05-02-1977 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
"మహోన్నతకు ఆధారం"
పిల్లల యొక్క ఏ మహిమల ఆధారంగా అంత ఉన్నతంగా అవుతారో ఆ మహిమలను బాబా చూస్తున్నారు. మీకు మీ మూడు స్వరూపాల యొక్క మహిమను గూర్చి తెలుసా?1.అనాది స్వరూపము యొక్క మహిమ 2.వర్తమాన బ్రాహ్మణ జీవితము యొక్క మహిమ 3.భవిష్య ఆది స్వరూపము యొక్క మహిమ
ఆది స్వరూపము యొక్క మహిమను ఇప్పటివరకు భక్తులు కూడా గానం చేస్తూ ఉన్నారు. సర్వగుణసంపన్నులు, 16కళాసంపూర్ణులు, సంపూర్ణనిర్వికారులు, మర్యాద పురుషోత్తములు, సంపూర్ణ అహింసకులు అని గానం చేస్తూ ఉన్నారు. ఇది అంతిమ ఫరిస్తా స్వరూపము యొక్క మహిమ. అనగా భవిష్య ఆది స్వరూపము యొక్క మహిమ. బ్రహ్మ నుండి శ్రీకృష్ణునిగా అవుతారు అని ఏవిధంగా అంటారో అలాగే అంతిమ ఫరిస్తా రూపం నుండి దేవతగా అవుతారు. కావున ఇది ఆది స్వరూపము యొక్క మహిమ.
అనాది స్వరూపము యొక్క మహిమ:-బాబా యొక్క మహిమ ఏదైతే ఉందో అది మాస్టర్ స్వరూపంలో మీ అనాది రూపము యొక్క మహిమ కూడా. మాస్టర్ సర్వశక్తివాన్,మాస్టర్ జ్ఞానస్వరూప్,మాస్టర్ ఆనంద స్వరూపము,మాస్టర్ శాంతి స్వరూపము మొదలగు రూపాలలో మహిమ ఉంది.
వర్తమాన శ్రేష్ఠ బ్రాహ్మణ స్వరూపము యొక్క మహిమ ఏమిటి? బ్రాహ్మణుల జీవితంలో ముఖ్యంగా నాలుగు ఆధారాలున్నాయి. స్వయం చదువుతూ,చదివించేవారినే బ్రాహ్మణులు అని అంటారు.బ్రాహ్మణ జీవితం అనగా ఈశ్వరీయ విద్యార్ధి జీవితము. చదువు యొక్క ముఖ్యమైన నాలుగు సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అవే బ్రాహ్మణ జీవితం యొక్క నాలుగు ఆధారాలు మరియు ఈ ఆధారము పైనే బ్రాహ్మణ స్వరూపము యొక్క మహిమ ఉంది. అవి 1.పరమాత్మ జ్ఞానీ 2. సహజయోగి 3. దివ్య గుణధారి 4.విశ్వసేవాధారి. ఇది వర్తమాన బ్రాహ్మణ జీవితము యొక్క మహిమ. మీ మూడు స్వరూపాల యొక్క మహిమను తెలుసుకుని మీ గొప్పతనమును పరిశీలించుకోండి. మరియు ఏ ఏ లక్షణాలను ప్రత్యక్ష జీవితములో నిరంతర రూపంలో ధారణ చేశాను అని పరిశీలించుకోండి. పరమాత్మ జ్ఞానీ యొక్క విశేష లక్షణమేమిటి? ఆ లక్షణము ద్వారా వీరు పరమాత్మ జ్ఞానీ అని ప్రత్యక్షమవ్వాలి. ఆ ముఖ్య లక్షణమేమిటి? ప్రతి సబ్జెక్టు యొక్క లక్షణము వేరుగా ఉంటుంది. పరమాత్మ జ్ఞానీ అనగా జ్ఞాన స్వరూపులు. జ్ఞాన స్వరూపులు అనగా పరమాత్మ జ్ఞానులు. జ్ఞానము యొక్క విశేష ప్రాప్తి ఏమిటి? జ్ఞానము యొక్క విశేష ఫలము ఏమిటి? జ్ఞానము యొక్క ఫలము అనగా పరమాత్మ జ్ఞానము యొక్క ముఖ్య లక్షణము - ప్రతి సంకల్పంలో, వాక్కులో, కర్మలో, సంపర్కములో ముక్తీ జీవన్ముక్తి స్థితి ఉంటుంది. దానినే అతీతంగా మరియు ప్రియంగా ఉండే స్థితి అని అంటారు. అది జీవన్ముక్తి యొక్క స్థితి. కర్మ చేస్తూ కూడా బంధనాల నుండి ముక్తులుగా ఉంటారు. అన్ని విషయాలలోనూ ముక్తీ జీవన్ముక్తి యొక్క అనుభవము చేసుకోవడమే పరమాత్మ జ్ఞానీ యొక్క విశేష లక్షణము. జ్ఞానము అనగా వివేకము. వివేకవంతులు సదా స్వయాన్ని బంధన ముక్తులుగా సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా చేసే వివేకాన్ని కలిగి ఉంటారు. కావున పరమాత్మజ్ఞానీ యొక్క విశేష లక్షణము ముక్తీ మరియు జీవన్ముక్తి.
అదేవిధంగా సహజ రాజయోగి యొక్క లక్షణములు ఏమిటి? యోగి అనగా యోగయుక్తము. అనగా యుక్తియుక్తము. వారు సంకల్పము యొక్క సమానతలో సిద్ది స్వరూపులై ఉంటారు. అచ్చా !
దివ్యగుణధారి ముఖ్య లక్షణము ఏమై ఉంటుంది?సంతుష్టంగా ఉండటం మరియు అందరిని సంతుష్టపరచడం. అతడికి అందరి సంతుష్టత యొక్క ఆశీర్వాదము ప్రాప్తమవుతుంది. అనగా దైవీ యూనివర్సిటీ యొక్క సర్టిఫికెట్ ప్రాప్తమవుతుంది.
విశ్వసేవాధారి యొక్క విశేష లక్షణమేమిటి? సరళ స్వభావము మరియు అథక్ గా(అలసట లేకుండా) ఉండటం. సదా మేల్కొని ఉండే జ్యోతిలా ఉంటారు. జాగృతి జ్యోతి అనగా కేవలం నిద్రను జయించి ఉండటం కాదు. అది సర్వవిఘ్నాలను జయించి ఉండటం. అటువంటివారినే జాగృతి జ్యోతులు అని అంటారు. స్మృతి ఉండటం కూడా జాగృతిగా ఉండటమే. కావున ఇప్పుడు ఈ లక్షణాలన్నింటిని ముందు ఉంచుకుని నేను ఈ గాడ్లీ యూనివర్సిటీ యొక్క సంపూర్ణ డిగ్రీని పొందానా అని పరిశీలించుకోండి. నాలుగు సబ్జెక్టుల యొక్క ఆధారముపై ఏ మహిమనైతే వినిపించామో అదే బ్రాహ్మణ జీవితము యొక్క డిగ్రీ. మరి ఈ డిగ్రీని తీసుకున్నారా? ఇది వర్తమాన స్వరూపము యొక్క డిగ్రీ. డిగ్రీలయితే ఇంకా ఉన్నాయి కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ స్వయాన్ని జ్ఞానిగా,యోగిగా,సేవాధారిగా పిలుచుకుంటున్నారు కదా! కావున స్వయం గురించి ఏదైతే భావిస్తున్నారో, ఏదైతే చెప్పుకుంటున్నారో ఆ లక్షణాలు కనిపించాలి. అందరూ శాస్త్రజ్ఞులే కానీ మేము పరమాత్మ జ్ఞానులము అని, వారంతా హఠయోగులు మేము సహజ రాజయోగులము, దివ్యగుణధారులము అనగా కమలపుష్ప సమానమైన జీవితమును కలవారము అని ఛాలెంజ్ చేస్తున్నారు. మేము విశ్వకళ్యాణకారులము సేవాధరులము అని అంటున్నారు. కావున ఏ ఛాలెంజ్ అయితే చేస్తున్నారో అవే లక్షణాలు కనిపించాలి. ఇది కఠినమా? ఇది బ్రాహ్మణుల యొక్క నిజ ధర్మమూ మరియు కర్మ. జన్మ యొక్క లేక జాతి యొక్క ధర్మమూ మరియు కర్మ ఏదైతే ఉంటుందో అది కష్టమనిపించదు. వర్తమాన మహిమను స్వాభావికంగా, నిరంతర ధర్మము మరియు కర్మగా చేసుకోండి. అర్థమైందా? అచ్చా
ఇటువంటి లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసేవారికి మూడు స్వరూపాల యొక్క మహిమ ద్వారా ఉన్నతులుగా అయ్యేవారికి, సదా ముక్తి, జీవన్ముక్తులుగా ఉండేవారికి, యుక్తియుక్తులుగా సదా సంతుష్టంగా, సదా అలసట లేనివారిగా, నిర్మాణులుగా, సదా జాగృతి జ్యోతులుగా ఉండే శ్రేష్ఠ బ్రాహ్మణులకు ఆదిపిత, అనాదిపిత యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో అవ్యక్త బాప్ దాదా
సర్వఖజానాలతో సంపన్నంగా ఉండే ఆత్మ యొక్క గుర్తులేమిటి? ఎవరైతే ఖజానాలతో సంపన్నంగా ఉంటారో వారు సదా అతీంద్రియ సుఖంలో నిమగ్నమై ఉంటారు. వారికీ బాబా మరియు సేవ తప్ప ఇంకేమి గుర్తుండదు. వారు హద్దులోని ప్రవృత్తిని సంబాళిస్తూ కూడా ఈశ్వరీయ సేవార్ధము స్వయాన్ని ట్రస్టీగా భావిస్తూ ప్రవృత్తి యొక్క కార్యాన్ని చేస్తారు. వారి ప్రతి కర్మ శ్రీమాతానుసారము ఉంటుంది. వారు కొద్దిగా కూడా మన్మతము లేక పరమతమును కలుపరు.
శ్రీమతంలో మన్మతము లేక పరమతము ఏమాత్రము కలిపినా దాని రిజల్ట్ ఏవిధంగా కనిపిస్తుంది? శ్రీమతంలో మన్మతము లేక పరమతము కలిస్తే శుద్ధమైన వస్తువులో ఏదైనా అశుద్దమైన వస్తువు కలిసినపుడు ఏవిధంగానైతే ఏదో ఒక నష్టము వాటిల్లుతుందో అలాగే ఇక్కడ కూడా మన్మతము లేక పరమతము కలిస్తే సేవ ద్వారా ఏ ప్రాప్తి అయితే లభించాలో అది లభించదు. సంతోషము, సఫలత, శక్తి యొక్క అనుభవము కూడా కలుగదు. శ్రీమతం యొక్క రిజల్ట్ సఫలత అనగా సర్వప్రాప్తి. అప్పుడప్పుడూ ఎంతో శ్రమ పడతారు కానీ సఫలత తక్కువగా లభిస్తుంది. అనుభవము తక్కువ కల్గుతుంది. అలాగే అప్పుడప్పుడూ శ్రమ తక్కువగా ఉంటూ కూడా ప్రాప్తి అధికంగా లభిస్తుంది. ఇది మీరు అనుభవం చేసుకుంటారు కూడా. దీనికి కారణము యదార్థము మరియు కల్తీ. కావున ఈ సూక్ష్మమైన పరిశీలన కావాలి. ఎందుకంటే మన్మతము చాలా సూక్ష్మమైనది. మాయ మన్మతమును ఈశ్వరీయ మతంలో రాయల్ రూపంగా కలుపుతుంది. మీరు దానిని ఈశ్వరీయ మతంగా భావిస్తారు. కానీ అది మన్మతము. దీని కొరకు పరిశీలన శక్తి మరియు నిర్ణయ శక్తి కావాలి. ఈ రెండు శక్తులు శక్తివంతంగా ఉన్నట్లయితే ఎప్పుడూ మోసపోరు.
ఏ పిల్లలలోనైతే ఏడ్చే అలవాటు ఉంటుందో వారు బాబాకు స్వతహాగానే విముఖులవుతారు. మనస్సులో దుఃఖము యొక్క అల రావడము కూడా ఏడవడమే అవుతుంది. ఏడ్చే వారిని బాబా యొక్క ప్రాప్తి కలవారు అని అనరు. ఎప్పుడైతే తండ్రి నుండి సంబంధము వంచితమవుతుందో అప్పుడు ఈ దుఃఖము యొక్క అల వస్తుంది. కావున ఏడ్వడము అనగా బాబాతో సంబంధాన్ని తెంచుకోవడం, బాబా నుండి ముఖాన్ని తిప్పుకోవడం. ఎప్పుడైనా ఎవరైనా ఏడుస్తే మీరు చూసి ఉంటారు వారు ఎవరిముందుకు తమ ముఖాన్ని తిప్పుకోరు,తప్పకుండా ముఖము దాచుకుంటారు. స్థూలంగా ఏడ్చినప్పుడు స్వతహాగానే ముఖాన్ని ఏవిధంగా దాచుకుంటారో అలాగే మనస్సు ద్వారా ఏడ్చినప్పుడు కూడా స్వతహాగానే బాబా నుండి విముఖులవుతారు. బాబా వైపుకు వెన్ను చూపుతారు. ఎప్పుడూ దుఃఖము యొక్క అల సంకల్పములోకి కూడా రాకూడదు. సుఖదాత యొక్క పిల్లలలో దుఃఖము యొక్క అల ఉండటం శోభించదు. మూడ్ అఫ్ చేసుకోవడం కూడా మనస్సు ద్వారా ఏడ్వడమే. మరి మూడ్ అఫ్ చేసుకుంటున్నారా? ఎప్పుడైనా సేవ యొక్క అవకాశం తక్కువగా లభిస్తే మూడ్ అఫ్ అవ్వడం లేదు కదా!
అలసట లేకుండా మరియు బద్దకం లేకుండా ఉండేవారిగా స్వయాన్ని భావిస్తున్నారా? బద్దకం అంటే కేవలం నిద్రపోవడమే కాదు, అథక్(అలసట లేనివారు) అనగా ఏమాత్రము బద్దకం లేనివారు. కావున సదా అలసట లేనివారిగా ఉండటం అనగా సదా బాబా సన్ముఖంగా ఉండటం. అప్పుడు సదా సంతోషంగా ఉంటారు.
ఫాస్ట్ స్పీడ్ లో వెళ్లేవారు ఏ సమస్యలోనూ ఆగరు. సమస్య ఆపేందుకు ప్రయత్నిస్తుంది కానీ వారు దానిని అధికమిస్తూ దాటి వెళ్ళిపోతారు. సమస్యలను గూర్చి ఆలోచిస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకోరు. తీవ్రవేగము అనగా బాబా ఏది చెబితే అది చేయడం. ఇతడు ఒక అలౌకిక వ్యక్తి అని దూరం నుండే అనుభవమవుతుంది.
శక్తి మరియు సంతోషములను పొందేందుకు ఆధారము శ్రేష్ఠకర్మ. ఎప్పుడైతే కర్మ మరియు యోగము కలిసి ఉంటాయో అప్పుడే శ్రేష్ఠకర్మలు జరుగుతాయి. కర్మ చేస్తూ కూడా యోగిగా ఉన్నామా అని ఎల్లపుడూ పరిశీలించుకోండి. కర్మ చేస్తూ యోగమునైతే మర్చిపోవడం లేదు కదా! ఆత్మ మరియు శరీరము రెండు కలిసి ఉంటాయి. రెండూ విడిపోతే మృతులైపోతారు. అలాగే కర్మతో పాటు యోగము లేకపోతే ఆ కర్మలు వ్యర్థములైపోతాయి. బంధనలు వేసే ఆత్మ కూడా పురుషార్థములో సహాయోగియే. బంధనముల వల్ల తపన ఇంకా పెరుగుతుంది. కావున అది బంధనము కాక సహయోగమే అయ్యింది కదా! సహయోగము అనే దృష్టితో దాన్ని చూసినట్లయితే అందులో ఎంతో ఆనందము కల్గుతుంది. బంధన యొక్క దృష్టితో చూసినట్లయితే బలహీనులుగా అయిపోతారు.
Comments
Post a Comment