06-02-1977 అవ్యక్త మురళి

                    06-02-1977        ఓంశాంతి          అవ్యక్త బాప్ దాదా           మధువనము      

                                                "రియలైజేషన్ మరియు లిబరేషన్."

                     ఈ రోజు బాప్ దాదా ఈశ్వరీయ విద్యార్థులందరి యొక్క రిజల్టును చూస్తున్నారు. కోర్సు పూర్తి చేసారు. రివైజ్ కోర్సునూ పూర్తి చేసారు. రియలైజేషన్ కోర్సును కూడా చేసారు. మరి దాని రిజల్టు ఏమిటి? చదువు అనుసారముగా ఏ స్థితిని పొందగలుగుతాము అని ప్రతి ఒక్కరూ తమను తాము తెలుసుకున్నారా? రాజ్యపదవి యొక్క సంస్కారాలు లేక ప్రజాపదవి యొక్క సంస్కారాలు ... రెండింటిలో ఆత్మనైన నాలో ఏ సంస్కారాలు నిండాయి? అన్నది మీకు తెలుసా? రాజ్యపదవి యొక్క సంస్కారాలు అనగా శ్రేష్ఠపదవి యొక్క సంస్కారాలు ఏవిధంగా  కనిపిస్తాయి? అధికారి మరియు సత్కారి, నిరాకారి మరియు నిరహంకారి. ఈ విశేష ధారణలు రాజ్యపదవి యొక్క విశేష ఆసనము. ఈ ఆసనమే సింహాసనాన్ని ప్రాప్తిని కలుగజేస్తుంది. నాలుగు విషయాల యొక్క బ్యాలన్సులో  ఉండాలి. ఇటువంటి ఆసనము ధృఢముగా ఉందా? లేక కదులుతూ ఉందా? బాప్ దాదా ఈ రోజు రిజల్టును అడుగుతున్నారు. రియలైజేషన్  కోర్సు యొక్క హోంవర్క్ ను బాబా ఇచ్చారు. దానికి రిజల్టు ఏమిటి? మీరందరూ ఫైనల్ పేపర్ కొరకు తయారుగా ఉన్నారు. మరి మీ రిజల్టును ఏవిధంగా చూసారు? మీ స్థితిని ఏవిధంగా అనుభవము చేసుకున్నారు? బాబా సమానముగా, బాబాతో పాటు కలిసి వెళ్లేవారిగా అయ్యారా? సమానముగా అవ్వకపోతే కలిసి వెళ్లేందుకు బదులుగా మధ్యలో ఆగవలసి వస్తుంది. ఖాతా క్లియర్ అవ్వని కారణంగా వయా వెళ్ళవలసి ఉంటుంది. రిఫైన్ అవ్వకపోతే ఫైన్ కట్టవలసి వస్తుంది. కావుననే కలిసి వెళ్లలేకపోతారు. మీరు ఏమని ప్రతిజ్ఞ చేసారు? కలిసి వెళ్తాము అని అన్నారా?లేక మధ్యలో ఆగి వెళ్తాము అని  అన్నారా? మీరు పాత పిల్లలతో ఎందుకు కలవడం లేదు? అని బాబాను అడుగుతారు. మరి మీరు రిఫైన్ గా అయ్యారా? అని బాబా కూడా రిజల్టును అడుగుతారు. ఇప్పుడు ఇంకా ఏదైనా కోర్సు యొక్క అవసరం ఉందా? రియలైజేషన్ తర్వాత ఇంకేమి మిగిలి ఉంటుంది? అంతిమ రిజల్టు యొక్క స్వరూపము రియలైజేషన్. దాని తర్వాత లిబరేషన్ - అనగా అన్నింటి నుండి ముక్తులు. 

                         ఈ రోజు బాప్ దాదా,  బాబా మరియు పిల్లల మధ్యలో ఉన్న తేడాను చూస్తున్నారు. బాబా ఏమి చెబుతున్నారు మరియు పిల్లలు ఏమి చేస్తున్నారు? బాబా ఏ రిజల్టును చూసి ఉంటారు. అది చాలా రమణీయమైన రిజల్టు అయి ఉంటుంది కదా! చెప్పాలా లేక మీరు అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకుని కూడా మళ్లీ చేస్తున్నట్లయితే దానిని ఏమంటారు? మెజారిటి సాధారణ పురుషార్థులుగా ఉన్నారు. దానికి ముఖ్య కారణం ఏమిటి? ప్రభుపసందులుగా అవ్వండి, విశ్వపసందులుగా అవ్వండి అని బాబా అంటారు. కానీ ఏమి చేస్తున్నారు? ఆరాం పసందులుగా అయిపోయారు. కనెక్షన్ ను జోడించండి, గుణాలు మరియు శక్తుల యొక్క వరదానాలను తీసుకోండి మరియు ఇవ్వండి అని బాబా అంటారు. కానీ కొందరు పిల్లలు కనెక్షన్ యొక్క మహత్వమును తెలుసుకోరు. కనెక్షన్ ను జోడించడము వారికి రాదు. అందుకు బదులుగా వారికీ కరెక్షన్ చేయడం బాగా వస్తుంది. ఇతరుల యొక్క కరెక్షన్ చేయువారు కనెక్షన్ ఎప్పుడూ అనుభవము చేసుకోలేరు. సదా స్మృతి యొక్క సాధనలో ఉండండి అని బాబా అంటారు. కానీ సాధనకు బదులుగా అల్పకాలిక సాధనాలలో ఎక్కువగా బిజీగా ఉంటారు. సాధనాల యొక్క ఆధారముపై సాధన ఉంటుంది. సాధనాలు ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఇటువంటి సాధకుల యొక్క సాధన సఫలమవ్వదు. జీవన్ముక్తి యొక్క స్థానములో బంధనముక్త ఆత్మలుగా అయిపోతారు. బాబా ఎం చెబుతారో పిల్లలు ఏమి చేస్తున్నారో అర్థమైందా? రిజల్టు విన్నారా?

                                బాప్ దాదా శ్రేష్ఠఆత్మలను సదా శ్రేష్టదృష్టితో చూస్తారు. శ్రేష్ట భాగ్యము యొక్క రేఖలను చూస్తారు. ఈ ఆత్మలే విశ్వము ముందు ప్రకాశించే సితారలు. విశ్వము మీ కల్పపూర్వపు సంపూర్ణ స్వరూపమును,పూజ్య స్వరూపమును స్మరిస్తోంది. కావున మీ సంపన్న స్వరూపాన్ని ప్రత్యక్షంగా ప్రఖ్యాతము చేయండి. గతించిన బలహీనతలపై ఫుల్ స్టాప్ పెట్టండి. అప్పుడు సంపన్న స్వరూపము యొక్క సాక్షాత్కారము జరుగుతుంది. అన్ని పురాతన సంస్కారాలను, స్వభావాలను దృఢ సంకల్పము అనే ఆహుతి ద్వారా సమాప్తము చేయండి. ఇతరుల యొక్క బలహీనతలను నకలు చేయకండి. అవగుణాలను ధారణ చేసే బుద్దిని నాశనం చేయండి. దివ్యగుణాలను ధారణ చేసే సతోప్రధాన బుద్దిని ధారణ చేయండి. అధికారి మరియు సత్కారి ఈ రెండింటి యొక్క బ్యాలన్సును సమతుల్యంగా ఉంచుకోవాలి. ఇతరుల యొక్క బలహీనతలను విస్తారములోకి తీసుకురాకండి మరియు మీ బలహీనతలను దాచుకోకండి. సఫలతలో స్వయమును మరియు అసఫలతలో ఇతరులను దోషితులుగా చేయకండి. పేరు ప్రతిష్ఠల యొక్క త్యాగము, సాధనాల యొక్క త్యాగము ఇదే మహాత్యాగము. సాకార బాబా సమానముగా అల్పకాలిక మహిమ యొక్క త్యాగులుగా అవ్వండి. అప్పుడే శ్రేష్ఠ భాగ్యవంతులుగా అవ్వగలుగుతారు. శివబాబా ఈ విషయాలన్నింటి నుండి ముక్తులుగా చూడాలనుకుంటున్నారు. ఈ అంతిమ ఫోర్స్ యొక్క కార్యము కొరకు సమయం లభించింది. 

                                ఇటువంటి అధికారులకు, సత్కారమును ఇచ్చి విశ్వము ద్వారా సత్కరింపబడేవారికీ, నిర్మాణత ద్వారా నమస్కార యోగ్యులుగా అయ్యేవారికి, గతించిన దానిని సమాప్తము చేసేవారికి, సర్వగుణాలలో సంపన్నులుగా అయ్యేవారికి, సదా సమానంగా మరియు తోడుగా ఉండేవారికి, శ్రేష్ఠభాగ్యశాలి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

టీచర్లతో అవ్యక్త బాప్ దాదా :-  

                               ఏదైతే విన్నారో దానంతటి యొక్క సారమును మీ జీవితములోకి తెస్తున్నారు కదా! ఎందుకంటే టీచర్ యొక్క అర్థమే రహస్యయుక్తము మరియు సారయుక్తము. 

టీచర్ల యొక్క విశేషతలు:-

 1. వారు విస్తారాన్ని క్షణంలో సారములోకి తీసుకురావాలి. ఎసెన్స్ యొక్క ఒక్క బిందువు కూడా ఎంతో పని చేస్తుంది. అలాగే టీచరు అనగా ఎసెన్స్ ఫుల్ (సార యుక్తులు)వ్యర్థము యొక్క విస్తారమును  క్షణంలో సారరూపంలోకి తెచ్చేవారు మరియు అన్యులచే చేయించేవారు. 

2. టీచర్లు కూడా పవర్ హౌస్ అయిన బాబా సమానంగా సబ్ స్టేషన్ల వంటివారు. కావున పవర్ హౌస్ లో ఎక్కడా ఫ్యూజ్ ఎగిరిపోకుండా ఉండేందుకు సదా అటెన్షన్ మరియు చెకింగ్ ఏవిధంగా ఉంటుందో అలాగే టీచర్లు కూడా ఏ చెకింగ్ చేయాలి? ఎప్పుడూ ఏ పరిస్థితిలోనూ కన్ ఫ్యూజ్ (తికమక) పడకూడదు. పవర్ హౌస్ లో జరిగే చిన్న అలజడి మొత్తం ఏరియా అంతటి  యొక్క లైట్ ను తొలగించివేస్తుంది. అలాగే టీచర్ కన్ ఫ్యూజ్ అయినట్లయితే దాని ప్రభావం వాతావరణంలో పడుతుంది మరియు ఆ వాతావరణ ప్రభావము అక్కడికి వచ్చేవారిపై పడుతుంది. కావున టీచర్లు స్వయాన్ని అనేక ఆత్మలను పైకెక్కించేందుకు లేక కదిలించేందుకు నిమిత్తులుగా భావించాలి. 

3. టీచర్లు అలసట లేనివారే కదా! చిన్న చిన్న విషయాలలో అలిసిపోయేవారు కాదు కదా! పురుషార్థంలో స్వయంతో కూడా అలిసిపోకూడదు. ఏవిధమైన సంస్కారమును లేక స్వభావమును పరివర్తన చేయడంలో నిరుత్సాహపడటం లేక నిర్లక్ష్యం రావడం కూడా అలిసిపోవడమే.  ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇది తప్పక జరుగుతుంది అని భావించడం కూడా నిర్లక్ష్యమే. ఇది చాలా కష్టం, ఎప్పటివరకు ఇలా నడుస్తాం అని భావించడం నిరుత్సాహపడటం. కావున పురుషార్థంలో నిర్లక్ష్యులుగా అవ్వడం లేక నిరుత్సాహపడటం కూడా అలసిపోవడమే.

4. ఎవరిలోనైతే పరిస్థితులను ఎదుర్కొనే శక్తి ఉంటుందో వారు సదా ఉల్లాస, ఉత్సాహాలలో ఉంటారు. ఎప్పుడూ తికమకపడరు. 

5. టీచర్లు అనగా బాబా సమానమైన  సేవాధారులు మరి మీరు సమానమైనవారే కదా! సమానత యొక్క సంతోషము కూడా ఉంటుంది. మేము బాబా సమానమైన మాస్టర్ శిక్షకులము, బాబా సమానంగా నిమిత్తులుగా అయ్యాము అన్న సంతోషంలో టీచర్లు ఉంటారు. బాబా సమానంగా అనేక ఆత్మల యొక్క కళ్యాణము యొక్క బాధ్యత కూడా ఉంది. మరి బాబా సమానంగా ఉన్నారా? ఈ సంతోషము ఎంతగానో ముందుకు తీసుకెళ్లగల్గుతుంది. టీచర్లను చూసి బాప్ దాదా కూడా ఎంతో సంతోషిస్తారు. సమానమైన వారిని ఫ్రెండ్ షిప్ గ్రూప్ అని అంటారు. మరి మీరంతా స్నేహితుల యొక్క గ్రూపే కదా!

6. టీచర్లు సదా కొత్త ప్లానును తయారుచేస్తూ ఉండాలి. ప్లానింగ్ బుద్ధి ఉండాలి. చాలా సహజంగా ప్లానింగ్ బుద్ధి కలవారిగా అవ్వగలరు. అది ఎలా? అమృతవేళ ప్లేయిన్ బుద్ధి కలిగి ఉంటే బాప్ దాదా ద్వారా ప్లానులు టచ్ అవుతాయి తద్వారా ప్లానింగ్ బుద్ధి కలవారిగా అవుతూ ఉంటారు. సాకార ఆధారమును తీసుకుంటున్నారు కాబట్టే ప్లానింగ్ బుద్ధి తయారవ్వడం లేదు. లేకపోతే టీచర్ల యొక్క సంబంధము స్నేహముతో ఉన్న కారణముగా అది సమీప సంబంధము. కావున చాలా సహయోగాన్ని తీసుకోవచ్చు. హద్దులోని ఆధారాలను ఏర్పర్చుకున్నట్లుగా  బాబా గమనించినట్లయితే ఇక వారేమి సహాయం చేస్తారు?

7. టీచర్ల యొక్క విశేషత ఏమిటి? టీచర్లు ఇన్వెంటర్, క్రియేటర్ మరియు ప్లానింగ్ బుద్ధి కలవారు. (అనగా క్రొత్తవాటిని కనుగొనే, తయారుచేసే, ప్లానింగ్ బుద్ధి కలవారు). వారు అనేక ఆత్మలకు ఉల్లాస, ఉత్సాహాలను ఇస్తారు. ఈ విశేషతలన్నింటినీ ఇప్పుడు ప్రత్యక్షతలోకి తెచ్చుకోండి అప్పుడు హద్దులోని విషయాలన్నీ తొలగిపోతాయి. అర్థమయ్యిందా?

8. టీచరు యొక్క విశేషత అనుభవీమూర్తులుగా ఉండటం. కేవలం చెప్పే మూర్తులుగా కారు,  అనుభవీమూర్తులు. చెప్పడం కూడా అనుభవం యొక్క ఆధారము పైనే ఉంటుంది. ఇన్ని విశేషతలతో సంపన్నమైన దృష్టితో బాప్ దాదా చూస్తారు. మరి మీరు ఎంత గొప్పవారు? మహానతను అతిథిగా భావిస్తూ నడిపించాలి. మహానతను మీ ఆస్తిగా భావించకండి. మహానతను బాబా ఇచ్చినదిగా భావించకుండా స్వయానికి చెందినదిగా భావించినట్లయితే అందులో నష్టముంది. బాబా ద్వారా మహానత లభించింది. కావున మధ్యలో బాబాను మర్చిపోకూడదు. అచ్చా!  

Comments