ ఆత్మలు, నిమిత్తులుగా అవ్వటమే లిఫ్ట్. మరి లిఫ్ట్ ద్వారా సెకండ్లో చేరుకునే ఎగిరే కళ వారుగా అయ్యారు. ఎక్కే కళ కలవారు కారు, చలించేవారు కారు, కానీ చలింపచెయ్యటమునుండి రక్షించేవారు. నిప్పు వేడిలోకి వచ్చేవారు కారు కానీ మంటను ఆపేవారు. కనుక నిమిత్తము అన్న విధిద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకోండి. టీచర్స్ అర్థమే నిమిత్త భావము. ఈ నిమిత్త భావమే సర్వ ఫల ప్రాప్తిని స్వతహాగనే చేయిస్తుంది. అచ్ఛా!

అవ్యక్త మహావాక్యాలు - కర్మబంధన ముక్త కర్మాతీతులుగా, విదేహీలుగా అవ్వండి.

విదేహీ స్థితిని లేక కర్మాతీత స్థితిని అనుభవము చేసుకునేందుకు హద్దులోని నాది-నాది అన్న దేహ అభిమానమునుండి ముక్తులుగా అవ్వండి. లౌకికము మరియు అలౌకికము, కర్మ మరియు సంబంధము, రెండింటిలో స్వార్థ భావమునుండి ముక్తులుగా అవ్వండి. వెనుకటి జన్మల కర్మల లెక్కాచారాలు మరియు వర్తమాన పురుషార్థములోని బలహీనతల కారణంగా ఏదో ఒక వ్యర్థ స్వభావ-సంస్కారాలకు వశమైపోవటమునుండి ముక్తులుగా అవ్వండి. ఒకవేళ ఏదైనా సేవగానీ, సంఘఠనగానీ, ప్రకృతియొక్క పరిస్థితులుగానీ స్వస్థితిని లేక శ్రేష్ఠ స్థితిని పైకి కిందకి చేసినట్లయితే అదికూడా బంధనముక్త స్థితి కాదు, ఈ బంధనమునుండి కూడా ముక్తులుగా అవ్వండి. పాత ప్రపంచములో, పాత అంతిమ శరీరములోని ఏదైనా వ్యాధి మీ శ్రేష్ఠ స్థితిని అలజడిలోకి తీసుకురాకూడదు - దీనినుండి కూడా ముక్తులుగా అవ్వండి, వ్యాధి రావటము అన్నది విధి కానీ స్థితి కదలటము - బంధనయుక్తమునకు(బంధనలో ఉన్నట్లు) గుర్తు. స్వచింతన, జ్ఞాన చింతన, శుభ చింతకులుగా అయ్యే చింతన మారిపోయి శరీర వ్యాధిని గురించిన చింతన నడవటము - దీనినుండి ముక్తులుగా అవ్వండి. దీనినే కర్మాతీత స్థితి అని అంటారు.

కర్మయోగిగా అయ్యి కర్మ బంధననుండి సదా అతీతులు మరియు సదా బాబాకు ప్రియమైనవారిగా అవ్వండి. ఇదే కర్మాతీత విదేహీ స్థితి. కర్మనుండి అతీతులుగా అయిపోవటము - కర్మాతీతమునకు అర్థము ఇది కాదు, కర్మనుండి దూరమవ్వకూడదు, కర్మ బంధనములో ఇరుక్కోవటము నుండి అతీతులుగా అవ్వండి. ఎంత పెద్ద కార్యమైనా గానీ ఎలా అనిపించాలంటే పని చెయ్యటం లేదు కానీ ఆడుకుంటున్నాము అని అనిపించాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినాగానీ, ఏ ఆత్మ అయినా గానీ లెక్కాచారాన్ని సమాప్తము చేసేవారు ఎదిరించనికి వచ్చినాగానీ. శరీరానికి చెందిన కర్మభోగము ఎదిరించేందుకు వస్తున్నాగానీ హద్దు కామనలనుండి ముక్తులుగా ఉండటమే విదేహీ స్థితి. ఎప్పటివరకైతే ఈ దేహము ఉంటుందో, కర్మేంద్రియాలతోపాటు ఈ కర్మక్షేత్రములో పాత్రను పోషిస్తారో, అప్పటివరకు కర్మ లేకుండా ఒక్క సెకండ్ కూడా ఉండలేరు, కనుక కర్మ చేస్తూ కర్మ బంధనమునుండి దూరంగా ఉండటము - ఇదే కర్మాతీత, విదేహీ స్థితి. కనుక కర్మేంద్రియాలద్వారా కర్మ సంబంధములోకి రావాలి, కర్మ బంధనములో బంధింపబడకూడదు. కర్మయొక్క వినాశీ ఫలమును పొందాలన్న కోరికకు వశీభూతులవ్వకూడదు. కర్మాతీతులు అనగా కర్మకు వశమయ్యేవారు కారు కానీ యజమానిగా అయ్యి, అథారిటీలుగా అయ్యి కర్మేంద్రియాల సంబంధములోకి వచ్చి, వినాశీ కోరికలనుండి దూరమై కర్మేంద్రియాలద్వారా కర్మ చేయించాలి. యజమాని అయిన ఆత్మను కర్మ తన అధీనములోకి తీసుకోకూడదు కానీ అధికారిగా అయ్యి కర్మ చేయిస్తూ ఉండాలి. చేయించేవారుగా అయ్యి కర్మ చేయించటము - కర్మ సంబంధములోకి రావటము అని దీనినే అంటారు. కర్మాతీత ఆత్మ సంబంధములోకి వస్తుంది, బంధనములోకి కాదు.

కర్మాతీతము అనగా దేహము, దేహ సంబంధాలు, పదార్ధాలు, లౌకికముగానీ లేక ఆలౌకికముగానీ రెండు సంబంధాలనుండి, బంధనమునుండి అతీతముగా ఉండటము. సంబంధము అని  అన్నా - దేహ సంబంధము, దేహ సంబంధీకులతో సంబంధము ఇలా, కానీ దేహములో సంబంధములో ఒకవేళ అధీనత ఉన్నట్లయితే సంబంధముకూడా బంధనమైపోతుంది. కర్మాతీత స్థితిలో కర్మసంబంధము మరియు కర్మ బంధనల రహస్యమును తెలుసుకున్న కారణంగా ఎల్లప్పుడు ప్రతి విషయంలో సంతోషంగా ఉంటారు. ఎప్పుడూ దుఃఖపడరు. వారు తమ వెనుకటి కర్మల లెక్కాచార బంధనమునుండి కూడా ముక్తులుగా ఉంటారు. మునుపటి కర్మల లెక్కాచార ఫలస్వరూపంగా తనువుకు ఏదైనా రోగము వచ్చినాగానీ, మనసు సంస్కారము ఇతర ఆత్మల సంస్కారాలతో ఘర్షణ పడుతున్నాగానీ కర్మాతీతులు కర్మభోగమునకు వశము కాకుండా యజమానులుగా అయ్యి సమాప్తము చేయించుకుంటారు. కర్మయోగిగా అయ్యి కర్మభోగమును సమాప్తము చేసుకోవటము - ఇదే కర్మాతీతంగా అయ్యేందుకు లక్షణము. యోగముద్వారా కర్మభోగమును నవ్వుతూ, శూలమునుండి ముల్లులా చేసి భస్మము చేసుకోవాలి అనగా కర్మభోగమును సమాప్తము చేసుకోవాలి. కర్మయోగ స్థితిద్వారా కర్మభోగమును పరివర్తన చెయ్యటము - ఇదే కర్మాతీత స్థితి. వ్యర్థ సంకల్పములుకూడా కర్మబంధనయొక్క సూక్ష్మమైన త్రాళ్ళు. కర్మాతీత ఆత్మ చెడులోకూడా మంచిని అనుభవము చేస్తుంది. ఏది జరుగుతుందో అది మంచిది, నేను కూడా మంచే, బాబా కూడా మంచే, డ్రామా కూడా మంచిదే అని వారు అంటారు. ఈ సంకల్పము బంధనమును తెంచేసేందుకు కత్తెరలా పనిచేస్తుంది. బంధనముక్త్  అయిపోయినట్లయితే కర్మాతీతులుగా అయిపోతారు.


విదేహీ స్థితిని అనుభవము చేసేందుకు ఇచ్చా మాత్రం అవిద్యులుగా అవ్వండి. హద్దు కోరికలనుండి ముక్తమైన ఇటువంటి ఆత్మ సర్వుల కోరికలను పూర్తి చేసే బాబా సమానమైన 'కామధేనువు'గా అవుతారు. బాబాయొక్క సర్వ భండారాలు, సర్వ ఖజానాలు ఏవిధంగా ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయో, అప్రాప్తి అన్న పేరు, గుర్తులుకూడా ఉండవో అలా బాబా సమానంగా సదా మరియు సర్వ ఖజానాలతో నిండుగా అవ్వండి. సృష్టిచక్రములో పాత్రను అభినయిస్తూ అనేక దుఃఖ చక్రాలనుండి ముక్తులుగా ఉండటము - ఇదే జీవనముక్త స్థితి. ఇటువంటి స్థితిని అనుభవము చేసేందుకు అధికారులుగా అయ్యి, యజమానిగా అయ్యి సర్వ కర్మేంద్రియాలద్వారా కర్మ చేయించేవారుగా అవ్వండి. కర్మలోకి రండి, మరల కర్మ పూర్తవ్వటంతోనే అతీతులుగా అయిపోండి - ఇదే విదేహీ స్థితియొక్క అభ్యాసము.

Comments