01-03-1984 అవ్యక్త మురళి

01-03-1984         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

''ఒకటికి లెక్క''

ఈ రోజు బాప్దాదా సర్వ సహజయోగి, సదా సహయోగి పిల్లలను చూసి హర్షితమవుతున్నారు. అన్ని వైపుల నుండి విచ్చేసిన తండ్రికి చెందిన పిల్లలు ఒకే బలం - ఒకే విశ్వాసంతో, ఒకే మతం పై, ఏకరసంగా, ఒక్కరి గుణాలనే గానం చేసేవారిగా, ఒక్కరితోనే సర్వ సంబంధాలను నిభాయించేవారిగా, ఒక్కరితోనే సదా ఉండేవారిగా, ఒకే ప్రభు పరివారానికి చెందిన ఒకే లక్ష్యము, ఒకే లక్షణాలు, అందరినీ ఒకే శుభప్రదమైన శ్రేష్ఠ భావనతో చూసేవారు, అందరినీ ఒకే శ్రేష్ఠమైన శుభ కామనతో సదా ఉన్నతంగా ఎగిరింపజేసేవారు, ఒకే ప్రపంచము, ఒకే ప్రపంచంలో సర్వ ప్రాప్తుల అనుభవం చేసేవారు, కనులు తెరుస్తూనే కనుల ముందు ఒకే బాబాను చూచేవారుగా ఉన్నారు. ప్రతి కార్యము చేస్తూ ఒకే సహచరుడైన బాబా తోడును ఉంచుకొని పూర్తి రోజును గడిపేస్తారు. కర్మయోగం లేక సేవా కార్యమును సమాప్తం చేసి, ఒక్కరి ప్రేమలో లీనమైపోతారు, ఒక్కరి జతలోనే లవలీనమైపోతారు, అనగా ఒక్కరి స్నేహ రూపీ ఒడిలో ఇమిడిపోతారు. రాత్రింబవళ్లు ఒక్కరితోనే దినచర్యను గడుపుతారు. సేవా సంబంధంలోకి వస్తారు, పరివార సంబంధంలోకి వస్తారు, అయినా అనేమందిలో ఒక్కరినే చూస్తారు. ఒకే తండ్రి పరివారము, ఒక్క తండ్రియే సేవ పట్ల నిమిత్తంగా చేశారు. ఇదే విధితో అనేమందితో సంబంధ-సంపర్కంలోకి వస్తారు. అనేమందిలో కూడా ఒక్కరినే చూస్తారు. బ్రాహ్మణ జీవితంలో, హీరో పాత్రధారిగా అయ్యే జీవితంలో, పాస్ విత్ హానర్ గా అయ్యే జీవితంలో కేవలం నేర్చుకోవాలి, అయితే ఏం నేర్చుకోవాలి? ఒకటికి లెక్క(ఒకటి అనే శబ్ధానికి గల లెక్కాచారము). ఒక్కరిని తెలుసుకుంటే చాలు, అన్నీ తెలుసుకున్నట్లే. అన్నీ పొందినట్లే. ఒకటి వ్రాయడం, నేర్చుకోవడం, స్మృతి చేయడం అన్నిటికన్నా సరళమైనది, సహజమైనది.

లౌకికంలో కూడా భారతదేశంలో మూడు - నాలుగు విషయాల గురించి మాట్లాడకండి అని సామెత ఉంది. ఒక్క విషయాన్నే మాట్లాడండి. మూడు-నాలుగు విషయాలైతే కష్టంగా ఉంటుంది. ఒక్కరినే స్మృతి చేయడం, ఒక్కరినే తెలుసుకోవడం అతిసులభము. కనుక ఇక్కడ ఏం నేర్చుకుంటారు? ఒక్కటే నేర్చుకుంటున్నారు కదా! ఒక్కరిలోనే పదమాలు ఇమిడిపోయి ఉన్నాయి. అందువలన బాప్దాదా ఒకే సహజమైన మార్గాన్ని తెలిపిస్తున్నారు. ఒక్కరి మహత్వాన్ని తెలుసుకోండి మహాన్ గా  అవ్వండి. మొత్తం విస్తారమంతా ఒకటిలోనే ఇమిడి ఉంది. మొత్తం జ్ఞానమంతా వచ్చేసింది కదా! డబల్ విదేశీయులైతే ఆ ఒక్కరిని బాగా తెలుసుకున్నారు కదా! మంచిది. ఈ రోజు కేవలం వచ్చిన పిల్లలను గౌరవించేందుకు, స్వాగతం చేసేందుకు ఒకటిని గురించిన లెక్కాచారాన్ని వినిపించారు.

బాప్దాదా ఈ రోజు కేవలం కలుసుకునేందుకు వచ్చారు. అయినా అపురూపమైన పిల్లలు ఎవరైతే ఈ రోజు లేక నిన్న వచ్చారో వారి కొరకు ఏదో కొంత వినిపించారు. స్నేహం కారణంగా కష్టపడి ఇక్కడకు వచ్చేందుకు సాధనాలను ఎలా సమకూర్చుకుంటారో బాప్దాదాకు తెలుసు. పిల్లల కష్టానికి బదులుగా తండ్రి ప్రేమ పదమాల రెట్లు వారికి తోడుగా ఉంది. అందువలన తండ్రి కూడా స్నేహంతోనూ, గోల్డెన్ ర్షన్స్(మహావాక్యాల)తోనూ పిల్లలందరినీ స్వాగతం చేస్తున్నారు. మంచిది.

నలువైపులా ఉన్న స్నేహంలో లవలీనమైన పిల్లలందరికి, లగ్నంలో మగ్నమై ఉండే మనసుకు మిత్రులైన పిల్లలందరికి, సదా ఒక్క తండ్రి గుణాలను గానం చేసే పిల్లలకు, సదా ప్రీతి యొక్క విధిని నిభాయించే సాథీ పిల్లలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments