14-04-1977 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ఈరోజు బాప్ దాదా పిల్లలందరి భాగ్యము యొక్క చిత్రమును చూస్తున్నారు. ప్రతి ఒక్కరు యథాశక్తి తమ తమ చిత్రాన్ని తయారుచేసుకున్నారు. చిత్రములో ఆత్మీయత యొక్క విశేషత ఉండాలి. ఆత్మీయత నిండిన చిత్రము ప్రతి ఆత్మకు ఆత్మిక తండ్రి యొక్క దారిని చూపిస్తుంది. లౌకికములో చాలా సుందరముగా చిత్రీకరింపబడిన చిత్రము తన రచయిత యొక్క స్మృతిని కల్గిస్తుంది. కావుననే దీనిని తయారుచేసినవారు ఎవరు అని అడుగుతారు. అదేవిధంగా ఆత్మిక చిత్రము అనగా శ్రేష్ఠభాగ్యము గల చిత్రము తనను తయారుచేసిన బాబా వైపుకు స్వతహాగా ఆకర్షిస్తుంది. మీ భాగ్యము, భాగ్యమును తయారుచేసే భగవంతుని యొక్క స్మృతిని స్వతహాగా కల్గిస్తుంది. ఇటువంటి శ్రేష్ఠభాగ్యము యొక్క చిత్రమును తయారుచేసుకున్నారా? ఆత్మిక భాగ్యము అనగా నడుస్తూ తిరుగుతూ ఉన్న లైట్ హౌస్. ప్రతి ఒక్కరికి సక్రమమైన మార్గమును చూపించడమే లైట్ హౌస్ యొక్క కర్తవ్యము. నడుస్తూ తిరుగుతూ ఉన్న ఇంతమంది లైట్ హౌస్ లు ఏ అద్భుతము చేస్తారు? ఆవిధంగా అయ్యారా లేక ఇప్పటివరకూ అలా తయారయ్యే ప్లానును తయారు చేస్తున్నారా? ఈసారి బాప్ దాదా రిజల్టును తీసుకునేందుకు వచ్చారు. ఎప్పుడైతే పరీక్షల రోజులు వచ్చేస్తాయో ఆ సమయంలో చదివించడం జరగదు, చదివినదాని యొక్క పరీక్ష జరుగుతుంది. కావున బాప్ దాదా కూడా సంకల్పం ద్వారా, వాణి ద్వారా, కర్మ ద్వారా ఎంతో చదివించారు, ఇప్పుడు దాని రిజల్టును చూస్తారు. ప్రతి ఒక్కరు మీ రిజల్టుతో సంతుష్టంగా ఉన్నారా? పరిశీలించారా? సమయానుసారంగా లేక బాబా యొక్క చదువు అనుసారంగా విశ్వము ముందు స్వయాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా చేసుకున్నారా? ఏదైనా విషయమును స్పష్టము చేసేందుకు అనేక రకాలైన ప్రమాణాలను ఇవ్వడం జరుగుతుంది. కానీ అన్ని ప్రమాణాలలోకి శ్రేష్ఠ ప్రమాణము ప్రత్యక్ష ప్రమాణమే. మరి ఆ విధంగా అయ్యారా? ఎవరైనా చూస్తే వీరిని చదివించేవారు లేక ఇలా తయారుచేసేవారు స్వయంగా సర్వశక్తివంతుడైన తండ్రియేనని అనుభవం చేసుకోగల్గాలి. ప్రత్యక్ష ప్రమాణమే బాబాను ప్రత్యక్షము చేసే సహజమైన మరియు శ్రేష్టమైన సాధనము. ఈ సాధనాన్ని మీ సొంతం చేసుకున్నారా? ప్రత్యక్షతా సంవత్సరాన్ని జరుపుకున్నారు కానీ స్వయాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా చేసుకున్నారా? ఇది సహజమా లేక కష్టమా? ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణము అనగా ఎలా ఉన్నారో అలా ఎవరికీ చెందినవారిగా ఉన్నారో అలా అదే స్మృతిలో ఉండాలి. అదేమైనా కష్టమా? తమను తాము గుర్తు చేసుకోవడం ఎవరికైనా కష్టమనిపిస్తుందా? అల్పకాలికంగా పాత్రను అభినయించే సమయంలో అల్పకాలికంగా ఆ స్మృతిని ఉంచుకోవడం కష్టమవుతుంది. ఎవరైనా స్త్రీ, పురుషవేషము వేస్తే, పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ మధ్య మధ్యలో తన స్త్రీ రూపము స్మృతిలోకి వచ్చేస్తుంది. కానీ నిజస్వరూపమును ఎప్పుడూ మర్చిపోరు. కావున మీరు ఎవరో, ఎవరికీ చెందినవారో మరియు ఎక్కడివారో అది అనాది అయినది. అది అనాది యొక్క నిజ స్వరూపము, వారు అనాది తండ్రి మరియు అది అనాది స్థానము. అవి అల్పకాలికమైనవి కావు. అనాది యొక్క స్మృతి సహజంగా ఉంటుందా లేక కష్టంగా ఉంటుందా? ప్రత్యక్ష ప్రమాణము అనగా అనాది స్వరూపంలో స్థితులై ఉండటం. అయినా మర్చిపోతారు. నిజానికి మర్చిపోవడమే కష్టమవ్వాలి. ఎందుకంటే మర్చిపోయి ఏ స్వరూపమునైతే స్మృతిలోకి తెచ్చుకుంటారో అది అనాది అయినది కాదు మధ్యకాలానికి చెందినది. మధ్యకాలము అనగా ద్వాపరము యొక్క సమయము. కావున మధ్యకాలం యొక్క స్వరూపము కష్టంగా గుర్తుకు రావాలి. ఇది యదార్థము కాదు అయ్యదార్థము.
బాప్ దాదా రిజల్టును తీసుకునేందుకు వచ్చారు. విశేషంగా పాతవారి నుండి. ఎవరైతే విశేషంగా ఫిర్యాదు చేసి ఆహ్వానించారో వారి నుండి రిజల్టు తీసుకునేందుకు వచ్చారు. పాతవారు ఆహ్వానించడం అనగా రిజల్టును ఇచ్చేందుకు తయారుగా ఉండడం. ఎందుకంటే బాప్ దాదా ఇంతకుముందే చెప్పేసారు, తండ్రి రావడం అనగా స్వయం జీవిస్తూనే మరణించేందుకు సాహసాన్ని కల్గి ఉండటం అని మీరు క్రొత్తవారికి వినిపిస్తారు కదా! ఎందుకంటే బాబా రావడం అనగా తిరిగి తీసుకెళ్లడము లేక పురాతన ప్రపంచం యొక్క పరివర్తన చేయడం. మీరు బాబాను పిలవడం అనగా బాబాకు రిజల్టును ఇచ్చేందుకు తయారుగా ఉండడం. మరి పరీక్షల కొరకు తయారుగా ఉన్నారు కదా! విశ్వమును పరివర్తన చేసే అలజడిని చూస్తూ కూడా అచలంగా ఉండాలి. అలజడిలోకి తీసుకువచ్చేందుకు స్వయాన్ని నిమిత్తులుగా భావిస్తున్నారా లేక ఇప్పటివరకు ఇంకా మీ అలజడిలోనే ఉన్నారా? బాప్ దాదా కదిలించే పరీక్షను తీసుకోవచ్చా? అచలంగా ఉంటారా లేక కదులుతారా? రెడీగా ఉన్నారా లేక ఎవర్రెడీగా ఉన్నారా? రిజల్టు ఏమిటి? స్వయము యొక్క సంస్కారాల పేపర్, స్వయము యొక్క వ్యర్థసంకల్పాల పేపర్, లేక ఏదైనా శక్తి యొక్క లోపము యొక్క కారణంగా వచ్చే పేపర్ సర్వులతో సంస్కారాన్ని కలుపుకొనే పేపర్ ఇలా ఇప్పటివరకూ ఈ చిన్న చిన్న హద్దులోని పేపర్లలో కూడా అలజడిలోకి వస్తున్నారా లేక అచలంగా ఉన్నారా? అనంతమైన పేపర్ అనగా అనాది తత్వాల ద్వారా వచ్చే పేపర్, అనంతమైన విశ్వము యొక్క అలజడి ద్వారా వచ్చే పేపర్, అనంతమైన వాతావరణం ద్వారా వచ్చే పేపర్. అనంతమైన సృష్టి యొక్క తమోప్రధానమైన అశుద్ద వైబ్రేషన్ల ద్వారా, వాయుమండలము ద్వారా వచ్చే పేపర్.. ఇటువంటి అనంతమైన పేపర్లను ఎదుర్కొనేందుకు తయారుగా ఉన్నారా? మొదట స్వయం ద్వారా స్వయము యొక్క పేపర్. చిన్నని బ్రాహ్మణ ప్రపంచము ద్వారా లేక బ్రాహ్మణ సంస్కారాల ద్వారా వచ్చే పరీక్షలు. ఇది కచ్చా పరీక్షయా లేక పక్కా పరీక్షయా ? 6 నెలలకు మరియు 12 నెలలకు పరీక్ష ఉంటుంది కదా! మరి హద్దులోని పేపరును ఇచ్చి పాసైపోయారా? మరిప్పుడు అనంతమైన పరీక్షను ప్రారంభించాలా? ఇదేవిధంగా ఏ సబ్జెక్టు యొక్క పరీక్షలో పాసు మార్కులు పొందేందుకు లేక పాస్ విత్ హానర్ అయ్యేందుకు ఎంతవరకు యోగ్యునిగా అయ్యాను అని పరిశీలించుకోవాలి. ఏమి చేయాలో అర్థమైందా? ఎంతగానో అధైర్యపడుతున్నారు. దేనిని చూసి అధైర్యపడుతున్నారు? చిన్న చిన్న మాయ యొక్క బుడగలు చూసి భయపడుతున్నారు, అవి కాసేపు ఉంటాయి మళ్లీ ఇప్పుడే ఉండకుండాపోతాయి. చిన్న పిల్లలు కూడా బుడగలు చూసి భయపడరు. అచ్చా! ఇంకా తరువాత వినిపిద్దాము. అచ్చా!
ఇటువంటి నడుస్తూ తిరుగుతూ ఉన్న లైట్ హౌస్ లకు, తమ భాగ్యము యొక్క చిత్రము ద్వారా భాగ్యమును తయారు చేసేవారికి, బాబాను అన్నివేళలా ప్రత్యక్షము చేసేవారికి, ప్రతి పరిస్థితి యొక్క పేపర్లలో ఎవర్రెడీగా ఉండేవారికి, సదా ప్రత్యక్ష ప్రమాణంగా అయ్యి అన్యులకు ప్రమాణమునిచ్చే వారికీ, ఇటువంటి సదా మహావీరులుగా ఉండే పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీజీతో అవ్యక్త బాప్ దాదా:-
విశేష ఆత్మలైన మీరంతా బాప్ దాదా యొక్క కార్యంలో సహాయోగులుగా ఉన్నారు. సహయోగానికి ప్రతిఫలంగా విశేషంగా సర్వప్రాప్తులు సహజంగా ప్రాప్తమవుతాయి. ఎవరు ఎంత సమయము అన్నిరకాలుగా సహాయోగులుగా అవుతారో వారికీ దానికి ప్రత్యక్షఫలంగా సర్వప్రాప్తుల యొక్క అనుభవము సహజంగా కలుగుతుంది. సమయ ప్రతి సమయము బాబాకు సహాయోగులుగా అయితే బాబా కూడా ప్రతిఫలంగా సహాయం చేస్తారు. ధైర్యంతో కూడుకున్న సంకల్పమును పిల్లల యొక్క ఒక్క అడుగుగా చేస్తే, వేయి శ్రేష్ఠ సంకల్పాల సహయోగమును బాబా ఇస్తారు. ఇటువంటి సహయోగమును అవసరమైనపుడు ఇస్తూ ఉంటారు. పిల్లలు ఆలోచించగానే బాబా యొక్క సహయోగంతో అది జరిగిపోతుంది. ఇది సహాయోగులుగా అయినందుకు విశేష ఆత్మలకు లభించే ప్రత్యక్ష ఫలము. ప్రత్యక్ష ఫలమును పొందే ఆత్మ ఎప్పుడూ కష్టమును అనుభవం చేసుకోదు. ఎంత సహజంగా అనిపిస్తుందంటే ఇప్పుడిప్పుడే చేసిన విషయాన్ని రిపీట్ చేసినట్లుగా అనిపిస్తుంది. కల్పపూర్వము చేసినట్లుగా కాదు ఇప్పుడిప్పుడే చేసినట్లుగా అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడిప్పుడే దానిని రిపీట్ చేస్తున్నాము, నిన్నటి విషయమునైనా ఆలోచించవల్సి ఉంటుంది. కానీ ఇది ఇప్పటి విషయంగానే అనుభవమవుతుంది. ఇందులో బుద్ధిపై భారము ఏర్పడదు. చేయాలి, కానీ ఎలా అవుతుంది అన్న భారము కూడా లేదు. ఇప్పుడిప్పుడే రిపీట్ చేయాలి. ఇటువంటి ప్రత్యక్ష ఫలము ప్రాప్తమవుతుంది. కావున మీరు ప్రత్యక్ష ఫలము తినేవారే కదా! లేక భవిష్యత్తు యొక్క ఆధారముపై ఆలోచిస్తున్నారా? భవిష్యత్తు ఎటుతిరిగి ఉంటుంది. కానీ భవిష్యత్తు కన్నా కూడా శ్రేష్టమైనది ప్రత్యక్ష ఫలము. ప్రత్యక్ష ఫలమును వదిలి భవిష్యత్తు కొరకు ఎదురుచూస్తూ ఉండకండి. ఇప్పుడే బాబాకు చెందినవారిగా అయ్యారు మరియు ఇప్పుడిప్పుడే ఫలము లభించింది. బాబా నుండి దూరంగా ఉండే ఆత్మలు భవిష్యత్తును గూర్చి అనగా దూరము యొక్క విషయాలను గూర్చి ఆలోచిస్తారు. సమీపంగా ఉండే ఆత్మలు సదా ప్రత్యక్ష ఫలమును అనుభవము చేసుకుంటారు. ఒకటికి లక్షల రెట్లుగా అనుభవం చేసుకుంటారు. ఇలా జరుగుతుంది కదా!
నడవడం లేదు, ఎవరో నడిపిస్తున్నారు. తమ ఒడిలో కూర్చుండబెట్టుకుని నడిపిస్తున్నారు. అందులో కష్టమైతే ఉండదు కదా! కొడుకు తండ్రి ఒడిలో కూర్చుని తిరుగుతున్నట్లయితే అతడికి అలసట కలగదు. ఎంతో ఆనందం కలుగుతుంది. తన కాళ్లపై నడిస్తే అలిసిపోతారు. ఏడుస్తారు లేక గొడవ చేస్తారు. ఇక్కడ నడిపించే తండ్రి నడిపిస్తున్నారు. బాబా ఒడిలో కూర్చొని నడుస్తున్నారు. ఎంత అతీంద్రియ సుఖము, ఆనందము అనుభవమవుతాయి! కొద్దిగా కూడా శ్రమ లేక కష్టము యొక్క అనుభవము లేదు. ఇది ప్రాప్తియా లేక శ్రమయా? సంగమ యుగానికి చెందిన, సదా తోడుగా ఉండే ఆత్మలకు కష్టమేముంటుంది. వారు కష్టమంటే ఏమిటో కూడా తెలియని విధంగా ఉంటారు. కష్టమంటే ఏమిటో కూడా తెలియని వారు చాలా తక్కువగా ఉంటారు. ఇది ప్రత్యక్ష స్థితికి గుర్తు. దానికి సమీపంగా వస్తున్నారు. పురుషార్థము కూడా ఒక స్వభావిక కర్మగా అయిపోవాలి. ఇతర కర్మలు ఏవిధంగా సహజముగా ఉన్నాయో లేవడము, కూర్చోవడము, నడవడము, నిదురించడము ఏవిధంగా స్వభావిక కర్మలో అలాగే స్వయాన్ని సంపన్నంగా తయారుచేసుకునే పురుషార్థము కూడా స్వభావిక కర్మగా అనుభవమవ్వాలి. అప్పుడే ఈ ప్రకృతిని పరివర్తన చేయగలుగుతారు. ఇప్పుడు ఇంకా ఆ సేవ మిగిలి ఉంది. ఇప్పుడు మీరందరినీ ఫైనల్ పేపర్ ఇచ్చేందుకు, తయారు చేసేందుకు వెళుతున్నారు. ఎందుకంటే మీరంతా నిమిత్తులు కదా! ఈ విధంగా ఏ చిన్న లేక పెద్ద పరీక్షలలో కూడా అచలంగా ఉండే విధంగా ఎవర్రెడీగా అయిపోండి. ఇప్పుడింకా చిన్న పరీక్షల్లో కూడా అలజడిలోకి వచ్చేస్తున్నారు. స్వయము యొక్క పేపర్ల ద్వారానే అలజడిలో ఉన్నారు. కావున ఇప్పుడు ఎలా తయారు చేసి పంపించాలంటే పాతవారు ఇక్కడకు వస్తే వారు ఎవర్రెడీగా కనిపించాలి. బాబా రియలైజేషన్ కోర్సును ఇచ్చారు కావున దాని రిజల్టును కూడా తీసుకుంటారు. అనుభవజ్ఞులుగా చేస్తూ ఉండండి. కేవలం ఉచ్చరించేవారిగా అయిపోతారు కానీ అనుభవజ్ఞులుగా తక్కువగా అవుతారు. అనుభవిమూర్తులుగా అయిపోయినట్లయితే అనుభవజ్ఞులెప్పుడూ మోసపోరు. మోసపోవడము అనగా అనుభవజ్ఞులుగా వుండకపోవడమే. ఈ విధంగానే లక్ష్యమును ఉంచి అందరిలోనూ ఇటువంటి కళ్యాణమును నింపుతూ ఉండండి. ఈ రిజల్టును చూసేసారు. ఇప్పుడు ఇక సంపన్నంగా అయ్యి సంపూర్ణ పరివర్తన యొక్క కార్యమును సంపన్నము చేస్తాము అన్న ఒక్క ఉల్లాసము సర్వులలోనూ ఒకే విధముగా ఉండాలి. లేకపోతే విశ్వపరివర్తన యొక్క కార్యము కూడా అలజడిలో ఉన్నట్లే. ఇప్పుడిప్పుడే మేఘాలు నిండుతాయి కాస్త కురుస్తాయి మళ్ళీ చెల్లాచెదురవుతాయి. కారణమేమిటి? స్థాపన చేసే విశ్వపరివర్తకులే ఇంకా కదులుతూ ఉంటారు, తమ లక్ష్యము నుండి చెదిరిపోతారు. కావున పరివర్తన యొక్క మేఘాలు కూడా చెదిరిపోతాయి. గర్జిస్తాయి కానీ వర్షించవు. అచ్చా!
"శ్రేష్ఠభాగ్యము యొక్క చిత్రము"

Comments
Post a Comment