28-01-1977 ఓంశాంతి “అవ్యక్త్ బాప్దాదా” మధువనం
బ్రాహ్మణుల ధర్మము మరియు కర్మ
మీరు స్వయాన్ని బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులుగా భావిస్తున్నారు కదా! బ్రాహ్మణుల యొక్క ధర్మము మరియు కర్మ ఏమిటో మీకు తెలుసా? ధర్మము అనగా ముఖ్య ధారణ అయిన సంపూర్ణ పవిత్రత. సంపూర్ణ పవిత్రత ఏమిటో మీకు తెలుసా? సంకల్పంలో లేక స్వప్నంలో కూడా అంశమాత్రం కూడా అపవిత్రత ఉండకూడదు. ఇటువంటి శ్రేష్టమైనధారణ చేసేవారే సత్యమైన బ్రాహ్మణులుగా పిలువబడతారు. ఈ ధారణ కొరకే “ప్రాణం పోయినా ధర్మము పోకూడదు” అన్న నానుడి ఉంది. ఇటువంటి ధైర్యము మరియు ఇటువంటి దృఢనిశ్చయము కలవారిగా స్వయాన్ని భావిస్తున్నారా? ఎటువంటి పరిస్థితిలోనూ, మీ ధర్మము కొరకు అనగా ధారణ కొరకు ఏదైనా త్యాగం చేయవలసి వచ్చినా, సహించం ఉంచవలసి వచ్చినా, ఎదుర్కొనవలసి వచ్చినా,సాహసం ఉంచవలసి వచ్చినా సంతోషముగా చేస్తారా? వెనుకకైతే వెళ్లరు కదా? భయపడరు కదా?
త్యాగమును త్యాగముగా భావింపక భాగ్యముగా అనుభవము చేసుకోవడమే సత్యమైన త్యాగము అని అంటారు. సంకల్పములో, వాణిలో కూడా నేను ఇది త్యాగము చేశాను అన్న మాటలు వెలువడితే దానికి భాగ్యము తయారవదు. భక్తి మార్గములో కూడా బలి చేసేటప్పుడు ఆ బలి చేయబడే పశువు కొద్దిగా శబ్దము చేసినా లేక అరచినా అది మహాప్రసాదముగా భావింపబడదు లేక బలిగా భావింపబడదు. ఇప్పటి ఈ నియమం అక్కడ అలా నడుస్తుంది. త్యాగము చేయడంతోపాటు నేను త్యాగం చేశాను అన్న సంకల్పము ఉత్పన్నమైన, పేరు ప్రతిష్టలు సంకల్పాలు కలిగిన అది త్యాగం కాదు. దానిని భాగ్యము అని అనరు. ఇటువంటి ధారణ కలవారే సత్యమైనబ్రాహ్మణులుగా పిలువబడతారు.
బ్రాహ్మణుల ద్వారా యజ్ఞములను రచింపచేస్తారు. ఈ మహాయజ్ఞంలో పురాతన ప్రపంచము యొక్క ఆహుతి పడిన తరువాత యజ్ఞము సమాప్తం అవుతుంది. మొదట పురాతన ప్రపంచము యొక్క ఆహుతి పడేందుకు ముందు, నిమిత్తమై ఉన్న బ్రాహ్మణులు పురాతన సంకల్పాల సృష్టినంతటినీ, పురాతన స్వభావ సంస్కారాల రూపీ సృష్టిని, మహాయజ్ఞములో స్వాహా చేశారా? మీ హద్దు లోని సృష్టిని స్వాహా చేయకపోతే లేక మీ వద్ద మిగిలి ఉన్న సామాగ్రి యొక్క ఆహుతి వేయకపోతే అనంతమైన పురాతన సృష్టి యొక్క ఆహుతి ఎలా పడుతుంది? నిమిత్తమై ఉన్న బ్రాహ్మణులు ప్రతి ఒక్కరు యజ్ఞము యొక్క సమాప్తికి ఆధారము.కావున దానమును మొదట స్వయం నుండి ప్రారంభించాలి. మరి నేను ఆహుతి వేశానా అని మీ మనసులో పరిశీలించుకోండి. సంపూర్ణ అంతిమ ఆహుతి ఏమిటో మీకు తెలుసా? ఆత్మజ్ఞానులు-ఆత్మ పరమాత్మలో ఇమిడిపోవడమే సంపూర్ణ స్థితిగా భావిస్తారు. అలాగే ఈ అంతిమ ఆహుతి యొక్క స్వరూపము -నేను అనేది సమాప్తమై బాబా, బాబా అన్న పదాలు నోటి నుండి లేక మనస్సు నుండి వెలువడాలి. అనగా బాబాలో ఇమిడిపోవాలి. దీనినే ఇమిడిపోవడం అనగా సమానము అవ్వడము అని అంటారు. దీనిని అంతిమ ఆహుతి అని అంటారు. సంకల్పము మరియు స్వప్నములో కూడా దేహాభిమానముతో కూడుకున్న నాది అన్నది ఏది ఉండకూడదు. అనాది అయిన ఆత్మిక స్వరూపమైన స్మృతి ఉండాలి. ఆది అయిన బ్రాహ్మణ స్వరూపములో ధర్మము మరియు కర్మ యొక్క ధారణ ఉండాలి. వారినే సత్యమైన బ్రాహ్మణులు అని అంటారు.
ఇటువంటి సత్యమైన బ్రాహ్మణులే యజ్ఞ సమాప్తికి నిమిత్తం అవుతారు.యజ్ఞాన్ని రచించేవారిగా అయ్యారు కానీ ఇప్పుడు సమాప్తికి కూడా నిమిత్తం అవ్వండి. అనగా మీ అంతిమ ఆహుతి వేయండి. తద్వారా అనంతమైన, పురాతన ప్రపంచము యొక్క ఆహుతి కూడా అందులో పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అయిందా? సంపూర్ణంగా అయ్యేందుకు ఇదే సహజమైన సాధనము. సంపూర్ణ ఆహుతిని ఇవ్వడముని సంపూర్ణ స్వాహా అవ్వడము అని అంటారు. మరి స్వాహా అయిపోయారా లేక ఇంకా అవ్వాలా? అంతిమ ఆహుతిని అంతిమ ఘడియలోనే వేస్తారా? ఎప్పుడైతే స్వయం వేస్తారో అప్పుడే ఇతరులచేత కూడా వేయించగలుగుతారు. తరువాత చేద్దాము అని ఆలోచించకండి. ఇపుడు చేయవలసిందే. వినేందుకు ఛత్రకులుగా ఎలా ఉంటున్నారో, మిలనము కొరకు ఏవిధంగా ప్లానులు తయారుచేస్తున్నారో, మా టర్న్ ముందు ఉండాలి అని భావిస్తున్నారో అలాగే అంతం చేయడంలో కూడా మొదటి టర్న్ ను తీసుకోండి.చేయడంలో ఫస్ట్ టర్న్ తీసుకోండి. అచ్చా!
ఇటువంటి సంపూర్ణ స్వాహా అయ్యేవారికి,సంపూర్ణ ఆహుతిని వేసేవారికి, స్వయము యొక్క పరివర్తన ద్వారా విశ్వపరివర్తనకు నిమిత్తం అయ్యేవారికి, సత్యమైన బ్రాహ్మణులకు, బాబా సమానమైన సంపూర్ణ బ్రాహ్మణులకు, సర్వ శ్రేష్ఠ ధర్మము మరియు కర్మలో స్థితులై ఉండే బ్రాహ్మణులకు బాప్ దాదాల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
మధువన నివాసులతో: -
అందరూ సదా సంతోషముతో ఉన్నారు కదా! మూడు కాలాల యొక్క రహస్యాన్ని ఎవరైతే తెలుసుకున్నారో వారు రాజీ అయిపోయారు కదా! ఎప్పుడైనా, ఎవరైనా అసంతుష్టులైతే యదార్ధమైన డ్రామా యొక్క రహస్యాన్ని మరచిపోయినట్లే. ఎవరైతే సదా డ్రామా యొక్క రహస్యాన్ని మరియు మూడు కాలాలను తెలుసుకుని ఉంటారో వారు రాజీ అయి ఉంటారు కదా! అసంతుష్టతకు కారణం రహస్యాన్ని తెలుసుకోకపోవడమే. మూడు కాలాలను గూర్చి తెల్సినవారిని త్రికాలదర్శులు అని అంటారు. వారు సదా రాజీగా మరియు సంతోషంగా ఉంటారు.
మధువన నివాసులు అనగా సదా సంతోషంగా మరియు రాజీగా ఉండేవారు. ఇతరులతో అసంతుష్టులుగా అవ్వడము అనగా స్వయాన్ని రహస్యాలను తెల్సిన స్థితి నుండి క్రిందకు తీసుకురావడం. మీ ఆసనాన్ని వదిలి క్రిందకు వస్తారు అప్పుడే అసంతుష్టులుగా అవుతారు. త్రికాలదర్శులు అనగా జ్ఞానస్వరూపుల యొక్క స్థితి-ఒక ఉన్నతమైన ఆసనము వంటిది. ఎప్పుడైతే ఆ ఆసనాన్ని వదిలి క్రిందకు వస్తారో అప్పుడే అసంతుష్టులుగా అవుతారు. స్థానాన్ని బట్టి స్థితి ఉండాలి.
మధువనాన్ని స్వర్గభూమి అని అంటారు కదా! మధువనమును స్వర్గము యొక్క మోడల్ అని అంటారు కదా! మరి స్వర్గములో ఎక్కడైనా మాయ వస్తుందా! మాయ అంటే ఏమిటో కూడా స్వర్గములో తెలియదు. ఈ భూమిని సాధారణంగా భావించిన కారణంగా మాయ వస్తుంది. వరదాన భూమి అయినా మధువనాన్ని సాధారణంగా భావించకండి. మధువనం యొక్క స్మృతి కూడా సమర్ధతను తీసుకువస్తుంది. మధువనంలో ఉండేవారు ఫరిస్తాలుగా ఉండాలి. మధువనం యొక్క మహిమ అనగా మధువన నివాసుల యొక్క మహిమ. అది ఈ గోడల యొక్క మహిమ అయితే కాదు కదా! మధువన నివాసులను మొత్తం ప్రపంచం అంతా ఏ దృష్టితో చూస్తుంది? విశ్వము ఈనాటి వరకు స్మృతి స్వరూపంలో ఎంత ఉన్నతమైన దృష్టితో చూస్తుంది! భక్తులు కూడా మధువన నివాసుల గుణగానం చేస్తారు. బ్రాహ్మణపరివారము కూడా ఉన్నతమైన దృష్టితో చూస్తుంది. మీకు కూడా అంత ఉన్నతమైన దృష్టి ఉన్నట్లయితే మీరు ఫరిస్తాలయిపోయినట్లే కదా!
మధువన నివాసులు యజ్ఞానివాసులు అని కూడా పిలువబడతారు. యజ్ఞములో ఉండేవారు తమ ఆహుతిని వేయాలి. అప్పుడు మళ్ళీ ఇతరులు అనుసరిస్తారు. స్మృతి చిహ్నమైన స్థూల యజ్ఞంలో కూడా ఎప్పుడైతే మంత్రాన్ని జపిస్తారో అప్పుడే ఆహుతి సఫలమవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే సదా మన్మనాభవ యొక్క మంత్రం స్మృతిలో ఉంటుందో అప్పుడే ఆహుతి సఫలమవుతుంది. మధువన నివాసులు అనగా నిరంతరము మంత్రములో స్థితులై ఉండేవారు. కేవలం ఉచ్చరించేవారు కాదు మంత్ర స్వరూపులు. ఇప్పుడు బాబా రియలైజేషన్ (పరివర్తన) కోర్సును ఇచ్చారు. కావున స్వయాన్ని రియలైజ్ చేసుకుని పరివర్తన చేసుకున్నారా!
అందరు సరిగ్గా ఉన్నారా? ఉన్నాము అని ఎవరైనా అంటే మీ నోటిలో గులాబ్ అని బాబా అంటారు. అలా అనడం ద్వారా కూడా సరి అయిపోతారు. లోపాన్ని పదే పదే ఆలోచించడం ద్వారా అది మిగిలిపోతుంది. లోపాన్ని చూస్తూ అంతం చేస్తూ వెళ్ళండి. పరిశీలించుకోవడంతో పాటు పరివర్తన కూడా చేయండి. ఏదైనా అద్భుతం చేసి చూపించాలి కదా! ఇంత సమయంలో ఎంతైతే తోడు లభించిందో అందులో ఏదైనా అద్భుతాన్ని చేసారా? అద్భుతం అని మహిమ చేయబడే విధంగా ఏదైనా పని చేశారా లేక చేస్తూ కూడా మర్చిపోతున్నారా?స్వయాన్ని ఎప్పుడు గుణమూర్తులుగా చూసుకుంటూ ఉన్నతమైన స్థితిలో స్థితులై ఉండండి, క్రిందకు రాకండి. రాజ్యవంశానికి చెందిన పిల్లలు ఎప్పుడూ భూమిపై అనగా మట్టిలో కాలు మోపరు. ఇక్కడ దేహాభిమానము మట్టి. అందులో క్రిందకు రాకండి. ఈ మట్టి నుండి సదా దూరంగా ఉండండి. సంకల్పంలో కూడా దేహాభిమానంలోకి రావడము అంటే మట్టిలో కాలు మోపడమే. వాచా,కర్మణాలలోకి రావడము అంటే మట్టిని తినడము. రాజ్యవంశానికి చెందిన పిల్లలు ఎప్పుడూ మట్టిని తినరు. ఉన్నతోన్నతుడైన తండ్రి యొక్క ఉన్నత స్థితిలో ఉండే పిల్లలము అని సదా గుర్తు ఉండాలి. తద్వారా ఎప్పుడు దృష్టి క్రిందకు రాదు. పురాతన విషయాలను స్వప్నముల నుండి కూడా అంతము చేసెయ్యాలి. యోగి ఆత్మ, జ్ఞాని ఆత్మ యొక్క స్వప్నాలు కూడా క్రొత్త ప్రపంచము, క్రొత్త జీవితానికి చెందినవిగా ఉంటాయి. స్వప్నాలే మారిపోయినప్పుడు సంకల్పాల యొక్క విషయమే లేదు. మధువన నివాసుల యొక్క స్వప్నాలు కూడా శ్రేష్టముగా ఉంటాయి.బాప్ దాదా కూడా అదే దృష్టితో చూస్తారు. మధువన నివాసుల యొక్క పేరుకు ఎంత మహిమ ఉందంటే నామమాత్రంగా బృందావన, మధువన స్థానంలో ఉండేవారు చివరి వరకు తమ శరీర నిర్వహణ ఎంతగానో జరుపుకుంటూ ఉంటారు. పేరుకు అంత మహిమ ఉంది. కావున మధువన నివాసుల యొక్క పేరే ఎంతో మహత్తరమైనది. పేరుకే అంత మహిమ ఉన్నప్పుడు మరి స్వయం స్వరూపము యొక్క మహిమ ఇంక ఎంత ఉంటుంది? అచ్చా! అందరూ సంతుష్టంగా ఉన్నారు.
Comments
Post a Comment